బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్‌తో వచ్చి క్లిక్ అవడంతో అందరి కళ్లు సౌత్‌పై పడ్డాయి. పాన్ ఇండియా లెవల్‌లో సౌత్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
సౌత్ వర్సెస్ బాలీవుడ్
దీంతో అప్పటినుంచి బాలీవుడ్‌ను సౌత్ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్‌గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్ స్టార్స్ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్ కెమెరామన్ (ఫోటోగ్రాఫర్) వీరేందర్ చావ్లా అంటున్నాడు.
వీరేందర్ చావ్లా, ఫోటోగ్రాఫర్
చెప్పులేసుకుని..
అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సెలబ్రిటీలు ఫేక్‌గా కనిపిస్తారు. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్‌కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్ చేశాడు. సౌత్‌లో మరో బిగ్ స్టార్ (జూనియర్ ఎన్టీఆర్) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటాడు.
ఫోటో తీసిందొకరైతే కోప్పడింది మాత్రం..
అతడు హోటల్‌కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్ ఆయన్ను క్లిక్‌మనిపించాడు. అందుకాయన నా టీమ్ మెంబర్‌పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! మహేశ్‌బాబు అయితే బాలీవుడ్ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్‌గా ఉండేది సౌత్ హీరోలే.. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో
Comments
Please login to add a commentAdd a comment