ఆవులు మేత మేస్తున్నప్పుడూ వాటికి నచ్చినట్లు వెళ్లిపోతాయి. ఒక్కొసారి వాటిని కాస్తున్న వ్యక్తి మాటలు కూడా వినవు. అలాంటిది ఓ వ్యక్తి జస్ట్ చేతులు చూపించి సైగ చేయగానే అవన్నీ ఏదో అర్థమైనట్లు భలే బిహేవ్ చేశాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ సైకిలిస్ట్ ఇంగ్లాండ్‌లోని రెండో ఎత్తైన పర్వతం గ్రేట్ డన్ ఫెల్ మీదుగా వెళ్తూ కాసేపు బ్రేక్ తీసుకున్నాడు.
ఇంతలో అతడివైపుకే ఉన్నట్టుండి ఆవులన్నీ వచ్చేస్తున్నాయి. ఆవులు కాస్తున్న రైతు వాటిని రోడ్డుమీదకు రానీయకుండా ఆపాలని కోరాడు. దీంతో ఆ సైకిలిస్ట్ ఆవుల మందకు ఎదురుగా నిలబడి గట్టిగా "స్టాప్" అని అరుస్తూ.. చేతులతో సంజ్ఞ చేశాడు. అంతే అవన్నీ ఏమనుకున్నాయో గానీ భలేగా ఒక్కసారిగా అన్నీ కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఏ ఒక్కటి ముందుకు రాలేదు. పైగా ఆ రైతు వాటిని సమీపించేంత వరకు అలానే ఉండటం విచిత్రం. ఈ విషయాన్ని సైకిల్ రైడర్ "రైడ్‌లో నాకెప్పుడు ఎదరవ్వని విచిత్రమైన అనుభవం" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోకి మిలయన్లలో వ్యూస్ లైక్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment