
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి: రెండు రోజుల క్రితం ఉత్తరకన్నడ జిల్లా భట్కళ నుంచి అపహరణకు గురైన బాలుడు గోవాలో ప్రత్యక్షమయ్యాడు. బ్రెడ్ తీసుకురావడానికి వెళ్లిన అలీ ఇస్లాందాదా (8) అనే బాలుడు రెండురోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు భట్కళనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఒక కారులో అతన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గోవాలో దుండగులను పట్టుకుని బాలున్ని సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
సౌదీ నుంచి తాత పన్నాగం..
అయితే బంధువులే బాలుడిని కిడ్నాప్ చేశారని తేలింది. సౌదీఅరేబియాలో ఉన్న బాలుని తాత ఇనయతుల్లా ఇందుకు కుట్ర పన్నాడు. ఇతనికి బాలుని తండ్రి (అల్లుడు) డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోడంతో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో పలువురితో కలిసి కిడ్నాప్ చేయించి డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. ఈ కేసుకు సంబంధించి భట్కళవాసి అనీశ్‌పాషాను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment