
బనశంకరి : దొంగకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్ట్ చేసిన 15 మంది పోలీసులను క్వారంటైన్‌కు తరలించారు. వివరాలు...బెంగళూరు నగర సమీపంలోని అనేకల్ తాలూకా హెబ్బగోడి జేజే.నగర నివాసి ఇనుప కమ్మీ దొంగలించినట్లు ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దొంగను అరెస్ట్ చేసిన 15 మంది పోలీసులను హెబ్బాగొడి లాడ్జీలో క్వారంటైన్‌లో ఉంచారు.
(కరోనా రోగుల సంచారం, జనం హడల్)