Grand father
-
మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్స్పెక్టర్గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్..!
ఆధునిక వైద్యశాస్త్రం కొంగొత్త వ్యాధులకు తగ్గట్టుగా పురోగమిస్తోంది. సవాలు విసిరే వ్యాధులకు తగ్గట్టుగా వైద్యులు కూడా సరికొత్త వైద్య విధానంతో అద్భుతాలు సృష్టంచి రోగులకు ప్రాణాలు పోస్తున్నారు. దీంతో అత్యంత క్రిటికల్‌గా ఉన్న రోగులకు కూడా నయం అయ్యి.. మంచిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అచ్చం అలాంటి పరిస్థితితో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఊపిరి పోసి..కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బతికే ఛాన్స్ లేనివాడికి అత్యాధునిక చికిత్సతో కొత్త ఆశను చిగురించేలా చేసి ఓ అద్భుతానికి నాంది పలికారు అమెరికన్ వైద్య బృందం.అమెరికాలోని ఒహియోకు చెందిన 64 ఏళ్ల డాన్ ఇలియట్ అనే వ్యక్తి అరుదైన జన్యుపరమైన అప్లా-1 అనే యాంటిట్రిప్సిన్తో పోరాడుతున్నాడు. అతడు 18 ఏళ్ల ప్రాయం నుంచి ఈ అరుదైన జన్యు పరిస్థితితో భాధపడుతున్నాడు. గత 20 ఏళ్లుగా మెడిసిన్‌తో నియంత్రణలో ఉంచుకుంటూ వచ్చాడు. కానీ ఈ వ్యాధి తీవ్రమై ఎంఫిసెమాకు దారితీసింది. యాంటిట్రిప్సిన్ అనే కీలకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమవ్వడంతో ఈ జన్యు పరిస్థితి వస్తుంది. అయితే ఇన్నాళ్లు మందులకు అదుపులో ఉన్న ఈ వ్యాధి తీవ్రమై.. ఇలియట్ శరీరంలో ఒక్కో అవయవంపై దాడి చేయడం ప్రారంభించింది. దీంతో ముందుగా ఇలియట్ శరీరంలోని కాలేయం దెబ్బతింది, తర్వాత మూత్రపిండాల వైఫల్యానికి దారితీసింది అలా నెమ్మది నెమ్మదిగా ప్రాణాంతకంగా మారిపోయి.. చివరికి ఊపిరి తీసుకోవడమే అత్యంత కష్టంగా మారింది. దీంతో వైద్యులు ఇలియట్ ప్రాణాలు కాపాడేందుకు అవయవ మార్పిడి చేయక తప్పదని నిర్థారించారు. అతడి ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ట్రిపుల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. అంటే మరణించిన దాత నుంచి ఇలియట్కి కాలేయం, ఊపరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి చేశారు. ఇలా ట్రిపుల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తొలి వ్యక్తిగా ఇలియట్ నిలిచాడు. ఈ సర్జరీని వైద్యులు 24 గంటల్లోనే పూర్తి చేశారు. అయితే ఇలియట్ పూర్తిగా కోలుకోవడానికి ఏకంగా ఆరు నెలలు పట్టింది. మొదట కొన్ని రోజులు లైఫ్ సపోర్ట్‌తో ఆరువారాలకు పైగా ఆస్పత్రిలోనే గడిపాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆరోగ్యం కుదుటపడుతుండటంతో డిశ్చార్జ్ చేసి పంపిచేశారు. తనకు ఈ అమూల్యమైన బహుమతిని అందించిన దాత కుటుంబ సభ్యలుకు కృతజ్ఞతలు తెలిపాడు ఇలియట్. ఇక్కడ వైద్యులు ఎక్కువ శస్త్ర చికిత్సలను నివారించేలా ఒకే దాత నుంచి మూడు అవయవాలను తీసుకున్నట్లు తెలిపారు. అందువల్లే డాన్ ప్రాణలను రక్షించడం సాధ్యమయ్యిందని అన్నారు. ప్రస్తుతం ఇలియంట్ ఆక్సిజన్ సిలిండర్లతో పనిలేకుండానే స్వయంగా ఊపిరి పీల్చుకుంటున్నాడని చెప్పారు.(చదవండి: గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..) -
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్‌లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్‌విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ నవంబర్ 10న బెంగళూరులో పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ ముద్దుల బాబుకి 'ఏకాగ్ర' అని పేరుపెట్టారు. ఈ పేరుకి సంస్కృతంలో అచంచలమైన దృష్టి లేదా ఏకాగ్రత అని అర్థం వస్తుందని చెబుతున్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి.. కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. నారాయణ మూర్తి వేలకోట్ల సంపదకు వారసుడైన 'రోహన్ మూర్తి'.. తండ్రి మాదిరిగానే సొంతకాళ్ళ మీద నిలబడాలని కొత్త కంపెనీని ప్రారంభించడానికి ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్ పదవిని వదిలేసాడు. అనుకున్న విధంగానే 'సోరోకో' (Soroco) పేరుతో సంస్థ స్థాపించి కోట్లు గడిస్తున్నాడు. ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు! బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో చదువుకున్న రోహన్.. ఆ తరువాత కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ (PhD) పొందాడు. చదువు పూర్తయిన తరువాత 2011లో టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణుని వివాహం చేసుకున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల 2015లో ఈ జంట విడిపోయింది. లక్ష్మి వేణుతో విడాకులైన తరువాత రోహన్ మూర్తి రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ KR కృష్ణన్, మాజీ SBI ఉద్యోగి సావిత్రి కృష్ణన్ కుమార్తె 'అపర్ణ కృష్ణన్'ను 2019లో వివాహం చేసుకున్నారు. వీరిరువురు ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాతగారు టెన్త్ పాస్!
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్‌రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి) -
మనవడ్ని కిడ్నాప్ చేయించిన తాత
బనశంకరి: రెండు రోజుల క్రితం ఉత్తరకన్నడ జిల్లా భట్కళ నుంచి అపహరణకు గురైన బాలుడు గోవాలో ప్రత్యక్షమయ్యాడు. బ్రెడ్ తీసుకురావడానికి వెళ్లిన అలీ ఇస్లాందాదా (8) అనే బాలుడు రెండురోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు భట్కళనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఒక కారులో అతన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గోవాలో దుండగులను పట్టుకుని బాలున్ని సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సౌదీ నుంచి తాత పన్నాగం.. అయితే బంధువులే బాలుడిని కిడ్నాప్ చేశారని తేలింది. సౌదీఅరేబియాలో ఉన్న బాలుని తాత ఇనయతుల్లా ఇందుకు కుట్ర పన్నాడు. ఇతనికి బాలుని తండ్రి (అల్లుడు) డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోడంతో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో పలువురితో కలిసి కిడ్నాప్ చేయించి డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. ఈ కేసుకు సంబంధించి భట్కళవాసి అనీశ్పాషాను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. (చదవండి: నాన్‌వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?) -
చిన్నారి మిస్సింగ్! రెండున్నరేళ్ల తర్వాత.. దిమ్మతిరిగే ట్విస్టులు
ఏదో మలయాళం సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులు.. ఇప్పుడు చెప్పుకోబోయే కేసులో ఉంటాయి.. ఉన్నపళంగా ఓరోజు నాలుగేళ్ల ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో అంతా ఆమె కోసం వెతికారు. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఈ లోపు ఆ చిన్నారి మీద అయినవాళ్లు ఆశలు వదిలేసుకున్నారు. కానీ, కేసును టేకప్ చేసిన పోలీసులు, ప్రైవేట్ డిటెక్టివ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. రెండున్నరేళ్ల తర్వాత తమకు అందిన ఫోన్ టిప్‌తో ఓ ఇంటిపై దాడి చేశారు. నాటకీయ పరిణామాల నడుమ అక్కడ వాళ్లకు ఊహించని సీన్ కనిపించడంతో కంగుతిన్నారు. రెండున్నరేళ్లు వెనక్కి వెళ్తే.. అది.. న్యూయార్క్ స్టేట్‌లోని కయుగ హైట్స్ గ్రామం. 2019 జులైలో ఓ రోజు నాలుగేళ్ల చిన్నారి పైస్లీ తన అక్క స్కూల్‌కి వెళ్లడంతో ఒంటరిగా బయట ఆడుకుంటోంది. కాసేపటికే చిన్నారి కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది జరిగిన రెండున్నరేళ్ల తర్వాత.. పక్కా సమాచారంతో మొన్న ఫిబ్రవరి 14వ తేదీన సౌగర్టిస్(అల్బెనీకి 45 మైళ్ల దూరం..కయుగ హైట్స్‌కి 150 మైళ్లకు పైగా దూరం) లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారే.. పైస్లీనే.. రెండున్నరేళ్ల తర్వాత కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అయితే ఆ చిన్నారి అలా కనిపించడం వెనుక బోలెడన్ని ట్విస్టులు దాగున్నాయండోయ్. సీక్రెట్ గదిలో హాయిగా.. ఆ చిన్నారి అదే ఇంట్లోనే ఉందన్న సమాచారంతో డిటెక్టివ్ ఎరిక్ థెయిలె నేతృత్వంలో సౌగర్టిస్ పోలీసులు సుమారు గంటపాటు సోదా నిర్వహించారు. అంతా వెతికినా లాభం లేకపోయింది. ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించిన ప్చ్.. ప్రయోజనం కనిపించలేదు. ఇక వెళ్లిపోతున్న క్రమంలో.. డిటెక్టివ్ ఎరిక్‌కు మెట్ల మధ్య ఓ దుప్పటి కప్పి ఉండడం, దాని కింద ఏదో వెలుతురు కనిపించడంతో అనుమానంతో తొలగించి చూశాడు. అక్కడ చిన్న సందు కనిపించింది. అనుమానంతో.. చెక్క మెట్లను పదునైన టూల్స్‌తో తొలగించి చూడగా.. ఓ సీక్రెట్ చాంబర్లో బయటపడింది. ఆ చాంబర్లో కింబర్లీ కూపర్ ఒడిలో చిన్నారి పైస్లీ హాయిగా నిద్రపోతూ కనిపించింది. పోలీసుల దాడులు.. ఊహించని ఆ పరిణామంతో ఆ ఇంటి ఓనర్ క్రిక్ షుల్టిస్(సీ.), అతని కొడుకు క్రిక్ షుల్టిస్(జూ.)లు బిత్తరపోయారు. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్ల వయసున్న చిన్నారి పైస్లీని స్వయంగా దగ్గరుండి డిటెక్టివ్ ఎరిక్.. ఆమె అక్క దగ్గరికి చేర్చాడు. ఇంతకీ ఈ కిడ్నాప్‌కు పాల్పడింది ఆ చిన్నారి కన్నతల్లిదండ్రులే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. కన్నవాళ్లే వాళ్లు.. పైస్లీ షుల్టిస్.. క్రిక్ షుల్టిస్(జూ.) కింబర్లీ కూపర్ చిన్న కూతురు. కయుగ హైట్స్‌లో కాపురం ఉన్న ఈ జంటకు.. ఇద్దరు కూతుళ్లు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. తమ ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. కోర్టు ఆ పిల్లలను సంరక్షణను అదే ఊరిలో ఉండే ఓ లీగల్ గార్డియన్‌కు(ఐడెంటిటీ రివీల్ చేయలేదు) అప్పగించింది. దీంతో పైస్లీ షుల్టిస్, ఆమె అక్కను లీగల్ గార్డియన్ దగ్గరికి చేర్చింది ఆ జంట. కానీ, కన్నప్రేమపై మమకారం చంపుకోని ఆ పేరెంట్స్.. అలా పైస్లీని ఎత్తుకెళ్లి ఈ రెండున్నరేళ్లు తమతో పాటే ఉంచుకున్నారు. మధ్యలో పైస్లీ అక్కను కూడా ఎత్తుకెళ్లాలనే ప్లాన్ వేసినా.. అది జరగలేదట. పైస్లీ కనిపించకుండా పోయినా టైంలో.. వీళ్లు పడిన బాధ(నటన) వర్ణనాతీతం. అందుకే ఎవరికీ వీళ్ల మీద అనుమానం రాలేదు. అఫ్కోర్స్.. ఆ చిన్నారి తాత క్రిక్ షుల్టిస్ చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ వాళ్లు పోలీసులకు దొరికేవాళ్లు కాదేమో!. తాతే ఎందుకు పట్టించాడంటే.. క్రిక్ షుల్టిస్ సీనియర్, జూనియర్లు, కింబర్లీ కూపర్ అరెస్ట్‌తో ఆ ప్రాంతం ఒక్కసారిగా షాక్ తింది. రెండున్నరేళ్లు ఒక చిన్నారిని బయటకు రాకుండా.. జాగ్రత్తగా మ్యానేజ్ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు వాళ్లు. అయితే.. మనవరాలు కొడుకు కోడలుతో సంతోషంగా ఉన్నప్పటికీ.. పైస్లీ అలా ఆ బంధీఖానాలో మగ్గిపోవడం భరించలేకపోయాడట ఆ పెద్దాయన. అందుకే పోలీసులకు ఆ చిన్నారి గురించి సమాచారం అందించాడు. ఈ రెండున్నరేళ్లలో ఆ పేరెంట్స్ మీద, ఆ పెద్దాయన మీద పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.. వాళ్లెంత పక్కాగా ఆ చిన్నారిని కాపాడుకున్నారో!. -
సంక్రాంతి పండుగ మనవడితో సంతోషంగా చేసుకోవాలనుకున్నాడు.. అంతలోనే..
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సంక్రాంతి పండుగకు తన మనవడిని తీసుకువస్తున్న ఓ వ్యక్తి మానేరు నదిలో ఆ చిన్నారితో సహా గల్లంతయ్యాడు.. బాబు మృతదేహం లభ్యమవగా తాత ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. మీర్జంపేటకు చెందిన మార్క దేవేందర్(45)కు ఇద్దరు భార్యలు ఇందిర, కొమురమ్మ, కుమారులు బాలు, సాయి, వెంకటేశ్, కూతురు మౌనిక, తల్లిదండ్రులు ఉన్నారు. కూతురు మౌనికకు వీణవంక మండలం కిష్టంపేటకు చెందిన కోల శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఈ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అక్కడ శ్రీనివాస్ కూలి పనులు చేస్తున్నాడు. వీరికి యశ్వంత్(9), ఏడాది వయసున్న ఒక పాప ఉన్నారు. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో దేవేందర్ తన మనవడిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం యశ్వంత్‌ను తీసుకొని మీర్జంపేటకు బయలుదేరాడు. రైలెక్కి, జమ్మికుంటలో దిగి, ఆర్టీసీ బస్సులో వావిలాలకు వచ్చారు. అక్కడి నుంచి కాలినడకన మానేరు నది దాటుతూ స్వగ్రామం మీర్జంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ జారి, నీటిలో పడ్డారు. కొంత దూరంలో ఉన్న రైతులు గమనించి, గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’) గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. రాత్రి వరకు వెతికినా దేవేందర్ ఆచూకీ లభించలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న యశ్వంత్ తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దుర్ఘటనతో మీర్జంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే మానేరు నదిలో గల్లంతై, మృతి చెందిన మార్క దేవేందర్, ఆయన మనవడు యశ్వంత్‌ల కుటుంబసభ్యులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి పరామర్శించారు. ఈ సంఘటన దురదృష్టకరమని, ఇరు కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచ్ నాగార్జున్‌రావు, నాయకులు దేవేందర్, సదానందం, కొమురయ్య, ఓదెలు తదితరులున్నారు. -
ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ?
కొన్ని వ్యాధులను సంగీతం నయం చేయగలదని అంటారు. అలాగే బాగా ఒత్తిడిగా ఉన్నా మూడ్ బాగోకపోయినా కాస్త మంచి సంగీతం వింటే త్వరితగతిన రిలాక్స్ అవ్వగలం. కానీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారిని మానసికంగా ఆరోగ్యవంతులుగా చేయడానికి సంగీతం ఎంతగానో ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడోక అమ్మాయి వాళ్ల తాత అల్జీమర్స్ వ్యాధితో ఎవర్ని గుర్తు పట్టలేక ఇబ్బంది పడుతుంటే అతని మనవరాలు పీయానో వాయిస్తు అతనికి జ్ఙాపకం తెప్పించడానికీ ఎలా ప్రయత్నిస్తోందో చూడండి. ఏంటిదీ అసలేం జరిగింది ఎవరామె చూద్దాం రండి. (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) అసలు విషయంలోకెళ్లితే...షీలాకు 93 ఏళ్ల తాతయ్య ఉన్నారు. ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు పైగా ప్రతి పది నిమిషాలకు ఎవరు నువ్వు అని అడుగుతుంటారు. అయితే ఆమె వాళ్ల తాతయ్య గదిలోకి వెళ్లి పియానో వాయిస్తూ ఉంటుంది. దీంతో వాళ్ల తాతయ్య మొదట ఎవరు నా గదిలోకి వచ్చి పియానో వాయిస్తున్నారని చాటుగా చూస్తుంటాడు. తర్వాత నెమ్మదిగా మనవరాలి దగ్గరకి వచ్చి నిలుచుంటాడు. కాసేపటికీ మనవరాలు వాయిస్తున్న పియానో సంగీతాన్ని వింటూ నవ్వు ముఖం పెడతాడు. ఆ సన్నివేశాన్ని చూస్తే అతను తన మనవరాలిని గుర్తు పట్టినట్లుగా ఉంటుంది. ఈ మేరకు షీలా ఈ వీడియో తోపాటుగా జీవితం చాలా చిన్నది. మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అనే క్యాప్షన్‌ని జోడించి మరీ సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకా ప్రతి నెటిజన్లు హృదయాన్ని కదిలించింది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి, మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: అది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్!) View this post on Instagram A post shared by Sheela Awe 魏喜来 (@sheelaawe) -
పదే పదే తిడుతున్నారని గుడిసెకు నిప్పు.. సజీవ దహనం
సాక్షి, చెన్నై: పదేపదే తిడుతున్నారంటూ 16 ఏళ్ల బాలుడు అవ్వా, తాతపై కోపం పెంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వారిద్దరినీ సజీవ దహనం చేశాడు. వివరాలు.. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో కొత్తంపాడి గ్రామం భారతీ నగర్‌కు చెందిన కాటురాజా(75) రైతు. ఆయనకు భార్య కాశిఅమ్మాల్(65)తో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన కుమార్ కుటుంబం తల్లిదండ్రుల పంట పొలంలోని గుడిసెకు పక్కనే మరో ఇంట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువజామున కాటురాజా, కాశిఅమ్మాల్ నిద్రిస్తున్న గుడిసె తగల బడింది. కుమార్‌తో పాటుగా, పరిసర వాసులు ఆర్పేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది అర్ధగంట శ్రమించి మంటల్ని అదుపు చేశారు. లోనికి వెళ్లి చూడగా, ఆ దంపతులు సజీవ దహనం కావడంతో మృతదేహాల్ని పోస్టుమారా్టనికి తరలించారు. డీఎస్పీ ఇమాన్ వేల్ జ్ఞానశేఖరన్ తొలుత ప్రమాదంగా భావించినా, గుడిసెకు బయట గడియ పెట్టి ఉండడంతో కొడుకులను అనుమానించారు. అదే సమయంలో కుమార్ తనయుడు (16) పోలీసుల్ని చూసి భయపడడంతో అతడ్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తానే ఆ గుడిసెకు నిప్పు పెట్టినట్టు అతడు అంగీకరించాడు. పదేపదే తనను అవ్వా, తాత తిడుతుండడంతోనే ఆగ్రహించి ఈ ఘాతకానికి ఒడి గట్టిన ట్లు ఆ బాలుడు వెల్లడించాడు. దీంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మనవడి వేధింపులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య
చంద్రగిరి : మద్యం కోసం మనుమడు వేధింపులను తట్టుకోలేక తాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తశానంబట్లలో చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం..గ్రామానికి చెందిన చిన్నబ్బరెడ్డి (72), గోవిందమ్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నబ్బరెడ్డి దంపతులు తన మనమడితో కలసి అదే గ్రామంలో వేరే కాపురం ఉంటున్నారు. మద్యానికి బానిసైన మనుమడు తరచూ తన తాతను డబ్బులు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా చిన్నబ్బరెడ్డితో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లోని ఫ్యాను కొక్కీకి ఉరివేసుకుని మృతి చెందాడు. వృద్ధుని కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
పాడు వైరస్.. తాతను తీసుకెళ్లిపోయింది: క్రికెటర్ భావోద్వేగం
చెన్నై: టీమిండియా టెస్టు ఓపెనర్ అభినవ్ ముకుంద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్ ముకుంద్ తాత టీ. సుబ్బారావు(95) కరోనాతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అభినవ్ ముకుంద్ తన ట్విటర్లో పేర్కొన్నాడు. ''ఈరోజు నా జీవితంలో చీకటిరోజు. నాకు ఎంతో ఇష్టమైన మా తాత టీ. సుబ్బారావు ఈరోజు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 95 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న మా తాతను పాడు వైరస్ మా తాతను తీసుకెళ్లిపోయింది. ఆయన మాతో ఉన్నన్నాళ్లు అందరం క్రమశిక్షణతో మెలిగేవాళ్లం.. నేడు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఓం శాంతి అంటూ భావోద్వేగంతో తెలిపాడు. కాగా కరోనా సెకండ్‌వేవ్‌లో చాలా మంది క్రికెటర్లు తమ ఆప్తులను కోల్పోతున్నారు. పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్ తండ్రులు కరోనాతో మృతి చెందగా.. టీమిండియా మహిళా క్రికెటర్ల వేదా కృష్ణమూర్తి తన సోదరిని, తల్లిని కోల్పోగా.. మరో క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలయ్యారు. ఇక తమిళనాడుకు చెందిన అభినవ్ ముకుంద్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున ఏడు టెస్టలాడిన ముకుంద్ 320 పరుగులు చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన ముకుంద్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే టీమిండియాకు దూరమైన అభినవ్ దేశవాలీ టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 145 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 10వేలకు పైగా పరుగులు సాధించాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 300 పరుగులు సాధించి తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం With great sadness, i would like to inform you all that i have lost my grandfather Mr. TK Subbarao to CoVid19. He was 95. A man known for his discipline and his exemplary routines,was otherwise hale and healthy till the virus took him away. Om Shanti! — Abhinav mukund (@mukundabhinav) May 20, 2021 -
హీరో రామ్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ ట్వీట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. ‘విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పింది. నువ్వు లారీ టైర్లపై నిద్రిస్తూ.. ఫ్యామిలీకి అన్ని వసతులు ఏర్పాటు చేశావు. నీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లల కోసం పెద్ద కలలు కని వాటిని నెరవేర్చినందుకు థ్యాంక్స్ తాతయ్య. మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ అని రామ్ ట్వీట్ చేశాడు. From humble beginnings of a lorry driver in Vijayawada sleeping with lorry tires under your bed to providing & caring for your family,you’ve always had the heart of a King. You’ve shown us that richness comes not from what’s in your pocket but from what lies in your heart. 1/2 pic.twitter.com/TLBvzWRaiT — RAm POthineni (@ramsayz) May 18, 2021 -
చాలా ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా : డైరెక్టర్ అట్లీ
చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అట్లీ తాతయ్య సౌందరా పాండియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా అట్లీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మా తాత ఎం. సౌందరా పాడియన్ చనిపోయారు. పూడ్చలేని నష్టమిది..దీన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. ఆయన నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తాను. తాత మీరే నా రోల్‌మోడల్, లవ్ యూ, మిస్ యూ..మీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ అట్లీ ట్వీట్ చేశారు. ఇది చూసిన పలువురు ప్రముఖులు సహా అభిమానులు అట్లీక కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిచిత్రం రాజా రాణితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అట్లీ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ర్టీలో మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్లో షారుక్ ఖాన్‌తో ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తారక్‌కు స్క్రిప్ట్ వినిపించారని, త్వరలోనే ఈ మూవీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. My periyappa late justice M.Sowndra Pandian has passed away,Banyan of the whole family,Completely Devastated painful can’t take it & don’t know how to com over it,Love him the most,Periyappa ur always our king & role model, Love u & Will miss u , rest in peace... pic.twitter.com/LTvFXFQ9on — atlee (@Atlee_dir) April 25, 2021 చదవండి : 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెం అయినా సిగ్గుండాలి' ఆస్కార్ 2021: దక్షిణ కొరియాకు తొలి ఆస్కార్ నటి -
తాత చనిపోయాడని.. ఆస్పత్రిలో యువతి బీభత్సం
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కరోనాతో తమ తాతయ్య ప్రాణం పోవడం తట్టుకోలేక ఓ యువతి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. గురువారం కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆస్పత్రిలో బోడుప్పల్‌కు చెందిన సంజీవ్‌రావు (88) నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో అడ్మిట్ అయ్యాడు. సంజీవరావును కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా తమవంతుగా ప్రయత్నించారు. మూడ్రోజులపాటు 12 లీటర్ల ఆక్సిజన్‌ను అతనికి పెట్టారు. అయితే అతడిలో ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో వెంటిలేటర్ పెట్టాలని వైద్య సిబ్బంది సంజీవరావు కుటుంబ సభ్యులకు సూచించగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. ఆస్పత్రిలో ధ్వంసమైన వెంటిలేటర్ చివరికి గురువారం మధ్యాహ్నం సంజీవరావు ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పెట్టగా.. కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో ఆవేదన చెందిన మనవరాలు ఆస్పత్రి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సంజీవరావుకు పెట్టిన వెంటిలేటర్‌ను పగుల గొట్టడంతో వెంటిలేటర్ పాడైంది. కాగా, యువతి చర్యపై కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి వైద్యులు నారాయణగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చెరువులో పడి తాత, మనవడు మృతి
నడికూడ: ఎడ్లబండి అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో తాత, మనవడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. పరకాల రూరల్ సీఐ రమేశ్ కుమార్, ఎస్ఐ వెంకటకృష్ణ కథనం ప్రకారం.. వరికోల్‌కు చెందిన కానాల సాంబయ్య (46) తన పెద్ద కూతురు కుమారుడు ఆసోల ఆర్తిక్ (6) వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. మనవ డు ఎడ్లబండి తోలుతుండగా.. తాత వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. వరికోల్, వేములపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లకుంట చెరువు కట్టపై ఎద్దులు బెదరడంతో బండి అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఆర్తిక్ నీటిలో పడగా.. వెనకాల వస్తున్న సాంబయ్య మనవడని కాపాడటానికి చెరువులోకి దిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. -
తాత అయిన ముకేష్ అంబానీ
న్యూఢిల్లీ: భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తాత అయ్యారు. ముకేశ్ అంబా నీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోక దంపతులకు ముంబైలో కొడుకు పుట్టాడని అంబానీ కుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తాత. నానమ్మలైనందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొత్త శిశువు రాక అంబానీ, మెహత కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపిందని వివరించారు. వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోక, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో జరిగింది. -
వరదనీటిలో హీరో శర్వానంద్ తాతయ్య ఇల్లు
సాక్షి, అవనిగడ్డ: భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్‌కు చెందిన ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. సినీ నటుడు శర్వానంద్‌కు హరిప్రసాద్ తాతయ్య కావడంతో గతంలో గ్రామానికి వచ్చినప్పుడు శర్వానంద్ ఇదే భవనంలో గడిపేవారు. అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్, సినీ నటుడిగా శర్వానంద్ గుర్తింపు కలిగిన వారు కావడంతో వారికి చెందిన భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయింది. -
తాత కాబోతున్న విలక్షణ హీరో
చెన్నై : విలక్షణ నటుడు విక్రమ్ త్వరలో తాత కాబోతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆయన కుమార్తె అక్షిత.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. విక్రమ్, శైలజ దంపతులు గ్రాండ్ పేరెంట్స్‌గా కానునుండంతో.. వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ఈ వేడుకను చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది.(షారుఖ్ బంగ్లాకు ప్లాస్టిక్ ముసుగు) కాగా, విక్రమ్-శైలజ దంపతులకు కుమార్తె అక్షిత, కుమారుడు ధ్రువ్ ఉన్నారు. అక్షితకు మను రంజిత్‌తో 2017లో వివాహం జరిగింది. మరోవైపు ధ్రువ్ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా విక్రమ్, ధ్రువ్ హీరోలుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది.(‘నవరస’లో నటించనున్న తెలుగు హీరోలు వీరేనా?) -
పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు
సాక్షి, చండీగఢ్ : పబ్జీ మాయలో పడి లక్షల రూపాయలను మాయం చేసిన ఘటన మరువకముందే పంజాబ్‌లో మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా మొహాలికీ చెందిన ఒక టీనేజర్ (15) పబ్జీ ఉచ్చులో చిక్కుకుని తన తాత ఖాతాలోంచి 2 లక్షల రూపాయలను కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..) తాజా నివేదికల ప్రకారం మొహాలికి చెందిన బాలుడు పబ్జీ మొబైల్ గేమ్ వలలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ గేమ్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఇదే అదునుగా భావించిన అతని సీనియర్ ఒకడు ఆటలో మెలకువలు నేర్పుతానని మభ్యపెట్టాడు. దీంతో సీనియర్ నుంచి శిక్షణ పొందేందుడు మైనర్ బాలుడు తన తాతా ఖాతానుంచి భారీ ఎత్తున రహస్య చెల్లింపు చేసేవాడు. తాతా పెన్షన్ ఖాతాను ఇటీవల పేటీఎంకు లింక్ చేయడంతో ఈ టీనేజర్ పని మరింత సులువైంది. పైగా అతని ఖాతాలోని లావాదేవీలను ఇతర కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో అతనికి అడ్డే లేకుండా పోయింది. గత రెండు నెలల కాలంలో పేటీఎంద్వారా 30కి పైగా లావాదేవీలు చేశాడు. ఈ గేమ్‌కు అవసరమైన స్కిన్, క్రాట్స్ ఇతర ఫీచర్లను కొనుగోలు చేసుందుకు 55వేలు ఖర్చు పెట్టాడు. మొత్తంగా సుమారు 2 లక్షల రూపాయలను మాయం జేశాడు. చివరికి విషయం తెలిసిన కుటుంబ పెద్దలు గట్టిగా నిలదీయడంతో పబ్జీలోని రాయల్ ఆట కోసం 2 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు మైనర్ బాలుడు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఈ ఆటకోసం కొత్త సిమ్‌కార్డును కూడా కొనుగోలు చేసినట్టు తెలిపాడు. దీంతో బాలుడి కుటుంబం మొహాలీ ఎస్‌ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. కాగా పంజాబ్‌లోని ఖరార్‌లోని ఒక యువకుడు తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుండి 16 లక్షల రూపాయల మాయం చేసిన ఘటన గతవారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కరోనా, లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడటంతో ఇంటికే పరిమితమవుతున్న చిన్నపిల్లలు, టీనేజర్లు, విద్యార్థులు పబ్జీ గేమ్‌కు బానిసలవుతున్నారు. దీంతో మే నెలలో రికార్డు స్థాయిలో 270 మిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని వసూలు చేసిందంటేనే ఈ గేమ్ డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. -
చిరంజీవిపై తేనేటీగల దాడి
-
దోమకొండలో చిరంజీవిపై తేనేటీగల దాడి
సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసులు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రామ్‌చరణ్ తేజ్, ఉమాపతిరావు మనవరాలు ఉపాసన హాజరయ్యారు. కాగా.. ఆయన బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భౌతికదేహాన్ని గడికోటలో ప్రజల సందర్శనార్థం ఉంచి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 11 నుంచి 11:45 గంటల వరకు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక లక్ష్మీబాగ్‌కు తరలించి మధ్యాహ్నం 12 గంటలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు గడికోట ట్రస్టు సీనియర్ మేనేజర్ బాబ్జీ తెలిపారు. అంత్యక్రియలకు కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరు అయ్యారు. అంతకు ముందు ఉమాపతిరావు పార్థివదేహానికి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే పూలమాల వేసి నివాళులర్పించారు. తేనేటీగల దాడి కాగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో చిరంజీవితో సహా పలువురిపై తేనేటీగలు దాడి చేశాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉమాపతిరావుకు కుమారుడు అనిల్‌కుమార్ కామినేనితో పాటు కూతురు శోభ ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన కూతురు శోభ, అల్లుడు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. (తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్) -
యువతిపై తాత, మేనమామ లైంగిక దాడి
చాంద్రాయణగుట్ట: ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఆమె మేనమామ, తాతను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ మహ్మద్ నగర్‌కు చెందిన షేక్ అఫ్సర్ (70) మనుమరాలు(19) చిన్నతనం నుంచి వారి ఇంట్లోనే పెరిగింది. సదరు బాలికపై కన్నేసిన షేక్ అఫ్సర్ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్ సిద్దిఖ్ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె ఈ నెల 1న చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్టార్ హీరో ఇంట విషాదం
ముంబై : బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. హృతిక్ తాత, లెజెండరీ ఫిల్మ్ మేకర్ జే. ఓం ప్రకాష్ బుధవారం కన్నుమూశారు. 93 సంవత్సరాల ఓం ప్రకాష్ భగవాన్ దాదా, ఆప్ కే సాథ్, ఆఖిర్ క్యోం, అర్పణ్, ఆస్పాస్, ఆశ, ఆక్రమణ్, ఆప్ కీ కసమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆంధీ, ఆంఖో ఆంఖో మే, ఆయా సవాన్ ఝూమ్ కే వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఓం ప్రకాష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కొద్దిరోజుల కిందట తాతతో తన ఫోటోలను హృతిక్ రోషన్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ తాత తన సూపర్ టీచర్ అని, జీవితంలో ప్రతి దశలోనూ ఆయన ఎలా ఉండాలో తనకు పాఠాలు నేర్పించారని బలహీనతలను అధిగమించేలా తనను రాటుదేల్చారని పేర్కొన్నారు. గత ఏడాది ఓం ప్రకాష్ 92వ జన్మదినం సందర్భంగా హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లోనూ ఆయన గురించి పలు వివరాలు వెల్లడించారు. యువకుడిగా ఉన్న దశలో తన తాత పుస్తకాలు కొనుక్కునేందుకు వెడ్డింగ్ రింగ్‌ను అమ్మేశారని చెప్పుకొచ్చారు. వీధిదీపాల కింద చదువుకుని సృజనాత్మకత ఆలంబనగా సినిమాల్లో ప్రవేశించారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
మనవరాలి పెళ్లికి తాత బలి..!
దొడ్డబళ్లాపురం: 15 సంవత్సరాల కూతురికి ఇష్టం లేకున్నా వివాహం నిశ్చయించాడు ఒక తండ్రి. ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పుకుంది ముద్దుల మనవరాలు. ఆమె సంతోషమే తన సంతోషమనుకుని ఆ పెళ్లిని ఆపించాడు తాత. దీంతో తన పరువు తీశావని అగ్రహోదగ్రుడైన బాలిక తండ్రి... తన తండ్రి (తాత)ను కాబోయే వియ్యంకునితో కలిసి దారుణంగా హత్య చేశాడు. సినిమా కథలా అనిపించినా ఇది నిజంగా జరిగిన సంఘటనే. దొడ్డబళ్లాపుర తాలూకా కరేనహళ్లి పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే... వివరాలు.. కరేనహళ్లి నివాసి కుమార్ (50) తన కూతురు పుష్ప (15)కు, ఇదే ప్రాంత నివాసి సుబ్రమణ్య (55) కుమారుడు బాబుతో వివాహం నిశ్చయించాడు. అయితే ఈ వివాహం పుష్పకు ఇష్టంలేదు. ఇంకా మైనర్ అయిన ఆమె పెద్ద చదువులు చదువుకోవాలనుకుంది. కుటుంబ సభ్యులకు కూడా ఈ వివాహం ఇష్టంలేదు. తండ్రి తన బాధను పట్టించుకోకపోవడంతో తాత ఈశ్వరప్ప(70)తో తన గోడు చెప్పుకుంది. మనవరాలి దుఃఖం చూడలేని తాత రంగంలోకి దిగాడు. మహిళా–శిశు అభివృద్ధి శాఖ అధికారులకు ఫోన్ చేసి మైనర్ బాలికకు సోమవారం వివాహం జరుగుతోందని, కావున తక్షణం వివాహం నిలపాలని కోరాడు. అధికారులు నేరుగా కరేనహళ్లికి వెళ్లి వివాహం ఎట్టిపరిస్థితుల్లో జరగరాదని, జరిపితే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఘాటిపుణ్యక్షేత్రంలో సోమవారం జరపాల్సిన వివాహం ఆగిపోయింది. తనయుడు గొడవ పడి... పెళ్లి ఆగిపోవడం, బంధువుల్లో చులకన కావడం అవమానంగా భావించిన తండ్రి కుమార్, పెళ్లికొడుకు తండ్రి సుబ్రమణ్య ఇద్దరూ మద్యం తాగి ఆదివారం రాత్రి ఈశ్వరప్ప ఇంటికివెళ్లి ఘర్షణపడ్డారు. ఆగ్రహం పట్టలేక బండరాయితో తలపై మోది పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వృద్ధున్ని ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. వెంటనే నిందితులిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లు వదిలి పరారయ్యారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
111 ఏళ్ల వయసులో రోజూ వర్కవుట్లు..
కాలిఫోర్నియా : అరవై దాటగానే అంతా అయిపోయిందని నిట్టూర్చే రోజుల్లో 111 ఏళ్ల వయసులోనూ ఈ తాత రోజూ వర్కవుట్లు చేస్తూ యువతకే సవాల్ విసురుతున్నారు. ఈ బైక్‌పై రోజూ 30 నిమిషాలు సవారీ చేసే 111 సంవత్సరాల హెన్రీ సెంగ్ ఇప్పటికీ రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. జపాన్‌లోని యొకొహమాలో జన్మించిన హెన్రీ 1975 నుంచి లాస్ఏంజెల్స్లో స్ధిరపడ్డారు. వ్యాపారవేత్తగా విజయం సాధించిన హెన్రీ రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదిస్తూ నిత్యం చురుకుగా ఉండటమే ఆయన ఆరోగ్య రహస్యంగా చెబుతారు. హెన్రీ తన 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేసేవారని, 90 ఏళ్ల వయసులో ఉదయం ఆరున్నర గంటలకే ఏరోబిక్ క్లాస్‌లకు వెళ్లేవారని కుటుంబ సభ్యులు చెప్పారు. హెన్రీ యువకుడిగా ఉన్నప్పుడు స్విమ్మింగ్‌తో పాటు అవుట్డోర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడేవారని ఆయన కుమార్తె లిండా అన్నారు. ఇప్పటికీ ఆయన రోజూ 30 నిమిషాల పాటు ఈ బైక్‌పై వ్యాయామం చేస్తారని, వీల్‌ఛైర్‌లోనే యోగ విన్యాసాలతో పాటు ఒత్తిడిని అధిగమించే కసరత్తులు చేస్తారని చెప్పారు. తమ తల్లితండ్రులు ఎన్నడూ మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండేవారని, ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదించారని చెప్పారు. నిత్యం వ్యాయామం చేస్తూ సానుకూల దృక్పథంతో జీవించే వారు విజయం సాధిస్తారని హెన్రీ సెంగ్ చెబుతారు. హెన్రీ ఆహారం ఇదే.. ఉదయాన్నేబ్రేక్ఫాస్ట్లో రెండు బాయిల్డ్ ఎగ్స్, ద్రాక్ష పండ్లు, ఒక అరటిపండు, బ్రెడ్, ఓట్స్, ఆరంజ్ జ్యూస్ తీసుకుంటారు. లంచ్‌కు ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ ఫుడ్‌ను ఇష్టపడతారు. స్టార్‌బక్స్‌లో స్నాక్స్ ఆరగిస్తారు. ఇక రాత్రి డిన్నర్లో ఉడకబెట్టిన చికెన్, గ్రౌండ్ బీఫ్, పోర్క్, ఆమ్లెట్లు, సూప్‌ను రొటేషన్ కింద రోజుకో ఐటెమ్‌గా తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌ను భారీగా, లంచ్‌ను అధికంగా, డిన్నర్‌ను మితంగా ముగించడంతో పాటు నిత్యం సంతోషంగా ఉండటం, సానుకూల దృక్పదంతో ముందుకు సాగుతుండటమే తన ఆరోగ్య రహస్యమని, వీటికి మించి ఎప్పుడూ చెదరని చిరునవ్వే తానింత కాలం ఆరోగ్యంగా బతకడానికి కారణమంటారు హెన్రీ. -
మనుమరాలిని హతమార్చిన తాత
హుజూరాబాద్‌రూరల్ : ఆడుతూ..పాడుతూ సరదాగా ఉండే చిన్నారి తెల్లారెసరికి విగతజీవిగా మారింది. కథలు..కబుర్లు చెబుతూ..కాపాడాల్సిన తాతయ్యే కాలయముడయ్యాడు. సొంత మనుమరాలి గొంతునొలిమి చంపిన ఘటన హుజూరాబాద్ మండలం చెల్పూర్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నిజవపురం సంతోష్–స్వరూపలకు కుమారుడు రితీశ్(7), కుమార్తె సిరివల్లి(6) సంతానం. సంతోష్ దంపతులు జమ్మికుంటలో ఉంటుండడంతో పిల్లలు సైతం అక్కడి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో పాఠశాలకు సెలవులు రావడంతో సిరివల్లిని చెల్పూర్లోని సంతోష్ తల్లిదండ్రుల వద్ద మూడు రోజుల క్రితం మేనమామ దించేసివచ్చాడు. సోమవారం తెల్లవారుజామున చిన్నారి మృతిచెంది ఉన్నట్లు సిరివల్లి బాపమ్మ పేర్కొంది. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుజూరాబాద్‌టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా మృతురాలి తాతయ్య రవి వేలిముద్రలు సిరివల్లి మెడపై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తాతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తనే చంపినట్లు అంగీకరించాడు. తన కొడుకు సంతోష్‌ను కోడలు కొన్ని రోజులుగా తమ నుంచి దూరంగా ఉంచుతుండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రవి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా రవి కొంతకాలంగా మానసికవ్యాధికి సంబంధించిన మందులు వాడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : బాలల హక్కుల ప్రజాధ్వని సభ్యులు అభం శుభం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర కమిటీ సభ్యులు అనుమాండ్ల శోభారాణి, జిల్లా అధ్యక్షుడు సంపత్, కమిటీ సభ్యులు చల్లూరి రాజు, సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. చట్టాలు కఠినతరం చేసినప్పుడే బాలికల హత్యలు తగ్గుతాయన్నారు. -
మనువడి మృతిని తట్టుకోలేక..
బిజినేపల్లి రూరల్: ఈతకు వెళ్లి మనుమడు మృతిచెందడంతో తట్టుకోలేక తాత మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మాగనూరులో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలుడు హరీష్ గత నాలుగు రోజుల క్రితం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈ సంఘటనతో తీవ్రంగా కుంగిపోయిన అతని తాత పెద్ద బాలయ్య(56) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. తల్లిదండ్రులు ప్రతిరోజు కూలికి వెళ్లే సమయంలో బాలుడిని తాత దగ్గర వదిలివెళ్లేవారు. ఈ క్రమంలో బాలుడు సైతం తాతను విడిచి ఉండేవాడు కాదు. ఇలా మనువడి మృతిని రోజూ తలచుకుంటే దిగాలుగా ఉండే బాలయ్య అకస్మాత్తుగా మృతిచెందడం బాధాకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ కుర్మయ్య రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ మనోహర్, సత్యం తదితరులున్నారు. -
బూమ్రా తాతయ్య ఆత్మహత్య!
అహ్మదాబాద్: భారత క్రికెట్ జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బూమ్రా ఇంట విషాదం నెలకొంది. బుమ్రా తాతయ్య సంతోక్ సింగ్ బుమ్రా(84) సబర్మతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదృశ్యమైన మరుసటి రోజే సంతోక్ సింగ్ నదిలో శవమై కనిపించాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 6న బుమ్రా పుట్టినరోజును పురస్కరించుకుని సంతోక్ సింగ్ జార్ఖండ్ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చారు. కానీ బుమ్రాను కలవడానికి అతని తల్లి దల్జీత్ కౌర్ ఒప్పుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తన కుమారుడు బల్వీందర్ సింగ్‌కు ఫోన్ చేసి చనిపోయిన తన భార్య వద్దకు వెళుతున్నానని చెప్పాడు. ఒకప్పుడు వ్యాపారవేత్తగా బతికిన సంతోక్.. బుమ్రా తండ్రి చనిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇప్పుడు తన మొదటి కుమారుడు బల్వీందర్ వద్ద ఉంటూ ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన్ను ఎవరూ చేరదీయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు ఆదివారం గుర్తించారు. ప్రస్తుతం బూమ్రా శ్రీలంకతో ధర్మశాలలో తొలి వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. చివరి కోరిక తీరుకుండానే.. ఉత్తరాఖండ్‌లో ఉద్దమ్ సింగ్ నగర్లో నివసిస్తున్న సంతోక్ సింగ్ బుమ్రానే క్రికెటర్ జస్ఫ్రిత్ బూమ్రాకు స్వయానా తాత. దాదాపు 10 ఏళ్ల నుంచి ఉత్తరాఖండ్ లోనే ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనిది స్వతహాగా అహ్మదాబాద్ అయినప్పటికీ, బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు. తన చేసే వ్యాపారంలో నష్టం రావడంతో 2006లో ఉద్దమ్ నగర్ కు మారిపోయాడు సంతోక్ సింగ్. తనకున్న మూడు ఫ్యాక్టరీలను అమ్మేసి వలస వెళ్లిపోయాడు. 84 ఏళ్ల వయసులో పడరాని కష్టాలు పడ్డాడు. ఒక రూమ్ లో ఒంటరిగా ఉంటూ బతుకు బండిని లాగుతూ వచ్చాడు.. ముఖ్యంగా 2001లో బూమ్రా తండ్రి జస్విర్ సింగ్ మరణించిన తరువాత ఆ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోనే వారి మధ్య సంబంధం తెగిపోయి చెప్పుకునే బంధం మాత్రమే మిగిలందట. కాగా, బూమ్రా ఎదుగుదలను చూసి మురిసిపోయిన సంతోక్.. మనవడు ఆడే మ్యాచ్ ల్ని క్రమం తప్పకుండా టీవీల్లో చూసేవాడు. తాను మరణించే లోపు మనవడ్ని కలవాలని ఆశపడ్డాడు. అందుకోసం విపరీతంగా శ్రమించాడు. కాకపోతే తన చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచాడు. -
డబ్బు,నగల కోసం మనవడి దాష్టీకం
వైట్‌ఫీల్డ్: నగల కోసం తాతా, అవ్వలను అంతమొందించి మృతదేహాలను గ్యాస్‌తో దహనం చేసేందుకు యత్నించిన మనవడి ఉదంతం మహదేవపుర నియోజకవర్గం అశ్వర్థనగర్లోలో చోటు చేసుకుంది. వైట్‌ఫీల్డ్ డెప్యూటీ పోలీసు కమిషనర్ అబ్దుల్ అహ్మద్ తెలిపినమేరకు వివరాలు..ఇక్కడి కళామందిర్ వెనుక బీఈఎల్‌లో ఉద్యోగ విరమణ పొందిన గోవిందన్(62) తన భార్య సరోజ(61)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి వద్ద నగలు ఉన్నాయని పసిగట్టిన వారి మనవడు ప్రమోద్ వాటిని కాజేసేందుకు పథకం రచించాడు. స్నేహితుడు ప్రవీన్‌ను, హుసేన్పాషాలను సంప్రదించాడు. ముగ్గురూ కలిసి ఈ నెల 26న ఇంట్లోకి చొరబడి గోవిందన్, సరోజ దంపతులను హత్య చేసి నగలు, నగదు దోచుకున్నారు. అనంతరం గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మృతదేహాలను దహనం చేసేందుకు యత్నించి విఫలమై ఉడాయించారు. గ్యాస్ వాసన పసిగట్టిన స్థానికులు వెళ్లి పరిశీలించగా హత్యోదంతం వెలుగు చూసింది. నగర కమిషనర్ కుమార్, తూర్పు విభాగం అదనపు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్, సంయుక్త కమిషనర్ సతీష్ కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. నిందితులు యమలూరులో ఉన్నట్లు తెలుసుకున్న వైట్‌ఫీల్డ్ క్రైం విభాగం సీఐ ప్రషీలా, హెచ్ఏఎల్ సీఐ మహబూబ్, మహదేవపుర సీఐ శ్రీనివాసలు సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ తలదాచుకున్న హుసేన్‌పాషా పోలీసులపై మారణాయుధాలతో దాడికి దిగగా కానిస్టేబుల్ రవి గాయపడ్డాడు. దీంతో ప్రషీలా ఆత్మరక్షణ కోసం రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. బుల్లెట్ హుసేన్‌పాషా ఎడమ కాలిలోకి దూసుకెళ్లింది. అనంతరం హుసేన్ పాషాను, కానిస్టేబుల్ రవిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు నిందితులైన ప్రమోద్, ప్రవీణ్‌లను అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో బైక్ చోరీలకు పాల్పడేవారని పోలీసులు గుర్తించారు. -
ఆ తాతకు పెళ్లిళ్ల తహతహ..
లండన్: ఆ తాతకు పెళ్లంటే మహా సరదా..కానీ పెళ్లయిన కొద్దిరోజులకే భార్యలు హ్యాండ్ ఇస్తుంటే ఆయన మాత్రం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా తొమ్మిదవ భార్య గత వారం చెప్పా పెట్టకుండా చెక్కేయడంతో తాతగారు మరో అమ్మాయిని మనువాడతానంటున్నాడు. తన భార్యకు పెద్దగా కండిషన్లు పెట్టనని, 30 ఏళ్లకు అటూ ఇటూగా ఉంటే చాలని ఈ 69 ఏళ్ల పెళ్లికుమారుడు సిగ్గుపడుతూ చెబుతున్నాడు. బ్రిటన్‌కు చెందిన రాన్ షెఫర్డ్‌ను ఇటీవలే తన తొమ్మిదో భార్య తనకంటే 41 ఏళ్లు చిన్నదైన క్రిస్టెట్ మార్క్వెజ్ (28) విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ భాద నుంచి అప్పుడే తేరుకున్న రాన్ షెఫర్డ్ మరో భార్య కోసం అన్వేషణ మొదలెట్టాడు. ఓ భార్య వెళ్లిపోయిందని ఊరుకుంటామా అంటూ మరొక భార్య కోసం వేచిచూస్తున్నానని, ఈ సారి బాగా పరిణితి చెందిన యువతి కోసం చూస్తున్నానని చెప్పాడు. ఫేస్బుక్లో పలువురు మహిళలతో మాట్లాడుతున్నానని పెళ్లి ముచ్చట్లు చెప్పుకొచ్చాడు రాన్ షెఫర్డ్. భార్యల లిస్ట్ ఇలా... 1966లో రాన్ తొలి భార్య మార్గరెట్ మెడలో మూడు ముళ్లు వేశాడు.కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చన షెఫర్డ్ అప్పటి నుంచి వరుస పెళ్లిళ్లీ బాట పట్టాడు. రెండేళ్లు కాపురం చేసి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1973లో జెనెట్టేను వివాహమాడాడు. ఇక 1976లో ముచ్చటగా మూడోభార్యగా లెస్లీకి చేరువయ్యారు. ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత 1981లో లెస్లీకి విడాకులిచ్చి ఏడాది అనంతరం 1982లో కాథీని పెళ్లాడాడు. 1986లో ఐదో భార్యగా సూను చేరదీసిన రాన్ షెఫర్డ్ ఒక కుమార్తె కలిగిన అనంతరం 1997లో వీరి వైవాహిక జీవితానికి బ్రేక్ పడింది. ఇక 1999లో ఆరో భార్యగా ఉషా ఆయన జీవితంలోకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత వీరి బంధమూ వీడిపోయింది.2003లో వాన్ అనే యువతిని జీవిత భాగస్వామిగా చేసుకుంటే ఆమె కేవలం నాలుగు నెలలకే రాన్‌కు బై చెప్పేసింది. ఇక 2004లో వాంగ్ అనే మహిళను ఎనిమిదో భార్యగా ఆహ్వానించాడు. పదేళ్ల పాటు వీరి జీవితం సాఫీగా సాగినా 2015లో వీరు విడిపోయారు. అనంతరం తొమ్మిదవ భార్యగా వచ్చిన క్రిస్టెట్ గత వారం రాన్‌కు వీడ్కోలు పలుకుతూ తనదారి తాను చూసుకుంది. -
క్రికెటర్ బూమ్రా తాత దీనగాథ
అహ్మదాబాద్:జస్ప్రిత్ బూమ్రా.. టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో రెగ్యులర్ బౌలర్. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బూమ్రా.. ఆపై అంచెలంచెలుగా ఎదిగి జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరొకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బూమ్రాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల ఐపీఎల్-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ సాధించడంలో బూమ్రాది క్రియాశీలక పాత్ర. ప్రస్తుతం అటు క్రికెట్ జీవితాన్ని మంచి లగ్జరీ లైఫ్‌ను బూమ్రా బాగానే ఆస్వాదిస్తున్నాడు కూడా. అయితే బూమ్రా తాత దీనగాథను చూస్తే మాత్రం మనం చలించాల్సిందే. అంతటి స్థాయిలో ఉన్న క్రికెటర్ తాత దీనగాథ ఎంటా అని అనుకుంటున్నారా. ఇది నిజం. ఉత్తరాఖండ్‌లో ఉద్దమ్ సింగ్ నగర్లో నివసిస్తున్న సంతోక్ సింగ్ బుమ్రానే మన క్రికెటర్ జస్ఫ్రిత్ బూమ్రాకు స్వయానా తాత. దాదాపు 10 ఏళ్ల నుంచి ఉత్తరాఖండ్ లోనే ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనిది స్వతహాగా అహ్మదాబాద్ అయినప్పటికీ, బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు. తన చేసే వ్యాపారంలో నష్టం రావడంతో 2006లో ఉద్దమ్ నగర్ కు మారిపోయాడు సంతోక్ సింగ్. తనకున్న మూడు ఫ్యాక్టరీలను అమ్మేసి వలస వెళ్లిపోయాడు. ఇప్పుడు 84 ఏళ్ల వయసులో పడరాని కష్టాలు పడుతున్నాడు. ఒక రూమ్ లో ఒంటరిగా ఉంటూ బతుకు బండిని లాగుతున్నాడు. ముఖ్యంగా 2001లో బూమ్రా తండ్రి జస్విర్ సింగ్ మరణించిన తరువాత ఆ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోనే వారి మధ్య సంబంధం తెగిపోయి చెప్పుకునే బంధం మాత్రమే మిగిలందట. ఆ కారణంగానే స్టార్ క్రికెటర్ అయిన బూమ్రా తాత సంతోక్ కు ఇంత కష్టం వచ్చిందని స్థానికులు అంటున్నారు. కాగా, బూమ్రా ఎదుగుదలను చూసి మురిసిపోతున్న సంతోక్.. మనవడు ఆడే మ్యాచ్ ల్ని క్రమం తప్పకుండా టీవీల్లో చూస్తూ ఉంటానని తెలిపాడు. తాను మరణించే లోపు మనవడ్ని ఒకసారి కలవాలని ఆశపడుతున్నాడు సంతోక్. -
మందలిస్తే ప్రాణాలు తీశాడు..!
కల్లూరు: అభంశుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి వెంట తిప్పుకోవద్దని మందలించినందుకు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన పెద్దటేకూరు ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైంది. అదే కాలనీకి చెందిన రేపల్లె సుంకన్న కుమారుడు సాములు.. విద్యార్థినితో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం విద్యార్థిని జేజినాయన చిన్న సవారికి తెలిసింది. మంగళవారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన అమ్మాయి ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో పాఠశాల వైపు చిన్న సవారి వెళ్లాడు. పాఠశాల గది వద్ద తన మనుమరాలితో సాములు ఉండటాన్ని జీర్ణించుకోలేక గట్టిగా మందలించాడు. వెంటనే సాములు అడ్డుగా ఉన్న చిన్న సవారిని గట్టిగా తోసేశాడు. దీంతో చిన్న సవారి కింద పడడం.. తల వెనుకభాగంలో బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి సాములు పరారయ్యాడు. ఉలిందకొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా బుధవారం ఉదయం మృతదేమాన్ని.. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు రూరల్ తాలూకా సీఐ నాగరాజుయాదవ్, ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాములుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవ్వతాతలను ఇంట్లో పెట్టి నిప్పు
► డబ్బివ్వలేని మనవరాలి దాష్టీకం ► వృద్ధులకు గాయాలు మైసూరు: డబ్బులడిగినందుకు మందలించారనే కోపంతో ఒక యువతి తన అవ్వతాతలపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టి పరారైంది. బాధితులకు గాయాలు కాగా ఇరుగుపొరుగు రక్షించారు. మైసూరు సిటీ హెబ్బాళలోని లక్ష్మీ కాంతనగరలో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తల్లి ఆత్మహత్య చేసుకోగా, తండ్రి మరో పెళ్ళి చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆయన కూతురు ప్రియదర్శిని (22) తన అవ్వతాత సోమసుందర్ (85), లీలావతి (80)ల వద్ద ఉంటోంది. ఇంటర్ ఫెయిలైన ఆమె ఎప్పుడూ స్నేహితులతో గడిపేది. రోజు ఖర్చుల కోసం డబ్బులు కావాలని వృద్ద దంపతులతో గొడవ పడేది. చాలాసార్లు చుట్టుపక్కలవారు మందలించినా పట్టించుకునేది కాదు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రియదర్శిని, తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇంటిని మిమ్మల్ని ఇద్దరినీ మంటల్లో వేసి తగలబెడతానని బెదిరించింది. ఎప్పుడూ ఉండే గొడవే కదా అని వృద్ధ దంపతులు పట్టించుకోలేదు. అయితే ఆమె అన్నంతపనీ చేసింది. ఇంట్లో నిప్పంటించి పారిపోయింది. ఇంట్లోంచి మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల వారు వచ్చి వృద్ధులను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్‌సిబ్బంది మంటలను అదుపుచేశారు. దాడికి పాల్పడిన యువతి పరారీలో ఉంది. ఆమె డ్రగ్స్ మత్తులోనే ఈ అకృత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
తాతా–మనవడి పోరు
రసవత్తరంగా వారసత్వ జగడం (లక్కింశెట్టి శ్రీనివాసరావు) అనగనగా ఒక తాత..అతనికో మనవడు..సొంత మనవడు కాదులెండి..వారిద్దరిదీ ఎర్ర‘మెట్ట’ ఏరియానే. అక్కడి నేల స్వభావమేమో కాని తాతకు కాస్తంత కోపమెక్కువే. అయినా మనసు మాత్రం వెన్నపూసేనండోయ్. దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్న నాలుగు కుటుంబాల్లో ఆ కుటుంబానిదీ కీలక పాత్రే. అన్నేళ్ల ఏలుబడిలో రాజకీయ వారసత్వం కోసం పోట్లాటలు మొదలయ్యాయి. కుటుంబ పెద్ద తాత ఏలుబడిలో ఉన్న ఆ ఎర్ర‘మెట్ట’రాజ్యంలో పెంచి పోషించిన మనవడి పెత్తనం పెరిగిపోయింది. ఎంతంటే ఆ పెద్దాయన ఆదేశాలు అమలు కాకూడదనే స్థాయిలో. పైకి మాత్రం ఇద్దరు కలిసే నడుస్తారు, కాదు కాదు నడుస్తున్నట్టు నటిస్తారంతే. తాను రాజ్యాధికారం రేసులో ఉన్నానని మనవడు. కుమారుడి కేసు వ్యవహారంలో వెనుక మనవడు ఉన్నాడనేది తాత అనుమానం. ఇంతకంటే ముందు నుంచి తాత, మనవళ్ల మధ్య వివాదం లేదని కాదు. ఆ రాజ్యంలో రూ.12 కోట్లు రహదారి పనుల్లో కమీష¯ŒS విషయంలో తాత, మనవళ్ల మధ్య మనస్పర్థలు గుప్పుమన్నాయి. అది చినికి చినికి గాలివానగా మారి మనవడి రాజకీయకాంక్ష ఆ కుటుంబ వారసత్వ రాజకీయాల్లో ముసలం పుట్టిస్తోంది. ఆ తగువు ఆ కుటుంబంలోనే మరో పెద్దాయన సమక్షంలో లంచాయతీపై ‘పంచాయతీ’ జరిగింది. చెక్కు తాత వ్యూహం... ఇంతకాలం మనవడి కాని మనవడ్ని తాత అన్ని విధాలా పెంచి పోషించాడు. చిరు వ్యాపారి స్థాయి నుంచి జిల్లాలో అన్ని పరగణాల్లో వందల కోట్ల టర్నోవర్‌తో నడిచే ఆర్థిక సంస్థ పగ్గాలు చేపట్టే వరకు అన్న మాట. తాతకు రెండు దఫాలు రాజ్యాధికారం దక్కడంలో ప్రతి అడుగులో వెనుక ఉండి ఎంతో చేశానని మనవడు ఊరూవాడా చెబుతున్నాడని తాత ఆరోపణ. ఈ విషయం తన వేగుల ద్వారా తెలుసుకున్న ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది. తన నీడలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఇప్పుడు తనకే ఎసరుపెట్టే స్థాయికి వచ్చేశాడని తెలిసొచ్చాక ఇప్పుడు జూలువిదిల్చి మనవడి రాజ్యకాంక్షకు పుల్‌స్టాప్ పెట్టాలనేది తాత వ్యూహం. ఇంటిపోరుకు ఇదొకటా... తన కుమారుల్లో ఇంతవరకు ఎవరినీ రాజకీయాల్లో వెంట తిప్పుకోలేదు. ఆ వారసులకు కూడా అంతటి నాయకత్వ లక్షణాలు, రాజ్యకాంక్ష ఉన్నట్టు ఎక్కడా బయటపడలేదు. అలాగని ఇప్పుడు కూడా కళ్లకుగంతలు కట్టుకుంటే వారసుల రాజకీయ భవిష్యత్ ఏమి చేద్దామనుకుంటున్నారని ఇంటి పోరు మొదలైంది. దేనినైనా తట్టుకోవచ్చుగానీ ఇంటిపోరును కాదని ముందుకు పోయే ధైర్యం ఎవరు మాత్రం చేస్తారు చెప్పండి. ఈ విషయంలో రాజ్యాలకు రాజ్యాలే కూలిపోయిన చరిత్ర మనకు తెలియంది కాదు. అందుకే ఆయన కూడా ఒక అడుగు ముందుకేశారు. మనవడికి చెక్ పెట్టాలంటే ఏమి చేయాలా అని బురల్రు వేడెక్కుతున్న సమయాన ఆ తాతగారి పుట్టిన రోజు వచ్చింది. అంతకంటే మంచి ముహూర్తం మరొకటి రాదని అంతా భావించారు. మంత్రులు, సేవకులు కొలువుదీరి విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇంతలో మరొక రాజకీయ కుటుంబం నుంచి పొరుగు రాజ్యాన్ని ఏలుతున్న వయసులో చిన్న, సరిసమానమైన హోదా, రాజకీయ వ్యూహకర్త ఆ పుట్టిన రోజు వేడుకలకు వచ్చారు...అనేకంటే అదీ వ్యూహంలో భాగమేనంటారు ఆంతరంగీకులు. మనువడికి ఎసరు... మనవడు కాని మనవడికి పొగపెట్టే కథ, రచన అక్కడే జరిగింది. వారసత్వ రాజకీయాల్లోకి అప్పటికప్పుడు వారసులు వచ్చినా కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఇంకాస్త సమయం కావాలని అక్కడకు వచ్చిన వారంతా అనుకున్నారు. అలా అని పెత్తనం చేస్తున్న మనవడ్ని వదిలేస్తే భవిష్యత్‌లో వారసత్వ రాజకీయమని చెప్పుకోవడానికి ఏదీ మిగలదనుకున్నారు. అందుకే తన ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి దూరమైన సోదరుడు తనయుడుని దగ్గరకు తీసుకోవాలనుకున్నారు. చాలా కాలంగా ఆ ఇద్దరి మధ్య విబేధాలున్నాయనుకోండి. పంచాయతీ ఎన్నికల్లో ఆ ’బాబు’ నిలబెట్టిన అభ్యర్థి గెలిచి తన తండ్రి సోదరుడు నిలబెట్టిన కేండిడేట్ ఓడిపోవడంతోనే వీరి మధ్య దూరం పెరిగింది. ఆ ’బాబు’ కూడా ఒకప్పుడు సామంత రాజుగా చలామణి అయిన వాడే. ఆ బాబును తెరమీద ప్రవేశపెట్టాలనేది ఆ అంతఃపుర నిర్ణయం. ఆ ఆదేశాలు అమలు కోసం అప్పటికప్పుడు ఆ ’బాబు’ను పిలిపించి ఆ పెద్దాయన చేతిలో చేయి వేసి కలిపించేశారు. ఎందుకంటే సోదరుడు తనయుడు, మనవడి మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు.మనవడికి పొగపెట్టాలంటే సోదరుడి తనయడిని యుద్ధ రంగంలోకి దింపారు. ఈ వ్యూహం వెనుక పొరుగు రాజ్యంలో అగ్రజుడుది ముఖ్య భూమిక. ’తాతకే దగ్గులు నేర్పుతావా అనే సామెతను మరిపించే రీతిలో పెద్దాయన రాజనీతితో మనవడ్ని దూరంచేసే ఎత్తు వేశారు. వరుసకైనా ఆ ఇంటి పేరుతో వచ్చిన రాజకీయ వారసత్వమే పునాది. తాతను మించిన మనవడనిపించుకోవాలనేది ఆ మనవడి ఆరాటం. తాతే కాదు నా తండ్రి కూడా రాజ్యాధికారం చలాయించిన విషయం మరిచిపోతే ఎలా అంటాడు మనవడు. అందుకే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కత్తులకు పదునుపెడుతున్నాడతడు.తాత, మనవలు ఇద్దరూ ఇద్దరే. ఎందుకంటారా...వారిద్దరు కూడా అవసరం కొద్ధీ అటు, ఇటు మూడు పార్టీలు మారిన వారే. తాత నీడలో కూడబెట్టింది కొంత, తెలివితేటలో పెంచుకున్నది మరికొంత, మాటలతో ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేసే రాజకీయ చతురత, వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో ఆ ఎర్ర’మెట్ట’ సీమలో మనవడిని మించిన వాడు లేడంటారు. ఇన్ని కలిసి వచ్చే అంశాలున్న తనదే ఎప్పటికైనా పై చేయి అంటాడు మనవడు.ఇద్దరు వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నే పని అంతరంగీకులకు అప్పగించారు. అసలు ఏమి జరుగుతుందా చూద్దామని వేగులందించే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారేమో చూడాలి మరి. -
రమ్య కుటుంబంలో మరో విషాదం
-
రోడ్డుప్రమాదంలో తాత,మనవడు మృతి
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతిచెందారు. బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో తాత కొమ్మినేని వెంకటేశ్వరరావు(70) ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మనవడు కొమ్మినేని సుధాకర్(15)ను మైలవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వొదిలెళ్లిన జోళ్లు
కథ: ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ‘‘జోళ్లు మాట్లాడుకోవటం ఏమిటి? నాతో అంటే అన్నారు కాని, ఇంకెవ్వరితో అనకండి. మీకు పిచ్చి పట్టిందని వాళ్లకు తెలిసిపోతుంది’’ అనింది మా ఆవిడ. అంటే నేను పిచ్చివాడినని మా ఆవిడ ఫిక్స్ అయినట్టుంది. ఇక తనతో ఈ విషయం మాట్లాడటం దండగ అనిపించింది. నాలాగే మా తాత ఉండేవాడంట. కాదు కాదు ఆయనలాగే నేను ఉన్నానంటేనే నాకు ఇష్టం. చిన్నప్పుడు నాకు మా తాతే అన్నీ. ఆయన చెప్పిన చిట్టి చిట్టి కథలు అన్నీ జ్ఞాపకాలే. అసలు చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే, ఆ జోళ్ల మూలంగానే. ఓసారి సెలవలకు మా అమ్మమ్మ వాళ్ల వూరికి వెళ్లా. ఏమీ తోచక పాత అల్మరా సర్దుతుంటే మా తాత వాడిన జోళ్లు కనబడ్డాయి. చూడగానే తెలియని అనుభూతి. గుర్తుగా వుంటాయిలే అని నాతో పాటే తెచ్చుకున్నా. అక్కడి నుండి మొదలైంది అసలు కథ. ఎర్రటి ముదురు రంగు తోలు, దాని చుట్టూ తెల్లటి దారంతో కుట్టిన అంచు, బాగా వాడిన తరువాత పుట్టే అందం, ఒక మూలన పడేసిన మా ఆవిడ నిర్లక్ష్యం... వాటి మాటెవ్వరు పట్టించుకోని తీరులో అవి అక్కడే ఉంటాయి. ఆ జోళ్లను చూసినప్పుడల్లా ఏవో గుసగుసలు వినిపిస్తుంటాయి. నిజమే ఏదో గుసగుస. నాకు అర్థం కాని గుసగుస. కాని ఎవరితో చెప్పను! ఎవరితో అన్నా వీడికి పిచ్చిపట్టిందంటూ గొడవ చేస్తారని భయం. ఏది నమ్మినా, నమ్మకపోయినా ఒక మనిషి పిచ్చివాడంటే ఇట్టే నమ్మేస్తుంది లోకం. ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ఒకసారి మా అమ్మమ్మను అడిగా: ‘‘అమ్మమ్మ... తాతయ్య ఏం చేసేవాడు?’’ అని. అమ్మమ్మకు ప్రశ్న వేస్తే చేస్తున్న పని ఆపి చేతులు కొంగుకు తుడుచుకుంటుంది. ఆ రోజు కూడా అలానే తుడుచుకుంటూ ‘‘మాట్లాడేవాడ్రా’’ అంది. ‘‘ఏంటీ... మాట్లాడటం కూడా ఒక పనా?’’ అన్నాను ఆశ్చర్యపోతూ. ‘‘మరి?’’ అని కొనసాగించింది. ‘‘ఆయన తాను పండించిన పైరుతో మాట్లాడేవాడు. తాను నడిచే దారితో మాట్లాడేవాడు. తాను చేతిలో పెట్టుకున్న బెల్లం ముద్దను మా రాముడికి, అంటే ఒక కర్రెద్దులే, దానికి తినిపిస్తూ మాట్లాడేవాడు. పువ్వుతో మాట్లాడేవాడు. పెరట్లో గుమ్మడి పిందె కనిపిస్తే దానితో మాట్లాడేవాడు. ఇప్పుడెక్కడివి? తెచ్చిన వడ్లరాశిని గాదెలో నింపుతున్నప్పుడు పిచ్చుకలు ఎన్ని వచ్చేవని? వాటితో మాట్లాడేవాడు. ఆఖరుగా నాతో మాట్లాడేవాడు. అట్టా... ఆయన మాట్లాడటం వింటుంటే మాట్లాడటం కూడా ఇంత మంచిపనా? అనిపించేది’’ అంది. నేను కుతూహలంగా ‘‘ఇంకా...?’’ అన్నాను. మా అమ్మమ్మ చాలా దయగా నవ్వి, ‘‘అన్నీ నేనే చెప్పేస్తే నువ్వేం తెలుసుకుంటావురా సన్నాసి’’ అంది. ఆ తర్వాత నేను తాత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఏమీ తెలియలేదు. కనీసం ఈ చెప్పులైనా ఎంతోకొంత చెప్పకపోవా...? అని నా పిచ్చి. రోజురోజుకు ఈ జోళ్ల మీద ఆసక్తి మరీ ఎక్కువైపోతుంది. ఆఫీస్‌కు వెళ్తూ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నా. ఎప్పుడు ఖాళీ దొరికినా జోళ్ల గుసగుస వినడమే. అప్పటికే ఆఫీస్‌లో అందరూ నాకు ఏమైందన్నట్టుగానే కొత్తగా వింతగా చూస్తున్నారు. ఇంట్లో పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకొని పడుకుంటున్నా. దుప్పటి ముసుగుతన్ని నేను, నా పక్కలో జోళ్లు. రాత్రంతా ఒకటే ఆశ. చెవులు రెండు రిక్కించి మరీ వినడం. ఏదో గుసగుస అర్థం కాదు. నా పద్ధతి చూసి మా ఆవిడ నాతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. రోజులు గడుస్తున్నాయ్. ఆ రోజు ఎందుకో జోళ్లు తొడుక్కోవాలి అనిపించి, నా రెండు కాళ్లకు తొడిగి చూసుకున్నా, అంతే! నాలో తెలియని ఉత్సాహం, ఉద్వేగం...రెండు అడుగులు వేశానంతే. ఈ ప్రపంచాన్ని చుట్టానన్న తృప్తి. నాలుగో అడుగుకు శరీరం అంతా చాలా తేలికగా గాల్లో ఎగురుతున్నట్టుంది. గాల్లో ఎగురుతున్నట్టు కాదు గాల్లోనే ఉన్నా. గాలిపటంలా గాలి ఎటు వీస్తే అటు ఎగురుతున్నా. ఎక్కడికో వెళ్తున్నా. అంతుచిక్కడం లేదు. దూరంగా నున్నగా కొండలు కనబడుతున్నాయి. ఆ కొండల నడుమ నారింజ రంగులో ఉదయిస్తున్న సూర్యుడు. ఒకదాని మీద ఒకటి వెండి పరుపులా పరుచుకొని ఉన్న మేఘాలు. మేఘాల అంచులు నారింజ రంగుతో కొత్త సరిగ చీర అంచుల్లా ఉన్నాయి. నారింజ వర్ణంలో కనిపించేంత మేర పరుచుకున్న నీళ్లు... ఒక అద్భుతం... చూసి తీరాల్సిందే. దట్టంగా పొగమంచు కప్పుకొని ఉంది. కనుచూపు మేరలో మనుషులు గాని, ఇళ్లు గాని ఏమీ లేవు. బహుశ అడవిలో ఉన్నట్టున్నా. నెమ్మదిగా అక్కడ దిగా. చుట్టూ మహావృక్షాలు మంచును చీలుస్తూ. చెట్టుకు వేలాడుతున్న ఊడలు. దూరంగా మినుక్ మినుక్మంటూ ఏదో వెలుగు. అటువైపుగా నడిచా. దగ్గరికి వచ్చేసరికి మంటలా అనిపించింది. అది చలిమంటలా ఉంది. ఎవరో మనుషులు కూడా ఉన్నట్టున్నారు, నలుగురు మనుషులు. ఒక ఆడ, మగ, ఇద్దరు పిల్లలు చలిమంట చుట్టూ కూర్చొని ఉన్నారు. పిల్లలేమో దబ్బపళ్లలా భలే ఉన్నారు. మగ మనిషేమో తల ఎత్తకుండా చలిమంట వైపు చూస్తున్నాడు, ఆడ మనిషేమో లేచి ఇంట్లోకెళ్లి ఓ బుట్టతో వచ్చింది. ఆ బుట్టలో ఏవో కాగితాల్లా ఉన్నాయి. చలిమంట కోసం లావుంది. పిల్లలిద్దరికీ గుప్పెడు గుప్పెడు కాగితాలిచ్చింది. వాళ్లేమో ఇష్టంగా మంటలో వేస్తున్నారు. కొద్దిగా దగ్గరికి వచ్చి చూశా. అంతే! ఆశ్చర్యం... ఆమె బుట్ట నిండా డబ్బుల నోట్లు. కుటుంబం అంతా ఇష్టంగా కాలుస్తున్నారు. వీళ్లు చేస్తున్న పనికి నాకు నోట మాట రావడం లేదు. తెలతెలవారుతోంది. నలుగురూ లేచి ఇంట్లోకి వెళ్లారు. వాళ్లు నన్ను గమనించినట్టు లేరు. ఇల్లు కూడా భలే వింతగా ఉంది. తలుపులు లేవు, కిటికీలకు ఊచలు లేవు. చూస్తే పేకలతో కట్టిన ఇల్లులా ఉంది. సూర్యుడు ఒకే ఊపులో అలా పైకి లేచాడు. చుట్టూ పచ్చదనం చిక్కటి ఆకుల వనంలా ఉంది. వాటి మధ్యలో అక్కడక్కడా పేకలతో కట్టిన ఇళ్లు. ఇక్కడ మనుషులంతా ఒకే వర్ణం... నారింజ రంగు. మనలా నలుపు, తెలుపు, చామనచాయ వర్ణాలు కాదు. అందరూ ఒకటే వర్ణం... నారింజ రంగు. మనుషులు కూడా ఆరు అడుగుల ఎత్తు, గాజుకళ్లు లాంటి కళ్లు. ఆడవాళ్లు అయితే అదొక తెలియని అందం. పిల్లలైతే దబ్బపళ్లలా ఉన్నారు. అదేమి విచిత్రమో, అందరూ నారింజ రంగు వర్ణంలో ఉన్నారు. ఆడా మగ అందరూ ప్రకృతితో మిళితమైన పనులు చేస్తున్నారు. ఒకడు నాగలి పట్టి దుక్కి దున్నుతున్నాడు. కొంతమంది ఆడాళ్లు నాట్లు వేస్తున్నారు. ఇద్దరేమో ఆవుల్ని తోలుకెళ్తున్నారు. తెల్లని ఆవుల మంద ఆకుపచ్చని వనంలో కళ్లు మిరిమిట్లు గొలుపుతోంది. ఆ ఆవులతో ఒకడేదో మాట్లాడుతున్నాడు. అదీ వాడితో మాట్లాడుతోంది. ఏంటి విచిత్రం! ఒకడు చెట్లెక్కి పండ్లు కోస్తున్నాడు. చూడ్డానికి ఆ పండ్లు మెరుస్తూ భలే వింతగా ఉన్నాయి. పిల్లలందరూ అరుగు మీద కూర్చున్న పేదరాసి పెద్దమ్మ చెప్పే కథలు వింటున్నారు. ఇద్దరేమో మట్టిని కువ్వలా పేర్చి, చెరోపక్క కూర్చొని చుకుచుకు పుల్ల ఆట ఆడుతున్నారు. ఆడపిల్లలేమో జట్టుగా కూర్చొని అచ్చంగాయ్ ఆడుతున్నారు. ఇంతలో జుయ్య్మంటూ ఒక సీతాకోకచిలుక ఒక బుడ్డోడిని వీపునేసుకొని పువ్వుపై వాలి, తేనె లాగి వాడి నోట్లో పోస్తోంది. నేనేమో ఈ వింతలన్నీ వింతగా చూస్తుండిపోయా. మరికాసేపటికి సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అందరూ హాయిగా చెట్ల నీడలో వంట చేసే కార్యక్రమం మొదలెట్టారు. పిల్లలేమో ఆకుకూరలు, కాయగూరలు అవీ ఇవీ కోసుకొని వస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు వండేదానికి సిద్ధం అవుతున్నారు. ఊరందరికీ సరిపడ పెద్ద బానలో బియ్యం వేస్తున్నారు. పిల్లలు తెచ్చిన కూరగాయలను పేదరాసి పెద్దమ్మ, వయసు పైబడినవాళ్లు కడిగి ముక్కలు కోస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు తయారుచేశారు. బాదంచెట్టు ఆకుల్లా పెద్దగా ఉన్నాయి... వాటిల్లో పెట్టుకొని భోజనాలు చేశారు. మళ్లీ ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. సాయంత్రానికి ఏటిగట్టు మీద వయసు కుర్రాళ్లు చేరి ఈతలు కొడుతున్నారు. ఒక్కొక్కరు ఆకాశం అంత ఎత్తు ఎగిరి దూకుతున్నారు. వయసుకొచ్చిన కన్నెపిల్లలేమో ధైర్యంగా అబ్బాయిల ముందు నుంచే నీళ్లు తోడుకెళ్తున్నారు. పిల్లలేమో పిల్లకాలువ దగ్గర కాగితపు పడవలొదులుతున్నారు... అదీ ఎందుకూ పనికిరాని పచ్చనోట్లతో! చీకటిపడుతున్న వేళ అందరూ ఇళ్లకు చేరారు. ఆడాళ్లేమో దీపాలు వెలిగించారు. ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. చంటిపిల్లలను ఎత్తుకొన్న అమ్మలేమో ఆకాశం నుంచి నక్షత్రాలను చేత్తో పట్టుకొని చంటాళ్లకు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. నక్షత్రాల వెలుగుకి తల్లి, పిల్లాడు వెండి వెలుగులో మెరుస్తున్నారు. ఊరంతా ఒక దగ్గర చేరి చలిమంట వేసుకున్నారు. అందరూ తెచ్చిన పచ్చనోట్లతో మంటను వెలిగించారు. ఒక్కొక్క నోటు చాలాసేపు మండుతోంది. ఆ వెలుగులో ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం... ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆ పాటే నన్ను తలకిందుల చేస్తోంది. నాకు ఆ పాట అర్థం కావట్లేదు. కాని వెన్నెలంతా చినుకులై వర్షంలా కారుతోంది. నాలో తెలియని ఆవేదనంతా తడిసి చల్లారిపోయింది. అందరూ పాటలు పాడుకొని, ఎవరిళ్లకి వారు వెళ్లారు. నేను మాత్రం వెన్నెల వానలో తడుస్తూనే ఉన్నా. మెలకువ రాగానే కళ్లు నలుపుకొని చూశా. బెడ్ లైట్ కాంతిలో అంతా ప్రశాంతంగా ఉంది. కాళ్లవైపు చూసుకున్నా. కాళ్లకి జోళ్లు లేవు. మూలగా చూశా. అవి అక్కడే ఉన్నాయి. ఈ మధ్య నాకు పిచ్చి ముదిరిందని మా ఆవిడ పక్క రూమ్‌లో పడుకుంటోంది. టైమ్ చూస్తే 5.30 అయ్యింది. జోళ్ల గుసగుసలు ఏమైనా వినబడుతాయేమోనని జోళ్ల దగ్గరకు వెళ్లా. అంతా నిశ్శబ్దంగా ఉంది. తెలవారబోతోంది. పొగ మంచు. ఇంట్లో నుంచి బయటకువచ్చా. అంతా నిర్మానుష్యంగా ఉంది. మంచుని చీల్చుకు కనబడుతున్న కాంతి. మసగ్గా టీ బంక్‌లా ఉంది... చుట్టూ నలుగురు ఉన్నారు. నేను టీ తాగాలని జేబులో చూశా. డబ్బులు లేవు. డబ్బు లేకుంటే ఈ లోకంలో ఏదీ నీ సొంతం కాదు... ఆఖరికి టీ కూడా, అని మనసులో అనుకుంటూ నడుస్తున్నా. తెల్లారింది. అలా నడుచుకుంటూ సిగ్నల్ దగ్గర ఆగా. ట్రాఫిక్ పెరిగింది. సిగ్నల్ పడింది. నేను నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుండగా, ఆగిన బెంజ్ కార్. అందులో సూట్ వేసుకొని కూర్చున్న బిజినెస్‌మ్యాన్. కార్ పక్కనే బైక్‌పైన భార్య, భర్త ఆఫీసులకు లాగుంది. పక్కనే స్కూటీపై ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న పదహారేళ్ల ఆడపిల్ల కాలేజ్‌కి వెళ్తున్నట్టుంది. చివరగా పిల్లలందరినీ కుక్కిన ఓ పసుపురంగు స్కూల్ వ్యాన్. నేను రోడ్డు దాటాను. సిగ్నల్ పడింది అంతే. రణ గొణ ధ్వనుల మధ్య కొన్ని వేల ఆర్తనాదాలు. ఇవేవి వినబడట్లేదు నాకు. ఎక్కడో... ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం... ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆశగా అడుగులు వేస్తున్నా... ఆయన వొదిలెళ్లిన జోళ్లతో... ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. - మహి బెజవాడ -
బాలయ్య.... ఇక తాతయ్య!
ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరలో తాతయ్య కాబోతున్నారు. ఆయన పెద్ద కుమార్తె, నారా వారి కోడలు బ్రహ్మణి ... త్వరలో తల్లి కాబోతోంది. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, బ్రహ్మణిల వివాహం 2007లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను లోకేష్... 'ఎస్ ఇట్స్ ట్రూ అండ్ థాంక్యూ ఫర్ ది విషెస్' అంటూ.... ఓ ఆంగ్ల దినపత్రికకు ధ్రువీకరించారు. ఇక ఇటు నందమూరి, అటు నారావారి కుటుంబంలోకి బుజ్జి పాపాయి రాబోతుండటంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకు ఇది డబుల్ బొనాంజా అవుతుంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు, బాలయ్య సతీమణి వసుంధర దేవి కూడా తొలిసారి నానమ్మ, అమ్మమ్మ హోదాపై చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇరు కుటుంబాలకు సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మణి ఆరోగ్యంగా ఉన్నారని, బిడ్డ పెరుగుదల కూడా బాగున్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ బుజ్జి పాపాయి కోసం వచ్చే ఏడాది వేసవి వరకూ ఆగాల్సిందేనట. కాగా ఈ విషయంపై బావ చంద్రబాబు, బావమరిది బాలయ్యలు ముసి ముసి నవ్వులే తప్ప, పెదవి మాత్రం విప్పటం లేదు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)