Gesture
-
అతడు అలా అనంగానే..ఆ ఆవులన్నీ ఒక్కసారిగా..!
ఆవులు మేత మేస్తున్నప్పుడూ వాటికి నచ్చినట్లు వెళ్లిపోతాయి. ఒక్కొసారి వాటిని కాస్తున్న వ్యక్తి మాటలు కూడా వినవు. అలాంటిది ఓ వ్యక్తి జస్ట్ చేతులు చూపించి సైగ చేయగానే అవన్నీ ఏదో అర్థమైనట్లు భలే బిహేవ్ చేశాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ సైకిలిస్ట్ ఇంగ్లాండ్‌లోని రెండో ఎత్తైన పర్వతం గ్రేట్ డన్ ఫెల్ మీదుగా వెళ్తూ కాసేపు బ్రేక్ తీసుకున్నాడు. ఇంతలో అతడివైపుకే ఉన్నట్టుండి ఆవులన్నీ వచ్చేస్తున్నాయి. ఆవులు కాస్తున్న రైతు వాటిని రోడ్డుమీదకు రానీయకుండా ఆపాలని కోరాడు. దీంతో ఆ సైకిలిస్ట్ ఆవుల మందకు ఎదురుగా నిలబడి గట్టిగా "స్టాప్" అని అరుస్తూ.. చేతులతో సంజ్ఞ చేశాడు. అంతే అవన్నీ ఏమనుకున్నాయో గానీ భలేగా ఒక్కసారిగా అన్నీ కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఏ ఒక్కటి ముందుకు రాలేదు. పైగా ఆ రైతు వాటిని సమీపించేంత వరకు అలానే ఉండటం విచిత్రం. ఈ విషయాన్ని సైకిల్ రైడర్ "రైడ్‌లో నాకెప్పుడు ఎదరవ్వని విచిత్రమైన అనుభవం" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోకి మిలయన్లలో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Andrew O'Connor (@andrewon2wheels) (చదవండి: "విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..) -
స్వీట్వాయిస్ చిట్టెమ్మ! చిన్నారి వీడియో వైరల్.. ఆహా’!
పియానో వాయిస్తూ ఒక మహిళతో కలిసి కన్నడ పాట పాడుతున్న చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయింది. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. పాడుతున్న సమయంలో చిన్నారి ప్రదర్శించిన హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆహా’ అంటూ అబ్బురపడ్డారు. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. Listened to this so many times..What an inborn talent..🌹🌹 Source:Wa . pic.twitter.com/bm1LEY4Nn4 — Ananth Kumar (@anantkkumar) April 19, 2023 -
అవ్వా.. ఎలా ఉన్నావ్?: సీఎం జగన్
-
అవ్వా.. ఎలా ఉన్నావ్?: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: జనంతో మమేకం అయ్యేవాడే నిజమైన లీడర్. అలాంటి లక్షణాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో లేనప్పుడు పాదయాత్ర ద్వారా.. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు సంక్షేమం ద్వారా నిత్యం ప్రజల మధ్యే నిలుస్తుంటాడాయన. సాయం కోసం చూసే ఎదురు చూపులు.. ఎక్కడున్నా ఆయన కంట పడతాయి. ఎందుకంటే.. ప్రజల బాగోగులనే ఎజెండా ఆయన పాలనా ప్రాధాన్యాల్లో అగ్రభాగాన ఉంటుంది కాబట్టి. తాజాగా.. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం అధికారిక కార్యక్రమం ముగిశాక ఓ వివాహ రిసెస్షన్‌కు హాజరయ్యారు సీఎం జగన్. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో సందడి చేశారాయన. ఆ వేడుకలో పాల్గొని తిరుగు పయనమైన సందర్భంలో నియోజకవర్గ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. ఆ సమయంలో ఆయనతో కరచలనం కోసం అక్కడున్నవాళ్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో.. జనాల మధ్య ఉన్న ఓ వృద్ధురాలు.. సీఎం జగన్‌ను పిలిచారు. అది గమనించిన ఆయన.. తన సిబ్బందికి చెప్పి ఆమెను దగ్గరకు రప్పించుకున్నారు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మప్పగా తనను తాను పరిచయం చేసుకుంది ఆ వృద్ధురాలు. ఆపై ఆప్యాయంగా పలకరించి.. ఆమె బాగోగులు తెలుసుకున్నారు. బోసి నవ్వులతో మురిసిపోతున్న అవ్వను.. సీఎం జగన్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం అక్కడున్నవాళ్లను ఆనందానికి గురి చేసింది. -
కష్టాల్లో ఉన్న వాళ్లు కనబడితే ఆయన వాళ్ల దగ్గరికే వెళ్తారు. సాయం అందిస్తారు..
-
సీఎం జగన్ సాయం జీవితాంతం మరువలేనిది
సాక్షి, తాడేపల్లి/తూర్పు గోదావరి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారాయన. బాధితులను చూసి కాన్వాయ్ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నలుగురు బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం అందించారు జిల్లా కలెక్టర్ మాధవీలత. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా సీఎం వైఎస్ జగన్ స్పందించడం జీవితాంతం మరువలేమంటున్నారు. సాయి గణేష్ లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న సాయి గణేష్ తండ్రి, తక్షణ సహాయానికి హామీనిచ్చిన సీఎం సి. డయానా శాంతి నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి స్పైనల్ మస్క్యులర్ వ్యాధితో బాధపడుతోంది. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న తల్లి సూర్యకుమారి. తక్షణ సహాయానికి హమీనిచ్చిన సీఎం. సిరికొండ దుర్గా సురేష్ రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ తన కుమార్తెకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుందని, తనకు 8 నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్ గా చేస్తున్న ఉద్యోగం కూడా పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వి. అమ్మాజి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గూడపల్లికి చెందిన అమ్మాజి తన కుమారుడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చింది. అమ్మాజి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. -
హృదయాన్ని కదిలించే క్షణం: అపురూపమైన ఆలింగనం
న్యూఢిల్లీ: కేరళలోని వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పర్యటించి పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్‌తో కలసి ఒక కేఫ్‌లో కూర్చొన్నారు. ఇంతలో అక్కడికి ఒక వృద్ధ మహిళ వచ్చింది. వెంటనే రాహుల్ ఆమె మనతో ఎందుకు కూర్చొదు..అంటూ వేణుగోపాల్‌ని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ సీనియర్ నాయకుడు ఆ మహిళకు రాహుల్ భావనను అనువదించి ఆ వృద్ధ మహిళకి చెప్పారు. అంతేకాదు ఆమెకు తమ ప్లేట్లోని ఆహారాన్ని కూడా రాహుల్ స్వయంగా అందించారు. ఆ తర్వాత ఆమె రాహుల్ గాంధీ చెంపను ప్రేమతో తాకి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ అపురూపమైన ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు.."ఇది మాటలతో నిర్వచించలేని ప్రేమపూర్వకమైన ఆరాధన" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నిజమైన నాయకుడు నిస్వార్థంగా తన ప్రజల కోసం, దేశం కోసం పనిచేసినప్పుడూ, పోరాడినప్పుడూ ఇలాంటి ప్రేమపూర్వకమైన అభిమానాన్ని అందుకుంటారని కూడా ట్వీట్ చేసింది. Unscripted pure love and adoration - this is what a true leader receives when he selflessly works and fights for his people and his country. pic.twitter.com/4cbU0Khxce — Congress (@INCIndia) July 3, 2022 (చదవండి: తుపాను కారణంగా రెండుగా ముక్కలైన ఓడ...12 మంది మృతి) -
చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది...
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైంది. నిందితుడు బాలికను తనతో పాటు తీసుకెళ్తుండగా కారు ఓ చోట ట్రాఫిక్‌లో ఆగింది. అతడి చెర నుంచి బయటపడాలని భావించిన బాలిక తన చేతులతో పదే పదే ఒక సైగ చేయసాగింది. ఆమె చేతి సైగను గమనించి, అర్థం చేసుకున్న కొందరు విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు మైనర్ని కాపాడి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. నోరు విప్పకుండా.. అరవకుండా.. కేవలం ఓ సైగ ద్వారా సదరు బాలిక తన జీవితాన్ని కాపాడుకుంది. ఆ వివరాలు.. నార్త్ కరోలినాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం తన బంధువు అయిన నిందితుడితో కలిసి బయటకు వెళ్లింది. నమ్మి వెంట వచ్చిన బాలికను కిడ్నాప్ చేశాడు నిందితుడి. బయటకు వెళ్లిన కుమార్తె రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. బాధితురాలి అసభ్య ఫోటోలతో ఆమెను బెదిరించసాగాడు కిడ్నాపర్. ఈ క్రమంలో ఓ రోజు నిందితుడు సదరు బాలికను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. (చదవండి: 18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు) ఓ చోట కారు ట్రాఫిక్‌లో ఆగింది. అతడి చెర నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న బాలిక.. చుట్టూ ఉన్న వ్యక్తులకు తన పరిస్థితిని వివరించడం కోసం చేతితో ప్రత్యేక సైగ చేయసాగింది. బొటనవేలిని ముడిచి.. మిగతా వెళ్లను ఎత్తి.. ఆ తర్వాత వాటిని బొటన వేలు మీదుగా బిగించి చూపించే ఆ సైగకు తాను గృహహింస బాధితురాలినని.. సాయం చేయాల్సిందిగా అర్థం. ఈ సైగ టిక్‌టాక్‌లో చాలా ట్రెండ్ అవ్వడంతో ఆమె సైగలు గమనించిన కొందరు విషయాన్ని పోలీసులకు తెలిపారు. (చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ) వారు నిందితుడి కారును వెంబండించి.. బాలికను కాపాడారు. నిందితుడి మొబైల్‌ని స్వాధీనం చేసుకుని చూడగా.. దానిలో బాలిక అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: కాబూల్‌లో భారతీయుని అపహరణ ! -
టచ్ చేయక్కర్లేదు.. కంటి చూపు చాలు.. గూగుల్ కొత్త టెక్నాలజీ
ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అందులోని బటన్లను గట్టిగా నొక్కాల్సి వచ్చేది, స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా టచ్ చేస్తే చాలు పని జరిగిపోతుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి టచ్ చేయకుండా కేవలం ముఖ కవళికలు, సంజ్ఞలతోనే ఫోన్లను ఆపరేట్ చేసేలా సరికొత్త ఆప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 (స్నో కోన్) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ 12లో యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను పొందు పరుస్తున్నారు. దీని సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. అయితే ఈ కమాండ్స్‌ను ఫోన్ గుర్తించాలటే కెమెరా అన్ని వేళలా ఆన్‌లో ఉంటుంది. ఈ మేరకు కెమెరా స్విచెస్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ 12 వెర్షన్లో గూగుల్ డెవలప్ చేస్తోంది. ఆండ్రాయిడ్ 12 అందుబాటులోకి వస్తే ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే.. నోరు తెరవడం, కుడిఎడమలకు, కిందికి పైకి చూడడం వంటి గెశ్చర్స్తోనే హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి పనులు చేయవచ్చు. చదవండి : Facebook: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్
బెల్గ్రేడ్: జాత్యంహకారం, సెక్సీయెస్ట్ కామెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లపై వేటు పడుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు పాత ఘటనల్ని సైతం తవ్వి తీసి.. విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో సెర్బియన్ వాలీబాల్ ప్లేయర్ ఒకరు.. కోర్టులోనే జాత్యహంకార ధోరణిని ప్రదర్శించి వేటుకి గురైంది. జూన్ 1న థాయ్‌లాండ్, సెర్బియా మహిళా జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో సంజా జుర్డ్జెవిక్ అనే సెర్బియన్ ప్లేయర్.. థాయ్‌లాండ్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ సైగ చేసింది. ఇది థాయ్ ఆటగాళ్లు పట్టించుకోకపోయినా.. ఆమె అలా చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో అగ్గిరాజుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. తాను మ్యాచ్ ముగిశాకే థాయ్‌లాండ్ టీంకు క్షమాపణలు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెప్తున్నానని ప్రకటించింది. అయినా వివాదం చల్లారక పోవడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 16 వేల పౌండ్ల ఫైన్ కూడా విధించింది ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్. ఈ జరిమానాను యాంటీ డిస్క్రిమినేషన్ ఛారిటీకి లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయాలని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సెర్బియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా క్షమాపణలు చెప్పింది.ఇంతకుముందు 2017లో సెర్బియన్ వాలీబాల్ టీం యూరోపియన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత.. ఇలాంటి చేష్టలకే పాల్పడి విమర్శలు ఎదుర్కొంది. 2008లో స్పానిష్ బాస్కెట్‌బాల్ టీం, 2017లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం. చైనా వాళ్లను అవహేళన చేస్తూ కళ్లను చిన్నవి చేసి ఫొటోలు దిగి విమర్శలపాలయ్యాయి. చదవండి: ఫ్రస్ట్రేషన్ ట్వీట్లపై సారీ! -
మాటరాని మౌనమిది..!
సాక్షి, గుంటూరు: లక్షలాది జీవరాసుల్లో మానవుడికి మాత్రమే దక్కిన అదృష్టం మాట్లాడటం. కానీ ఓ వ్యక్తి మాత్రం మూడు దశాబ్దాలుగా మాట్లాడటం మానివేసి మౌనమునిగా మారిపోయాడు. అదేమంటే విలువైన మాటను పొదుపు చేయాలని సాధన చేశా.. అది శాశ్వతంగా అలవాటైందని సైగలు, చిటికెల శబ్దాలు, చేతిరాతతో చెప్పుకొచ్చాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామంలోని కశిందుల పూర్ణచంద్రరావు ఇంట్లోకి వెళితే మూగసైగలే కనిపిస్తాయి. అంతమాత్రాన ఆ ఇంట్లో మూగవాళ్లు ఎవరైనా ఉన్నారనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ ఇంట్లోని వారందరికీ మాటలు వచ్చు. కానీ ఇంటి పెద్ద అయిన పూర్ణచంద్రరావు గత 30 ఏళ్లుగా మాట్లాడకుండా కేవలం సైగలు, చిటికెల శబ్దాలతోనే కాలం గడుపుతూ వస్తున్నారు. పూర్ణచంద్రరావు, ధనలక్ష్మి దంపతులకు నలుగురు పిల్లలు. వీరిలో వెంకట సత్యభీమలింగేశ్వరరావు, బసవశంకర్, సుధారాణి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుండగా.. చిన్నకుమార్తె యశోద తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తండ్రి నోటి నుంచి ఒక్కచిన్నమాట కూడా వారి చెవిన పడలేదు. వారికి ఏం కావాలో కూడా సైగలు, చేతిరాత ద్వారానే పూర్ణచంద్రరావు కనుక్కునేవారు. పిల్లలు ఫోన్ చేసినా.. వారు చెప్పింది వినడమే గానీ వారి మాటలకు మాత్రం బదులు చెప్పరు. ఏదైనా చెప్పాలనుకుంటే భార్యకు చేతిరాతతో వివరించి.. ఆమె ద్వారా పిల్లలకు సమాధానమిస్తారు. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తే.. ‘విలువైన దానిని దాచుకోవడం అందరూ చేసేదే కదా! ధనం కంటే మాటకే విలువ ఎక్కువ అని భావించాను. మొదట్లో పొదుపుగా మాట్లాడేవాణ్ని. రానురానూ అసలు మాట్లాడటమే మానివేశాను’ అని పూర్ణచంద్రరావు పేపర్ మీద రాసి చూపించారు. తనకు గురువైన సూర్యానంద సరస్వతి స్వామి(బొగ్గులకొండ స్వామి) మౌనంగా ఉండాలని ఉపదేశించడంతో ఆయన్ని అనుసరించానని చెప్పుకొచ్చారు. ‘1982లో చిన్న గురువు మారుతికుమార్తో సూర్యానంద సరస్వతి స్వామి కోటప్పకొండలో బ్రహ్మోపదేశం చేయించారు. అప్పటి నుంచి మౌనంగా ఉండటం మొదలుపెట్టాను. దేవుడిపై భారం వేసి జీవనం సాగించాను. ఆయన దయ వల్ల పిల్లలందరూ స్థిరపడ్డారు’ అని పేపర్‌పై రాసి చూపించారు. మొదట్లో ఇబ్బందిగా ఉండేది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైగలు చేస్తుంటే మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. క్రమక్రమంగా ఆయన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు సైగల ద్వారా, చిటికెల ద్వారా ఆయన ఏం చెబుతున్నారో కూడా నాకు ఇట్టే అర్థమవుతోంది. మాట్లాడాలని మేము కూడా ఆయన్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. – ధనలక్ష్మి, భార్య హేళన చేసినా.. పట్టించుకోలేదు మా నాన్న సైగలు చేస్తుంటే గ్రామస్తులు హేళన చేసేవారు. ఏది పడితే అది మాట్లాడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కంటే.. నాన్నలా మౌనంగా ఉండటం గొప్పగా అనిపించింది. నాన్నను చూసి పూర్తిగా మౌనం పాటించలేకపోయినా.. తక్కువ మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. – సుధారాణి, కుమార్తె -
అద్భుతం.. భరతనాట్యం
బంజారాహిల్స్ అద్బుతమైన నాట్యంతో భరతనాట్య కళాకారిణి కిరణ్మయి మడుపు నాట్యప్రియులను కట్టిపడేసారు. శుక్రవారం బంజారాహిల్స్ సప్తపర్ణిలో ‘ మార్గం ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పలు కీర్తనలకు ఆకట్టుకునే అభినయంతో చేసిన నాట్యం ఆహుతులును ఉర్రూతలూగించింంది. కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి , బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి, హైదరాబాద్ పాస్ ఎడిటర్ సర్వాని పొన్నం పాల్గొన్నారు. -
‘సైగల’తో సంఘీభావం
బధిరుడైన క్లాస్‌మేట్‌కు సంఘీభావం తెలపాలనుకున్నారు ఆ పిల్లలు. దీనికోసం వాళ్లు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కొద్ది నెలల్లోనే పట్టుదలతో సైగల భాష నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లందరూ బధిరుడైన తమ క్లాస్‌మేట్‌తో ఇంచక్కా సైగల భాషతో రోజూ తెగ కబుర్లాడేసుకుంటున్నారు. బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా రాజధాని సారాజెవోలోని నకాస్ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరేళ్ల జెజ్ద్ ఒకటో తరగతిలో చేరాడు. అతడు పుట్టుకతోనే బధిరుడు. అలాగని ఆ పాఠశాల మూగ బధిరుల కోసం ప్రత్యేకించినదేమీ కాదు. మామూలు విద్యార్థులు చదువుకునే పాఠశాలే. దగ్గర్లో మరే పాఠశాల లేకపోవడంతో జెజ్ద్ను అతడి తల్లి ఆ పాఠశాలలో చేర్చడానికి తీసుకొచ్చింది. టీచర్లకు అతడి పరిస్థితిని వివరించింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, అతడిని చేర్చుకున్నారు. కొత్తగా వచ్చిన జెజ్ద్తో స్నేహంగా ఉండాలంటూ మిగిలిన పిల్లలకు చెప్పారు. మిగిలిన పిల్లలు కూడా అతడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ల మాటలేవీ అతడికి వినిపించకపోవడంతో మొదట్లో కాస్త నిరుత్సాహం చెందారు. అతడి సైగల భాష వాళ్లకు అర్థం కాకపోవడంతో కొన్నాళ్లు వాళ్లు అయోమయం చెందేవాళ్లు. పిల్లల ఇబ్బందిని గమనించిన వాళ్ల టీచర్ సనేలాకు ఒక ఐడియా వచ్చింది. జెజ్ద్కు ఎలాగూ మాటలు వినిపించవు కదా, అందుకే తాను సైగల భాష నేర్చుకోవడానికి సిద్ధపడింది. మిగిలిన పిల్లలను కూడా సైగల భాష నేర్చుకునేలా ప్రోత్సహించింది. కొద్ది నెలల్లోనే వాళ్లు సైగల భాషను నేర్చేసుకున్నారు. తన కోసం తన క్లాస్మేట్స్ అందరూ సైగల భాష నేర్చుకోవడంతో జెజ్ద్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక అప్పటి నుంచి క్లాస్‌లో సందడే సందడి. -
అసలు సిసలు ప్రేయసీ!
టీవీ టైమ్ కుటుంబ కలహాలు, బాంధవ్యాల మధ్య విభేదాలు, ప్రేమ కోసం పోరాటాలు, పగలు ప్రతీకారాలు... ఏ సీరియల్ అయినా ఉండేవి ఇవే. కానీ వాటిని ఎంత డిఫరెంట్‌గా చూపించాం, ఎంత కొత్తగా అల్లుకున్నాం అన్నదాని మీదే సక్సెస్ ఆధారపడివుంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని తీసినట్టుగా ఉంటుంది ‘ఇది ఒక ప్రేమకథ’ సీరియల్. ఎన్ని ప్రేమకథలు చూడలేదు? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, అంతస్తుల భేదాల వల్ల వారి ప్రేమలో అవరోధాలు ఏర్పడటం, ఆ తర్వాత రకరకాల సమస్యలు... చాలా సీరియళ్లు ఇలా నడిచాయి. అయితే ‘ఇది ఒక ప్రేమకథ’లో మాత్రం పాత్రల చిత్రణ బాగుంది. హీరో సాఫ్ట్ నేచర్, హీరో తల్లిగా జ్యోతి అద్భుతమైన అభినయం, చక్కని సంభాషణలు కలగలసిన ధారావాహిక అది. ఉత్కంఠను రేకెత్తించే కథనం కూడా బలాన్ని చేకూరుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ శ్రీవాణి తన పాత్రకి చక్కగా సరిపోయింది. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయింది. స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే సున్నితత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ మార్కులు కొట్టేస్తోంది. అసలు ప్రేయసి అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేస్తోంది. అందుకే ఆ సీరియల్ సక్సెస్‌లో శ్రీవాణి భాగం కాస్త ఎక్కువే!