
బుల్లితెర నటి దల్జీత్ కౌర్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. తన లైఫ్‌లో దుఃఖానికి చోటు లేదనుకున్న ఆమెకు నిరాశే ఎదురైంది. ఏడాది తిరిగేలోపు పుట్టింటికి వచ్చేసింది. భర్త నిఖిల్ పటేల్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నందువల్లే తన కాపురం కుప్పకూలిందని ఇటీవలే వెల్లడించింది. అయితే తన గురించి ఇలా అడ్డగోలుగా మాట్లాడితే బాగోదని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.

గుర్తులను చెరిపేస్తూ..
తాజాగా ఇతడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేశాడు. గతంలో దల్జీత్ వేసిన పెయింటింగ్ కనిపించకుండా గోడకు తెలుపు రంగు వేశాడు. ఇది చూసిన నటి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. గోడ మీద ఉన్న ఆర్ట్‌ను చెరిపేస్తున్నావ్.. కానీ నిజాన్ని నువ్వు మాయం చేయలేవు అని విరుచుకుపడింది.
రెండో పెళ్లి కూడా ఫెయిల్
కాగా గతేడాది మార్చిలో దల్జీత్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. నిఖిల్‌తో ఓ కూతురు కలిసి ఉంటుండగా దల్జీత్‌కు ఓ కుమారుడు ఉన్నాడు. రెండో పెళ్లి కూడా ఫెయిలవడంతో అభిమానులు దల్జీత్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు.
చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment