Arundhathi
-
ఈ సినిమాలు చూస్తే గజగజ వణకడమే! ఏది ఏ ఓటీటీలో ఉందంటే?
చాలామందికి చీకటంటే భయం. కానీ హారర్ సినిమాలు చూడటానికి రెడీ. మరికొందరు అర్థరాత్రి ఒంటరిగా ఇలాంటి మూవీస్ చూడాలని కోరిక. అలాంటి వాళ్ల కోసమే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న 12 బెస్ట్ హారర్ మూవీస్ లిస్టుతో వచ్చేశాం. వీటిని చూస్తుంటే ఓవైపు థ్రిల్లింగ్ మరోవైపు భయం గ్యారంటీ. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయ్?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీల్లో బెస్ట్ హారర్ మూవీస్మణిచిత్ర తాళు (1993) - మనకు బాగా తెలిసిన 'చంద్రముఖి' చిత్రానికి ఇది ఒరిజినల్. మలయాళంలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.13బీ (2009) - ఇదో డబ్బింగ్ సినిమా. ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తీశారు. హాట్‌స్టార్‌లో అది కూడా తెలుగులోనే ఉంది.అరుంధతి (2009) - స్వీటీ అనుష్క శెట్టి నటించిన తెలుగు హారర్ మూవీ ఇది. బొమ్మాళీ అని అప్పట్లో అందరినీ భయపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.భ్రమయుగం (2024) - తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళ హారర్ మూవీ ఇది. కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంటిలో జరిగిన స్టోరీతో తీశారు. సోనీ లివ్ ఓటీటీలో ఉంది.పిజ్జా (2012) - విజయ్ సేతుపతికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవాలే కథ. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.భూతకాలం (2022) - దెయ్యాన్ని ఏ మాత్రం చూపించకుండా భయపెట్టిన సినిమా ఇది. మలయాళ సినిమానే కానీ తెలుగు డబ్బింగ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.మసూద (2022) - అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా. ఆహా ఓటీటీలో ఉంది. చూస్తే ప్యాంట్ తడిసిపోవడం గ్యారంటీ.హౌస్ ఆఫ్ సీక్రెట్స్ (2021) - ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఇది. నిజ జీవిత సంఘటనలతో తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే ఉంది.తుంబాడ్ (2018) - అత్యాశ మనిషిని ఎలా నాశనం చేస్తుందో అనే కాన్సెప్ట్‌కి హారర్ జోడించి తీసిన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.కౌన్ (1999) - రాంగోపాల్ వర్మ తీసిన హిందీ సినిమా ఇది. డిఫరెంట్ సౌండ్స్‌తో తీసిన ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లోనే ఉంది.గృహం (2017) - సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా.. వెన్నులో వణుకు పుట్టేలా భయపెడుతుంది. జియో సినిమా ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ తెలుగులోనే అందుబాటులో ఉంది.డీమోంటే కాలనీ (2015) - బంగ్లాలో జరిగే కథతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనే ఉందండోయ్!(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) -
వెంటిలేటర్‌పైనే హీరోయిన్.. వేడుకుంటున్న అరుంధతి సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. మార్చి 14న ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే పలుమార్తు వేడుకున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో అరుంధతికి చికిత్స జరుగుతుందని ఆమె సోదరి ఆర్తీ చెప్పింది. ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపింది. వైద్యం కోసం రోజూ దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోందని, ఇప్పటికే అరుంధతి కోసం రూ. 40 లక్షలు ఆస్పత్రి బిల్లులు చెల్లించామని అర్తీ చెబుతుంది. అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా మెదడులో రక్తం గడ్డకట్టింది. అందుకు సంబంధించిన బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం పూర్తి అయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తీ ఆవేధన చెందుతుంది. 90 రోజులు దాటినా తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అన్నట్లు ఆర్తీ పేర్కొంది. ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకలకి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరింది. ఇప్పటికే పలువురు మళయాల నటీమణులు కూడా ఆమెకు సాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు. అరుంధతి నాయర్ తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్' (తెలుగులో భేతాళుడు)లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by ❣️A S W A T H Y.R A H U L👸👑❣️ (@__aswathy__sr21__official__) -
చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్ (ఫోటోలు)
-
మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్ సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. సుమారు ఆరు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకువచ్చారు. 'నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బుల్లేవు. దాంతో మేము ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాం. ఇదొక పెద్ద స్కామ్ అంటూ చాలామంది ట్రోల్ చేశారు. ఆస్పత్రి చుట్టూ మేము పరుగులు పెడుతుంటే ఇలాంటి నెగెటివిటీ వస్తుందనుకోలేదు' అన్నారు. ప్రస్తుతం అరుంధతికి బ్రెయిన్ సర్జరీ చేపించాలని ఆర్తి తెలిపింది. అందు కోసం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో చేర్పించామని ఆమె చెప్పుకొచ్చింది. కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీద అరుంధతి ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఇప్పటికే సుమారు రూ. 5 లక్షలకు పైగా ఖర్చు పెట్టామని ఆమె తెలిపింది. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేమని.. అందుకు కావాల్సిన డబ్బు తమ వద్ద లేదని ఆమె వాపోయింది. సాయం చేయాలనుకునే వారి కోసం తన బ్యాంకు ఖాతా వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అరుంధతి స్నేహితురాలు, సహనటి రమ్య మాట్లాడుతూ.. 'కోలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో అరుంధతి హీరోయిన్గా నటించారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, లేదా నడిగర్ సంఘం సభ్యులు ఒక్కరూ సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. కనీసం మాట్లాడనూ లేదు. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు.సహ నటీనటులు కొంతవరకు మాత్రమే సాయం చేయగలరు. ఎందుకంటే, మేము రూ.కోట్లలో సంపాదించడం లేదు.' అని వాపోయారు. తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్'లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arathy Nair (@aaraty.nairr) -
మృత్యువుతో పోరాడుతున్న హీరోయిన్.. కనీసం ఫోన్ కూడా చేయలేదు!
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ ఇంటర్వ్కకు హాజరైన ఆమె అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సాయం కోసం నటి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మరో నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. అయితే ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ సభ్యుల నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, బుల్లితెర నటి రెమ్యా జోసెఫ్ వెల్లడించారు. ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను నడిగర్ సంఘం సభ్యులు కూడా సంప్రదించలేదని తెలిపింది. కనీసం ఫోన్ చేసి కూడా ఎవరూ ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఆర్థిక సాయం కోరితే చాలామంది ట్రోల్ చేశారని అరుంధతి సోదరి ఆరతి వెల్లడించింది. ఇప్పటికే వైద్యానికి దాదాపు రూ.5 లక్షల ఖర్చు అయిందని పేర్కొంది. ప్రస్తుతం బ్రెయిన్ సర్జరీకి డాక్టర్లు సిద్ధమవుతున్నారని ఆరతి తెలిపారు. సినీ కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసింది. -
స్కూటీపై వెళ్తుండగా యాక్సిడెంట్.. ఐసీయూలో హీరోయిన్..
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై హీరోయిన్ ఈ విషయాన్ని నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'అరుంధతి వెంటిలేటర్‌పై పోరాడుతోంది. ఆమె కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gopika Anil (@gops_gopikaanil) చదవండి: ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఏవి ఎందులో అంటే? -
రాజమౌళి అలా అనడంతో నా గుండె పగిలింది: హీరోయిన్
తెలుగులో తొలి చిత్రం 'యమదొంగ'తో బాగా పాపులర్ అయిన హీరోయిన్ మమతా మోహన్‌దాస్ 2010, 13లో రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకుంది. ఇటీవలే చర్మం రంగు మారడం అనే విటిలిగో వ్యాధి బారిన పడగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఓపక్క అనారోగ్యంతో పోరాడుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. కాగా గతంలో మమత సూపర్ హిట్ మూవీ 'అరుంధతి'ని చేజార్చుకున్న విషయం తెలిసిందే! తాజాగా తాను చేసిన పొరపాటు గురించి ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడిందీ నటి. 'రాజమౌళి సర్ నాకు ఫోన్ చేసి యమదొంగ చేయమని అడిగారు. దానికంటే ముందే శ్యామ్ ప్రసాద్ అరుంధతి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకు సంతకం చేశాను. కానీ ఆ ప్రొడక్షన్ మంచిది కాదని మేనేజర్ చెప్పారు. నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు కాబట్టి వెనకడుగు వేశాను. శ్యామ్ ప్రసాద్ గారు రెండు, మూడు నెలలపాటు అడిగారు.. కానీ నేను మాత్రం కుదరదన్నాను. దీని గురించి రాజమౌళి సర్ మాట్లాడుతూ.. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది. వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఆయన అలా అనడంతో నా గుండె పగిలిపోయినట్లయింది. అప్పటికి ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు' అని చెప్పుకొచ్చింది మమతా మోహన్‌దాస్. చదవండి: మరణానికి ముందు శ్రీదేవి ఎలా ఉందంటే? చివరి ఫోటో వైరల్ -
అరుంధతి మూవీలో బాలనటి.. అంతలా మారిపోతుందని ఊహించలేదు..!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అరుంధతి'. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అనుష్క ఫేమస్ అయిపోయింది. అందరూ జేజమ్మ అంటూ ముద్దుగా పేరు పెట్టారు. అయితే ఈ సినిమాలో బాలనటిగా ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. తన డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా చిన్నారి అనుకుంటున్నారా? బాలనటిగా మెప్పించిన దివ్య నగేశ్ అందరినీ తనదైన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడెలా ఉంది? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదివేయండి. (చదవండి: కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?) చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును పొందారు. అలానే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి దివ్య నగేశ్ కూడా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఆమె పలు సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్లో 'నేను నాన్న అబద్దం' అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేశ్. ఇటీవలే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అరుంధతి బాలనటి దివ్య నగేశ్. -
అరుంధతి మూవీలో సీన్‌ను రీ కనస్ట్రక్ట్ చేసి మరీ... ఆత్మహత్యా యత్నం
తాగుడికి, మత్తుపదార్థాలకు అడిక్ట్ అవ్వడం గురించి విన్నాం. అలాగే సినిమాలకు అడిక్ట్ అయ్యే వాళ్లు గురించి కూడా తెలుసు. చాలావరకు హిరో లేదా హిరోయిన్ మాదిరిగా ప్రవర్తించడం వంటి పిచ్చి చేష్టలు చేస్తారని తెలుసు. కానీ ఆ సినిమాలో కథనాయిక ఎలా చనిపోయాడో అలా చనిపోవాలని మాత్రం అనుకోరు. ఐతే ఈ వ్యక్తి మాత్రం తన చూసిన సినిమాలో కథనాయకి ఎలా చనిపోయిందో అలానే చనిపోవాలని నిర్ణయించుకుని కన్నవాళ్లకు తీరని వేదన మిగల్చాడు.. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కర్ణాటకలోని ఓ గ్రామంలోని 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ అనే వ్యక్తి పదోతరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత అతనికి సినిమాలంటే మోజు ఎలా పెరిగిందో తెలియదు గానీ దానికి అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఆ సినిమాలో వాళ్లు ఏం చేస్తే అలా చేసేయాలనేంతగా వ్యామోహం పెంచేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఇంటర్ కూడా చదవడం మానేశాడు. అతనికి అరుంధతి సినిమా అంటే మహా ఇష్టమట. ఏకంగా 15 సార్లు ఆ సినిమాని చూశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐతే ఆ సినిమాలో అనుష్క విలన్ పశుపతి నుంచి తన సంస్థానంలోని మనుషులను కాపాడుకోవడానికి ఎలా అయితే సాధువుల వద్దకు వెళ్లి ఎలా తనకు తానుగా చనిపోతుందో అలా తాను చనిపోవాలనుకున్నాడు. ఈ విషయం గురించి తన తల్లిదండ్రులతో పదే పదే చెప్పేవాడు కూడా. దీంతో వాళ్లు అతన్ని అది సినిమాని నిజంగా అలా చేయడం కుదరదని పలుమార్లు వారించారు కూడా. ఈ మేరకు సదరు వ్యక్తి తాను చెప్పినట్టుగానే సినిమా కథానియికిలా 20 లీటర్లు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటాడు. తాను చనిపోతున్న దాన్ని కూడా వీడియో తీసి మరీ వివరించాడు. అయితే స్థానికులు అతను మంటల్లో కాలిపోవడం చూసి రక్షించి ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తి 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ.. ఆస్పత్రిలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు..) -
కొత్త డ్రామా
రాజవంశానికి చెందిన ఓ పెద్దాయన కన్ను మూస్తాడు. అంత్యక్రియలు ఘనంగా మొదల య్యాయి. అంతలో ఏదో డ్రామా జరిగిందట. మరి... ఈ డ్రామా సూత్రధారి ఎవరో తెలియాలంటే ‘డ్రామా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మోహన్‌లాల్. రంజిత్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డ్రామా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కనిహా, కోమల్ శర్మ, అరుంధతి నాగ్, నిరంజ్, సిద్ధిక్ కీలక పాత్రధారులు. రంజాన్ సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. ముందుగా ఈ సినిమాకు రిప్ (ఆర్.ఐ.పి) అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా ‘డ్రామా’ టైటిల్‌ను ఫిక్స్ చేశారట. మూడేళ్ల క్రితం వచ్చిన ‘లోహం’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, రంజిత్ కాంబోలో వస్తున్న చిత్రమిది. -
అరుంధతి నేనే అవ్వాల్సింది
తమిళసినిమా: అరుంధతి నేనే అవ్వాల్సిందని అని నటి మమతామోహన్‌దాస్ పేర్కొంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ బహుభాషా నటిగా రాణించిన మమతా మంచి గాయని కూడా. తెలుగులో నాగార్జున వంటి స్టార్‌తో జత కట్టి స్టార్ హీరోయిన్గా రాణించిన మలయాళీ భామ ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడింది. అరుంధతి చిత్రాన్ని నటి అనుష్క జీవితంలో మరచిపోలేదు. తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆ చిత్రానికి కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. అంత ఘన విజయం సాధించిన చిత్రం అరుంధతి. నటి అనుష్కకు అంత పేరును ఆపాదించి పెట్టిన ఆ చిత్రం మమతను దాటి అనుష్కకు వచ్చిందట. దీని గురించి మమత ఒక భేటీలో తెలుపుతూ మొదట్లో తాను నటనపై ఆసక్తి చూపలేదని అంది. తొలి నాలుగేళ్లలో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోయాను కానీ, చాలా అయోమయంలో ఉండిపోయానని చెప్పింది. మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనేలేదని అంది. అరుంధతిలో నటించే అవకాశం తొలుత తనకే వచ్చిందని, చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. ఆ తరువాత ఆ చిత్రంలో అనుష్క నటించడం ఆమెకా చిత్రం స్టార్డమ్ తెచ్చిపెట్టడం గురించి తెలుసుకున్నానని తెలిపింది. ఆ తరువాతే చిత్రాలపై అవగాహన పెరిగిందని, ఆ తరువాత రెండు నెలల్లోనే జీవితంలో పెద్ద షాక్‌కు గురయానని చెప్పింది. కేన్సర్‌తో తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పింది. దీంతో సినిమా కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత నివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతామోహన్‌దాస్ పేర్కొంది. -
అరుంధతి ఔట్!
న్యూఢిల్లీ: తదుపరి ఆర్బీఐ గవర్నర్ పదవికోసం అభ్యర్థి ఎంపికలో ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్యకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం మరింత కుదించింది. ఈ షార్ట్ లిస్ట్ ను నాలుగు నుంచి రెండుకు కుదించిందని గురువారం నివేదికలు వెల్లడించాయి. అరుంధతి భట్టాచార్య, ఊర్జిత్ పటేల్ పక్కన పెట్టిన ప్రభుత్వం ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డోజౌన్స్ వైర్ అంచనాల ప్రకారం అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జులై 15వ తేదీకల్లా ఈ నియామకం పూర్తి కావచ్చని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గట్టి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ప్రధానంగా ముందు ఆరుగురుతోనూ, ఇద్దరి తొలగించి ఆ తరువాత నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఎంపిక చేసిన ప్రభుత్వం మరో ఇద్దరిని కూడా ఈ జాబితా నుంచి తొలగించింది. ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను పక్కన పెట్టడంతో.. మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ ఫైనల్ రేసులో మిగిలారు. మరి వీరిలో ఎవర్ని ఆ పదవి వరించనుది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.