నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రా | Anand Mahindra Tweet About Floating House in Water | Sakshi
Sakshi News home page

నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రా

Published Fri, Sep 27 2024 6:54 PM | Last Updated on Fri, Sep 27 2024 7:43 PM

Anand Mahindra Tweet About Floating House in Water

పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. నీటిపై తేలియాడే ఇంటిని చూడవచ్చు. దీనిని మొత్తం నేచురల్ మెటీరియల్స్ ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కుమార్ అనే ఇంజినీర్.. వర్షాలు పడినప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఉండాలని అలోచించి ఇలాంటి ఓ అద్భుతమైన నిర్మాణం రూపొందించారు.

ఇలాంటి ఇల్లు డిజైన్ చేయాలని 2020లోనే అనుకున్నట్లు.. ఆ తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ ఇంటికి కరెంట్ కోసం సోలార్ ప్యానెల్స్ కూడా సెట్ చేసి ఉండటం వీడియోలో చూడవచ్చు. ఇల్లు పూర్తిగా నీటిపైన తేలడానికి అవసరమైనవన్నీ ప్రశాంత్ ఉపయోగించారు.

ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం

ఈ వీడియో షేర్ చేస్తూ.. వాతావరణ మార్పుల వల్ల జీవితాల్లో ఏర్పడే అంతరాయాలను పరిష్కరించడానికి ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇలాంటి ఆవిష్కరణలు కనిపిస్తాయి. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రశాంత్‌ను సంప్రదిస్తాను, నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలనో చూస్తానని ఆనంద్ మహీంద్రా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement