కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. మార్చి 14న ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే పలుమార్తు వేడుకున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో అరుంధతికి చికిత్స జరుగుతుందని ఆమె సోదరి ఆర్తీ చెప్పింది. ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపింది. వైద్యం కోసం రోజూ దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోందని, ఇప్పటికే అరుంధతి కోసం రూ. 40 లక్షలు ఆస్పత్రి బిల్లులు చెల్లించామని అర్తీ చెబుతుంది. అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా మెదడులో రక్తం గడ్డకట్టింది. అందుకు సంబంధించిన బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం పూర్తి అయినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఇప్పుడు కూడా కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తీ ఆవేధన చెందుతుంది. 90 రోజులు దాటినా తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అన్నట్లు ఆర్తీ పేర్కొంది. ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకలకి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరింది. ఇప్పటికే పలువురు మళయాల నటీమణులు కూడా ఆమెకు సాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు. అరుంధతి నాయర్ తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్' (తెలుగులో భేతాళుడు)లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment