చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ఆఫీసులో తాము ఎదుర్కుంటున్న పని ఒత్తిడి, బాస్ టార్చర్ వంటి సమస్యలను గురించి పేర్కొంటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా ఒక ఉద్యోగి ఆఫీసులో సృష్టించిన అల్లకల్లోలం గురించి.. కంపెనీ ఓనర్ వెల్లడించారు.
ఇటీవల ఉద్యోగంలో చేరిన లిలీ అనే 26ఏళ్ల ఉద్యోగి.. ప్రారంభంలో చాలా చురుగ్గా ఉండేది. అయితే కొన్ని సార్లు ఆఫీసులో పాటించాల్సిన నియమాలను పాటించేది కాదు. అయితే ఓ పనిమీద నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో లిలీ ఆఫీసులోని అందరికీ పార్టీ ఇచ్చింది. దీనికోసం కంపెనీ క్రెడిట్ కార్డును ఉపయోగించి 2000 డాలర్లు (దాదాపు రూ. 1.70 లక్షలు) ఖర్చు చేసింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, అందుకే అందరికీ ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్నాను, అందరూ తప్పకుండా రావాలని లిలీ మెయిల్ చేసి.. అందరికీ పార్టీ ఇచ్చిందని ఆ కంపెనీ మహిళా ఓనర్ రెడ్డిట్ వేదికగా వెల్లడించింది.
ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని పార్టీ ఇచ్చిన లిలీ.. జాబ్‌కు రిజైన్ చేయలేదు. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చాక.. ఆఫీసులో జరిగిన అల్లకల్లోలం గురించి తెలుసుకున్నాను. దీనికి కారణమైన లిలీని పిలిచి.. ఆఫీసులో పార్టీ ఏంటి? దీనికి కంపెనీ డబ్బును ఎందుకు ఉపయోగించావని అడిగాను. దీనికి ఆమె బదులిస్తూ ఇదొక 'సోషల్ ఎక్స్‌పర్‌మెంట్' అని చెప్పింది.
ఆఫీసులో ఎక్స్‌పర్‌మెంట్ ఏమిటి? అని అడిగితే.. నేను రాజీనామా చేసి వెళ్లే సమయంలో పార్టీ ఇస్తే ఎంతమంది వస్తారో అని తెలుసుకోవడానికి అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలతో చిర్రెత్తిపోయిన బాస్.. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేసింది.
నేను లిలీను తొలగించడం కరెక్టేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లను అడిగింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. లిలీపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టమని కొందరు చెబుతున్నారు. ఆమె నమ్మక ద్రోహం చేసిందని మరికొందరు పేర్కొన్నారు. కంపెనీ డబ్బుతో లిలీ ఎంజాయ్ చేసింది.. మీరు కాబట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరో కంపెనీలో అయితే ఆమెపై కఠినమైన చర్యలు తీసుకుని ఉండేవారని ఇంకొందరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment