బెంగళూరు : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకుని ఓ కిరాతక తండ్రి ఆస్తి పంచివ్వాలనే దురాశతో పొట్టనబెట్టుకున్నాడు. కిరాయి హంతకులతో కొడుకు రక్తం కళ్లజూశాడు. అయితే నేరం ఎంతోకాలం దాగలేదు. చెన్నరాయపట్టణ తాలూకా బెడిగనహళ్లి చెరువు వద్ద ఆగస్టు 27న రాత్రి బైకుమీద వెళుతున్న పునీత్ (26) అనే యువకున్ని కొందరు దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. ఈ నేరంలో ఆరుమందిని బుధవారం చెన్నరాయపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో పునీత్ తండ్రి హేమంత్ ఈ ఘాతుకానికిసూత్రధారిగా గుర్తించి పోలీసులే నివ్వెరపోయారు. కాంతరాజు, ప్రశాంత్, సునీల్, నందీశ, నాగరాజ్ సుపారీ హంతకులు.
రూ.2 లక్షలకు సుపారీ
కుమారున్ని అంతమొందించాలని నాలుగైదు నెలల క్రితం ప్లాన్ చేసిన తండ్రి హేమంత్.. హంతక ముఠాకు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చాడు. స్వామి, నందీశ్, కాంతరాజు తుపాకితో కాలి్చచంపారు. కొడుకు హత్యతో తల్లి యశోదమ్మ తల్లడిల్లిపోయింది. చెన్నరాయపట్టణపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త హేమంత్, కొడుకు పునీత్ మధ్య గత కొద్ది ఏళ్లుగా ఆస్తి పంపకాలపై వైరం నడుస్తున్నట్లు, భర్తే హత్య చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీని ఆధారంగా హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా సుపారీ ఇచ్చిన వైనం వివరించాడు. నిందితులను అరెస్టు చేసి రూ.1.88 లక్షల నగదు, 5 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌గౌడ తెలిపారు.
భర్త, అత్తమామల ఘాతుకం
తుమకూరు: తిపటూరు తాలూకా నొణవినకెరె పోలీసులు ఓ వినూత్న కేసును చేధించారు. నాగరఘట్ట గ్రామ బావిలో ఇటీవల ఒక మహిళ (38) మృతదేహం లభించింది. అన్ని ఆధారాలు సేకరించి మృతురాలి భర్తను విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. భర్త, రైతు రఘునందన్ కుటుంబ కలహాల వల్ల తల్లితో కలిసి భార్యను గొంతు పిసికి చంపి పాక్షికంగా కాలి్చవేసి, తరువాత కారులో తీసుకెళ్లి బావిలో పడేసినట్లు చెప్పాడు. తన తండ్రి మంజునాథ్, సోదరుడు మహాలింగయ్య సహకరించారని తెలిపాడు. కేసును ఛేదించిన సీఐ విజయలక్షి్మ, నొణవినకెరె సీపీఐ ముద్దయ్య, సిబ్బందిని జిల్లా ఎస్పీ కృష్ణవంశీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment