10 ఏళ్ల కొడుకే ఆమె ప్రాణం.. రెండో పెళ్లికి సిద్ధమైన నటి, ఆరోజే వెడ్డింగ్‌! | Dalljiet Kaur, Nikhil Patel Wedding Date Fix | Sakshi
Sakshi News home page

Dalljiet Kaur: పదేళ్ల కుమారుడు ఉండగా రెండో పెళ్లి చేసుకోబోతున్న నటి

Published Thu, Mar 2 2023 3:59 PM | Last Updated on Sat, Jun 1 2024 6:40 PM

Dalljiet Kaur, Nikhil Patel Wedding Date Fix - Sakshi

రెండక్షరాల పెళ్లి రెండు జీవితాలనే కాదు రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది. జీవితాంతం కలిసి ఉండమని దంపతులను ఆదేశిస్తుంది. జంటగా కష్టసుఖాల సంసార సాగరాన్ని దాటాలని హితబోధ చేస్తుంది. కానీ కాలం మారేకొద్దీ పెళ్లిళ్లు చేసే విధానాలు మారిపోతున్నాయి. కానీ ఆ వివాహబంధం చెప్పే సూత్రాలు మాత్రం అలాగే నిలిచుండిపోయాయి.

బాలీవుడ్‌లో అయితే ప్రేమ, పెళ్లి, విడాకులు, మరో పెళ్లి.. ఇది చాలా కామన్‌ అయిపోయింది. తాజాగా ఈ జాబితాలోకి నటి, బిగ్‌బాస్‌ బ్యూటీ దల్జీత్‌ కౌర్‌ వచ్చి చేరింది. త్వరలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది. యూకేకు చెందిన నిఖిల్‌ పటేల్‌తో మార్చి 18న ఆమె వివాహం జరగనుంది. 17వ తేదీ నుంచి ఆమె పెళ్లి పనులు షురూ కానున్నాయి. ఇటీవలే తన లవ్‌స్టోరీని బయటపెట్టింది దల్జీత్‌. ఫ్రెండ్స్‌ పార్టీలో ఒకరినొకరు తొలిసారి కలుసుకోగా ఇద్దరూ వారివారి పిల్లల గురించే కబుర్లు మాట్లాడుకున్నారు. పిల్లలపై ఉన్న బాధ్యతే తమను ప్రేమలో పడేలా చేసిందని వెల్లడించింది. ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసే నిఖిల్‌ ప్రస్తుతం నైరోబీలో వర్క్‌ చేస్తున్నాడు. కాబట్టి పెళ్లవగానే మొదట దల్జీత్‌ నైరోబీకి వెళ్లనున్నట్లు పేర్కొంది. అక్కడ పని పూర్తవగానే అతడి స్వస్థలమైన లండన్‌కు చెక్కేస్తారట! 

ఇకపోతే దల్జీత్‌ కౌర్‌ హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో పాల్గొంది. గతంలో ఆమె షాలిన్‌ బానోత్‌ను పెళ్లాడింది. అతడు ఇటీవలే బిగ్‌బాస్‌ 16వ సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేశాడు. వీరికి జైడన్‌ అనే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కానీ దల్జీత్‌, షాలిన్‌ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దల్జీత్‌.. కులవధు, సంతాన్‌, ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ ధూ?(చూపులు కలిసిన శుభవేళ), కాలా టీకా, కాయామత్‌కీ రాత్‌, గుడ్డన్‌: తుమ్‌సే నా హో పాయేగా, సాసురాల్‌ జెండా ఫూల్‌ 2 వంటి సీరియల్స్‌లో నటించింది. అటు నిఖిల్‌కు కూడా ఇదివరకే పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు తల్లితో ఉంటే మరొకరు తండ్రితో ఉంటున్నారు.

 

 

చదవండి: ఊహించని సర్‌ప్రైజ్‌.. ఏడ్చేసిన మంచు విష్ణు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement