
న్యూఢిల్లీ: భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తాత అయ్యారు. ముకేశ్ అంబా నీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోక దంపతులకు ముంబైలో కొడుకు పుట్టాడని అంబానీ కుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తాత. నానమ్మలైనందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొత్త శిశువు రాక అంబానీ, మెహత కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపిందని వివరించారు. వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోక, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment