
తాగుడికి, మత్తుపదార్థాలకు అడిక్ట్ అవ్వడం గురించి విన్నాం. అలాగే సినిమాలకు అడిక్ట్ అయ్యే వాళ్లు గురించి కూడా తెలుసు. చాలావరకు హిరో లేదా హిరోయిన్ మాదిరిగా ప్రవర్తించడం వంటి పిచ్చి చేష్టలు చేస్తారని తెలుసు. కానీ ఆ సినిమాలో కథనాయిక ఎలా చనిపోయాడో అలా చనిపోవాలని మాత్రం అనుకోరు. ఐతే ఈ వ్యక్తి మాత్రం తన చూసిన సినిమాలో కథనాయకి ఎలా చనిపోయిందో అలానే చనిపోవాలని నిర్ణయించుకుని కన్నవాళ్లకు తీరని వేదన మిగల్చాడు..
వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కర్ణాటకలోని ఓ గ్రామంలోని 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ అనే వ్యక్తి పదోతరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత అతనికి సినిమాలంటే మోజు ఎలా పెరిగిందో తెలియదు గానీ దానికి అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఆ సినిమాలో వాళ్లు ఏం చేస్తే అలా చేసేయాలనేంతగా వ్యామోహం పెంచేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఇంటర్ కూడా చదవడం మానేశాడు.
అతనికి అరుంధతి సినిమా అంటే మహా ఇష్టమట. ఏకంగా 15 సార్లు ఆ సినిమాని చూశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐతే ఆ సినిమాలో అనుష్క విలన్ పశుపతి నుంచి తన సంస్థానంలోని మనుషులను కాపాడుకోవడానికి ఎలా అయితే సాధువుల వద్దకు వెళ్లి ఎలా తనకు తానుగా చనిపోతుందో అలా తాను చనిపోవాలనుకున్నాడు. ఈ విషయం గురించి తన తల్లిదండ్రులతో పదే పదే చెప్పేవాడు కూడా.
దీంతో వాళ్లు అతన్ని అది సినిమాని నిజంగా అలా చేయడం కుదరదని పలుమార్లు వారించారు కూడా. ఈ మేరకు సదరు వ్యక్తి తాను చెప్పినట్టుగానే సినిమా కథానియికిలా 20 లీటర్లు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటాడు. తాను చనిపోతున్న దాన్ని కూడా వీడియో తీసి మరీ వివరించాడు. అయితే స్థానికులు అతను మంటల్లో కాలిపోవడం చూసి రక్షించి ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తి 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ.. ఆస్పత్రిలోనే మరణించాడని పోలీసులు తెలిపారు.
(చదవండి: భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు..)
Comments
Please login to add a commentAdd a comment