ఖరీదైన కారు కొన్న హీరోయిన్‌.. ధర తెలిస్తే షాకే | Mamta Mohandas Buys Porsche 911 Careera Car Worth Nearly 2 Crore | Sakshi
Sakshi News home page

Mamta Mohandas: కాస్ట్‌లీ స్పోర్ట్స్ కారు కొన్న 'యమదొంగ' భామ

Published Sat, Sep 25 2021 9:06 PM | Last Updated on Sun, Sep 26 2021 8:02 AM

Mamta Mohandas Buys Porsche 911 Careera Car Worth Nearly 2 Crore - Sakshi

Mamta Mohandas buys Porsche 911 Carrera Car: మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్‌ దాస్‌కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. 'యమదొంగ' సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ భామ కృష్ణార్జున,హోమం సినిమాలతో నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును కొని ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. 'నా కల నిజమైంది. దీని కోసం దశాబ్దం పాటు ఎదురుచూశాను. ఫైనల్లీ ఇప్పుడు దీన్ని సొంతం చేసుకున్నా. నా కుటుంబంలో కొత్త సభ్యుడిని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

తన తల్లిదండ్రులతో కలిసి మమతా మోహన్‌ దాస్‌ ఈ కారును కొనుగోలు చేసింది. 'ఫోర్ష్‌911 కారెర్రా' మోడల్‌కు చెందిన ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 3.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 450 బీహెచ్‌పీ పవర్ కలిగి ఉంది. వీటితో పాటు మరెన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ కారు ధర అక్షరాల రూ.1.80 కోట్లు. ప్రస్తుతం మమతా మోహన్‌ దాస్‌ కొత్త కారు ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement