
బనశంకరి: హృద్రోగ నిపుణుడిగా ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి... బెంగళూరు బనశంకరి నివాసి సంధ్యా గాయత్రిని రూ.80 లక్షల మేర మోసం చేశాడు. జనవరి 23వ తేదీ సంధ్యా గాయత్రికి ఇన్‌స్ట్రాగామ్‌లో డేవిస్ హర్మాన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా ఆమె ఆమోదించింది. క్రమేపీ ఇద్దరూ స్నేహితులయ్యారు. డేవిడ్ హర్మాన్ తాను కార్డియాలజిస్టునని చెప్పుకోగా, ఆమె తన గుండెజబ్బుకు సలహాలను తీసుకునేది. మీకు ఖరీదైన కానుక పంపించానని ఫిబ్రవరి 6న ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు మెసేజ్ పంపాడు. 35 వేల పౌండ్ల విదేశీ కరెన్సీ, వస్తువులు ఉన్నాయని, కస్టమ్స్ ఫీజు చెల్లించి తీసుకోవాలని తెలిపాడు.
కొంతసేపటికి ఒక యువతి సంధ్యాగాయత్రికి ఫోన్ చేసి కస్టమ్స్ కొరియర్ అధికారిగా పరిచయం చేసుకుంది. కస్టమ్స్ ఫీజు చెల్లించి విదేశాల నుంచి వచ్చిన గిప్టు తీసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ సంధ్యా గాయత్రి అనుమానంతో డబ్బు పంపలేదు. మళ్లీ ఆ యువతి ఫోన్‌చేసి పార్శిల్ తీసుకోనందున, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుంచినోటీస్ వచ్చిందని నకిలీ నోటీస్ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌లో పంపింది. దీంతో సంధ్యా గాయత్రి నిజమేనేమో అని నమ్మింది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 19 వరకు దశలవారీగా వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.80 లక్షలు బదిలీ చేసింది. డబ్బు జమకాగానే డేవిన్‌హర్మాన్ అడ్రస్ లేదు. నెలరోజులైనా ఏ కానుక అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళ బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
చదవండి: NATO: చైనాతో ప్రపంచ దేశాలకు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment