అద్భుత దృశ్యం.. ఆ గోవులన్నీ శ్రీకృష్ణుడే వచ్చాడనుకున్నాయేమో..! | Man Playing Saxophone At A Farm Several Cows Gathered Around Him | Sakshi
Sakshi News home page

మోడ్రన్‌ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్‌

Published Wed, Oct 19 2022 2:18 PM | Last Updated on Fri, Oct 21 2022 10:35 AM

Man Playing Saxophone At A Farm Several Cows Gathered Around Him - Sakshi

పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన పిల్లనగ్రోవితో మంత్రముగ్ధుల్ని చేసేవాడని చెబుతారు. పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోవులన్నీ ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవి. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్‌ కృష్ణుడు. సాక్సోఫోన్‌ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వీడియో ప్రకారం.. ఓ ‍వ్యక్తి ఆవులు గడ్డి మేస్తున్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలుచుని సాక్సోఫోన్‌ వాయించాడు. ఆయన మ్యూజిక్‌ విన్న కొద్ది క్షణాల్లోనే దూరంగా ఉన్న ఆవులన్నీ పరుగున వచ్చి చుట్టూ చేరాయి. సుమారు 20-30 గోవులు ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ సంగీతం శక్తి ఇది అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షలకుపైగా మంది వీక్షించారు. దీనిపై పలువురు కామెంట్లు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన భగవాన్‌ క్రిష్ణ చేసిన విధంగానే ఉంది. ఆయన తన పిల్లన గ్రోవితో అందరిని తనవైపు ఆకర్షించేవారు, ఆయన గోవులను సైతం’ అని ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: క్రాకర్‌ కాల్చడం ఇంత కష్టమా.. ఎమ్మెల్యే తిప్పలు చూస్తే నవ్వు ఆగదు.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement