ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్‌లో టెక్ దిగ్గజం గూగుల్ వెనుకపడి ఉంది. దీనికి ప్రధాన కారణం రిమోట్ వర్క్ & కాంపిటీటివ్ డ్రైవ్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ప్రాధాన్యమివ్వడమే అని గూగుల్ మాజీ సీఈఓ 'ఎరిక్ స్మిత్' (Eric Schmidt) ఆరోపించారు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎరిక్ స్మిత్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి స్టార్టప్‌లు ఏఐ రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయని వెల్లడించారు. అయితే గూగుల్ ఏఐ రంగంలో విజయం సాధించడం కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, త్వరగా ఇంటికి వెళ్లడం & వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి చాలా ముఖ్యమని గూగుల్ భావించిందని ఆయన అన్నారు.
2001 నుంచి 2011 వరకు గూగుల్ సీఈఓగా వ్యవహరించిన ఎరిక్ స్మిత్ వేగవంతమైన సాంకేతిక పరిశ్రమలో పోటీ పడేందుకు అవసరమైన విధానాలను గురించి వెల్లడించారు. ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి లేదా అనువైన షెడ్యూల్‌లను నిర్వహించడానికి అనుమతించడం వల్ల ప్రత్యర్థుతో పోటీ పడలేమని పేర్కొన్నారు.
గతంలో స్మిత్ ఆఫీస్ నుంచి పని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సమర్థవంతమైన నిర్వహణను నిర్మించడానికి.. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది కీలకమని వాదించారు. అయిత్ గూగుల్ ప్రస్తుత పని విధానాలు స్మిత్ క్యారెక్టరైజేషన్‌కు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో చాలామంది ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment