
ప్రతీకాత్మక చిత్రం
చంద్రగిరి : మద్యం కోసం మనుమడు వేధింపులను తట్టుకోలేక తాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తశానంబట్లలో చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం..గ్రామానికి చెందిన చిన్నబ్బరెడ్డి (72), గోవిందమ్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నబ్బరెడ్డి దంపతులు తన మనమడితో కలసి అదే గ్రామంలో వేరే కాపురం ఉంటున్నారు. మద్యానికి బానిసైన మనుమడు తరచూ తన తాతను డబ్బులు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా చిన్నబ్బరెడ్డితో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లోని ఫ్యాను కొక్కీకి ఉరివేసుకుని మృతి చెందాడు. వృద్ధుని కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment