
ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అందులోని బటన్లను గట్టిగా నొక్కాల్సి వచ్చేది, స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా టచ్ చేస్తే చాలు పని జరిగిపోతుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి టచ్ చేయకుండా కేవలం ముఖ కవళికలు, సంజ్ఞలతోనే ఫోన్లను ఆపరేట్ చేసేలా సరికొత్త ఆప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 (స్నో కోన్) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
గూగుల్ ఆండ్రాయిడ్ 12లో యాక్సెసిబిలిటీ ఫీచర్ను పొందు పరుస్తున్నారు. దీని సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. అయితే ఈ కమాండ్స్‌ను ఫోన్ గుర్తించాలటే కెమెరా అన్ని వేళలా ఆన్‌లో ఉంటుంది. ఈ మేరకు కెమెరా స్విచెస్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌లో గూగుల్ డెవలప్ చేస్తోంది.
ఆండ్రాయిడ్ 12 అందుబాటులోకి వస్తే ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే.. నోరు తెరవడం, కుడిఎడమలకు, కిందికి పైకి చూడడం వంటి గెశ్చర్స్‌తోనే హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి పనులు చేయవచ్చు.
చదవండి : Facebook: ఫేస్‌బుక్‌లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్
Comments
Please login to add a commentAdd a comment