Tejasswi Prakash Says Women Depending On Men For Investments Is Stupid - Sakshi
Sakshi News home page

Tejasswi Prakash: వారిపై ఆధారపడటం తెలివితక్కువ పని: తేజస్వీ ప్రకాశ్

Published Mon, Jan 16 2023 5:21 PM | Last Updated on Mon, Jan 16 2023 6:08 PM

Tejasswi Prakash says women relying on men for investments is stupid - Sakshi

బిగ్ బాస్ బ్యూటీ  తేజస్వీ ప్రకాశ్ బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నటి హిందీలో పలు సీరియల్స్‌లో నటిస్తోంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మహిళల ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్థికపరమైన విషయాల్లో సలహాల కోసం పురుషులపై ఆధారపడే మహిళలను 'మూర్ఖులు'గా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో మహిళలు తగినంత స్వతంత్రంగా ఉండాల్సిన అవసరముందని ఆమె అన్నారు. 

జీవితంలో ప్రతి మహిళ సొంత నిర్ణయాలు తీసుకోవాలని తేజస్వీ ప్రకాశ్ సూచించారు. ఆమె ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. బిగ్ బాస్- 15 తేజస్వికి బాలీవుడ్‌ ఫేమ్ తీసుకొచ్చింది.  ఆమె ఇటీవలే దుబాయ్‌లో కరణ్ కుంద్రాతో కలిసి ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది బాలీవుడ్ భామ. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజస్వీ మాట్లాడుతూ.. ' ఒక అమ్మాయి తగినంత స్వతంత్రంగా ఉండాలని నేను భావిస్తున్నా. ఆర్థిక సాయం, సలహాల కోసం వేరొకరిని అడగకండి. ఎక్కడికైనా  వెళ్లాలని నిర్ణయించుకుంటే ఆ ప్రదేశానికి వెళ్లండి.  ఒక మహిళగా, తల్లిగా, భార్యగా, సోదరిగా ప్రతి ఒక్కరికీ ఆ స్వాతంత్ర్యం ఉండాలి. ఎందుకంటే ఇది మహిళల ఆత్మగౌరవం సంబంధించినది. మహిళలు పెట్టుబడులు పెట్టేందుకు పురుషులపై ఆధారపడటం తెలివి తక్కువ పనిగా నేను భావిస్తున్నా. ' అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement