ఆధునిక వైద్యశాస్త్రం కొంగొత్త వ్యాధులకు తగ్గట్టుగా పురోగమిస్తోంది. సవాలు విసిరే వ్యాధులకు తగ్గట్టుగా వైద్యులు కూడా సరికొత్త వైద్య విధానంతో అద్భుతాలు సృష్టంచి రోగులకు ప్రాణాలు పోస్తున్నారు. దీంతో అత్యంత క్రిటికల్‌గా ఉన్న రోగులకు కూడా నయం అయ్యి.. మంచిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అచ్చం అలాంటి పరిస్థితితో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఊపిరి పోసి..కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బతికే ఛాన్స్ లేనివాడికి అత్యాధునిక చికిత్సతో కొత్త ఆశను చిగురించేలా చేసి ఓ అద్భుతానికి నాంది పలికారు అమెరికన్ వైద్య బృందం.
అమెరికాలోని ఒహియోకు చెందిన 64 ఏళ్ల డాన్ ఇలియట్ అనే వ్యక్తి అరుదైన జన్యుపరమైన అప్లా-1 అనే యాంటిట్రిప్సిన్‌తో పోరాడుతున్నాడు. అతడు 18 ఏళ్ల ప్రాయం నుంచి ఈ అరుదైన జన్యు పరిస్థితితో భాధపడుతున్నాడు. గత 20 ఏళ్లుగా మెడిసిన్‌తో నియంత్రణలో ఉంచుకుంటూ వచ్చాడు. కానీ ఈ వ్యాధి తీవ్రమై ఎంఫిసెమాకు దారితీసింది. యాంటిట్రిప్సిన్ అనే కీలకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమవ్వడంతో ఈ జన్యు పరిస్థితి వస్తుంది. అయితే ఇన్నాళ్లు మందులకు అదుపులో ఉన్న ఈ వ్యాధి తీవ్రమై.. ఇలియట్ శరీరంలో ఒక్కో అవయవంపై దాడి చేయడం ప్రారంభించింది.
దీంతో ముందుగా ఇలియట్ శరీరంలోని కాలేయం దెబ్బతింది, తర్వాత మూత్రపిండాల వైఫల్యానికి దారితీసింది అలా నెమ్మది నెమ్మదిగా ప్రాణాంతకంగా మారిపోయి.. చివరికి ఊపిరి తీసుకోవడమే అత్యంత కష్టంగా మారింది. దీంతో వైద్యులు ఇలియట్ ప్రాణాలు కాపాడేందుకు అవయవ మార్పిడి చేయక తప్పదని నిర్థారించారు. అతడి ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ట్రిపుల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది.
అంటే మరణించిన దాత నుంచి ఇలియట్‌కి కాలేయం, ఊపరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి చేశారు. ఇలా ట్రిపుల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తొలి వ్యక్తిగా ఇలియట్ నిలిచాడు. ఈ సర్జరీని వైద్యులు 24 గంటల్లోనే పూర్తి చేశారు. అయితే ఇలియట్ పూర్తిగా కోలుకోవడానికి ఏకంగా ఆరు నెలలు పట్టింది. మొదట కొన్ని రోజులు లైఫ్ సపోర్ట్‌తో ఆరువారాలకు పైగా ఆస్పత్రిలోనే గడిపాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆరోగ్యం కుదుటపడుతుండటంతో డిశ్చార్జ్ చేసి పంపిచేశారు.
తనకు ఈ అమూల్యమైన బహుమతిని అందించిన దాత కుటుంబ సభ్యలుకు కృతజ్ఞతలు తెలిపాడు ఇలియట్. ఇక్కడ వైద్యులు ఎక్కువ శస్త్ర చికిత్సలను నివారించేలా ఒకే దాత నుంచి మూడు అవయవాలను తీసుకున్నట్లు తెలిపారు. అందువల్లే డాన్ ప్రాణలను రక్షించడం సాధ్యమయ్యిందని అన్నారు. ప్రస్తుతం ఇలియంట్ ఆక్సిజన్ సిలిండర్‌లతో పనిలేకుండానే స్వయంగా ఊపిరి పీల్చుకుంటున్నాడని చెప్పారు.
(చదవండి: గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..)
Comments
Please login to add a commentAdd a comment