ఈ రోజు టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. తప్పకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడకుండా ఉండలేము. అంతలా ఎదిగిన ఈ ఏఐను దిగ్గజ కంపెనీలు సైతం మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ నిపుణుడు 'నోమ్ షజీర్'ను తిరిగి నియమించుకోవడానికి భారీ మొత్తంలో ఆఫర్ చేసింది.
గూగుల్ కంపెనీ నోమ్ షజీర్‌ను తిరిగి నియమించుకోవడానికి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఈయన మళ్ళీ గూగుల్ జెమినీలో పనిచేయడానికి జాయిన్ అవుతున్నట్లు సమాచారం.
నిజానికి నోమ్ షజీర్ గూగుల్ మాజీ ఉద్యోగి. ఈయన 2000లో గూగుల్ కంపెనీలో పనిచేశారు. అప్పట్లోనే తన సహోద్యోగి డేనియల్ డి ఫ్రీటాస్‌తో కలిసి డెవలప్ చేసిన ‘చాట్ బాట్’ను విడుదల చేయాలన్నఅభ్యర్థనను కంపెనీ తిరస్కరించడంతో.. 2021లో గూగుల్ వదిలి వెళ్లారు.
ఇదీ చదవండి: నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రా
నోమ్ షజీర్, డేనియల్ డి ఫ్రీటాస్ Character.AI కనుగొన్నారు. ఇది అతి తక్కువ కాలంలోనే సిలికాన్ వ్యాలీలో గొప్ప ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా మారింది. ఇది గతేడాది ఒక బిలియన్ విలువకు చేరుకుంది. ఆ తరువాత వీరిరువురు గూగుల్ ఏఐ యూనిట్ డీప్‌మైండ్‌లో చేరుతున్నట్లు గూగుల్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment