తెలుగులో తొలి చిత్రం 'యమదొంగ'తో బాగా పాపులర్ అయిన హీరోయిన్ మమతా మోహన్‌దాస్ 2010, 13లో రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకుంది. ఇటీవలే చర్మం రంగు మారడం అనే విటిలిగో వ్యాధి బారిన పడగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఓపక్క అనారోగ్యంతో పోరాడుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. కాగా గతంలో మమత సూపర్ హిట్ మూవీ 'అరుంధతి'ని చేజార్చుకున్న విషయం తెలిసిందే! తాజాగా తాను చేసిన పొరపాటు గురించి ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడిందీ నటి.
'రాజమౌళి సర్ నాకు ఫోన్ చేసి యమదొంగ చేయమని అడిగారు. దానికంటే ముందే శ్యామ్ ప్రసాద్ అరుంధతి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకు సంతకం చేశాను. కానీ ఆ ప్రొడక్షన్ మంచిది కాదని మేనేజర్ చెప్పారు. నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు కాబట్టి వెనకడుగు వేశాను. శ్యామ్ ప్రసాద్ గారు రెండు, మూడు నెలలపాటు అడిగారు.. కానీ నేను మాత్రం కుదరదన్నాను. దీని గురించి రాజమౌళి సర్ మాట్లాడుతూ.. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది. వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఆయన అలా అనడంతో నా గుండె పగిలిపోయినట్లయింది. అప్పటికి ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు' అని చెప్పుకొచ్చింది మమతా మోహన్‌దాస్.
చదవండి: మరణానికి ముందు శ్రీదేవి ఎలా ఉందంటే? చివరి ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment