
హిందీ బిగ్‌బాస్ ఫేం, బాలీవుడ్ టీవీ నటుడు, మోడల్ కరణ్ కుంద్రా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో బాంద్రా రిక్లమేషన్ ప్రాంతంలోని '81 అరీటే' భవనంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొంటున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం గోరేగావ్‌లో ఉంటున్న కరణ్ కుంద్రా చాలా రోజులుగా బాంద్రా, జుహు వైపుకు మారాలని అనుకుంటున్నాడట.
Is Karan Kundrra Bought A Flat Worth 20 Crore In Bandra: హిందీ బిగ్‌బాస్ ఫేం, బాలీవుడ్ టీవీ నటుడు, మోడల్ కరణ్ కుంద్రా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో బాంద్రా రిక్లమేషన్ ప్రాంతంలోని '81 అరీటే' భవనంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొంటున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.
చదవండి: పెళ్లయ్యాక 25 మంది పిల్లలను కంటాం
ప్రస్తుతం గోరేగావ్‌లో ఉంటున్న కరణ్ కుంద్రా చాలా రోజులుగా బాంద్రా, జుహు వైపుకు మారాలని అనుకుంటున్నాడట. కరణ్ కుంద్రా చూస్తున్న ఫ్లాట్ ధర రూ. 20 కోట్లు. ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, బార్బెక్యూ పిట్ మొదలైన విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనం నుంచి బాంద్రా సమీపంలోని సముద్రపు వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుందట.
కరణ్ కుంద్రా త్వరలో 'నాగిని' సీరియల్ హీరోయిన్ తేజస్వి ప్రకాష్‌ను వివాహం చేసుకోనున్నాడని సమాచారం. వారిద్దరి కోసమే ఈ ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నాడని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ జర్నీ కొనసాగించిన ఈ జంట బయటకు వచ్చాక వర్క్ షెడ్యూల్స్‌తో బిజీ అయిపోయింది. అయితే ఇటీవల తేజస్వి ఇంటికి తన పేరెంట్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన కరణ్ కుంద్రా నుదుటన కుంకుమతో బయటకు రావడంతో వీరికి రోకా అయిపోయిందని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు.
దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. కాగా రాజ్ కరణ్ కుంద్రా తల్లిదండ్రులు సంవత్సరంలో కొన్ని నెలలు యూఎస్‌లో నివసిస్తారు. అలాగే వారికి పంజాబ్‌లో ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది.
చదవండి: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు