
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
బిజినేపల్లి రూరల్: ఈతకు వెళ్లి మనుమడు మృతిచెందడంతో తట్టుకోలేక తాత మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మాగనూరులో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలుడు హరీష్ గత నాలుగు రోజుల క్రితం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈ సంఘటనతో తీవ్రంగా కుంగిపోయిన అతని తాత పెద్ద బాలయ్య(56) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు.
తల్లిదండ్రులు ప్రతిరోజు కూలికి వెళ్లే సమయంలో బాలుడిని తాత దగ్గర వదిలివెళ్లేవారు. ఈ క్రమంలో బాలుడు సైతం తాతను విడిచి ఉండేవాడు కాదు. ఇలా మనువడి మృతిని రోజూ తలచుకుంటే దిగాలుగా ఉండే బాలయ్య అకస్మాత్తుగా మృతిచెందడం బాధాకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ కుర్మయ్య రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ మనోహర్, సత్యం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment