ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌ వెరీ డేంజర్‌ గురూ! | AI Girlfriends or Boyfriends Could Be Dangerous Says Eric Schmidt | Sakshi
Sakshi News home page

ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌ వెరీ డేంజర్‌ గురూ!

Published Thu, Nov 28 2024 6:21 PM | Last Updated on Thu, Nov 28 2024 8:07 PM

AI Girlfriends or Boyfriends Could Be Dangerous Says Eric Schmidt

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గూగుల్ మాజీ సీఈఓ 'ఎరిక్ స్మిత్' (Eric Schmidt) ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఏఐతో భావోద్వేగ బంధాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, అది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదానికి దారి తీస్తుందని అన్నారు.

ఒంటరిగా ఉన్న వారికోసం రూపొందించిన ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌ లేదా బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ యువతను ఆకర్షిస్తున్నాయి. వీటికి ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అయ్యేవారు మునుపటికంటే ఎక్కువ ఒంటరితనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని ఎరిక్ స్మిత్ హెచ్చరించారు.

ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే హోస్ట్ చేసిన పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో.. ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌లపై ఎరిక్ స్మిత్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి లేదా సరదా కోసం యువత ఏఐని ఆశ్రయిస్తున్నారు. చూడటానికి అందంగా ఉన్న ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌ లేదా బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ వారిని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ కారణంగానే వాటితోనే గంటల తరబడి సమయాన్ని గడిపేస్తారు. దీంతో వారు బాహ్య ప్రపంచానికి దూరమైపోతారని స్మిత్ అన్నారు.

ఇదీ చదవండి: రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్‌ ఏం చేశారంటే?

12 నుంచి 13 సంవత్సరాల పిల్లలు వీటికి చాలా తొందరగా కనెక్ట్ అవుతున్నారు. వారి ఆలోచనలను కూడా ఏఐ కంట్రోల్ చేస్తోంది. చివరికి వారు ఏఐతో ప్రేమలో పడటం.. సూసైట్ చేసుకోవడం వంటివి కూడా చేస్తారు. ఫ్లోరిడాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించిన తర్వాత తన ప్రాణాలను తీసుకున్న విషాదకరమైన కేసు కూడా వెలుగులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement