Banashankari
-
ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతిపై అత్యాచారం
-
రైడ్ బుక్ చేసుకుంటే.. రూమ్‌కి తీసుకెళ్లి ప్రియురాలి ముందే అత్యాచారం
సాక్షి, బెంగళూరు(బనశంకరి): సిలికాన్ సిటీలో దారుణం జరిగింది. ర్యాపిడో బైక్ డ్రైవరు స్నేహితునితో కలిసి కేరళ కు చెందిన యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు. అది కూడా అతని ప్రియురాలి సమక్షంలోనే అకృత్యాన్ని సాగించారు. ఈ ఘటన బెంగళూరు ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బిహార్‌కు చెందిన ర్యాపిడో బైక్ డ్రైవరు షహబుద్దీన్, అతని స్నేహితుడు అర్పత్ షరీఫ్, షహబుద్దీన్ ప్రియురాలిని ఎల్రక్టానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో స్నేహితున్ని కలవాలని.. వివరాలు.. గత 25వ తేదీ రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కేరళ యువతి (22) మద్యం మత్తులో స్నేహితున్ని కలవాలని ర్యాపిడో బైకును బుక్‌చేసింది. దారి మధ్యలో యువతి డ్రైవరు షహబుద్దీన్‌ను సిగరెట్ అడిగింది. బైకు నిలిపిన అతడు సిగరెట్ కోసం వెళ్లాడు. తన ఫోన్ పే పనిచేయడం లేదని స్నేహితుడు అర్పత్ షరీఫ్‌కు కాల్ చేసి డబ్బు అడిగాడు. డబ్బు ఎందుకు అని అతడు అడగడంతో యువతిని డ్రాప్ చేయడానికి వెళుతున్నాను. ఆమె మద్యం మత్తులో సిగరెట్ అడిగింది అని వివరించాడు. యువతిపై అత్యాచారం చేయాలని ఇద్దరూ మాట్లాడుకుని షహబుద్దీన్ యువతిని తన రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆమె మద్యం మత్తులో ఉండడంతో ఏమీ గ్రహించలేకపోయింది. ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ సమయంలో షహబుద్దీన్ ప్రియురాలు కూడా అక్కడే ఉంది. ఆస్పత్రిలో చేరిక కొంతసేపటికి యువతిని గమ్యం వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. యువతికి శరీరంలో బాధ కనబడటంతో తనపై అత్యాచారం జరిగినట్లు అనుమానం వచ్చింది. బాయ్ ఫ్రెండ్‌కు చెప్పడంతో ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టర్లు పరీక్షించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులను అరెస్ట్ చేశారు. చదవండి: (టెన్త్ విద్యార్థినిపై తోటి విద్యార్థుల.. గ్యాంగ్‌రేప్) -
నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా
సాక్షి, బెంగళూరు(బనశంకరి): రాష్ట్రంలో హనీట్రాప్ దందాలు ఆగడం లేదు. హైకోర్టు ఉద్యోగికి వల వేసిన నగదు వసూలుకు యత్నించిన ముఠాను శనివారం కామాక్షీపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు అనురాధ, కావ్య, సిద్దరాజులతో పాటు పది మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు.... హైకోర్టు ఉద్యోగి జైరామ్‌కు రెండేళ్ల క్రితం అనురాధ పరిచయమైంది. ఆరు నెలల క్రితం ఇంటిలో షార్ట్‌సర్క్యూట్‌తో వస్తువులు కాలిపోయాయని, డబ్బు అవసరం ఉందని జైరామ్ వద్ద అనురాధ రూ. 10 వేలు తీసుకుంది. అక్టోబర్ 10న జైరామ్‌కు డబ్బు తిరిగి చెల్లించింది. అనంతరం మళ్లి 25న రూ. 5 వేలు అప్పు అడిగింది. దీంతో జైరామ్ అదే రోజు నగదు ఇవ్వడానికి అనురాధ ఇంటికి వెళ్లాడు. అక్కడే జైరామ్ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. వల వేసి.. డబ్బుల కోసం డిమాండ్ జైరామ్‌కు అనురాధ పరిచయమైన అనంతరం ఓ రోజు ఇంటికి రావాలని పిలిపించుకుంది. రూ. 5 వేల నగదుతో వచ్చిన జైరామ్ నగదు ఆమె చేతికి ఇచ్చాడు. అదే సమయంలో ఈ గ్యాంగ్ వీడియో చిత్రీకరించారు. అప్పటి వరకు చాటుగా ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి బెదిరింపులకు దిగారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అంటూ ముఠాలోని ఓ వ్యక్తి బెదిరించాడు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి జైరామ్ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. లేదంటే వీడియో బయట పెడతామని హెచ్చరించారు. దీంతో బాధితుడు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 10 మంది గ్యాంగ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు సిద్దరాజు దావణగెరెకు చెందిన వాడు కాగా నగరంలో రౌడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రెండు దోపిడీలతో పాటు పలు కేసులు ఉన్నాయి. -
హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు
వారం రోజుల కిందట బండెమఠం బసవలింగ స్వామి ఆత్మహత్య కేసులో తొలిరోజే వ్యక్తమైన అనుమానాలు నిజమయ్యాయి. మరో మఠం స్వామి కుట్ర పన్ని ఆయనను హనీ ట్రాప్‌లో ఇరికించడం, ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించడం బండెమఠం స్వామి ఆత్మహత్యకు కారణమని తేలింది. ఓ యువతిని మఠానికి పంపి స్వామీజీని లోబర్చుకుని వీడియోలు తీశారు. పరువు పోవడం కంటే ప్రాణం పోతే మేలనుకునేలా ఆయనను ఒత్తిడికి గురిచేశారు. సూత్రధారి ఆయనకు బంధువు కావడం గమనార్హం. మఠాల మధ్య సాగుతున్న చీకటి పోరాటాల్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడి తాలూకా కంచుగల్ బండేమఠ బసవలింగస్వామి (45) ఆత్మహత్య కేసులో అదే జిల్లా కణ్ణూరు మఠం మృత్యుంజయ శ్రీ, స్థానిక నేత మహదేవయ్య, ఇంజనీరింగ్ విద్యార్థిని నీలాంబికను ఆదివారం రామనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. బసవలింగ స్వామి రాసిన డెత్‌నోట్‌లో మూడు పేజీలలో పూర్తి సమాచారం తెలియపరిచారు. 21 ఏళ్ల నీలాంబికను బండేమఠానికి పంపి కణ్ణూరు మృత్యుంజయ స్వామి హనీట్రాప్‌కు పాల్పడ్డారని డెత్‌నోట్‌లో ప్రస్తావించారు. కణ్ణూరు స్వామి, ఇతర ఏడెనిమిదిమందితో వేధింపులను ఎదుర్కొన్నానని, మఠం గురించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన చావుకు ఆ యువతి కారణమని రాసిపెట్టారు. రాష్ట్రంలో సంచలనం బండేమఠ బసవలింగస్వామీజీ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో నిందితుల కోసం వేట మొదలైంది. మృతుడు వివరంగా డెత్‌నోట్ రాయడంతో పోలీసుల పని సులువైంది. హనీ ట్రాప్ జరిగినట్లు తొలిరోజే వెలుగుచూసింది. నిందితుల అరెస్టులతో ఇది ఖరారైంది. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని రామనగర ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు. నగ్న వీడియో వైరల్ బండేమఠం స్వామి ప్రైవేటు వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో మొదటి రెండు వీడియోల్లో అర్దనగ్నంగా ఉన్న ఆయన ఆ తరువాత పూర్తి నగ్నంగా ఉన్నారు. కానీ వీడియో కాల్ చేసిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఆమె వీడియో కాల్‌ను రికార్డ్ చేసుకుని ఆడియోను మ్యూట్ చేసింది. 8 మంది తీవ్ర విచారణ ఈ కేసులో 8 మందిని పోలీసులు విచారణ చేపట్టారు. స్వామీజీ యువతి గురించి పదేపదే లేఖలో పేర్కొన్నారు. మూడో వీడియో కూడా శనివారం లీక్ అయింది. మరో మొబైల్లో దృశ్యాలను చూపుతూ ముద్దు పెట్టుకుందామా అని మహిళను కోరే దృశ్యాలు ఉన్నాయి. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశముంది. పావుగా బెంగళూరు విద్యార్థిని ఈ కేసులో రామనగర పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా బెంగళూరుకు చెందిన నీలాంబికను అదుపులోకి తీసుకున్నారు. కణ్ణూరు మృత్యుంజయస్వామీమి, బండెమఠం బసవలింగస్వామీజీ బంధువులని తెలిసింది. బండెమఠం పీఠం కోసం కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మృత్యుంజయ స్వామిని రామనగర పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. ఇతనితో 8 మంది చేతులు కలిపినట్లు తెలిసింది. అపారమైన సంపద ఉన్న బండె మఠాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి యువతి ద్వారా పథకం నడిపించారు. బండెమఠ పాఠశాలలలో పనిచేసే పంకజ అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అక్రమంగా స్పాల నిర్వహణ.. పోలీసుల దాడులు
బనశంకరి: అక్రమంగా నిర్వహిస్తున్న మూడు స్పా కేంద్రాలపై సీసీబీ పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి ఇద్దరిని అరెస్ట్‌చేసి ఇద్దరు విదేశీయులతో పాటు 13 మంది మహిళా సిబ్బందిని రక్షించారు. ఉత్తర భారతదేశానికి చెందిన దేవేందర్, అభిజిత్ అనే ఇద్దరు పట్టుబడ్డారు. ఉద్యోగాల ఆశచూపించి ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు, యువతులను పిలిపించుకుని వారిచే నగరంలోని స్పాల్లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేశారు. నేపాల్, టర్కీ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, నాగాలాండ్‌కు చెందిన ఇద్దరు, అసోంకు చెందిన ముగ్గురు మహిళలు, ఢిల్లీ మహిళ, పశ్చిమబెంగాల్-ముగ్గురు, స్థానికులైన ఇద్దరు మహిళలను సీసీబీ పోలీసులు కాపాడారు. మరికొందరు నిందితులపై హెచ్ఎస్ఆర్ లేఔట్, అశోక్‌నగర, మడివాళ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. -
గూగుల్‌లో సెర్చ్ చేసి దోపిడీకి ప్లాన్.. బంగారం అమ్ముతామని రప్పించి దారుణం
బనశంకరి (కర్ణాటక): దుండగులు గూగుల్‌ను సెర్చ్ చేశారు. గోల్డ్ కంపెనీ ఉద్యోగుల వద్ద నగదు ఉంటుందని గుర్తించి వల వేశారు. బంగారం అమ్ముతామని చెప్పి ఆ కంపెనీ ఉద్యోగిని రప్పించి హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి నగదుతో ఉడాయించారు. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. పుట్టేనహళ్లిపోలీసుల కథనం మేరకు వివరాలు...బనశంకరి సరబండెపాళ్య నివాసి దివాకర్ ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రజల వద్ద బంగారు నగలు డిపాజిట్ చేయించుకొని రుణాలు ఇచ్చేవారు. ఇదిలా ఉండగా తుమకూరుకు చెందిన మంజునాథ్, మునిరాజ్‌లు దోపిడీ కోసం ప్లాన్ వేశారు. గూగుల్‌లో గాలించి ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి దివాకర్ నంబర్ తీసుకున్నారు. ఈనెల 19న ఫోన్ చేశారు. చదవండి: (కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?) డబ్బు అవసరం ఉందని, 65.70 గ్రాముల ఆభరణాలు విక్రయిస్తామని చెప్పి సుందనకట్టెకు ఈనెల 20న రప్పించి అతని వద్ద ఉన్న రూ.5లక్షలు లాక్కొని తర్వాత అతన్ని గొంతునులిమి హత్య చేసి శవాన్ని మూటగట్టి అతను వచ్చిన బైక్‌తో సహా మాగడిరోడ్డు హొన్నాపుర చెరువులో పడేశారు. దివాకర్ అదృశ్యంపై లక్ష్మీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని ఫోన్‌కు వచ్చిన నంబర్లను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బుధవారం దివాకర్ మృతదేహాన్ని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: (యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?) -
వారి వంచనే ముంచిందా..?
బనశంకరి: అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రొఫెసర్ ఏకే రావు కేసులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక ముఠా చేసిన భారీ మోసమే ఆయన మృతికి కారణమని తెలుస్తోంది. దీనికి బలం చేకూరేలా ఏకే రావు చనిపోయే రోజు పోలీసుల విచారణ ఎదుర్కొన్నారని తేలింది. తెలుగు గాయని హరిణి తండ్రి, విశ్రాంత ప్రొఫెసర్ ఏకే రావు 23వ తేదీ బెంగళూర్‌లో యలహంక–రాజానుకుంటే రైల్వే పట్టాలపై శవమై కనిపించారు. చాకుతో గొంతు, ఎడమ చేతిని కోసిన గుర్తులు కనిపించాయి. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు యశవంతపుర రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదవీ విరమణ తరువాత లోన్ కన్సల్టెన్సీ.. రావు మృతి చెందక ముందు కర్ణాటక సుద్దగుంటెపాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఇటీవల పదవీవిరమణ పొందారు. తరువాత బెంగళూర్‌లో లోన్ కన్సల్టెన్సీ ఏజెన్సీని తెరిచారు. ఈ సమయంలో రావుకు, ఎస్ వెంచర్స్ కేపిటల్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన డేనియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, రాఘవన్, వివేకానంద అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తాము భారీ ప్రాజెక్టులకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. దీంతో రావు తన లోన్ కన్సల్టెన్సీ ద్వారా రుణాలు అడిగిన అరుణాచలప్రదేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి తారంగ, బెంగళూర్ పారిశ్రామిక వేత్త గిరీశ్‌లను వారి వద్దకు పంపారు. లోన్లు ఇస్తామని, అయితే 3 నెలల ఈఎంఐ ముందుగా చెల్లించాలని ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం చెప్పగా ఫణి తారంగ, గిరీశ్ సరేనన్నారు. రూ.240 కోట్ల లోన్‌కు ఫణి తారంగ రూ.3.60 కోట్లు, గిరీశ్ రూ.150 కోట్లకు రూ.3 కోట్లు ముందస్తుగా ఈఎంఐ చెల్లించారు. ఆ తరువాత ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం ఫోన్లు స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో ఫణి తారంగ, గిరీశ్‌లు రావును నిలదీయడంతో పాటు స్థానిక సుద్దగుంటపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావును విచారణకు పిలిపించి పంపించినట్లు సమాచారం. ఫైనాన్షియర్లు నమ్మించి మోసం చేశారని రావు స్నేహితుల వద్ద వాపోయారు. అనంతరం కొద్దిసేపటికి ఏకే రావు రైల్వేట్రాక్‌పై శవమై కనిపించారు. ఈ నేపథ్యంలో ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్ కోసం సుద్దగుంటెపాళ్య పోలీసులు గాలిస్తున్నారు. -
కన్ను పడితే ఇల్లు ఖాళీ
బనశంకరి: విలాసవంతమైన జీవనం సాగించడానికి దొంగతనాలను ఎంచుకున్నారు. కొన్నిరోజులు ఒక ప్రాంతంలో ఇల్లుబాడుగకు తీసుకోవడం, ఇంపుగా కనిపించిన ఇంట్లో పడి దోచేయడం. ఇదీ ఆ ముఠా అలవాటు. అంతర్రాష్ట్ర దొంగలను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.80 కోట్ల విలువచేసే బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిలాల్ మండల్, షాజాన్ మండల్, మహారాష్ట్రవాసి సలీం రఫిక్ షేక్, బిహార్‌వాసి మహమ్మద్ జాలీక్ అనే నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. చదవండి: ఆరునెలల్లో కూతురు వివాహం.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా చోరీలు పెరగడంతో నిఘా బెంగళూరు దక్షిణ విభాగంలో ఇటీవల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడ్డారు. దీంతో డీసీపీ హరీశ్‌పాండే ఆధ్వర్యంలో బసవనగుడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల జాడను కలిపెట్టి అరెస్టు చేశారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇళ్లను బాడుగకు తీసుకుని మకాం వేసేవారమని, తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలు చేసేవారమని దొంగలు తెలిపారు. నగలను ముంబై, హైదరాబాద్ నగరాల్లో బంగారు దుకాణాల్లో విక్రయించి జల్సాలు చేసేవారు. విమానాల్లోనే రాకపోకలు సాగించేవారమని చెప్పారు. రూ.2 లక్షల విలువైన 24 వాచ్‌లు, రూ.50 వేల ల్యాప్‌టాప్, రూ.46,700 నగదు, సుమారు రూ.1.64 కోట్ల ఖరీదైన 3 కిలోల 286 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12.60 లక్షల విలువచేసే 18 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్ట్‌తో 27 కేసులు పరిష్కారమైనట్లు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు -
డేంజర్ జోన్లో అపార్టుమెంట్లు
బనశంకరి: బెంగళూరులో అపార్టుమెంట్లు కరోనా వైరస్‌కు నిలయాలుగా మారాయనే ఆరోపణలున్నాయి. దీనికి అడ్డుకట్టకు బీబీఎంపీ చేస్తున్న చర్యలు ఫలించడం లేదు. బెంగళూరుకు సరిహద్దు వార్డులో డేంజర్జోన్లుగా మారగా, జనాభా అధికంగా ఉండే, వాణిజ్య ప్రాంతాలైన సిటి మధ్య ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. జనసాంద్రత తక్కువగా ఉండే బెంగళూరు నగర శివారు వార్డుల్లో కరోనా ప్రబలడం విశేషం. వసంతనగర ఎంబెసీ అపార్టుమెంట్లో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి మొత్తం అపార్టుమెంట్స్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వేలాది మంది ఒకేచోట నివసిస్తుండడం కరోనా ప్రబలడానికి కారణంగా అనుమానాలున్నాయి. అపార్టుమెంట్లే అధిక క్వారంటైన్లు అపార్టుమెంట్లలో కరోనా బెడద వల్ల సిటీలో కంటైన్మెంట్ జోన్లు 172కి పెరిగాయి. ఇందులో 80 అపార్టుమెంట్లే. అందులో మహాదేవపుర అత్యధికంగా.. అంటే 49 కంటైన్మెంట్ జోన్లు ఉండడంతో స్థానికుల్లో కలకలం రేపుతోంది. మహాదేవపుర 49 కంటైన్మెంట్లలో 28 అపార్టుమెంట్లు ఉన్నాయి. బొమ్మనహళ్లిలో ఉన్న 24 కంటైన్మెంట్ జోన్లన్నీ అపార్టుమెంట్లు కావడం గమనార్హం. తూర్పు వలయంలో 36 కంటైన్మెంట్ జోన్లలో 13 అపార్టుమెంట్లు, దక్షిణలో 21 కంటైన్మెంట్ జోన్లలో 8 అపార్టుమెంట్లు, పశ్చిమ వలయంలో 11 కంటైన్మెంట్‌జోన్లులో రెండు అపార్టుమెంట్లు ఉన్నాయి. యలహంక 25 కంటైన్మెంట్ జోన్లలో 11 అపార్టుమెంట్లు, ఆర్ఆర్.నగరలో 5 కంటైన్మెంట్జోన్లలో రెండు అపార్టుమెంట్లు, దాసరహళ్లిలో ఒక విల్లాను కంటైన్మెంట్జోన్గా గుర్తించారు. డేంజర్ వార్డులు ఇవే బేగూరు, బెళ్లందూరు, రాజరాజేశ్వరినగర, హూడి, హగదూరు, వర్తూరు, హొరమావు, బసవనపుర, విజ్ఞాననగర, విద్యారణ్యపురల్లో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. కొత్తగా వెయ్యి పాజిటివ్‌లు సాక్షి, బెంగళూరు: కరోనా తీవ్రత తగ్గినట్లే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,065 మందికి పాజిటివ్‌గా వెల్లడి కాగా, 1,486 మంది కోలుకున్నారు. 28 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,30,529 కి, డిశ్చార్జ్‌లు 28,71,448, మరణాలు 37,007 కి చేరాయి. మరో 22,048 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివిటీ రేటు 0.93 శాతంగా ఉంది. బెంగళూరులో తాజాగా 270 కేసులు, 378 డిశ్చార్జిలు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. 8,054 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,13,580 మందికి కరోనా పరీక్షలు చేశారు. 2,90,794 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. -
మరో మహిళతో సాన్నిహిత్యం.. నిలదీసినందుకు
బనశంకరి/కర్ణాటక: మూడుముళ్లు వేసి కడదాక తోడుంటానని బాసలు చేసిన భర్త కర్కోటకుడిగా మారాడు. భార్య గొంతుకు చార్జర్ వైర్ బిగించి హత్య చేశాడు. ఈఘటన కుష్టగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ...యలబుర్గి తాలూకా యడ్డోణి గ్రామానికి చెందిన మంజులకు కొప్పళ తాలూకా ముద్దాబళ్లికి చెందిన మంజునాథ్ కట్టమనితో వివాహమైంది. మంజునాథకట్టిమని కుష్టగిలోని కెనరా బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. మంజుల (25) స్థానిక తాలూకా ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. మంజునాథ్ మరో మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. గురువారం దంపతులు బృందావన హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దీంతో సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌ను మంజుల గొంతుకు బిగించి హత్య చేసి మృతదేహాన్ని కొప్పళ రోడ్డు కదళినగర వద్ద సజ్జ పొలంలో పడేసి ఉడాయించాడు. శుక్రవారం మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి హతురాలిని మంజులగా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
నయవంచకుడు; రాజకుటుంబం పేరుతో యువతులకు వల
బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో మైసూరు రాజకుటుంబం బంధువునని ప్రొఫైల్స్ పెట్టుకుని యువతులను పెళ్లి పేరుతో నమ్మించి రూ.40 లక్షలు స్వాహా చేసిన సిద్ధార్థ్ అనే వంచకున్ని వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు స్మార్ట్ ఫోన్లు, పలు బ్యాంకుల డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దేవరాజ్ తెలిపారు. తన పేరు సిద్ధార్థ్ అరస్ అని, అమెరికాలో ఐటీ ఇంజనీరునని ప్రొఫైళ్లు పెట్టుకున్నాడు. ఆంగ్లం, స్పానిష్ మాట్లాడుతూ యువతులను బుట్టలో వేసుకుని ఏదో కారణంతో వారి నుంచి భారీగా డబ్బు గుంజడం ఇతని నైజం. పలువురు ఫిర్యాదు చేయడంతో మైసూరు జిల్లాలో అరెస్టు చేశారు. -
ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు!
బనశంకరి: ఇద్దరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు. కష్టపడితే మంచి భవిష్యత్తు. కానీ తప్పుదోవ తొక్కి కష్టాల్లో పడ్డారు. ప్రియుని ఒత్తిడితో గంజాయి అమ్ముతూ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రేణుక (25) యువతి బెంగళూరు సదాశివనగర పోలీసులకు పట్టుబడింది. ఆమె ప్రియుడు సిద్ధార్థ్ పరారీలో ఉన్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన రేణుక, కడప జిల్లావాసి సిద్ధార్థ్ ఇద్దరూ ఒకే బ్యాచ్. కాలేజీలో ప్రేమలో పడ్డారు. చదువు ముగిశాక రేణుక చెన్నైలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. సిద్ధార్థ్ మాత్రం విలాసవంత జీవితంపై మోజుతో డ్రగ్స్ ముఠాలతో కలిశాడు. నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించానని, ఇందులో చాలా డబ్బు వస్తుందని రేణుకకు చెప్పాడు. సరేనని ఆమె ఉద్యోగం వదిలిపెట్టి ప్రియునితో కలిసి డ్రగ్స్ దందాలోకి దిగింది. లాక్డౌన్లో గంజాయి విక్రయాలు గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో రేణుకను గంజాయి విక్రయానికి బెంగళూరుకు పంపించాడు. ఆమె మారతహళ్లి సమీపంలోని పీజీ హాస్టల్లో ఉండేది. బిహార్‌కు చెందిన సుధాంశు అనే వ్యక్తితో కలిసి గంజాయి విక్రయాలు ప్రారంభించింది. ప్రియుడు సిద్ధార్థ్ పెద్దమొత్తంలో గంజాయిని తీసుకువస్తే రేణుక చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేది. మంగళవారం రాత్రి సదాశివనగర ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి సీఐ ఎంఎస్ అనిల్‌కుమార్, ఎస్ఐ లక్ష్మీలు దాడి చేసి రేణుక, సుధాంశును అరెస్ట్ చేశారు. ఇద్దరినీ పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ప్రియుని మాటలను నమ్మి తప్పు చేశానని రేణుక విలపించింది. సిద్ధార్థ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం -
బహుమతి పంపించానంటూ.. రూ.80 లక్షలు స్వాహా
బనశంకరి: హృద్రోగ నిపుణుడిగా ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి... బెంగళూరు బనశంకరి నివాసి సంధ్యా గాయత్రిని రూ.80 లక్షల మేర మోసం చేశాడు. జనవరి 23వ తేదీ సంధ్యా గాయత్రికి ఇన్‌స్ట్రాగామ్‌లో డేవిస్ హర్మాన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా ఆమె ఆమోదించింది. క్రమేపీ ఇద్దరూ స్నేహితులయ్యారు. డేవిడ్ హర్మాన్ తాను కార్డియాలజిస్టునని చెప్పుకోగా, ఆమె తన గుండెజబ్బుకు సలహాలను తీసుకునేది. మీకు ఖరీదైన కానుక పంపించానని ఫిబ్రవరి 6న ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు మెసేజ్ పంపాడు. 35 వేల పౌండ్ల విదేశీ కరెన్సీ, వస్తువులు ఉన్నాయని, కస్టమ్స్ ఫీజు చెల్లించి తీసుకోవాలని తెలిపాడు. కొంతసేపటికి ఒక యువతి సంధ్యాగాయత్రికి ఫోన్ చేసి కస్టమ్స్ కొరియర్ అధికారిగా పరిచయం చేసుకుంది. కస్టమ్స్ ఫీజు చెల్లించి విదేశాల నుంచి వచ్చిన గిప్టు తీసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ సంధ్యా గాయత్రి అనుమానంతో డబ్బు పంపలేదు. మళ్లీ ఆ యువతి ఫోన్‌చేసి పార్శిల్ తీసుకోనందున, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుంచినోటీస్ వచ్చిందని నకిలీ నోటీస్ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌లో పంపింది. దీంతో సంధ్యా గాయత్రి నిజమేనేమో అని నమ్మింది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 19 వరకు దశలవారీగా వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.80 లక్షలు బదిలీ చేసింది. డబ్బు జమకాగానే డేవిన్‌హర్మాన్ అడ్రస్ లేదు. నెలరోజులైనా ఏ కానుక అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళ బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చదవండి: NATO: చైనాతో ప్రపంచ దేశాలకు ప్రమాదం -
‘నేను లండన్‌లో ఉంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా’
సాక్షి, బెంగళురు(బనశంకరి): నేను లండన్‌లో నివసిస్తుంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంచకుడు ఓ మహిళ నుంచి రూ.10.13 లక్షలు స్వాహా చేశాడు. బెంగళూరు గురురాఘవేంద్ర లేఔట్ నివాసి తానియా రై బాధిత మహిళ. కొద్దిరోజుల క్రితం ప్రేమ్ బసు అనే వ్యక్తి ఒక పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమయ్యాడు. లండన్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. మీరు నచ్చారని, భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పడంతో మహిళ నిజమేననుకుంది. మరుసటి రోజు ఆమె మొబైల్‌కు ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. లండన్ నుంచి ప్రేమ్బసు వచ్చారని, అతడి వద్ద కరోనా నెగిటివ్ రిపోర్టు లేదని, రూ.2 కోట్ల నగదు ఉందని, దీనికి సరైన పత్రాలు లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేశామని చెప్పాడు. అతడిని విడుదల చేయాలంటే కొంత పన్ను కట్టాలన్నాడు. తానియా రై అతనికి సాయం చేద్దామని రూ.10.13 లక్షల నగదును ఖాతాలోకి బదిలీ చేసింది. తరువాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో బాధితురాలికి దిక్కుతోచలేదు. సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. చదవండి: స్విగ్గీ డెలివరీ బాయ్‌ని చితకబాది.. నగదు చోరీ -
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత: నీళ్లు లేని ట్యాంక్‌లో
బనశంకరి: వేట కోసం వచ్చిన చిరుత నీళ్లులేని ట్యాంక్‌లో పడిపోయిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుందాపుర కొడ్లాడిలోకి శుక్రవారం ఉదయం చొరబడిన చిరుత చంద్రశెట్టి అనే వ్యక్తి ఇంటి సమీపంలో కుక్కను వెంబడిస్తూ నీళ్లు లేని ట్యాంక్‌లో పడిపోయింది. అటవీశాఖాధికారి ప్రభాకర్ బృందం చేరుకొని చిరుతను పైకి లాగి బోనులో వేసి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. చిరుతకు 5ఏళ్ల వయస్సు ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: మామిడి తోట రక్షణ కంచెకు చిరుత బలి -
Karnataka: ఉపాధ్యాయులపై కరోనా పంజా..90 మంది మృతి
బనశంకరి: కర్ణాటకలో బెళగావి జిల్లాలో కోవిడ్–19 మహమ్మారి వల్ల ఆదివారం వరకు 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యవాతపడ్డారు. జిల్లాలో కోవిడ్ మొదటి దశలో 23 మంది, రెండోదశలో 20 మంది, ఇదే జిల్లా చిక్కోడి పరిధిలో మొదటి దశలో 18 మంది, రెండో దశలో 29 మంది మృతిచెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ విధుల్లో పాల్గొన్నవారిలో 10 మంది ఉపాధ్యాయులను కరోనా బలిగొంది. ప్రస్తుతం 53 మంది పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. (చదవండి: విషాదం: కుటుంబంలోని నలుగురు మృతి) -
ఇంట్లోకి దూరి కత్తులతో రియల్టర్ దారుణహత్య
బనశంకరి: నగరంలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్టర్ హత్యకు గురయ్యాడు. ఇట్టిమడు మెయిన్‌రోడ్డు బేకరి సమీపంలో మంజునాథ్ అలియాస్ దడియా మంజు (37) అనే రియల్ఎస్టేట్ వ్యాపారి నివసిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనిపై కత్తులు, కొడవళ్లతో తల, పొట్ట, ఇతర భాగాలపై నరికి చంపి ఉడాయించారు. ఇది తెలియగానే పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మంజునాద్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గానూ పనిచేసేవాడు. తమ గురించి ఖాకీలకు సమాచారం ఇస్తున్నాడని కక్షతో ఎవరైనా నేరగాళ్లు హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఇట్టిమడు చుట్టుపక్కల భయాందోళన వ్యక్తమైంది. -
కర్ణాటకలో కన్నతండ్రి దుర్మార్గం
బెంగళూరు : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకుని ఓ కిరాతక తండ్రి ఆస్తి పంచివ్వాలనే దురాశతో పొట్టనబెట్టుకున్నాడు. కిరాయి హంతకులతో కొడుకు రక్తం కళ్లజూశాడు. అయితే నేరం ఎంతోకాలం దాగలేదు. చెన్నరాయపట్టణ తాలూకా బెడిగనహళ్లి చెరువు వద్ద ఆగస్టు 27న రాత్రి బైకుమీద వెళుతున్న పునీత్ (26) అనే యువకున్ని కొందరు దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. ఈ నేరంలో ఆరుమందిని బుధవారం చెన్నరాయపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో పునీత్ తండ్రి హేమంత్ ఈ ఘాతుకానికిసూత్రధారిగా గుర్తించి పోలీసులే నివ్వెరపోయారు. కాంతరాజు, ప్రశాంత్, సునీల్, నందీశ, నాగరాజ్ సుపారీ హంతకులు. రూ.2 లక్షలకు సుపారీ కుమారున్ని అంతమొందించాలని నాలుగైదు నెలల క్రితం ప్లాన్ చేసిన తండ్రి హేమంత్.. హంతక ముఠాకు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చాడు. స్వామి, నందీశ్, కాంతరాజు తుపాకితో కాలి్చచంపారు. కొడుకు హత్యతో తల్లి యశోదమ్మ తల్లడిల్లిపోయింది. చెన్నరాయపట్టణపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త హేమంత్, కొడుకు పునీత్ మధ్య గత కొద్ది ఏళ్లుగా ఆస్తి పంపకాలపై వైరం నడుస్తున్నట్లు, భర్తే హత్య చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీని ఆధారంగా హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా సుపారీ ఇచ్చిన వైనం వివరించాడు. నిందితులను అరెస్టు చేసి రూ.1.88 లక్షల నగదు, 5 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌గౌడ తెలిపారు. భర్త, అత్తమామల ఘాతుకం తుమకూరు: తిపటూరు తాలూకా నొణవినకెరె పోలీసులు ఓ వినూత్న కేసును చేధించారు. నాగరఘట్ట గ్రామ బావిలో ఇటీవల ఒక మహిళ (38) మృతదేహం లభించింది. అన్ని ఆధారాలు సేకరించి మృతురాలి భర్తను విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. భర్త, రైతు రఘునందన్ కుటుంబ కలహాల వల్ల తల్లితో కలిసి భార్యను గొంతు పిసికి చంపి పాక్షికంగా కాలి్చవేసి, తరువాత కారులో తీసుకెళ్లి బావిలో పడేసినట్లు చెప్పాడు. తన తండ్రి మంజునాథ్, సోదరుడు మహాలింగయ్య సహకరించారని తెలిపాడు. కేసును ఛేదించిన సీఐ విజయలక్షి్మ, నొణవినకెరె సీపీఐ ముద్దయ్య, సిబ్బందిని జిల్లా ఎస్పీ కృష్ణవంశీ అభినందించారు. -
దొంగకు కరోనా.. పోలీసులకు క్వారంటైన్
బనశంకరి : దొంగకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్ట్ చేసిన 15 మంది పోలీసులను క్వారంటైన్‌కు తరలించారు. వివరాలు...బెంగళూరు నగర సమీపంలోని అనేకల్ తాలూకా హెబ్బగోడి జేజే.నగర నివాసి ఇనుప కమ్మీ దొంగలించినట్లు ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దొంగను అరెస్ట్ చేసిన 15 మంది పోలీసులను హెబ్బాగొడి లాడ్జీలో క్వారంటైన్లో ఉంచారు. (కరోనా రోగుల సంచారం, జనం హడల్) -
లాయర్ ఫీజు ఇచ్చేందుకు చోరీలు
బనశంకరి (కర్ణాటక): జైలు నుంచి విడుదల కావడానికి జామీను ఇప్పించిన న్యాయవాదికి డబ్బు చెల్లించడానికి ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను శుక్రవారం కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్, వసీమ్ గతంలో అనేక ఇళ్లలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీరిద్దరికి న్యాయవాది జామీను ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. న్యాయవాది ఫీజు చెల్లించడానికి జైలు నుంచి విడుదలైన అనంతరం సయ్యద్, వసీమ్ ఇద్దరూ మళ్లీ చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చోరీసొత్తును బంగారు దుకాణాల్లో విక్రయించి న్యాయవాదికి ఫీజు చెల్లించి మిగిలిన డబ్బుతో జల్సాలు చేసేవారు. కోరమంగళ మాత్రమే కాకుండా ఆడుగోడి, తిలక్‌నగర, బొమ్మనహళ్లితో పాటు ఆరుకు పైగా పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెలుగుచూసిందని బెంగళూరు దక్షిణ డీసీపీ ఇషాపంత్ తెలిపారు. -
సీఐకి షాకిచ్చిన కానిస్టేబుల్
బనశంకరి : విధులకు ఆలస్యంగా హాజరైనందుకు కారణం చెప్పాలని నోటీస్ ఇచ్చిన జయనగర పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యర్రిస్వామికి కానిస్టేబుల్ శ్రీధర్‌గౌడ ఇచ్చిన సమాధానం పోలీస్‌శాఖలో తీవ్రచర్చకు దారితీసింది. జయనగర పోలీస్‌స్టేషన్‌లో 5 మంది గస్తీ సిబ్బంది నిత్యం విధులకు ఆలస్యంగా వస్తున్నారని సీఐ వారికి నోటీసులు అందించారు. ఈ నోటీసులకు కానిస్టేబుల్ శ్రీధర్‌గౌడ సీఐ వ్యవహారశైలిని ప్రస్తావిస్తూ ఘాటుగా లేఖ రాయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘మీ మాదిరిగా ఉదయం సుఖసాగర్ లేదా యుడి హోటల్లో టిఫిన్, మధ్యాహ్నం ఖానావళిలో భోజనం, రాత్రి ఎంపైర్‌లో భోజనం, మిలనోలో ఐస్‌క్రీం తిన్న తరువాత పోలీస్‌స్టేషన్ పైన ఉన్న గదిలో నివాసం ఉండేట్లయితే నేను కూడా ఉదయం తీరిగ్గా విధులకు హాజరయ్యేవాణ్ని. కానీ నాకు వయసు మీదపడిన తల్లిదండ్రులు, పోలీస్‌శాఖలో పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆలనపాలన చూసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌కు రావడం ఆలస్యమౌతుంది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదు’ అని శ్రీధర్‌గౌడ సమాధానమిచ్చారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందోనని కుతూహలం నెలకొంది. -
బాత్ రూంలో రహస్య కెమెరా పెట్టి..
సాక్షి, బనశంకరి: ఓ యువకుడు చేసిన వికృతచేష్టలకు కటకటాల పాలయ్యాడు. ఓ వ్యక్తి పక్కింటిలో ఉన్న బాత్రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మైకోలేఔట్ స్వారభౌమనగర్కు చెందిన జీవన్సెఠ్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి బాత్రూంలో కెమెరా అమర్చాడు. ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సదరు ఇంటి మహిళ కెమెరా ఉన్నట్లు గమనించి భర్తకు తెలిపింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మైకో లేఔట్ పోలీసులు జీవన్‌ను గురువారం అరెస్టు చేశారు. -
జైలులోనూ ఎమ్మెల్యే కొడుకు అదే దూకుడు
సాక్షి, బనశంకరి: యుబీ సిటీలో ఒక రెస్టారెంట్ వ్యాపారవేత్త కొడుకు విద్వత్‌పై దాడికి పాల్పడిన కేసులో శాంతినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కొడుకు మహ్మద్ హ్యారిస్ నలపాడ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు అక్కడ కూడా తన దుందుడుకు తనం ప్రదర్శించాడు. జైలులో స్నేహితుడిపై దాడికి దిగాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఐదవ నిందితునిగా ఉన్న తన మిత్రుడు అబ్రాస్.. ‘నేను జైలుకు రావడానికి మీరే కారణం’ అని మహ్మద్ తిట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అబ్రాస్ పై మహ్మద్ కోపం పట్టలేక దాడికి దిగాడు. సెల్లో ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగిన విషయం తెలుసుకుని జైలు అధికారులు ఇద్దరిని విడిపించారు. అబ్రాస్ను మరో సెల్‌కు తరలించారు. విలపిస్తూనే భోజనం విద్వత్‌పై దాడి కేసులో నగరంలోని 8 వ ఏసీఎంఎం కోర్టు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో బుధవారం సాయంత్రం మహ్మద్, మరో ఐదుగురిని పరప్పన జైలుకు తరలించడం తెలిసిందే. జైల్లో పెట్టిన అన్నం సాంబారును మహ్మద్ ఏడుస్తూనే తిన్నట్లు తెలిసింది. స్నేహితునితో గొడవతో అతని సెల్ వద్ద భద్రత పెంచారు. మిత్రులను వేర్వేరు గదులకు తరలించారు. మహ్మద్ హ్యారిస్‌పై గతంలో కూడా ఇటువంటి దుందుడుకు ఘటనలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. 2016వ సంవత్సరం జూన్‌లో యూబీ సిటీలోని పార్కింగ్‌లో కారు తీయడంలో ఆలస్యం చేసినందుకు మహ్మద్ ఒక యువకునిపై దాడికి పాల్పడగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, తండ్రి, ఎమ్మెల్యే హ్యారిస్ రాజకీయ పలుకుబడితో ఘటనను పెద్దది కాకుండా చేశారని సమాచారం. అదే సంవత్సరం ఆగస్ట్‌లో శాంతినగర లోని ఓ పబ్‌లో, కొద్దిరోజుల అనంతరం బౌరింగ్ క్లబ్లో బౌన్సర్లపై దాడి చేసి వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దయానంద కాలేజీ విద్యార్థి సౌరవ్‌పై తన తమ్ముడు ఒ మర్తో కలసి దాడి చేయడమే కాకుండా రూ.10లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా, ఒక కార్పోరేట్ రంగంలోకి దిగి మహ్మద్‌ను చీవాట్లు పెట్టినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ కుమార్తెను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెనక్కు తగ్గాడు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలతో పార్టీలు... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల çకుమారులతో కూడా మహ్మద్‌కు మంచి సంబంధాలున్నాయని సమాచారం. ప్రతీనెలా వీరంతా యూబీ సిటీలో పార్టీలు విందు వినోదాల్లో మునిగి తేలుతుంటారు. -
ప్రియుడితో జల్సాలు చేసేందుకు చోరీలు..
సాక్షి, బనశంకరి: విద్యావంతురాలైన ఓ యువతి ప్రియుడితో జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలను వృత్తిగా ఎంచుకొని చివరకు కటకటాలపాలైంది. పీజీ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లను తస్కరిస్తున్న యువతిని శనివారం మైకోలేఔట్ పోలీసులు అరెస్ట్ చేసి రూ.4 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణవిభాగ డీసీపీ బోరలింగయ్య శనివారం వివరాలు వెల్లడించారు. చింతామణి తాలూకా చిలకలనేర్పుకు చెందిన శోభ(23) డిప్లొమా పూర్తిచేసి బెంగళూరులోని మైకోలేఔట్‌కు చేరుకుంది. నగరంలోని మహిళా పీజీ హస్టళ్లను సందర్శించి యజమానులను పరిచయం చేసుకొని తనకు వసతి కల్పించాలని విన్నవించేది. యజమానులు గదులు చూపించే సమయంలో అక్కడి ల్యాప్‌టాప్‌లను తస్కరించి ఉడాయించేది. ల్యాప్‌టాప్‌లు చోరీకి గురైన ఘటనలు అధికం కావడంతో సీఐ అజయ్ తన సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలింపు చేపట్టి సదరు కిలేడీని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండా సదరు కిలేడీ చోరీలకు పాల్పడటం ప్రియుడికి తెలియదని పోలీసులు తెలిపారు. -
భార్య ఉండగానే మరో యువతితో..
బనశంకరి: భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం నడిపి కటకటాలపాలైన వంచకుడి ఉదంతం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక బాణసవాడి పరిధిలోని కాచరకనహళ్లికి చెందిన కంట్రాక్టర్ మూర్తికి నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. అతన్ని నమ్మిన సదరు యువతి సర్వం సమర్పించుకుంది. అయితే మూర్తికి ఇప్పటికే వివాహమైనట్లు తెలుసుకున్న సదరు బాధితురాలు బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.