న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాలో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సర్వేను పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు కూడా అంగీకరించింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ శుక్రవారం షాహి మసీద్ ఈద్గా మేనేజ్‌మెంట్ కమిటీ ట్రస్ట్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పిటిషన్ రూపంలో సవాల్ చేయాలని సూచించింది. దీనితో పాటు దీనిపై ట్రస్ట్ వేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment