sri krishna
-
రవీంద్రభారతిలో అలరించిన శ్రీకృష్ణ లీలామృతం (ఫొటోలు)
-
సమ్మోహన స్వరూపుడు
రూపు నల్లన.. చూపు చల్లన. మనసు తెల్లన... మాట మధురం. పలుకు బంగారం.నవ్వు సమ్మోహకరం. వ్యక్తిత్వం విశిష్టం..ఆ ముద్ర అనితర సాధ్యం. అందుకే... నమ్మిన వారికి కొండంత అండ. అసలు కృష్ణుడంటేనే సచ్చిదానంద రూపం.. అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..అందుకే ఆ నామం ఆరాధనీయం.. సదా స్మరణీయం.కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా చతుర్విధ çపురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి.దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకూ శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా నందన నామ సంవత్సర దక్షిణాయన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. నేడు ఆయన ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా ఓ వ్యాస పారిజాతం. చిలిపి కృష్ణునిగా, గో పాలకునిగా, రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టపత్నులకూ ఇష్టుడైన వాడిగా... గోపికావల్లభుడిగా... యాదవ ప్రభువుగా, పార్థుడి సారథియైన పాండవ పక్షపాతిగాను, గీతా బోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, రాజనీతిజ్ఞునిగా... ఇలా బహువిధాలుగా శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ద్యోతకమవుతుంటాయి. ఎన్నిసార్లు చదివినా, ఎంత తెలుసుకున్నా ఆయన లీలలు మిగిలిపోతూనే ఉంటాయి. శ్రీ కృష్ణుడు బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. గోపికల ఇళ్లలో వెన్నముద్దలను దొంగిలించి తినేవాడు. అది చాలదన్నట్టు వారిలో వారికి తంపులు పెట్టేవాడు. అందులోని అంతరార్థమేమిటంటే.. జ్ఞానానికి సంకేతమైన వెన్న అజ్ఞానానికి చిహ్నమైన నల్లని కుండలలో కదా ఉండేది. అందుకే కుండ పెంకులనే అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నమైన వెన్నను దొంగిలించడం ద్వారా తన భక్తుల మనసులో విజ్ఞానపు వెలుగులు నింపేవాడు. గోపాలకృష్ణుడు‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. మోహన కృష్ణుడుశ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలిపింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. శ్రీకృష్ణుని పూజించేవారికి మాయవలన కలిగే దుఃఖాలు దరిచేరవని అంటారు.వేణుమాధవుడుకన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...కృష్ణుడికి అర్పించుకోవడం కోసం వేణువు తనను తాను డొల్లగా చేసుకుంటే, ఆ డొల్లలో గాలిని నింపడం కోసం కృష్ణుడు ఎప్పుడూ దానిని తన పెదవుల దగ్గరే ఉంచుకునేవాడు. అందుకే కృష్ణుడి పెదవులు తనను తాకి నప్పుడు పరవశించి మృదు మధురమైన గానాన్ని వినిపిస్తుంది వేణువు. అందుకే నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
Shri Krishna Janmashtami: కృష్ణం వందే జగద్గురుం!
బాల్యంలో వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు. మన్నుతిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించినవాడు. బృందావనంలో వేణుగానం వినిపిస్తూ, గోపికలను రాసలీలలతో అలరించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ నెరవేర్చినవాడు. కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని, యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు. భగవద్గీతను బోధించినందున గీతాచార్యుడిగా, జగద్గురువుగా భక్తుల పూజలు అందుకొనే శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయన జగన్నాథుడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. శ్రీకృష్ణుడి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. మన దేశంలో బృందావనం, మథుర, ద్వారక సహా పలు శ్రీకృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి వేలాదిగా ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, విదేశాల్లోనూ శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విదేశాల్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాల విశేషాలు మీ కోసం...శ్రీకృష్ణుడి ఆరాధాన ప్రాచీనకాలంలోనే విదేశాలకు పాకింది. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలోనే ప్రాచీన గ్రీకులు శ్రీకృష్ణుడిని వాసుదేవుడిగా, దేవాదిదేవుడిగా కొలిచేవారు. గ్రీకు రాయబారి హిలియోడారస్ క్రీస్తుపూర్వం 113 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరంలో ఒక గరుడస్తంభాన్ని నాటించాడు. ఈ రాతి స్తంభంపై బ్రహ్మీలిపిలో ‘వాసుదేవుడు దేవాదిదేవుడు’, ఆయన అడుగుజాడలైన ఆత్మనిగ్రహం, జ్ఞానం, దానం అనుసరించడం వల్ల స్వర్గాన్ని చేరుకోవచ్చు’ అని రాసి ఉంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రస్తుతం ‘ఇస్కాన్’ శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్వహిస్తోంది.మన పొరుగు దేశాల్లో కృష్ణాలయాలు..బ్రిటిష్ పాలనలో ఒకటిగా ఉండి తర్వాత విడిపోయిన మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలలోను, నేపాల్లోను కృష్ణాలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే కృష్ణాలయాలతో పాటు కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. దినాజ్‌పూర్‌లోని ‘కళియా జుయె’ ఆలయం, జెస్సోర్‌లోని రాధాకృష్ణ మందిరం, పాబ్నాలోని జగన్నాథ ఆలయం బంగ్లాదేశ్‌లోని పురాతన కృష్ణాలయాల్లో ప్రముఖమైనవి. పాకిస్తాన్‌లోని క్వెట్టా, రావల్పిండి, హరిపూర్, ఫతేజంగ్ తదితర చోట్ల పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి. లాహోర్‌లో 2006లో కొత్తగా కృష్ణాలయాన్ని నిర్మించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్కడి ప్రభుత్వ అనుమతితో కొత్తగా కృష్ణాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పాటన్, నవల్పరాసీ, రాజ్‌బిరాజ్ తదితర ప్రాంతాల్లో పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి.ఖండ ఖండాంతరాల్లో కృష్ణాలయాలుమన పొరుగు దేశాల్లోనే కాకుండా, ఆసియా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌లో అక్కడ స్థిరపడిన తమిళులు నిర్మించిన కుయిల్ శ్రీకృష్ణాలయం, పెనాంగ్‌లో శ్రీకృష్ణాలయం, రాధాకృష్ణాలయం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి. సింగపూర్‌లో 1870 నాటి శ్రీకృష్ణాలయం ఉంది. దీనిని సింగపూర్ ప్రభుత్వం జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణంగా గుర్తించింది. మయాన్మార్లో రాధామండలేశ్వర ఆలయం, థాయ్లండ్లో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికే వైష్ణవారాధన ఉండేది. థాయ్లండ్లోని శ్రీథేప్లో పదమూడో శతాబ్ది నాటి వైష్ణవాలయంలో గోవర్ధనగిరి పైకెత్తిన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో స్థిరపడిన భారతీయులు రాధా శ్యామసుందర ఆలయాన్ని నిర్మించుకున్నారు. భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సెయింట్ మాడలిన్ నగరంలోని కృష్ణ మందిరం, డెబె పట్టణంలోని గాంధీగ్రామంలో రాధాకృష్ణ మందిరం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి.బ్రిటన్ రాజధాని లండన్‌లో కృష్ణయోగ మందిరం, రాధాకృష్ణ ఆలయాలతో పాటు లివర్‌పూల్, మాంచెస్టర్, ఓల్డ్హామ్, స్వాన్సీలలో రాధాకృష్ణ ఆలయాలు, గ్లోస్టర్‌షైర్, ష్రాప్షైర్, కాన్వెంట్రీ, డుడ్లీ, శాండ్వెల్, బోల్టన్లలో కృష్ణ మందిరాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవే కాకుండా, బ్రిటన్‌లో పలుచోట్ల కృష్ణారాధన జరిగే ‘ఇస్కాన్’ మందిరాలు, స్వామినారాయణ్ మందిరాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయిజ్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో హరేకృష్ణ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైదిక సంస్కృతీ కేంద్రం కూడా పనిచేస్తోంది. హాల్బ్రూక్లో ‘బ్రజమందిర్’ పేరిట కృష్ణాలయం ఉంది. ఆస్టిన్‌లో రాధామాధవధామ్ ఆలయం, మిల్‌క్రీక్ సాల్ట్‌లేక్ సిటీలో కృష్ణాలయం, స్పానిష్ఫోర్క్లో రాధాకృష్ణాలయం, మిల్వాకీలో రాధామాధవ మందిరంతో పాటు పలుచోట్ల ‘ఇస్కాన్’ నిర్వహిస్తున్న కృష్ణాలయాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్లి స్థిరపడిన హిందువులు ఎక్కువగా నివసించే గల్ఫ్ దేశాల్లోనూ కృష్ణాలయాలు దుబాయ్‌లో ‘శ్రీకృష్ణ హవేలి’, బహ్రెయిన్‌లో శ్రీనాథ ఆలయం, ఓమన్‌లో శ్రీకృష్ణాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో హరేకృష్ణ ఆలయంతో పాటు పలుచోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని మార్ల్బ్రోలో, శాండ్టన్లలో రాధేశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.ఇవే కాకుండా, ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కృష్ణాలయాలు ఉన్నాయి. అలాగే స్వామినారాయణ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు దేశ విదేశాల్లోని ఇతర వైష్ణవ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. -
రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్!
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునునితో సంభాషిస్తున్న శ్రీ కృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దనున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్ రూపొందించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మూడు ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవ్పురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునునికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయి. త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపధ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్‌ను సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణ దశలో ఉంది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతి నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది. -
షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాలో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్వేను పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు కూడా అంగీకరించింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ శుక్రవారం షాహి మసీద్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ట్రస్ట్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పిటిషన్ రూపంలో సవాల్ చేయాలని సూచించింది. దీనితో పాటు దీనిపై ట్రస్ట్ వేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. -
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్‌తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
ఆ విషయం శ్రీ కృష్ణుడితో చెప్పకపోవడం వల్ల...!
-
లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!
సాక్షి, ఖమ్మం: లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్వర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించి ఈ నెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు శ్రీకృష్ణావతారంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం చేరుకుంది. భారీ వాహనంలో 54 అడుగుల విగ్రహాన్ని గురువారం లకారం ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ‘తానా’, ఎన్ఆర్ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్‌కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. కోర్టు ఉత్తర్వులు.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడంపై హైకోర్టు గురువారం స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ విగ్రహ ఏర్పాటు ను సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళాపీఠం, శ్రీకృష్ణ జేఏసీ సహా పలువురు లంచ్‌మోషన్ రూపంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని ఆదేశించింది. చదవండి: రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్’ విస్తరణ -
తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్
-
తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోక కంటకుడై! ఆఖరికి..
యావత్ భారత్ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతో పాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి పండుగ లోనూ అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. వాటిని మనం అర్థం చేసుకుని ఆచరించాలి. శరత్కాలంలోని ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి జగన్మాతను దేవీ నవరాత్రులలో ఆరాధిస్తాము, దశమినాడు విజయదశమి మహా పర్వదినముగా పండుగ చేసుకుంటాము. ఆ మాసం చివరిలో, అమావాస్య నాడు కూడా జగన్మాతనే ఆరాధిస్తాము. మహాలక్ష్మీ పూజను, కుబేరలక్ష్మీ పూజను చేసుకుంటాము. మాస ప్రారంభంలోనూ, అంతమందు చివరి దినము నాడు కూడా జగన్మాతనే ఆరాధించడం వల్ల ఆశ్వయుజ మాసమంతా జగన్మాతను ఆరాధించిన ఫలం మనకు లభిస్తుంది. అమావాస్యను, పౌర్ణమిని కూడా "పూర్ణ తిథులు" అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనము దీపావళి పండుగను జరుపుకొంటాము. ఈ దీపావళి కూడా పెద్ద పండుగే ! ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనము అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి, అని - ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము, దేవతలనారాధిస్తాము. "దీపానాం ఆవళీ - దీపావళీ." దీపావళి అంటే దీపముల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు సూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానమాచరించటము, పితృ తర్పణాలివ్వటము, దానము చెయ్యటము, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటము, ఆకాశదీపము పెట్టటము. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గ దర్శనమవుతుంది. మన సనాతన ధర్మంలో 'అగ్ని ఆరాధన' ముఖ్యమైనది. "అగ్ని మిచ్ఛధ్వం భారత !" అన్నారు మహర్షులు. భా అంటే కాంతి, ప్రకాశము. కాంతి యందు, ప్రకాశమునందు, వెలుగు నందు అనగా జ్ఞానమునందు రతి కలవారు, అభినివేశము, ఇచ్ఛ కలవారు భారతీయులు. అంటే జ్ఞానాన్ని కాంక్షించేవారు. అసలైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని కోరి సాధన చేసేవారు భారతీయులు. ప్రధానంగా మనది అగ్ని ఆరాధన సంప్రదాయము. మన పూర్వీకులు నిత్యాగ్నిహోత్రులు, నిరతాన్నదాతలు. నిత్యము 24 గంటలు 365 రోజులు ప్రతి ఇంట్లోనూ ఒక గదిలో - అగ్ని గృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అగ్ని అసలు ఎప్పుడూ నిధనమవదు. అది మన సంప్రదాయము. అగ్నిలో సర్వదేవతలు ఉంటారు. ఒక్క దీపము వెలిగించి అక్షింతలు వేసి నమస్కరిస్తే, సర్వదేవతలను ఆరాధించిన ఫలం లభిస్తుంది. "అగ్ని ముఖా వై దేవాః" అన్నారు. మనము ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపమును, దీపజ్యోతిని ఆరాధిస్తాము. ఏ శుభకార్యములు చేసినా, ఏ వేడుకలు చేసినా, గొప్ప ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, దైవ ప్రార్థన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకుంటాము. వివాహములు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాము. అంటే దీపము, దీపములో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపము వెలిగించటము అన్నది అత్యంత ప్రధానమైనది అని అందరికీ తెలియజేయటానికి, అందరి చేత దీపములు వెలిగించబడటానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. "దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః" దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము. ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాము. వారి సంతానమే నరకాసురుడు అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాము. కార్తీకమాసం కూడా దీప ప్రజ్వలనకు అత్యంత ప్రధానమైన మాసము. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీకములో అయ్యవారిని - పరమశివుడిని ఆరాధిస్తాము. హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహవతారంలో వచ్చి హిరణ్యక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మ దేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, 'కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా' అని ఆలోచించి, "నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి" అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచ జన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకము అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి. ఇంక, నరకుడి చెరలో ఉన్న 16 వేల మంది స్త్రీలను విడిపించినప్పుడు వారందరూ శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా వరించారు. 16 వేల మంది అంటే అర్థం ఏమిటి? అంటే, మనకు కల ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, మనోబుధ్యహంకార చిత్తములు అనబడే అంతరింద్రియము - అంతఃకరణము. ఇవన్నీ కలిసి 16. ఈ 16 అజ్ఞానంతో ఆవరించబడి ఉండటమే నరకుడు 16 వేల మందిని చెరబట్టటం. ఎప్పుడైతే మన ఇంద్రియాలు, మనసు, అంతఃకరణము అన్నీ పరమాత్మ వైపు మరలుతాయో, అప్పుడు - ఆ జీవుడు పరమాత్మను ఆశ్రయించినప్పుడు, అతని అజ్ఞానము నశించి జ్ఞానవంతుడై పరమాత్మను చేరుతాడు. అదే శ్రీకృష్ణుడు విడిపించిన 16,000 మంది శ్రీకృష్ణుడిని వరించటము అని అంటే ! దీపావళి పండుగను అజ్ఞానము మీద జ్ఞానము యొక్క, అంధకారము మీద వెలుగు యొక్క విజయముగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయముగాను చెప్పవచ్చును. "అసతోమా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ." నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాయిద్యములు మ్రోగించి సత్యభామా శ్రీకృష్ణులకు స్వాగతం చెప్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి. -రచన : సోమంచి రాధాకృష్ణ చదవండి: Walnut Halwa: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! -
అద్భుత దృశ్యం.. ఆ గోవులన్నీ శ్రీకృష్ణుడే వచ్చాడనుకున్నాయేమో..!
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన పిల్లనగ్రోవితో మంత్రముగ్ధుల్ని చేసేవాడని చెబుతారు. పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోవులన్నీ ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవి. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్ కృష్ణుడు. సాక్సోఫోన్ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆవులు గడ్డి మేస్తున్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలుచుని సాక్సోఫోన్ వాయించాడు. ఆయన మ్యూజిక్ విన్న కొద్ది క్షణాల్లోనే దూరంగా ఉన్న ఆవులన్నీ పరుగున వచ్చి చుట్టూ చేరాయి. సుమారు 20-30 గోవులు ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ సంగీతం శక్తి ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షలకుపైగా మంది వీక్షించారు. దీనిపై పలువురు కామెంట్లు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన భగవాన్ క్రిష్ణ చేసిన విధంగానే ఉంది. ఆయన తన పిల్లన గ్రోవితో అందరిని తనవైపు ఆకర్షించేవారు, ఆయన గోవులను సైతం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: క్రాకర్ కాల్చడం ఇంత కష్టమా.. ఎమ్మెల్యే తిప్పలు చూస్తే నవ్వు ఆగదు.. వీడియో వైరల్ -
Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ తేదీన జరుపుకోవాలంటే!
చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే పండుగ కృష్ణాష్టమి. అయితే, కొన్నిసార్లు తిథులు తగులు, మిగులు (ముందు రోజు తర్వాత రోజు) వచ్చినప్పుడు పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి విషయంలోనూ అదే తరహా సందిగ్దం. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందేహం. మరి ఈ ఏడాది ఈ పండుగను ఏ రోజున జరుపుకోవాలంటే...? శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. విష్ణువుకు సంబంధించిన దశావతారాల్లో శ్రీ కృష్ణావతరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు తన చిన్నతనంలో అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని చెప్పాడని చాలా మంది నమ్ముతారు. కన్నయ్య వెన్న దొంగగా అందరి మనసులను కొలగొట్టేశాడు. గోప బాలుడిగా, సోదరుడిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో కీలకమైన పాత్రలను పోషించాడు. ఆయన ఉపదేశించిన భగవద్గీత మరెంతో ప్రత్యేకం. అయితే కృష్ణుని లీలలన్నీ లోక కళ్యాణం కోసమే. ఆరోజే పండుగ! నిజానికి ఆగష్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది. తదుపరి అష్టమి వచ్చింది. ఆగష్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది. పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగష్టు 19 శుక్రవారం జరుపుకోవాలని స్పష్టత ఉంది. అయితే, ఆగష్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందో గమనిద్దాం… శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగష్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు కొంతమంది. ఇదిలా ఉంటే.. హిందువుల పండుగల్లో 90 శాతం సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగష్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు. గోకులాష్టమి నాడు.. కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని పర్వదినంగా జరుపుకుంటారు. కిట్టయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కన్నయ్య పుట్టినరోజైన పండుగ రోజున ఒకపూట భోజనం చేసి వేణుమాధవుడికి పూజ చేసి.. శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతాన గోపాల మంత్రం పూజిస్తే.. అదే విధంగా సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు. కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి నామ స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు. -ఇన్పుట్స్: డి.వి.ఆర్ చదవండి: ద్వివిధుడి వధ -
ద్వివిధుడి వధ
ద్వివిధుడనే వానరుడు నరకాసురుడికి నమ్మకమైన స్నేహితుడిగా ఉండేవాడు. కృష్ణుడి చేతిలో నరకుడు హతమైపోయాక, తన మిత్రుణ్ణి చంపిన కృష్ణుడి మీద, అతడి పరివారమైన యాదవుల మీద పగబట్టాడు. కృష్ణుడి ఆనర్త దేశంలో అడపా దడపా నానా బీభత్సం సృష్టించేవాడు. పొలాల మీద పడి పంటలు నాశనం చేసేవాడు. ఊళ్లకు ఊళ్లను తగులబెట్టేవాడు. ఉద్యానవనాల్లోకి చొరబడి వాటిని ధ్వంసం చేసేవాడు. ద్వారక మీదకు రాళ్లు రువ్వేవాడు. ఆలమందలను చెదరగొట్టేవాడు. ఇలా నానా ఆగడం చేసి, చెట్ల మీద నుంచి గెంతుతూ ఎవరకీ దొరక్కుండా క్షణాల్లో పారిపోయేవాడు. ఇలా ఉండగా, ఒకసారి బలరాముడు ప్రియురాళ్లతోను, వాళ్ల చెలికత్తెలతోను కలసి రైవత పర్వతం మీదకు వనవిహారానికి వెళ్లాడు. సముద్రం మీద నుంచి వీచే చల్లగాలి హాయిగొలుపుతుండగా, అందరూ కొండ మీద చదునైన చోట కూర్చుని సేదదీరసాగారు. బలరాముడు హాయిగా మధువు తాగుతూ, ఆ తన్మయత్వంలో పాటలు పాడసాగాడు. బలరాముడి సంగీతానికి అనుగుణంగా ప్రియురాళ్లు నాట్యం చేయసాగారు. వారి వినోద కాలక్షేపం పాన గానాలతో ఆహ్లాదభరితంగా సాగుతుండగా, ఎక్కడి నుంచి చూశాడో ద్వివిధుడు చెట్ల మీద నుంచి దూకుతూ రైవత పర్వతం మీదకు చేరుకున్నాడు. కొండ మీదనున్న చెట్లపై వేలాడుతూ, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ కోతిచేష్టలు మొదలుపెట్టాడు. చెట్లను బలంగా ఊపుతూ, వాటికి ఉన్న పండ్లను దులిపేశాడు. పూలను రాల్చేశాడు. ఆడవాళ్ల ఎదుటికొచ్చి చిందులు వేశాడు. వాళ్లు అతణ్ణి వింతగా చూశారు. కొందరు నవ్వారు. ఇంత జరుగుతున్నా బలరాముడు తన మైకంలో, తన లోకంలో తానుండి హాయిగా గానాలాపన సాగిస్తూనే ఉన్నాడు. తాను ఎంత ఆగడం చేస్తున్నా, బలరాముడు చలించకపోవడంతో ద్వివిధుడు చిర్రెత్తిపోయాడు. ఏకంగా బలరాముడి ఎదుటికే వచ్చి, జబ్బలు చరుచుకుని రంకెలు వేశాడు. కాళ్లు నేలకు తాటిస్తూ, కయ్యానికి కాలు దువ్వాడు. ఈ చేష్టలను బలరాముడు అరమూత కళ్లతో ఒకసారి చూసి, తన మానాన పాడుకోసాగాడు. ద్వివిధుడు మరింతగా కోపంతో పెట్రేగి ఊగిపోయాడు. పళ్లు పటపట కొరికాడు. బలరాముడి ముందున్న మధుపాత్రను పైకెత్తి నేలకేసి కొట్టాడు. మధుపాత్ర పగిలి, మధువు నేలపాలైంది. ఏదో ఘనకార్యం చేసినట్టు వికటాట్టహాసం చేశాడు. రెప్పలెత్తి చూశాడు బలరాముడు. మామూలు కోతిని అదిలించినట్లుగానే, పక్కనే ఉన్న ఒక చిన్నరాయిని తీసుకుని అదిలించాడు. బలరాముడి ధోరణికి ద్వివిధుడు బాగా రెచ్చిపోయాడు. ఈసారి ఆడవాళ్ల గుంపులోకి దూకాడు. వాళ్లను మిర్రి మిర్రి చూస్తూ కిచకిచలాడాడు. బెదిరిస్తున్నట్లుగా పైపైకి వచ్చాడు. గంతులు వేశాడు. వాళ్లు ఇదంతా వినోదంగా అనుకుంటున్నంతలోనే ఒక్కసారిగా వాళ్ల జడలు గుంజి, చీరలు చించేశాడు. మీదపడి దొరికిన వాళ్లను దొరికినట్లుగా గోళ్లతో రక్కాడు. వానరం ఆగడం మితిమీరడంతో వాళ్లంతా హాహాకారాలు చేస్తూ, ఏడుపు మొదలుపెట్టారు. అప్పుడు వాణ్ణి తేరిపార చూశాడు బలరాముడు. దేశంలో ఆగడాలు సాగిస్తున్న వానరుడు వీడేనని గుర్తించాడు. ఆడవాళ్ల మీద ఆగడం సాగిస్తుండటంతో ఏమాత్రం సహించలేకపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా, ఒక చేత నాగలి, మరో చేత ముసలం పట్టుకుని పైకి లేచాడు. బలరాముడు ఆయుధాలతో పైకి లేవడం గమనించిన ద్వివిధుడు, ఒక భారీ గుగ్గిలం చెట్టును పెరికి, బలరాముడి మీదకు విసిరాడు. ఎడమచేత్తో దాన్ని అడ్డుకున్నాడు బలరాముడు. ఒక మద్దిచెట్టును విసిరాడు. దాన్ని ముసలంతో నేలకూల్చేశాడు బలరాముడు. ఒక్క ఊపుతో ముందుకు దూసుకొచ్చాడు ద్వివిధుడు. ముసలంతో చాచిపెట్టి వాడి నెత్తి మీద కొట్టాడు బలరాముడు. వాడి తల పగిలి నెత్తురోడసాగింది. అయినా లక్ష్యపెట్టలేదు వాడు. భయంకరంగా పెడబొబ్బలు పెడుతూ, చెట్టు మీద చెట్టు పెరికి బలరాముడి మీదకు దండెత్తాడు. చుట్టు పక్కల చెట్లన్నీ ఖాళీ అయిపోయాక, పెద్ద పెద్ద బండరాళ్లు విసిరి ఊపిరాడనివ్వకుండా చేశాడు. అంతటితో ఆగకుండా బలరాముడి మీదకు దూకి, నేలకేసి అదిమి పిడిగుద్దులు కురిపించాడు. ఉపేక్షిస్తున్న కొద్దీ వానరం రెచ్చిపోతుండటంతో బలరాముడికి కోపం తలకెక్కింది. ఆగ్రహంతో కళ్లెర్రచేసి, కాలసర్పంలా బుసకొట్టాడు. ద్వివిధుడి మీద పిడుగుల్లా పిడిగుద్దులు కురిపించాడు. ఇద్దరూ కచాకచీ బాహాబాహీ ఒకరితో ఒకరు తలపడ్డారు. రైవతపర్వతం అదిరిపోయేలా రంకెలు వేస్తూ భీకరంగా ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు నేలపైకి పడదోసుకుంటూ యుద్ధం సాగించారు. ఒకరినొకరు తన్నుకుంటూ, చరుచుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ కలియబడ్డారు. అదను చూసుకుని బలరాముడు ద్వివిధుణ్ణి ఒడుపుగా పట్టుకుని, నేలకేసి తోశాడు. పైకి లేచేలోగానే అతడిపై కలబడ్డాడు. అతడి గుండెల మీద కూర్చుని, లేవనివ్వకుండా అతణ్ణి కట్టడి చేశాడు. ప్రతిఘటించేలోపే వ్యవధినివ్వకుండా పిడిగుద్దులు కురిపించాడు. గుండెల మీద పిడుగులాంటి పోటు పిడికిటితో పొడిచాడు. దెబ్బకు నెత్తురు కక్కుకుంటూ, భీకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు ద్వివిధుడు. బలరాముడి చేతిలో వానరం హతమవడంతో అతడితో కొండ మీదకు వచ్చిన ఆడవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. బలరాముడిని పొగుడుతూ ఆనందంతో పాటలు పాడారు. యుద్ధంలో అలసిపోయిన బలరాముడికి సపర్యలు చేశారు. కొండ మీద కాసేపు సేదదీరాక, తిరిగి ద్వారకకు మళ్లారు. -సాంఖ్యాయన -
శతక నీతి – సుమతి ‘‘..సతాం సంగో...’’ పాటించండి
ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. దుర్యోధనుడికన్నా ప్రమాదకారి. అంత పరమదుర్మార్గుడయిన ధృతరాష్ట్రుడికి శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా దృష్టినిచ్చి నిండు సభలో తన విశ్వరూప దర్శనానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడంటే... ఆయనకున్న ఒకే ఒక అర్హత చూసి. ఆ ఒక్క సుగుణం ఏమిటి! ప్రతిరోజూ రాత్రి పరమ ధర్మాత్ముడయిన విదురుడిని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు వింటాడు.. పాటించడు. కానీ విదురుడు లేకపోతే విలవిల్లాడిపోతాడు. ఆయన చెప్పేవన్నీ వింటాడు. ‘ఒక మహాత్ముడిని చేరదీసావు, ఆయనతో కలిసి ఉన్నావు, ఆయన చెప్పినవన్నీ వింటున్నావు.. ఈ ఒక్క కారణానికి నీకు విశ్వరూప సందర్శనకు అవకాశం ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషులతో సహవాసం అంత మేలు చేస్తుంది. మంచివారితో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేస్తుండాలి. వారు నిన్ను పేరు పెట్టి పిలిచినా, బంధుత్వంతో పిలిచినా, నీవు వారింటికి వెళ్ళగలిగినా, వారు తరచుగా నీతో మాట్లాడుతున్నా నీవు చాలా అదృష్ట్టవంతుడివని జ్ఞాపకం పెట్టుకో... ఎందుకని అంటే... భగవంతుడు బాగా ఇష్టపడేది తనని పూజించే వాళ్లని కాదు, తాను చెప్పిన మాటలను ఆచరించేవారిని. మంచి వారితో కలిసుండే వారినే ఇష్టపడతాడు.. భాగవతంలో అజామిళోపాఖ్యానం– అనే అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంది. ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని.. వారినే కాదు.. వారి వారి వారి తాలూకు వారి జోలికి కూడా వెళ్ళవద్దు, వారినెవరినీ నా దగ్గరకు తీసుకుని రావద్దు–అంటాడు యమధర్మరాజు తన భటులతో...అందులో. అందుకే లోకంలో ఒక సామెత ఉంది... ‘‘అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యం వాసః సతాం సంగో గంగభః శంభుసేవనమ్’’. ఈ నాలుగు విషయాలు చాలా గొప్పవని తెలుసుకుని బతుకు..అని బోధిస్తారు. ఇవి తెలుసుకోకపోతే అసారమైన జీవితంలో ఉండిపోతావు. అసారం..అంటే నీవెంట వచ్చేది కాదు, నీ ఆత్మోద్ధరణకు వచ్చేది కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దేది కాదు. ఏవి చాలా గొప్పవి.. అంటే.. కాశీపట్టణానికి వెళ్ళి ఉండడం, సతాంసంగో–సత్పురుషులతో స్నేహం, గంగానదిలోస్నానం చేయడం, శంభుసేవనమ్–శివార్చన చేయడం. ఈ నాలుగింటికన్నా సారవంతమయినవి జీవితంలో ఉండవు. సతాంసంగో.. సత్పురుషులతో సహవాసం చాలా గొప్పది. ‘‘గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నన్నిత్ సంతో మహాశయః’’ అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు మాత్రమే పోతాయి, ఎంత వేసవికాలంలో అయినా శరీరంలో ఎంత తాపం కలిగినా, ఒక్కసారి చంద్రుడిని చూసి వెన్నెలలోకి చేరారనుకోండి కేవలం తాపం మాత్రం పోతుంది. కల్పవృక్షం దగ్గరకు చేరితే దరిద్రం మాత్రమే పోతుంది. అదే సత్పురుషులతో కలిసి ఉంటే పాపాలు, తాపాలు, దరిద్రం అన్నీ పోతాయి. తమ కష్టాలను పక్కనబెట్టి ఇతరుల కష్టాలను తమవిగా పరిగణిస్తారు సజ్జనులు. మీ దగ్గర ఏవో ఆశించి అలా చేయరు. అది వారి సహజ లక్షణం. దీనుల విషయంలో వారి మనసు కరిగిపోతుంది. బద్దెన గారు సుమతీ శతకంద్వారా ఇస్తున్న సందేశం కూడా ఇదే .. ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...’’.. దుర్జనులతో స్నేహం చేయవద్దు అని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!
ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు. అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు. కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్ పేరు కృష్ణుడిగా రిజిస్టర్లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
Deepavali 2021: ఈమె నా సత్యభామేనా.. ఇంత బేలగా..
తెలతెలవారుతోంది. సత్యభామ నెమ్మదిగా మేల్కొంటోంది. నిద్ర మంచం మీద నుంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడికి ప్రణామం చేసి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించి, నెమ్మదిగా లేచి వచ్చింది. ఆ రోజు సత్యభామ మనసును బాధ, ఆనందం రెండూ కష్టపెడుతూనే సంతోషపెడుతున్నాయి. మానసిక సంఘర్షణతో నిండిన ఎదతో సత్యభామకు ఏ పని చేయటానికీ తోచట్లేదు. తలారా స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీకృష్ణుని మందిరానికి బయలుదేరింది సత్యభామ. ఎన్నడూ లేనిది ఆ రోజు తెలుపునలుపుల సమ్మిళితమైన పట్టు బట్టలు ధరించింది. తల నిండా మల్లెలు తురుముకుంది. ముత్యాల హారం ధరించింది. సత్యభామ ముగ్ధలా ముద్దుగా మురిపెంగా కనిపస్తూనే అంతలోనే ఆమెలో ఏదో తెలియని దిగులు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గమనము విడిచిపెట్టకుండా వేగంగా శ్రీకృష్ణ మందిరం చేరింది సత్యభామ. ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా శ్రీకృష్ణుడు గుమ్మం దగ్గరే స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాడు.సత్యలోని రెండు భావాలను వెంటనే గమనించాడు నల్లనివాడు. ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నడిపించుకుంటూ తీసుకువెళ్లి, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అంతవరకు ఎంతో కొంత గంభీరంగా ఉన్న సత్య కళ్లలో నీళ్లు ఊటలా ఊరి ఒక్కసారిగా ఒళ్లంతా తడిపేశాయి. ఈమె నా సత్యభామేనా, ఇంత బేలగా విలపిస్తోంది. ఎంతటి ధైర్యవంతురాలు, యుద్ధం చేసిన అరివీరభయంకర నారి.. అనుకుంటూ తన చేలాంచలముతో ఆమె కన్నీరు మృదువుగా తుడిచాడు. ఆశ్వాసన లభించటంతో ఆమెలోని దుఃఖం వరదలా పొంగుకొచ్చింది. ఆమెను పూర్తిగా దుఃఖపడనిచ్చాడు. కొంత సేపటికి ఆమె మనసు కొద్దిగా కుదుటపడింది. కొంత సేపటికి తన మనసును తానే కుదుటపరచుకుని... శ్రీకృష్ణా.. నన్ను ఇలా చూస్తే నీకు కొత్తగా అనిపిస్తోంది కదూ... నిజమే.. నేను ధైర్యవంతురాలినే కాని, భీరురాలిని కానని నీకు తెలుసు. అటువంటి నేను కంటనీరు పెట్టుకోవటం నీకు ఆశ్చర్యంగా అనిపించటంలో తప్పులేదులే...అంటూ - తన దుఃఖానికి కారణం నెమ్మదిగా వివరించటం ప్రారంభించింది. శ్రీకృష్ణా... ఈ రోజు ప్రత్యేకత నీకు తెలుసు కదూ.. అంటూ తన ఖేదానికి కారణం చెప్పడానికి సన్నద్ధురాలైంది. ఎందుకు తెలీదు. నువ్వు నాకు విజయం తెచ్చిపెట్టిన రోజు ఈ రోజే కదా... అన్నాడు నవ్వురాజిల్లెడు మోముతో. అవును.. అది ఒక విషయం. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా నా మనసు సంబరపడుతుంది. అదొక్కటే కాదు కదా... మరో విషయం కూడా ఉంది కదా.. అంది మనసులోని దుఃఖాన్ని మాటల ద్వారా పలుకుతూ... ఎందుకు గుర్తు లేదు.. నరకాసుర సంహారం జరిగింది ఈ రోజే కదా.. అన్నాడు గంభీరంగా. అదే.. అదే.. ఆ సంఘటనే నా మనసుని కలవరపెడుతుంది.. అంది కంట నీరు బయటకు రానీయకుండా తడిసిన గుండెతో. అలా అంటావెందుకు. స్వయంగా నువ్వే కదా నరకాసురుని సంహరించడానికి సహకరించావు... అన్నాడు ఏమీ తెలియనట్లుగా ఆ లీలామానుష విగ్రహుడు. సత్యభామ అదేమీ గమనించనట్లుగా... నిజమే... ఎంతైనా వాడు నా పుత్రుడు కదా. ఒక తల్లిగా నాకు ఆ బాధ ఉంటుంది కదా. లోకరక్షణ కోసం నేను నరకుడిని సంహరించినా, కన్నప్రేమ ఒక పక్కన బాధిస్తూనే ఉంటుంది కదా.. అంది గద్గద స్వరంతో సత్యభామ. సత్యా... ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకుందామా. నరకుడిని అసురుడు అన్నాం. అంటే వాడిలో రాక్షస గుణాలు ఉన్నాయనే కదా అర్థం. మనం రాక్షస గుణాలను సంహరించాం. అందుకే నరకుడి పేరు మీదనే కదా నరక చతుర్దశి అని ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇతర పండుగలన్నింటికీ ఇలా అసురుల నామాలు లేవు కదా. మనం మనలోని రాక్షస లక్షణాలను పోగొట్టుకుని, మనలో ఉన్న జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా వెలిగించుతూనే ఉండాలి కదా... అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు జగద్గురువు. అసలు నువ్వు ఇలా మాట్లాడటమే నాకు వింతగా ఉంది. ఈ సృష్టికి మూలమైన లలన ఇంత బేలగా మాట్లాడొచ్చా... అంటుంటే సత్యభామ.. వెంటనే తనలోని బేలతనాన్ని పక్కకు పెట్టి, గంభీరంగా..నిజమే కృష్ణా.. వాస్తవానికి ఈ రోజు నీతో ఈ విషయమే మాట్లాడాలనుకున్నాను. కాని ఎందుకో నా మనసు తడి కావటంతో, ముందుగా నాలోని బాధను నీతో పంచుకున్నాను. నువ్వన్నది నిజమే. ఈ సృష్టికి కారణమైన స్త్రీకి ఇప్పుడు ఎందుకు సముచిత స్థానం లేదో అర్థం కావట్లేదు. మానవులందరూ పూజించే దేవుళ్లందరూ తమ భార్యల పేరుతోనే ప్రసిద్ధులు కదా. పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణిబ్రహ్మలు.. ఇలా.. మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదు.. అంటూ సందేహం వెలిబుచ్చింది సత్యభామ. ఏమో ఎక్కడ జరిగిందో తెలియట్లేదు. త్రేతాయుగంలో మా పినతల్లి కైకమ్మ మా తండ్రిగారయిన దశరథ మహారాజుకి యుద్ధంలో సహకరించింది కదా. ద్వాపర యుగం వరకు ఎన్నడూ స్త్రీపురుష వివక్ష లేదు. మరి కలియుగంలో ఎందుకు వచ్చిందో... అంటూ ఏమీ తెలియనివాడిలా ఉపదేశం చేశాడు పరాత్పరుడు. సత్యభామ చిరునవ్వుతో... వీటికితోడు.. ఎవరికైనా కోపం వస్తే చాలు... సత్యభామలా అలిగింది అంటూ పోలుస్తారే కాని, సత్యభామలా ధైర్యంగా ఉన్నవారిని నాతో ఎందుకు పోల్చరో తెలియట్లేదు. ఆడవారు ఆదిశక్తి స్వరూపం కదా... ఆ శక్తి ఎందుకు సన్నగిల్లిపోతోందో... ఆ ఆత్మాభిమానం ఎక్కడకు పారిపోతోందో అర్థం కావట్లేదు కృష్ణా... అంటూ తన కొంగును నడుముకి బిగిస్తూ పలికింది సత్య. అవును సత్యా... ఈ సృష్టి నిత్యం కొనసాగటం కోసం ఆడమగ అనే ప్రాణులను సృష్టిస్తే... మానవులు మాత్రం ఆడవారు తక్కువ, మగవారు ఎక్కువ అనే స్థితికి చేరుతున్నారు. ఇది మంచిది కాదు... అంటూ హితోక్తులు పలుకుతున్నాడు. దీపావళి పండుగలోని పరమార్థం అదే కదా... మన ఇంటిలోని రాక్షస గుణాలను పారద్రోలి, దైవలక్షణాలు అనే దీపాన్ని వెలిగించమని మనం ఈ పండుగ ద్వారా చెబుతున్నాం. దీపపు కాంతులతో పాటు, మానసిక ఉల్లాసం కోసం బాణాసంచా కాల్చుకోమంటున్నాం. కాని వీటిలోని పరమార్థం పక్కకు వెళ్లిపోతోంది. శారీరక ఆరోగ్యం దిగజారిపోయేలా చెవులు చిల్లులు పడే మందుగుండు సామగ్రి కాలుస్తున్నారు. సామాన్యంగా నిరాడంబరంగా చేసుకోవలసిన పండుగను అప్పులు చేసి ఆర్భాటంగా చేసుకుంటున్నారు... అంటూ సత్యభామ పలుకుతుంటే.. శ్రీకృష్ణుడు సన్నగా నవ్వుతూ...నిజమే సత్యా.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలేమో.. అన్నాడు. ►వైజయంతి పురాణపండ (సృజన రచన) -
కృష్ణ జన్మస్థలి కేసులో కొత్తమలుపు
మథుర: శ్రీకృష్ణ జన్మస్థలిగా భావించే స్థలంలో లభించిన కొన్ని వస్తువులకు సంబంధించిన వీడియో ఆధారాలను కృష్ణ జన్మస్థలి పిటీషనర్లు కోర్టు ముందుంచారు. ఈ వస్తువులు హిందూ మతవిశ్వాసాలకు సంబంధించినవని, వీటిని తర్వాత నిర్మించిన మసీదునుంచి తొలగించడం లేదా కనిపించకుండా చేయడం జరిగిఉంటుందని వివరించారు. ప్రస్తుతం మథురలోని షాహీ మసీదు స్థలంలో కృష్ణ జన్మస్థలి ఉందని చాలా సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడున్న కట్రా కేశవ్ దేవ్ గుడి ఆవరణలోని షాహీ ఇద్గా మసీదును తొలగించాలని పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు ఆధారంగా తాజాగా ఒక వీడియోను కోర్టుకు సమర్పించారు. ఇందులో మసీదులో శేష నాగు చిహ్నం, తామర పువ్వు, శంఖం చూపుతున్నాయి. ఇవన్నీ తర్వాత కాలంలో మసీదు నుంచి తొలగించి ఉంటారని, లేదా కనిపించకుండా రంగులు వేసి ఉంటారని పిటీషనర్లు ఆరోపించారు. తదుపరి విచారణ ఈ నెల 15న ఉందని పిటీషనర్ల తరఫు న్యాయవాది మహేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు. ఆ రోజు భారత పురాతత్వ సంస్థతో భౌతిక సర్వే కోసం పట్టుపడతామని చెప్పారు. -
పాచిపోయిన చికెన్.. పురుగులు పట్టిన స్వీట్‌కార్న్
కదిరి: జిల్లాలోని పలు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బూజు పట్టిన ఆహార పదార్థాలు, పాచిన చికెన్ ఇతర ఆహార పదార్థాలను ఇప్పటికే అనంతపురం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కదిరిలోనూ ఇలాంటి సంఘటనే మళ్లీ పునరావృతం అయింది. పట్టణంలోని శ్రీక్రిష్ణా గ్రాండ్ హోటల్లో ముందు రోజు మిగిలి పోయిన వంటకాలను తాజాగా స్పెషల్ అంటూ పార్శిల్ల రూపంలో ప్రజలకు అందజేస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంలో శుక్రవారం మున్సిపాలిటీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ చేసింది. వారి తనిఖీల్లో ఆ ఫిర్యాదు నిజమని తేలింది. ముందురోజు వండిన చికెన్‌ను పార్సిళ్ల రూపంలో అందజేసేందుకు సిద్ధం చేయడాన్ని వారు గుర్తించారు. అలాగే స్వీట్ కార్న్ డబ్బా తెరిస్తే బూజుపట్టి అందులో తెల్లని పురుగులు బయటకొచ్చాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడున్న హోటల్ సిబ్బంది ఒక్కరు కూడా మాస్కులు గానీ, చేతికి గ్లౌజులు గానీ, తలకు క్యాపులు గానీ ధరించకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు. అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ రమణ మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు హోటల్‌ను తనిఖీ చేస్తే పాచిపట్టిన, బూజుపట్టిన వంటకాలు తమకు కనిపించాయని , అందుకే ఈ హోటల్‌ను తక్షణం సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆ సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది
ముంబై : లాక్డౌన్ వలన ప్రజలందరు ఇళ్ళకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో పాత కార్యక్రమాలను, పాత టీవి సీరియళ్లను రీటెలికాస్ట్ చేస్తూ వీక్షకులను ఆనందింపజేస్తున్నారు. ఇప్పటికే దూరదర్శన్ రామాయణం.మహభారతం సీరియల్స్‌ను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకృష్ణ సీరియల్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!) ఈ విషయాన్ని ప్రసారభారతి తమ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. 90లలో ప్రసారమైన పురాణ గాథ శ్రీకృష్ణని తిరిగి ప్రసారం చేయనున్నట్టు పేర్కొంది. రామానంద్ సాగర్ యొక్క 'శ్రీ కృష్ణ' మొదట 1993-1996 మధ్య ప్రసారం చేయబడింది. అప్పట్లో అత్యధిక రేటింగ్ పొందిన ఈ సీరియల్ మొట్టమొదట 1993లో దూరదర్శన్(డీడీ2లో) ప్రసారమయింది. ఆపై 1996 లో డీడీ నేషనల్ మళ్లీ మొదటి నుంచి ప్రసారం చేసింది. ఇప్పటికే అనేక ఛానెల్స్‌లో ప్రసారమైన ఈ పాపులర్ సీరియల్ తిరిగి ప్రసారం కాబోతుండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. మొత్తం 221 ఎపిసోడ్లుగా ఉన్న శ్రీకృష్ణా సీరియల్లో చిన్ని కృష్ణునిగా స్వప్నిల్ జోషి నటిస్తే.. పెద్ద కృష్ణునిగా సర్వదమన్ బెనర్జీ నటించాడు. Coming Soon! #ShriKrishna on @DDNational.#StayHome pic.twitter.com/1SD1RveGwi — Prasar Bharati (@prasarbharati) April 23, 2020 -
భగవద్గీత... సన్మార్గానికి చేయూత
జీవితమంటే ఏమిటి? జీవితం ఇలాగే ఎందుకుంది? ఈ నక్షత్రాలు, గ్రహాలూ ఎందుకున్నాయి? కాలం ఎంతో శక్తిమంతమైనదా? అసలీ ప్రపంచం ఎందుకు సృష్టించబడింది? దేవుడంటే ఎవరు? ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు? సమాజంలో మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుంది? చెడు చేస్తున్న వారిని నిగ్రహించేవారే లేరా? ఈ ప్రకృతి ఏమిటి? ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ప్రశ్నలు... ఎపుడైనా ఇటువంటి ప్రశ్నలు మీ మదిలో మెలిగాయా? వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నించారా? అవునో, లేదో కానీ ఇటువంటి మరెన్నో సందేహాలకు సంతృప్తికర సమాధానాలతో తాత్వికదర్శనాన్ని అందించే గ్రంథమే శ్రీమద్భగవద్గీత. వేదసారాన్ని అందించే ఉపనిషత్తులలో మేటియైన ఈ గ్రంథమే గీతోపనిషత్తుగా కూడా ఖ్యాతినొందింది. అసలెందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అని అడిగితే అందుకు సమాధానమొక్కటే, అది ఈ సకల చరాచర సృష్టికి మూలకారణమైన దేవాదిదేవుడు సాక్షాత్తు శ్రీ కృష్ణునిచే స్వయంగా ఉపదేశించబడినందుకే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అంటుంది శ్రీమద్భాగవతం. ధర్మాచరణయందు సందిగ్ధతలో పడి, మనస్తాపంతో చింతామగ్నుడైన అర్జునునికి కర్తవ్యబోధ చేసి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉపదేశించినదే భగవద్గీత. అలా భగవద్గీతను విన్న అర్జునుడు చివర్లో ఈ విధంగా అన్నాడు – ఓ అచ్యుతా! నా మోహం ఇప్పుడు నశించింది. నీ కరుణతో నా స్మృతిని తిరిగి పొందాను. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను.’’– భగవద్గీత 18.73 మనం జీవితంలో ఎటువంటి పరిస్థితులలో వున్నా, భగవద్గీతలోని ఉపదేశాలను అనుసరిస్తే మన కర్తవ్య నిర్వహణయందు గల సందేహాలు నివృత్తి అవడమేగాక, దృఢమైన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకెళ్ళగలం. భగవద్గీత అందించే ఆత్మవిశ్వాసం, చేసే పనుల్లో స్పష్టత మరే ఇతర వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలంటూ నేడు నిర్వహిస్తున్న పలు తరగతుల పాఠ్యాంశాలలో సైతం లభించదు. అసలు జీవన నిర్మాణ మూల ఉద్దేశమేమిటో తెలుసుకున్నప్పుడే వ్యక్తిత్వ వికాసమన్నది సాధ్యపడుతుంది. ఆ విషయాలను గీత విపులంగా వివరిస్తుంది. సమస్త వేదసారాన్ని, భగవతత్త్వాన్ని సమగ్రంగా అందించేదే భగవద్గీత. క్రమం తప్పకుండా పఠించినవాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అయితే వందల రకాల భగవద్గీతలు అందుబాటులో వున్న నేటి తరుణంలో ఒక విశుద్ధభక్తుడు రచించిన గీతను ఎంచుకోవటమే సకల విధాలా శ్రేయస్కరం. బ్రహ్మ–మధ్వ–గౌడీయ పరంపరలో 32వ ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు చిన్ననాటినుండే శ్రీ కృష్ణుని విశుద్ధ భక్తులు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరులచే దీక్షను పొందిన వీరు కృష్ణ పరంపర సందేశాన్ని ‘భగవద్గీత యథాతథం’ గ్రంథంగా రచించారు. భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు అత్యంత విలువైన భగవద్గీతలోని 700 శ్లోకాలను పారాయణ చేయడం ద్వారా విశ్వశాంతి, లోక కళ్యాణం కలుగుతాయి. అలానే విశ్వమానవ సౌభ్రాతృత్వం, స్నేహభావనలు పెరుగుతాయి. మన లోపల ఉండే అసూయ, ద్వేషం లాంటి వాటిని జయించగలం. ఈ గీతాజయంతి రోజున ప్రతి ఒక్కరూభగవద్గీత చదవడం, చదివించడం వంటి సంకల్పాన్ని పాటించండి. (5054 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీ కృష్ణుని అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించడం వల్ల దీనిని గీతాజయంతి పర్వదినంగా జరుపుకుంటున్నాం). ►భగవద్గీతలోని ముఖ్యమైన 108 శ్లోకాలను తాత్పర్య సహితంగా పారాయణ చేయడం ద్వారా దేవాది దేవుడైన శ్రీ కృష్ణభగవానుడి అనుగ్రహం పొంది శాంతి సౌఖ్యాలు పొందుతారు. గీతా సందేశం ఏదో ఒక మతానికే కాకుండా ఈ విశ్వంలోనే అందరూ సమతా భావాన్ని కలిగి ఐకమత్యంతో కలిసి మెలిసి పని చేసేలా చేయగలదు. నేడు గీతా జయంతి సందర్భంగా ప్రపంచమంతటా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ‘యత్ర యోగేశ్వరో కృష్ణో...’ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతిరోజూ భగవద్గీతను పఠిస్తే సంపద, విజయం, అసాధారణశక్తి, నీతి నిశ్చయంగా సంప్రాప్తిస్తాయి. భగవద్గీతపై వివిధ రకాలుగా వ్యాపించి ఉన్న అపోహలను విడనాడి, జీవితంలో ఆచరించవలసిన సన్మార్గానికి చేయూతనిచ్చే భగవద్గీతను ఇంటిల్లిపాదీ చదువుకోవచ్చు. కావున, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తున్నాము. – సత్యగౌర చంద్ర ప్రభు, హరేకృష్ణమూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. -
కృష్ణ పరవశం
రాముణ్ణి సీరియల్ హీరోగా చేయొచ్చని ‘రామాయణ్’ ద్వారా గ్రహించిన రామానంద్ సాగర్ కృష్ణుడి వేణుగానంతో 200 ఎపిసోడ్లు తీయవచ్చని నిరూపించాడు. శ్రీకృష్ణుడిపై నిర్మించిన ‘శ్రీకృష్ణ’ సీరియల్ ఆ విహారి విశ్వరూపాన్ని ఇంటింట్లో ప్రత్యక్షం చేయించింది. ఆ కృష్ణ పరవశం నేటికీ మరపురానిది. బాల్యంలో కన్నతల్లి దేవకి అయినా పెంచిన తల్లి యశోద దగ్గర అల్లారుముద్దుగా పెరుగుతాడు కృష్ణుడు. రామానంద్‌సాగర్ దేవకిలా శ్రీకృష్ణ సీరియల్‌కి ప్రాణం పోస్తే.. తాను యశోదలా మురిపెంగా పెంచి ప్రతి ఒక్కరి కళ్లకు కట్టింది దూరదర్శన్. 1993 నుంచి 1996 వరకు నాలుగేళ్ల పాటు శ్రీకృష్ణ లీలలను ప్రసారం చేసింది గ్రేట్ ఇండియన్ టెలివిజన్. 90ల కాలంలో బుల్లితెరకు దాదాపు వందకోట్ల ఆదాయం తెచ్చిన సీరియల్ శ్రీకృష్ణ కావడం విశేషం.కృష్ణుడి గురించి దేశమంతా తెలుసు. కథలు కథలుగా కృష్ణుడు ప్రతి ఇంటి బిడ్డడే. ఆ అల్లరి, కొంటెతనం తెలియనివారుండరు. ఆ వెన్నదొంగను అప్పటికే సినిమా పరిశ్రమ ఎన్నో విధాల పరిచయం చేసింది. మళ్లీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకోలేదు రామానంద్‌సాగర్. అప్పటికే రామాయణానికి ముందు తన పేరును సార్థకం చేసుకున్న రామానంద్‌సాగర్ రాముడు తర్వాత మరో పురాణ పురుషుడిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడిని అప్పటికే జనం చూసి ఉన్నారు. తిరిగి కృష్ణుడిని చూడాలంటే ఓ ప్రత్యేకత ఉండాలి. అందుకే భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశం, విష్ణుపురాణం, పద్మపురాణం, గర్గ సంహిత, భగవద్గీత, మహాభారత్ గ్రం«థాల నుంచి కృష్ణుడున్న ప్రతీ సన్నివేశాన్ని తీసుకున్నారు. ఆసక్తిగా మలుచుకున్నారు. మూడేళ్ల పాటు టీవీ ప్రేక్షకులను కృష్ణలీలలతో అలరించారు. రాక్షస సంహారమే ప్రధానం కంసుడు తన చెల్లెలు దేవకి – బావ వసుదేవుడిని బంధించి చెరసాలలో ఉంచుతాడు. యోగులకు, దేవతలకు తాను భూమ్మీద జన్మిస్తున్నట్టు చెబుతాడు వైకుంఠ నారాయణుడు. దేవకి కడుపున అష్టమసంతానంగా జన్మిస్తాడు నారాయణుడు. కంసుడి కంటపడకుండా ఉండటానికి వసుదేవుడు ఆ బిడ్డను గంపలో పెట్టుకొని అర్ధరాత్రి కారాగారాన్ని ముంచేస్తున్నట్టు పరవళ్లు తొక్కుతున్న యమునా నదిని దాటుకొని రేపల్లెలో ఉన్న నందుని ఇంటికి చేరుతాడు. యశోద ప్రసవించిన ఆడబిడ్డను తీసుకొని, తన కొడుకును ఆమె పక్కన పడుకోబెట్టి తిరిగి కారాగారం చేరుకుంటాడు. దేవకి ప్రసవించిందని తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డను చంపడానికి కత్తి ఎత్తుతాడు. దాంతో ఆ బిడ్డ అదృశ్యమై తను యోగ మాయ అని, తాను దేవకి బిడ్డ కాదని, రేపల్లెలో కృష్ణుడు పెరుగుతున్నాడని, అతడే కంసుడిని హతమారుస్తాడని చెప్పి అదృశ్యమౌతుంది. అప్పటినుంచి కంసుడు రేపల్లెలో పెరుగుతున్న కృష్ణుడిని చంపడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. యశోదా గారాబు తనయుడిగా కృష్ణుడు రేపల్లెలో చేయని అల్లరంటూ ఉండదు. గోకులంలో గోవర్ధానాన్ని ఎత్తి యాదవులందరినీ కాపాడిన విధం, సాందీపుని ఆశ్రమంలో నేర్చిన విద్య, రాక్షసులను సంహరించి, తన బలగాన్నంతా కాపాడుకున్న విధం... చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మనసును గెలుచుకుంది. కృష్ణుడి బాల్యంతోపాటు కౌమారం అటు నుంచి రాధాకృష్ణుల ప్రేమనూ బుల్లితెర మీద హృద్యంగా చూపారు దర్శకులు. మంచి పక్షాన నిలిచిన దైవం బృందావనం నుంచి ద్వారక చేరి మామ కంసుడిని హతమార్చి తల్లిదండ్రులని చెరసాల నుంచి విడిపించిన బలరామకృష్ణుల గాధలను టీవీ కట్టేసినా మరచిపోలేక పోయారు ప్రేక్షక జనం. ద్వారకా నగరం, అక్కడ కృష్ణుడి వైభవంతోపాటు తనను కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించే సుగుణాన్ని ఎంతో అందంగా కళ్లకు కట్టారు. భారత యుద్ధ సమయంలో అర్జునుడు–దుర్యోదనాదుల రాక, యుద్ధంలో పాండవుల పక్షాన కృష్ణుడు పాల్గొనడం.. వంటి ఘట్టాలనూ చూపారు. కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణంతో సీరియల్ ముగుస్తుంది. – ఎన్.ఆర్ వందకోట్ల కృష్ణుడు 1993లో బుల్లితెరమీద ప్రత్యక్షమైన శ్రీ కృష్ణ సీరియల్‌ను 1995లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వరించింది. వందకోట్ల సంపాదనతో దూరదర్శన్ ద్వారకానగర వైభవమంత వెలిగిపోయింది ∙ సిరివెన్నెల సినిమా హీరో సర్వదమన్ డి. బెనర్జీ. కృష్ణుడిగా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు ∙శ్రీ కృష్ణ సీరియల్‌ను రామానందసాగర్, సుభాష్ సాగర్, ప్రేమ్‌సాగర్‌లు ‘సాగర్ ఎంటర్ప్రైజెస్’ ద్వారా నిర్మించారు. దర్శకులు రామానంద్‌సాగర్, ఆనంద్‌సాగర్, మోతీసాగర్లు ∙యువ కృష్ణుడిగా స్వాప్నిల్ జోషి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడుగా బెనర్జీ నటించారు. స్వాప్నిల్ జోషి కన్నా బెనర్జీ కృష్ణుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరస్థానాన్ని పొందారు. అందుకు బెనర్జీ రూపమే కాదు చిరుమందహాసం, నటన జనాన్ని అమితంగా ఆకట్టుకున్నాయి ∙రవీంద్ర జైన్ ఈ సీరియల్ సంగీతాన్ని అందించారు. ‘శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారీ’ టైటిల్ సాంగ్ ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా చాలా పాపులర్ అయ్యింది ∙ఈ సీరియల్ మారిషస్, నేపాల్, సౌత్ ఆఫ్రికా, జకర్తా, థాయిలాండ్ టీవీలు సైతం ప్రసారం చేశాయి ∙ఆ తర్వాత వివిధ చానెల్స్‌లో ప్రసారమైన జై శ్రీ కృష్ణ, రాధా కృష్ణ, పరమావతార్ శ్రీ కృష్ణ.. వంటి సీరియల్స్ ప్రేక్షకులను అలరించాయి. అలరిస్తున్నాయి. -
కిలకిల మువ్వల కేళీ కృష్ణా!
బుంగమూతి వీడలేదు కన్నయ్య. కుండెడు వెన్నమీగడలు, గడ్డ పెరుగు... ఎన్ని ఆశ చూపినా కన్నయ్య గుండ్రటి మూతి వెడల్పు కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు యశోదమ్మకు. ఉదయాన్నే చద్ది మూట కట్టుకుని, అన్న బలరాముడితో కలిసి గోవులను అడవికి తీసుకువెళ్లిన శ్రీకృష్ణుడు సాయంత్రం గడిచి, చీకటిపడుతున్నా ఇంటికి రాలేదు. యశోద మనసు పరిపరివిధాల పోతోంది. రోజూ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయని కన్నయ్య ఈ రోజు ఇంకా ఎందుకు రాలేదా అని ఆందోళన చెందుతోంది. నందుడి చేతికి కాగడా ఇచ్చి నల్లనయ్యను వెతికి తీసుకురమ్మంది. నందుడు గుమ్మం దిగుతుండగా, దీన వదనంతో ఎదురు వచ్చాడు కిట్టయ్య. తన చిన్ని కృష్ణుడు రావడం చూసి యశోద నయనాలు ఆనంద బిందువులతో నిండిపోయాయి. పరుగుపరుగున ఎదురువచ్చి అక్కున చేర్చుకుంది. బుంగమూతి వీడలేదు కన్నయ్య. కుండెడు వెన్నమీగడలు, గడ్డపెరుగు ఎన్ని ఆశ చూపినా కన్నయ్య గుండ్రటి మూతి వెడల్పు కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు యశోదమ్మకు. ఆ మురారిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, బుజ్జగింపుగా అడిగింది. ఏడుపు ముఖంతో, ‘అమ్మా! నేను నల్లగా ఎందుకు ఉన్నాను. రాధ చూడు ఎంత తెల్లగా ఉంటుందో. నాకు చిన్నతనంగా ఉంది’ అన్నాడు. యశోద మనస్సు చివుక్కుమంది. బాధను బయటపడనీయకుండా, నవ్వుతూ, ‘అయ్యో! ఇంతేనా! నీకో విషయం తెలుసా. నీ పసితనంలో ఒక రాక్షసి నీకు విషం పాలు ఇచ్చింది. నీ రంగుమారిందే కాని, నీకేమీ కాలేదు. అప్పటి నుంచి నువ్వు నల్లనయ్యవు అయ్యావు. నీ రూపం నచ్చి, పోతన మహాకవి నిన్ను ‘నల్లనివాడు, పద్మ నయనమ్ముల వాడు, కృపారసంబు పైజల్లెడివాడు.. చెల్వల మనోధనంబు దోచెను’ అని ప్రస్తుతించాడు. అయినా ఎవరైనా, ఎప్పుడైనా నువ్వు నల్లగా ఉన్నావని అన్నారా. నువ్వంటే అందరికీ ప్రేమే కదా. నువ్వు ఎవరి ఇళ్లలో వెన్నముద్దలు దొంగిలించినా, పెరుగు తస్కరించినా, చివరకు గోపికల వస్త్రాలను అపహరించినా, నిన్ను అందరూ స్తుతించారే కాని, ఒక్కరూ నిందించలేదు కదా. ఈరోజు నీకు ఎందుకు నువ్వు నల్లగా ఉన్నావన్న భావనలో ఉన్నావు...’ అని సముదాయించడానికి పరిపరివిధాలప్రయత్నించింది. నల్లనయ్య ముఖంలోని ఆ విశాలమైన కలువ కళ్లు ముడుచుకునే ఉన్నాయి. విచ్చుకోవట్లేదు. యశోద చాలాసేపు ఆలోచించింది. పసుపు, కుంకుమలు, రకరకాల కాయగూరల నుంచి వచ్చే రంగులు, బిందెడు నీళ్లు తీసుకు వచ్చింది, వాటితోపాటు ఒక పిచికారీ కూడా తీసుకువచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తున్నాడు బుల్లి కన్నయ్య. ఏంటమ్మా ఇవన్నీ అని అడిగాడు. అందుకు యశోద ‘చిట్టి తండ్రీ! నీ రాధ నీకు ఏ రంగులో కనిపించాలనుకుంటున్నావో ఆ రంగు ఆమె ముఖానికి పులిమేసెయ్యి. ఇంకా కావాలంటే, ఆ రంగులతో రంగు నీళ్లు తయారుచేసి, ఈ పిచికారీతో రాధ ఒళ్లంతా తడిపేసెయ్. అప్పుడు రాధ, నువ్వు ఒకే రంగులో ఉంటారు, సరేనా!’ అంది. కృష్ణుడు తెగ సంబరపడిపోయాడు. రంగులు, రంగునీళ్లు తీసుకుని రాధ దగ్గరకు బయలుదేరాడు. నల్లనయ్యను చూసిన రాధకు ఏమీ అర్థం కాలేదు. వస్తూనే కన్నయ్య చేతిలోని రంగులను రాధ ముఖానికి పులిమేశాడు. వెంటనే పిచికారీతో ఒళ్లంతా తడిపేశాడు. రాధకు కన్నయ్య చేష్టలు అర్థమయ్యాయి. ఇంతకాలం తాను చాలా తెల్లగా ఉంటాననుకున్న రాధ, ఇప్పుడు కన్నయ్య రంగులోకి వచ్చేసింది. ఆ రోజు రాధకు కృష్ణ తత్త్వం అర్థమైంది. యశోదమ్మ దగ్గర చిన్నపిల్లవాడిగా ప్రవర్తించిన కన్నయ్య, రాధ దగ్గర వేదాంతాన్ని బోధించాడు. ఆ రోజు నుంచి రంగుల పండుగను గోకుల వాసులతో పాటు భారతీయులంతా జరుపుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ పండుగను తన లీలలతో ప్రబోధించాడు గీతాకారుడు శ్రీకృష్ణుడు. –డా. వైజయంతి పురాణపండ -
పాదుకల శ్లోకం పుట్టుపూర్వోత్తరాలు
భారతంలో ధర్మరాజుని గురించి వ్యాసుడు వర్ణిస్తూ ధర్మమనే చెట్టులాంటివాడు ధర్మరాజు అనీ నకుల సహదేవులు పుష్పఫలాలు వంటి వారనీ– మాను భీమసేనుడనీ– అర్జునుడు చెట్టు నిలబడటానికి కారణమైన శక్తి అనీ మూలం శ్రీ కృష్ణుడనీ చెప్పాడు. ఇదే తీరుగా దుర్యోధనుడ్ని గురించి చెప్తూ రోషమయ మహావృక్షం దుర్యోధనుడని తెలియజేశాడు వివరించి.బోధి అనే పేరున్న వృక్షం కింద కూర్చుని తపశ్శక్తిని పొందిన కారణంగానే తాను తపశ్శక్తిమంతుడ్ని కాగలిగానని బుద్ధుడు కూడా ప్రకటించాడు.ఇలా చెట్లకీ తపస్సులకీ తాపసులకీ అనుబంధం గోచరిస్తుంది. అందుకే సాయి బహుశ ఈ వృక్షాన్ని ఎంచుకుని ఉండి ఉంటాడు. ఆ చెట్టు నీడని తాను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి, రుణవిముక్తి కోసంమరికొన్ని వృక్షాలని పెంచవలసిన బాధ్యత తనకుందని గ్రహించి ‘వెండీతోట’ని స్వయంగా పెంచి పెద్ద చేయాలనుకునే ఆలోచనకి వచ్చి దాన్ని అమలు చేసుంటాడు. ఎండిన చెట్ల కొమ్మలనీ కాండాలనీ సమిధలుగా చేస్తూ ఇంతటి పవిత్ర నిస్వార్థ భావంతో మనకి ఎంతో ఆశ్రయాన్నిచ్చిన చెట్లకి సద్గతులు కలగాలనే భావంతో (జీవులే వృక్షాలనేది సాయి భావన) వాటి సమిధలని అగ్నిహోత్రంలో (ధుని)వేస్తూ ఆయా దేవతల్ని తృప్తి పరచవలసిందే నన్నాడు సాయి పరోక్షంగా. ఆ పవిత్రతని కాపాడేందుకే.... అంతటి పవిత్రమైనదీ నిస్వార్థంగా తనని ఆశ్రయించిన అందరికీ సేవచేసినదీ అయిన వృక్షానికి ఉన్న పవిత్రతని మరింత చేసేందుకూ, జనులందరికీ ఉపకారబుద్ధితో పాటూ చెట్టుకున్న గొప్పదనాన్ని తెలియజేసేందుకూ నిర్ణయించుకున్న సాయి ఆ చెట్టు మొదట్లోనే సాయి పాదుకలని ఉంచాలని భావించాడు మనసులో. ఆ పాదుకలు తనవి మాత్రమే కావాలని ఏనాడూ సాయి భావించలేదు.ఎక్కడైనా భగవంతుడు అనగానే వెంటనే పాదాలని కదా ముందుగా పూజిస్తాం. అంతటి శక్తిమంతుడైన భగవంతుని పాదాలని ఎవరి మటుకు వాళ్లు తల మీద పెట్టుకోలేరు కదా! ఆ కారణంగా అందరికీ భగవంతుని చరణాల సేవా సౌభాగ్యం కలగాలనీ, కలిగించాలనీ భావించిన సాయి భగవత్పాదుకలని ఆ పవిత్ర వేపచెట్టు మొదట్లో ఉండేలా చేయాలని సంకల్పించాడు.దేవాలయాల్లో కూడా శఠగోపం అని ఒకటుంటుంది. కిరీటం ఆకారంలో, దాన్ని మన శిరసు మీద పెడతారు. హిరణ్య గర్భాది సురాసురాణాం కిరీటమాణిక్య విరాజమండితం (ఉదాహరణకి శివాలయమైతే)శివస్య తత్పాదసరోజ యుగ్మం త్వదీయ మూర్ధాన మలంకరోతు’ అని చదువుతూ ఆ శఠగోపాన్ని భక్తుల శిరసు మీద ఉంచుతారు. ఆ శఠగోపం మీద ఏ దేవాలయపు శఠగోపమైతే ఆ దేవుని పాదుకలు (ధరించిన పాదరక్షలు) కనిపిస్తూ ఉంటాయి. ఆ శఠగోపం మన తలమీద పెట్టగానే ఆ దైవపాదుకలకి మన తలతో నమస్కారాలని చేసిన పుణ్యం మనకొస్తుందని దానర్థమన్నమాట. పాదుకలని ప్రతిష్ఠించిన తీరూ– అక్కడ చదవాల్సిన శ్లోకాన్నీ అర్థాన్నీ గురించి తెలుసుకుందాం! ఎవరైనా ‘సాయి’ అనగానే వెంటనే గుర్తొచ్చే శ్లోకం ‘సదా నింబవృక్షస్య... సాయినాథమ్’ అనే శ్లోకమే. ఒక బిడ్డ పుట్టిందనగానే అందరికీ చెప్పలేని ఆనందం కలుగుతుందనేది యథార్థమే గానీ, ఆ బిడ్డ పుట్టుకకి వెనుక తల్లి గర్భంలో కలిగిన అలజడిని దాదాపుగా ఎవరూ పట్టించుకోరు. అందుకే కాళిదాస మహాకవి అన్నాడు–మామిడి పండుని తినేవాడెవడూ దానిపువ్వు పుట్టడం గురించి ఆలోచించడని. మామిడి చెట్టుకి ఆనందం ఎప్పుడు కలుగుతుందట? మొదటిసారిగా తాను పువ్వుని వేసినప్పుడట. దాన్నే ‘పుష్పవతి’ కావడమంది శాస్త్రం.అలాగే ఈ పైననుకున్న శ్లోకం ఎలా పుట్టిందో దాని అర్థం వివరంగా ఏమిటో తెలుసుకుందాం! శ్లోకానికి నాంది ఇదీ! షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట అనే ఓ గ్రామం ఉంది. అక్కడ ఓ మహాతపశ్శక్తి సంపన్నులు ఉండేవారు. ఆయన్ని అందరూ ‘మహారాజ్’ అని పిలుస్తూ ఉండేవారు. దాంతో ఆయన ‘అక్కల్‌కోటకర్ మహారాజ్’గా వ్యవహారంలోకి వచ్చేశారు. వీరికి మహాభక్తుడు కృష్ణజీ(భాయి కృష్ణజీ అవీ బాగేకర్). ఆయనెప్పుడూ ఈ మహారాజ్ గారి చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని నిరంతరం పూజిస్తూ ఉండేవారు. ఓసారి మాత్రం కృష్ణజీకి అక్కల్కోట గ్రామానికి స్వయంగా వెళ్లాలనీ, అక్కడ ఉన్న మహారాజ్ గారి పాదుకల్ని దర్శించి స్వయంగా పూజించుకోవాలనీ ఓ ఆలోచన వచ్చింది. ఇక బయల్దేరి రేపు వెళ్దామనుకుంటూ ఉండగా ఆయనకి ఓ కలొచ్చింది. ‘కృష్ణజీ! ప్రస్తుతం నా నివాసస్థలం అక్కల్కోట కాదు షిర్డీ. అక్కడికి పోయి నా మీద ఉన్న నీ భక్తినంతా అక్కడ ఉంచి నీ పూజని అక్కడ చేసుకో!’ అని స్వయంగా అక్కల్‌కోటకర్ మహారాజుగారే చెప్పినట్లుగా తోచింది కలలో. వెంటనే కృష్ణజీ తన నిర్ణయాన్ని మార్చుకుని అక్కల్కోటకి బదులుగా షిర్డీకి వెళ్లాడు. ఎందుకో అక్కడకి వెళ్లాక సాయిని దర్శించాక, అక్కడ వాతావరణం మరింత హృద్యంగా అనిపించాక వెంటనే వెళ్లిపోదామనిపించలేదు. దాంతో ‘రేపు వెడదాం – మాపు పోదాం’ అనుకుంటూ ఆయన ఆర్నెల్లపాటు అక్కడే సాయిని సేవించుకుంటూ ఉండిపోయారు.దాంతో ఆయనకి సాయితో మరింత అనుబంధం పెరిగిపోయింది. ఇలా షిర్డీలో వీరున్న కాలంలో బొంబాయి నుంచి డాక్టరూ(రామారావు కోరారే) ఆయనతో పాటు ఆయన కాంపౌండర్ కూడా వచ్చారు. దీంతో డాక్టరూ, కాంపౌండర్ వీరే కాక సగుణ్ –దీక్షిత్ అనే వారు కూడా బాగా సన్నిహితులయ్యారు ఈ ఆరునెలల కాలంలో. ప్రతినిత్యం ఇలా సాయి గురించిన భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాటల మధ్యలో– సాయి ప్రతినిత్యం ఏ వేపచెట్టు కింద కూర్చుని నిరంతర విరాగమూర్తిగా తపస్సు చేసుకుంటూ ఎండ, వాన, చలి అనే వాటిని లెక్క చేయకుండా ఉండి మొత్తానికి సిద్ధిని సాధించి సిద్ధుడయ్యాడో ఆ విశేషం అందరికీ ముందునాటికి అర్థమయ్యేలా తెలియజేయాలి’ అనే ఆలోచన ఒక్కరికి కాదు ఏకగ్రీవంగా వచ్చింది. ఆలోచన రావడమేమిటి? దాన్ని అమలు చేయాలనే నిర్ణయబుద్ధి కలిగిన డాక్టరుగారు షిర్డీలోనే పాదుకల నమూనాని రాయించారు. ‘మన బుద్ధికి తోచినట్లూ– అంతేకాక అక్కల్‌కోటకర్ మహారాజుగారి పాదుకలని చూసి వాటి పద్ధతిలో నమూనాని రాసినట్లూ ఉన్నాయి ఈ పాదుకలు. ఏ అతి ముఖ్యమైన శాశ్వతమైన పనిని చేయదలచినా అది లోపభూయిష్టంగాని, దుర్విమర్శకి లోనయ్యే తీరుగా గానిఉండకూడదు సరికదా– ఒకసారంటూ వాటికి ప్రతిష్ఠ జరిగిన పక్షంలో వాటిని మార్చడం కూడా సరికాదు. భక్తులందరికీ కూడా అదో తీరు భావన ఈ పాదుకల విషయంలో కలగచ్చు కూడా.అందుకని పాదుకలూ– నమూనా... మొదలైన విషయాల్లో గట్టి అనుభవం, అంతేకాక తపశ్శక్తీ పుష్కలంగా ఉన్న ఉపాసనీ మహారాజ్ గారు ఉండే ఖండోబా అనే పేరున్న ఆలయానికెళ్లారు. ఆయన ఆ పాదుకల నమూనాని చూస్తూనే ఎంతో సంతోషపడి – ఎన్నాళ్లకి ఈ మంచిపని జరుగుతోందనే ఆనందాన్ని వ్యక్తీకరించారు. ఆ పాదుకల నమూనాలో కొన్ని మార్పుల్ని చేస్తూ– పద్మం, శంఖం,చక్రం అనే వాటిని కూడా చేర్పించారు. ఈ వేపచెట్టుకున్న గొప్పదనాన్ని కూడా లోకానికంతటికీ తెలియజేయదలిచి ఓ శ్లోకాన్ని రాసి– దాన్ని ఓ ఫలకం మీద చెక్కించి ప్రతిష్ఠించడం బాగుంటుంది అని సూచించారు కూడా. పెద్దరికం పెద్దలెప్పుడూ కూడా ‘ఇలా చేయవలసిందే – చేసి తీరాలి’ అని ఆజ్ఞాపించరు. ఒకవేళ అవతలి వ్యక్తులు తమభావాన్ని అర్థం చేసుకోలేక తాము సూచించిన విధంగా చేయని పక్షంలో మనసు నొచ్చుకోవలసి వస్తుందనుకుంటూ కేవలం సూచన ప్రతిపాదన వంటి వాటినే చేస్తారు. దీన్నే ‘పెద్దరికం నిలుపుకోవడం’ అంటారు.పెద్దలు అలా చేసిన సూచనని తప్పక పాటించదలిచి ఆ సూచననే సలహానే ప్రతిపాదననే ఓ ఆజ్ఞగా భావించి చేయడమనేదాన్ని ‘భక్తి – శ్రద్ధ’ అంటారు. ఇలా తాము చెప్పిందాన్ని చెప్పినట్లుగా అవతలివారు పాటిస్తున్నారని అనిపిస్తే పెద్దలు – మరింత జాగ్రత్తగా ఆలోచించి, ఒకటికి రెండుమార్లు తర్కించుకుని మాత్రమే సూచన, సలహా, ప్రతిపాదనని చేస్తారు తప్ప యథాలాపంగా ఏమేమో చెప్పెయ్యరు. ఇలాంటి చరిత్రలని వింటూ ఉంటే ఎదుటివారికి ఎలా సలహా సూచన ప్రతిపాదన అనే వాటిని మనం చేయాలో అర్థమవుతుంది. ‘నా ఈ సలహాని, సూచనని పాటించని పక్షంలో... భోజనం చేయననీ, ఇంటికి రానేరాననీ, ముఖం చూడననీ’ ఈ తీరుగా పలకడం ఎంతటి పిల్లతనానికీ, పిల్లచేష్టలకీ ఉదాహరణమో... అర్థం చేసుకోగలుగుతారు ఆ తీరు లక్షణమున్నవాళ్లు. పైగా ఈ సూచన చేసిన ఆయన ‘ఉపాసని–మహారాజ్’ ఉపాసనని చేసి చేసి, ఉపాసన కారణంగా ‘ఉపాసని’ గానూ అందరి పట్లా ప్రేమా వాత్సల్యాలని చూపే కారణంగా మహారాజ్గానూ పేరు పొంది ‘ఉపాసనీ మహారాజ్’ అయ్యారు. అలాంటి వాళ్లకి రాబోయే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా చెప్పకపోవడం అనేది వారి గొప్పదనం – పెద్దరికం కూడా. అందుకే దేవతలు అలాంటి వారికి మాత్రమే భవిష్యత్ దర్శన శక్తినిస్తారు. దాన్ని సద్వినియోగ పరుచుకుంటే నిచ్చెన మెట్ల మీదుగా సాగిపోయేటట్లు ఎదిగిపోతారు. అలాంటి ప్రవర్తన లేని పక్షంలో వైకుంఠపాళి (పరమపదసోపాన పటం) ఆటలో పామునోట్లో పడి ఒక్కసారిగా కిందికి పడిపోయినట్లు అథఃపతనానికి వచ్చేస్తారు. సరే! శ్లోకం– అర్థం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్త్రావిణం తిక్తమప్యప్రియం తమ్ తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథమ్ ఈ శ్లోకాన్ని కొన్ని సాయి దేవాలయాల్లో తప్పుగా వేయించడం జరిగిన కారణంగానూ, అది అధికసంఖ్యలో భక్తుల నోళ్లలోకి వెళ్లిపోతోందనే ఉద్దేశంతోనూ స్పష్టంగానూ వివరంగానూ దీని అర్థాన్ని తెలుసుకోవలసి ఉంది. ముఖ్యంగా ‘మూలధివాసాత్’కి బదులుగా ‘మూలాదివాసాత్’ అనీ, ‘కల్పవృక్షాధికమే’ అన్నదానికి బదులుగా ‘కల్పవృక్షాదిక’ అనీ దోషాలు దొర్లి కనిపిస్తున్నాయి. ఆ దోషాల్లేకుండా ఉండేందుకూ ఏది దోషమో ఏ తీరుగా చదివితే దోషం లేకుండా చదువుకుంటున్న తృప్తి ఉంటుందో– ఆ తీరులో అర్థమయ్యేలా వివరించుకుందాం శ్లోకాన్ని. శ్లోకానికి ముందుగా తెలుసుకోవలసినది పదాల విరుపుని. దీన్నే పద విభాగం అంటారు. సదా– నింబవృక్షస్య– మూలాధివాసాత్ సుధాస్రావిణమ్– తిక్తమ్– అపి– అప్రియమ్– తమ్ తరుమ్– కల్పవృక్షాధికం– సాధయంతమ్ నమామి– ఈశ్వరమ్– సద్గురుమ్– సాయినాథమ్ అనేది పదవిభాగం. పదవిభాగం లాగానే ప్రతి పదానికీ అర్థాన్ని కూడా తెలుసుకుంటే పొరపాటున కూడా ఈ శ్లోకమే కాదు ఏ శ్లోకాన్ని కూడా తప్పుగా ఉచ్చరించనే ఉచ్చరించలేం. అలా తప్పుగా ఉచ్చరించినందువల్ల కలిగే దుష్పరిణామం కూడా మనకి తెలిసే అవకాశముంటుంది. ప్రతిపద అర్థం సదా– పగలు, సాయంతరం, రాత్రి, ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, చలికాలమనే భేదాన్ని లెక్కించకుండా ఎప్పుడూ కూడా నింబ వృక్షస్య– ఆ తోవపక్కనే ఉన్న వేపచెట్టు యొక్క మూల+అధివాసాత్– మొదట్లోనే స్థిరంగా కూచుని ఉండే కారణంగా తిక్తమ్ – పుట్టుకతో తనకి కలిగిన చేదు తనంతోనే ఉన్నదీ అ–ప్రియమ్–ఎవరికీ కూడా ఏ మాత్రపు ఇష్టమూ కానిదీ అయిన తమ్ తరుమ్ – సామాన్యమైన జాతికి చెందిన ఆ వేప చెట్టుని (మంచిగంథం వంటిది కానిదైన)సుధా స్రావిణమ్ – నిరంతరం తేనెని ప్రవహించే తీరు కలిగిన దానిగానూ నిరాశా నిస్పృహలతో జీవితాన్ని చాలిద్దామనుకునేవారికి అమృతాన్ని ప్రవహించే తీరు లక్షణం కలిగినదవుతూ జీవించాలనే ఆలోచనని కలిగించే దానిగానూకల్పవృక్ష+అధికమ్ – అంతేకాక, ఏ కోరికని అడిగితే ఆ కోరికని అడిగినవాని అర్హతని బట్టి తీర్చే లక్షణమున్న దేవలోకవృక్షమైన కల్పవృక్షం కంటే గొప్పదనం కలదానివిగానూసాధయంతమ్ – ఏ రోజు కారోజు దాని గొప్పదనం జనులకి అర్థమయ్యేలా తీర్చిదిద్దుతున్నవాడూసత్+గురుమ్ – సజ్జనులకి మార్గదర్శనాన్ని చేస్తూ ఉండే ఓ గురువైనవాడూ, ఏ విధమైన లోటూ లోపమూ లేకుండా పరిపూర్ణమైన గురు లక్షణాలు కలిగిన వాడూసాయి నాథమ్ – దీనులకి రక్షకుడవుతూ ‘సాయి’ అనే పేరుగలిగి అందరికీ దిక్కైన వాడూఈశ్వరమ్ – సర్వశక్తులూ సర్వసిద్ధులూ తనలో కలిగి అందరి కష్టాలనీ నష్టాలనీ తొలగించగల సమర్థుడూ అయిన వానికి నమామి – ఎల్లవేళలా సర్వకాలాల్లో నమస్కరిస్తూనే ఉంటాను.భావం – ఈ శ్లోకంలో సాయి గొప్పదనం మొత్తం చిత్రీకరింపబడి కనిపిస్తుంది తరిచి చూస్తే.అదో సామాన్యమైన వేరు చెట్టు. ఆ చెట్టుకి ఆకులు కూడా సన్నగా చిన్నగానే ఉండే కారణంగా ఎక్కువనీడ నియ్యలేదు. పోనీ! దాని పుష్పాలు గాని, ఫలాలు గాని ఆహారంగా పనిచేస్తాయా? అంటే అందుకూ దానికి సమర్థత లేదు. పోనీ! ఏ నిద్రగన్నేరో మర్రీ మొదలైన వృక్షాల్లాగా పక్షులకి గూళ్లనీ, ఎలుకలూ మొదలైన వాటికి కన్నాలనీ,కోతులూ మొదలైన వాటికి ఆధారంగా కొమ్మల్నీ... ఈయగలదా? అంటే అలా ఈయగలిగిన శక్తీలేనిది– ఏ జీవజంతువులకీ ఆశ్రయాన్ని ఇచ్చి ఉన్నదీ కాదు. అలాంటి వేపచెట్టు అది. పైగా తన దగ్గరికి ఎవరినీ రానిచ్చుకోలేని రెండు అవగుణాలు – ఒకటి చేదుతనం, రెండవది ఎవరికీ ఈ చెట్టు అనగానే పట్టనితనం అనేవి కలిగి ఉండే జాతికి చెందిన వృక్షం.అలాంటి వృక్షాన్నే ఆశ్రయించాడు సాయి అనేది విశేషం. మల్లె, సంపెంగ, చందనం మొదలైన తీగల్నీ, చెట్లనీ ఎందరో ఇష్టపడతారు. అది కాదు విశేషం. ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. – సశేషం ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. -
ఆనందోత్సాహాల వెలుగు పూలు
లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం దీపావళి అమావాస్య. రావణవధ అనంతరం శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో బాణాసంచా కాలుస్తారు. ఒకనాడు కృష్ణభగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు దుర్వాసమహర్షి తదితరులందరూ వచ్చి ‘కృష్ణా, నరకాసురుని ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. వాడు దేవతల తల్లి అదితి కుండలాలను తస్కరించాడు. వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహరించే మణిపర్వతాన్ని మరలించి వేశాడు. అమిత బలాఢ్యుడైన నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు. అపుడు కృష్ణుడు ‘నేను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతలనందరిని సాంత్వన పరిచాడు. తరువాత సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ప్రాగ్జోతిషపురానికి వెళ్లాడు. అక్కడ ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. కృష్ణుడు ప్రళయ కాలంలో మేఘం ఉరిమినట్లుగా తన పాంచజన్యం పూరించాడు. ఆ శబ్దానికి నిద్రనుంచి లేచి యుద్ధానికి దూకబోయిన మురాసురుని మట్టుపెట్టాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చారు. ఆ ఏడుగురిని కూడా యమపురికి పంపించాడు కృష్ణుడు. ఈ వార్త నరకాసురుడికి చేరి యుద్ధానికి వచ్చాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది. రాక్షసుల మస్తకాన్ని ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును కృష్ణుడు సత్యభామ చేతికి అందించాడు. వెంటనే యుద్ధాన్ని ప్రారంభించి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణాన్ని తీసి వింటికి తొడుగుతుంటే వీర రసం, శృంగార రసం, భయరసం, రౌద్ర రసాలు ఆమెలో తాండవిస్తున్నాయి. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణాలను ప్రయోగించడం ప్రారంభించారు. భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటికి అత్తుకుపోయిన సత్యభామ వంక చూసిన కృష్ణుడు ‘సత్యా, నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను’ అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. చివరికి ప్రాణాలతో ఉన్న నరకుడి మీదికి తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని.ప్రయోగించగానే నరకాసురుని తల తెగి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడనే సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించారు. వాడు చతుర్దశినాడు చచ్చిపోయాడు. అందుకనే మనం నరకచతుర్దశి అంటాము. ఆ మరునాటిని దీపావళి అమావాస్య అంటాము. దీపావళి నాడు ఆచరించవలసినవి – ఈ రోజున తెల్లవారు జామున్నే పెద్దల చేత తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లకీ‡్ష్మ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో ప్రవేశిస్తుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టిప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. చీకటిపడే సమయంలో దీపదానం చేసి, మండుతున్న కట్టెల్ని తిప్పాలి. ఇలా తిప్పడం చేత పీడ పోతుందని చెప్తారు. నిజానికి దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతసిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీపూజ చేయాలి. దీపావళీ నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతోకొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ దరిద్ర దేవతను సాగనంపాలని శాస్త్రవచనం. బలిపాడ్యమి దీపావళి మరునాటినుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. కార్తీక శుద్ధపాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈరోజు బలిచక్రవర్తిని పూజించి ‘‘బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సు రారాతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి. భగినీ హస్త భోజనం కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ. – కృష్ణకార్తీక -
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి