కొత్త స్పోర్ట్స్‌ కారు కొన్న యమదొంగ నటి, ఖరీదు లక్షల్లో కాదు! | Actress Mamta Mohandas Buys BMW Z4 Sports Car For Shocking Price, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Mamta Mohandas BMW Z4 Car Video: పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ.. బ్రాండెడ్‌ కారు కొనుగోలు..

Feb 9 2024 6:35 PM | Updated on Feb 9 2024 7:43 PM

Mamta Mohandas Buys BMW Z4 Sports Car, Price Details - Sakshi

మమతా మోహన్‌దాస్‌.. ఈమె పేరు చెప్పగానే చాలామందికి యమదొంగ సినిమా టక్కున గుర్తొస్తుంది. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టే ధనలక్ష్మిగా అందరినీ నవ్విస్తుంది. తర్వాత.. కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడి ఇలా అనేక సినిమాలు చేసింది. కానీ మమతా మోహన్‌కు యమదొంగతో వచ్చినంత క్రేజ్‌ మరే చిత్రానికీ రాలేదు. అటు తమిళ, కన్నడ భాషల్లో యాక్ట్‌ చేసినా ఎక్కువగా మలయాళంలోనే గుర్తింపు తెచ్చుకుంది. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది.

నటి, సింగర్‌..
ఆ మధ్య ఈ హీరోయిన్‌ క్యాన్సర్‌ బారిన పడింది. అయితే ధైర్యంగా పోరాడి ఆ ప్రాణాంతక వ్యాధినే జయించింది. తిరిగి మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈమె గాయకురాలు కూడా! 'రాఖీ రాఖీ రాఖీ.. నా కవ్వసాఖీ', 'ఆకలేస్తే అన్నం పెడతా..' ఇలా అనేక పాటలు పాడింది.

కొత్త కారు
తాజాగా ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు ఇంటికి తెచ్చేసుకుంది. దీని ధర దాదాపు కోటి రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త కారు వీడియోను మమతా మోహన్‌దాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసింది. ఇకపోతే పదేళ్లకు పైగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మమతా మోహన్‌దాస్‌ ఇటీవలే రుద్రంగి చిత్రంతో ఇక్కడ రీఎంట్రీ ఇచ్చింది.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement