
బనశంకరి: నగరంలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్టర్ హత్యకు గురయ్యాడు. ఇట్టిమడు మెయిన్‌రోడ్డు బేకరి సమీపంలో మంజునాథ్ అలియాస్ దడియా మంజు (37) అనే రియల్‌ఎస్టేట్ వ్యాపారి నివసిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనిపై కత్తులు, కొడవళ్లతో తల, పొట్ట, ఇతర భాగాలపై నరికి చంపి ఉడాయించారు. ఇది తెలియగానే పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మంజునాద్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గానూ పనిచేసేవాడు. తమ గురించి ఖాకీలకు సమాచారం ఇస్తున్నాడని కక్షతో ఎవరైనా నేరగాళ్లు హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఇట్టిమడు చుట్టుపక్కల భయాందోళన వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment