ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి: అక్రమంగా నిర్వహిస్తున్న మూడు స్పా కేంద్రాలపై సీసీబీ పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి ఇద్దరిని అరెస్ట్‌చేసి ఇద్దరు విదేశీయులతో పాటు 13 మంది మహిళా సిబ్బందిని రక్షించారు. ఉత్తర భారతదేశానికి చెందిన దేవేందర్, అభిజిత్ అనే ఇద్దరు పట్టుబడ్డారు.
ఉద్యోగాల ఆశచూపించి ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు, యువతులను పిలిపించుకుని వారిచే నగరంలోని స్పాల్లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేశారు.
నేపాల్, టర్కీ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, నాగాలాండ్‌కు చెందిన ఇద్దరు, అసోంకు చెందిన ముగ్గురు మహిళలు, ఢిల్లీ మహిళ, పశ్చిమబెంగాల్-ముగ్గురు, స్థానికులైన ఇద్దరు మహిళలను సీసీబీ పోలీసులు కాపాడారు. మరికొందరు నిందితులపై హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, అశోక్‌నగర, మడివాళ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment