ఒక ఆడదాని జీవితం మరో ఆడదే నాశనం చేస్తుంది: నటి | Dalljiet Kaur: A Woman Destroy Another Woman's Life | Sakshi
Sakshi News home page

అలాంటి వ్యక్తి నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లో? దీనికంతటికీ కారణం ఆవిడే!

Published Wed, Sep 4 2024 7:20 PM | Last Updated on Wed, Sep 4 2024 7:46 PM

Dalljiet Kaur: A Woman Destroy Another Woman's Life

హిందీ బుల్లితెర నటి దల్జీత్‌ కౌర్‌ కోటి ఆశలతో పెళ్లిపీటలెక్కింది. మొదటి బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారినా.. రెండో బంధాన్నయినా కలకాలం కాపాడుకోవాలని ఆరాటపడింంది. నిఖిల్‌ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అతడితోనే జీవితమని భావించి తనతోపాటు విదేశాలకు వెళ్లిపోయింది.

నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? 
కానీ ఆశలన్నీ చెదిరిపోయాయి. కట్టుకున్న భర్త తన ప్రియురాలితో ఇంకా సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని మనసు ముక్కలైంది. పోట్లాడింది, పోరాడింది. తను మారడని తెలుసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో.. 'నా మెదడులో రెండు ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఒకటి.. అతడు ఏదైతే చేస్తున్నాడో.. దానితో సంతోషంగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? అంటే గతంలో తనకు పబ్లిసిటీ లభించలేదనా?

ఆడదానికి ఆడదే శత్రువు
రెండోది.. ఒక ఆడదానికి ఆడదే శత్రువు.. మహిళ జీవితాన్ని మరో మహిళే నాశనం చేస్తుందని జనాలు చెప్పే మాటలు సత్యం. ఇప్పుడు నేను ఆవిడను తప్పు పట్టడం లేదు. కానీ భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా తనను వదిలిపెట్టనేమో! భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి దూరాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా పెద్ద తప్పు. పైగా తనకు ఆల్‌రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయినా సరే నా భర్త చెంతచేరడమేంటో? దీని వెనక కారణాలేంటో ఎవరికి మాత్రం తెలుసు?' అని రాసుకొచ్చింది.

2009లో మొదటి పెళ్లి 
కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ ధూ) ఫేమ్‌  దల్జీత్‌.. 2009లో నటుడు షాలిన్‌ బానోత్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్‌ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్‌ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.

గొడవలు
ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో 2023 మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కుమారుడిని తీసుకుని అతడితో పాటు దల్జీత్‌ లండన్‌ వెళ్లిపోయింది. కానీ అక్కడ గొడవలు తలెత్తడంతో వివాహమైన పది నెలలకే విడాకులకు దరఖాస్తు చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement