Karan Kundra Makes Paparazzi Apologise To Girlfriend Tejasswi Prakash - Sakshi
Sakshi News home page

Tejasswi Prakash: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు

Published Wed, Mar 30 2022 9:21 PM | Last Updated on Thu, Mar 31 2022 3:24 PM

Karan Kundra Makes Paparazzi Apologise To Girlfriend Tejasswi Prakash - Sakshi

Karan Kundrra Fires On Paparazzi For Trying to Enter Girlfriends House: హిందీ బిగ్‌బాస్‌ ఫేం, బాలీవుడ్‌ టీవీ నటుడు కరణ్‌ కుంద్రా మీడియాపై ఫైర్‌ అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ తేజస్వి ప్రకాశ్‌ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మీడియాపై అతడు నిప్పుడు చెరిగాడు. ఈ క్రమంలో మీడియా వ్యక్తులు ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో కరణ్‌ కుంద్రా వారికి క్లాస్‌ పీకుతూ ప్రియురాలు తేజస్వికి మీడియాతో క్షమాపణ చెప్పించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా తేజస్వి ప్రకాశ్‌.. బిగ్‌బాస్‌ 15 విజేతగా టైటిల్‌ గెలుచుకుని ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ప్రముఖ నిర్మాత ఎక్తా కపూర్‌ నాగిన్‌ 6లో లీడ్‌ రోల్‌ అవకాశం ఇచ్చింది.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌: జక్కన్నపై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్‌ వైరల్‌

అలా బిగ్‌బాస్‌, నాగిని సీరియల్‌తో తేజస్వి రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యమలో ఆమె ఎక్కడ కనిపించిన మీడియా తమ కెమెరాలకు పని చేబుతూ ఆమెను ఫొటోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె ఇంటి ముందు ఫొటోలు తీస్తుండగా తొందర తొందరగా ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెను వెంబడిస్తూ తనతో పాటు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతేకాదు తమ ఫొటోలకు ఫోజులు ఇవ్వాలంటూ తేజస్విని ఇబ్బంది పెట్టడంతో ప్రియుడు కరణ్‌ కుంద్రా వారిపై విరుచుకుపడ్డాడు. ఇలా ఇంట్లోకి దూరి తమ పర్సనల్ ఫోటోలు తియ్యడం పద్దతి కాదని, అనుమతి లేకండా ఓ అమ్మాయి ఇంట్లోకి ఎలా చొరబడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌

సెలబ్రెటీలకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారి ప్రైవసికి ఇబ్బంది కలిగించడం సరికాదన్నాడు.ఊరుకుంటున్నాం కదా అని ఇంటి వరకు వచ్చి ఫొటోలు తీయడం ఏంటని ప్రశ్నించాడు. ఇది మరోసారి రిపీట్‌ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తూ మీడియాతో ప్రియురాలికి క్షమాపణలు చెప్పించాడు. కాగా తేజస్వి, కరణ్‌లు తొలిసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో కలుసుకున్నారు. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం మెల్లిగా ప్రేమగా మారింది. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పగా వారు ఈ జంట పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం కరణ్‌, తేజస్విలు ముంబైలో ఒకే అపార్టుమెంట్‌లో కలిసి ఉంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement