Eric Schmidt
-
ఏఐ రంగంలో వెనుకపడ్డ గూగుల్.. కారణం ఇదే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్‌లో టెక్ దిగ్గజం గూగుల్ వెనుకపడి ఉంది. దీనికి ప్రధాన కారణం రిమోట్ వర్క్ & కాంపిటీటివ్ డ్రైవ్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ప్రాధాన్యమివ్వడమే అని గూగుల్ మాజీ సీఈఓ 'ఎరిక్ స్మిత్' (Eric Schmidt) ఆరోపించారు.స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఎరిక్ స్మిత్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి స్టార్టప్‌లు ఏఐ రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయని వెల్లడించారు. అయితే గూగుల్ ఏఐ రంగంలో విజయం సాధించడం కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, త్వరగా ఇంటికి వెళ్లడం & వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి చాలా ముఖ్యమని గూగుల్ భావించిందని ఆయన అన్నారు.2001 నుంచి 2011 వరకు గూగుల్ సీఈఓగా వ్యవహరించిన ఎరిక్ స్మిత్ వేగవంతమైన సాంకేతిక పరిశ్రమలో పోటీ పడేందుకు అవసరమైన విధానాలను గురించి వెల్లడించారు. ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి లేదా అనువైన షెడ్యూల్‌లను నిర్వహించడానికి అనుమతించడం వల్ల ప్రత్యర్థుతో పోటీ పడలేమని పేర్కొన్నారు.గతంలో స్మిత్ ఆఫీస్ నుంచి పని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సమర్థవంతమైన నిర్వహణను నిర్మించడానికి.. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది కీలకమని వాదించారు. అయిత్ గూగుల్ ప్రస్తుత పని విధానాలు స్మిత్ క్యారెక్టరైజేషన్‌కు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో చాలామంది ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుంది. -
ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..
ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాయి. అయితే ఈ 'ఏఐ' టెక్నాలజీ మానవాళికి ముప్పు తీసుకువస్తుందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ హెచ్చరించారు. తప్పకుండా దీనిని నియంత్రించాలి. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల వార్డ్రోట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో ఎరిక్ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి హెచ్చరించారు. సరైన మార్గంలో ఉపయోగించుకునేంత వరకు దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఒక్కసారి అనవసర విషయాల్లో ఉపయోగించడం మొదలుపెడితే అది చాలా ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అణు సాంకేతికతతో సమానమని, ఒక స్థాయిలో దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలైన ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ అధినేతలతో పాటు బ్రిటన్ ప్రధాని పాల్గొన్న ఈ సమావేశంలో ఎరిక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎరిక్ స్మిత్ గూగుల్ సంస్థకు 2001 నుంచి 2011 వరకు సీఈఓగా పనిచేసి, ఆ తరువాత 2015 నుంచి 2017 వరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. (ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో తప్పకుండా దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సాంకేతికత వల్ల భవిష్యత్తులో కలిగే దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్ర రావడం లేదని పిచాయ్ అన్నాడు. బిల్ గేట్స్ కూడా దీనినే అంగీకరించాడు. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందనేది అంతు చిక్కని ప్రశ్న. -
గూగుల్ బోర్డు నుంచి ష్మిట్ నిష్క్రమణ
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ సంస్థ గూగుల్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ తాజాగా ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. జూన్‌లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. గతేడాది తొలినాళ్లలోనే ఆల్ఫాబెట్ చైర్మన్ పదవి నుంచి ష్మిట్ తప్పుకున్నారు. ఆతర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పటికీ .. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. జూన్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. అటుపైన రీ–ఎలక్షన్ కోరరాదని ష్మిట్ నిర్ణయించుకున్నారని, సాంకేతికాంశాల్లో తగు సలహాలు ఇవ్వడం కొనసాగిస్తారని ఆల్ఫాబెట్ పేర్కొంది. ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ష్మిట్‌ను సీఈవోగా 2001లో గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ రిక్రూట్ చేశారు. అప్పటికి గూగుల్ ప్రారంభమై మూడేళ్లే అయింది. ఆ తర్వాత నుంచి సంస్థను భారీగా విస్తరించటంలో పేజ్, బ్రిన్‌లతో పాటు ష్మిట్ కీలక పాత్ర పోషించారు. 2001 నుంచి 2011 దాకా గూగుల్ సీఈవోగా వ్యవహరించారు. తర్వాత ష్మిట్ స్థానంలో పేజ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అటుపై గూగుల్‌కు ఆల్ఫాబెట్ పేరుతో కొత్తగా మాతృ సంస్థను ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ సీఈవోగా పేజ్, గూగుల్ సీఈవోగా ప్రవాస భారతీయులు సుందర్ పిచాయ్ నియమితులయ్యారు. -
మరో గూగుల్‌ని తయారుచేసే సత్తా భారతీయులకి ఉంది
న్యూయార్క్: భారత ఔత్సాహిక ఆవిష్కర్తలకు గూగుల్ లాంటి మరో దిగ్గజాన్ని రూపొందించే సామర్థ్యం ఉందని సెర్చి ఇంజిన్ గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిట్ వ్యాఖ్యానించారు. ‘సిలికాన్ వ్యాలీలో అనేక మంది భారతీయులు సత్తా చాటుతున్నారు. అలాంటప్పుడు యువ ఆవిష్కర్తలు ఒకవేళ స్వదేశంలోనే ఉండి దిగ్గజాల్లాంటి కంపెనీలను సృష్టిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. వారు ప్రపంచాన్నే మార్చేయగలరు’అంటూ కితాబిచ్చారు. అయితే, ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువగా ఉందని, దీన్ని ఇంకా పెంచాల్సి ఉందని ‘రీఇమేజినింగ్ ఇండియా’ పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశీయంగా మహిళలకు ఇంటర్నెట్‌ని చేరువ చేసే చర్యల్లో భాగంగా గూగుల్... హెచ్డబ్ల్యూజీవోడాట్కామ్ వెబ్‌సైట్‌ని రూపొందించింది. ఇందులో ఇంటర్నెట్ ప్రాథమికాంశాల గురించి హిందీ, ఇంగ్లిష్‌లో కంటెంట్ ఉంటుందని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. అలాగే, ఇంటర్నెట్ సంబంధిత సందేహాలు తీర్చేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా ‘1800 41 999 77’ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రారంభించినట్లు వివరించారు.