కొన్ని వ్యాధులను సంగీతం నయం చేయగలదని అంటారు. అలాగే బాగా ఒత్తిడిగా ఉన్నా మూడ్ బాగోకపోయినా కాస్త మంచి సంగీతం వింటే త్వరితగతిన రిలాక్స్ అవ్వగలం. కానీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారిని మానసికంగా ఆరోగ్యవంతులుగా చేయడానికి సంగీతం ఎంతగానో ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడోక అమ్మాయి వాళ్ల తాత అల్జీమర్స్ వ్యాధితో ఎవర్ని గుర్తు పట్టలేక ఇబ్బంది పడుతుంటే అతని మనవరాలు పీయానో వాయిస్తు అతనికి జ్ఙాపకం తెప్పించడానికీ ఎలా ప్రయత్నిస్తోందో చూడండి. ఏంటిదీ అసలేం జరిగింది ఎవరామె చూద్దాం రండి.
(చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!)
అసలు విషయంలోకెళ్లితే...షీలాకు 93 ఏళ్ల తాతయ్య ఉన్నారు. ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు పైగా ప్రతి పది నిమిషాలకు ఎవరు నువ్వు అని అడుగుతుంటారు. అయితే ఆమె వాళ్ల తాతయ్య గదిలోకి వెళ్లి పియానో వాయిస్తూ ఉంటుంది. దీంతో వాళ్ల తాతయ్య మొదట ఎవరు నా గదిలోకి వచ్చి పియానో వాయిస్తున్నారని చాటుగా చూస్తుంటాడు. తర్వాత నెమ్మదిగా మనవరాలి దగ్గరకి వచ్చి నిలుచుంటాడు.
కాసేపటికీ మనవరాలు వాయిస్తున్న పియానో సంగీతాన్ని వింటూ నవ్వు ముఖం పెడతాడు. ఆ సన్నివేశాన్ని చూస్తే అతను తన మనవరాలిని గుర్తు పట్టినట్లుగా ఉంటుంది. ఈ మేరకు షీలా ఈ వీడియో తోపాటుగా జీవితం చాలా చిన్నది. మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అనే క్యాప్షన్‌ని జోడించి మరీ సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకా ప్రతి నెటిజన్లు హృదయాన్ని కదిలించింది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి, మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: అది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్!)
Comments
Please login to add a commentAdd a comment