Android 12
-
ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలా?
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్‌ల కోసం ఓలా లేదా ఉబర్‌లో బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కోసం ఉపయోగించిన ఫోన్ మోడల్‌ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్ నుంచి బుక్ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంబంధిత యాప్‌ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్‌లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి బుక్ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది. చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్‌లు బుక్ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్‌లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు. -
ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా..అదరగొట్టేస్తున్నాయ్!
ప్రస్తుతం అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఓఎస్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ నడుస్తోంది. అయితే త్వరలో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్డేట్ అవుతుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి.ఆ రిపోర్ట్‌ల ఆధారంగా ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మేలో గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక ఈ ఆండ్రాయిడ్ 13 వెర్షన్లో ఉన్న సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం. యాడ్స్‌కు చెక్ పెట్టొచ్చు స్మార్ట్ ఫోన్లో బ్రౌజింగ్ చేసే సమయంలో కొత్త కొత్త వెబ్సైట్లను ఓపెన్ చేస్తుంటాం. ఆ సమయంలో మన పర్మీషన్ లేకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు మన ఫోన్‌కు వస్తుంటాయి. చిరాకు పెట్టిస్తుంటాయి. కానీ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్ డేట్‌తో పర్మీషన్ లేకుండా నోటిఫికేషన్ లు మన ఫోన్‌కు రాలేవు. పైగా నోటిఫికేషన్ కావాలని ఎనేబుల్ చేసినా , బ్లాక్ చేయాలంటే ఈజీగా బ్లాక్ చేయొచ్చు. లాంగ్వేజ్ కూడా ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఆండ్రాయిడ్ 13లో అలా కాదు. యూజర్ ఒక్కసారి యాప్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో లాంగ్వేజ్ మార్చుకుంటే..ఆ లాంగ్వేజ్‌లో కంటెంట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్13లో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఆండ్రాయిడ్ 13వెర్షన్ ఈ సంవత్సరంలో మే, సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ అనూహ్యంగా ఓఎస్ ఫీచర్లు లీకవ్వడంతో ఆండ్రాయిడ్ 13వెర్షన్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు టెంప్ట్ అవుతున్నారు. చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు! -
గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్‌కి ఎదురే లేదు. యాపిల్ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానం చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్‌కి పోటీగా హువావే, శామ్సంగ్, వన్‌ప్లస్‌లు కొత్త ఓఎస్‌లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్ ముందు నిలవలేకపోయాయి. కాగా గూగుల్ సరికొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 12 రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. స్నో కోన్ రెండేళ్ల గ్యాప్ తర్వాత గూగుల్ మరోసారి పాత సంప్రదాయం కొనసాగించేందుకు రెడీ అయ్యింది. మరోసారి తమ అప్డేట్లకు ఐస్‌క్రీమ్‌ల పేరు పెట్టే సంప్రదాయం కొనసాగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా త్వరలో రిలీజ్ కాబోతున్న గూగుల్ అప్డేట్కి స్నోకోన్గా పేరు పెట్టింది. ముందుగా పిక్సెల్ ఎప్పటిలాగే పిక్సెల్ ఫోన్లకే ముందుగా స్నోకోన్ అప్డేట్ని అందివ్వనుంది గూగుల్. ఆ తర్వాత ఒప్పో, వన్‌ప్లస్ సంస్థలకు అందివ్వనుంద. ఇక మోటరోలా సైతం ఈ అప్డేట్ని ముందుగా అందుకునే కంపెనీల జాబితాలో ఉంది. స్నోకోన్లో ప్రైవసీ సెట్టింగ్స్, థీమ్స్‌లో కొత్త ఫీచర్లు జోడించినట్టు సమాచారం. 2008లో మొదలు ఫీచర్ ఫోన్లు రాజ్యమేలుతున్న కాలంలో స్మార్ట్ఫోన్లుగా యాపిల్ రంగ ప్రవేశం ఓ సంచలనంగా మారింది. ఆ వెంటనే బ్లాక్‌బెర్రీ మెస్సేజింగ్ యాప్‌తో మార్కెట్లో చొచ్చుకుపోయింది. భవిష్యత్తు ఈ రెండు ఫోన్లదే అనుకునే తరుణంలో 2008 సెప్టెంబరులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో గూగుల్ తెర మీదకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురన్నదే లేకుండా గూగుల్ ఆండ్రాయిడ్ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఐస్‌క్రీమ్‌ల పేరు గూగుల్ 2008 సెప్టెంబరు 23న రిలీజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్‌కి 1.0 పేరుతో కోడ్ నేమ్ ఇచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతీ ఏడు ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొత్త మెరుగులు దిద్దుతూ కొత్త కోడ్ నేమ్‌తో వస్తోంది. రెండో సారి వచ్చిన ఆప్డేటెడ్ ఓఎస్‌కి 1.1 కోడ్ నేమ్ ఇచ్చింది. ఆ తర్వాత 2009లో వచ్చిన మూడో అప్డేట్ నుంచి ఓఎస్‌లకు పలు రకాల ఐస్‌క్రీమ్‌ల పేరుతో కోడ్ నేమ్ ఇవ్వడం మొదలు పెట్టింది గూగుల్. కప్కేక్తో మొదలు 2009 ఏప్రిల్‌లో విడుదలైన ఆపరేటింగ్ సిస్టమ్‌కి కప్కేక్గా కోడ్ నేమ్ ఇచ్చింది గూగుల్. ఆ తర్వాత వరుసగా డోనట్, ఎక్లయిర్స్, ఫ్రోయో, జింజర్‌బ్రెడ్, హనీకోంబ్, ఐస్‌క్రీం శాండ్విచ్, కిట్‌కాట్, లాలీపాప్, మార్ష్‌మాలో, నౌగట్, ఓరియో, పై వరకు వరుసగా తొమ్మిది అప్డేట్లకి ఐస్‌క్రీమ్‌ల పేరు పెట్టింది. టెన్తో బ్రేక్ గూగుల్ అప్డేట్స్కి ఐస్‌క్రీమ్‌ల పేరు పెట్టడంతో ఆండ్రాయిడ్ యూజర్లలో ఎంతో క్రేజ్ వచ్చింది. దీంతో గూగుల్ తదుపరి అప్డేట్కి ఏం పేరు పెడుతుందనే అంశంపై ఆసక్తి పెరిగింది. 9వ అప్డేట్ అయిన పై తర్వాత వచ్చే అప్డేట్కి కోడ్‌నేమ్ క్యూగా ఇచ్చింది గూగుల్. కానీ అప్డేట్ విడుదలైన తర్వాత క్యూ స్థానంలో 10 వచ్చి చేరింది. ఆ తర్వాత అప్డేట్కి సైతం ఐస్‌క్రీం పేరు ఇవ్వకుండా ఆండ్రాయిడ్ 11గానే గూగుల్ పేర్కొంది. చదవండి : 2ఎస్వీ.. ఇక యూజర్ పర్మిషన్ లేకుండానే! హ్యాకర్లకు చుక్కలే! -
టచ్ చేయక్కర్లేదు.. కంటి చూపు చాలు.. గూగుల్ కొత్త టెక్నాలజీ
ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అందులోని బటన్లను గట్టిగా నొక్కాల్సి వచ్చేది, స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా టచ్ చేస్తే చాలు పని జరిగిపోతుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి టచ్ చేయకుండా కేవలం ముఖ కవళికలు, సంజ్ఞలతోనే ఫోన్లను ఆపరేట్ చేసేలా సరికొత్త ఆప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 (స్నో కోన్) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ 12లో యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను పొందు పరుస్తున్నారు. దీని సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. అయితే ఈ కమాండ్స్‌ను ఫోన్ గుర్తించాలటే కెమెరా అన్ని వేళలా ఆన్‌లో ఉంటుంది. ఈ మేరకు కెమెరా స్విచెస్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ 12 వెర్షన్లో గూగుల్ డెవలప్ చేస్తోంది. ఆండ్రాయిడ్ 12 అందుబాటులోకి వస్తే ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే.. నోరు తెరవడం, కుడిఎడమలకు, కిందికి పైకి చూడడం వంటి గెశ్చర్స్తోనే హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి పనులు చేయవచ్చు. చదవండి : Facebook: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
గూగుల్‌లో కొత్త ఫీచర్స్..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ప్రైవసీ సెట్టింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌తో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం బీటా వెర్షన్‌ను ఆవిష్కరించింది. అమెరికాలోని మౌంటెయిన్ వ్యూ క్యాంపస్‌లో వర్చువల్‌గా నిర్వహించిన గూగుల్ ఐ/ఓ 2021 కార్యక్రమంలో వీటిని పరిచయం చేసింది. వీటిని ఈ ఏడాది ప్రవేశపెట్టే ఉత్పత్తుల్లో పొందుపర్చనుంది. ‘‘కోవిడ్–19తో నా మాతృదేశమైన భారత్‌తో పాటు బ్రెజిల్ తదితర దేశాలు ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బోధన, చిన్న వ్యాపార సంస్థల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, అవసరమైన వారికి టీకాలు మొదలైన అత్యవసరాలు సత్వరం అందేందుకు గూగుల్ పలు ఉత్పత్తులు ప్రవేశపెట్టింది. చర్యలు తీసుకుంది’’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సెర్చి, లెన్స్, ఫొటోస్, మ్యాప్స్, షాపింగ్ మొదలైన ఉత్పత్తుల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే కొత్త ఫీచర్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరిన్ని విశేషాలు.. ►గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు ‘‘క్విక్ డిలీట్’’ ఆప్షన్. దీనితో గూగుల్ అకౌంట్ మెనూ ద్వారా ఒక్కసారి ట్యాప్ చేసి 15 నిమిషాల సెర్చి హిస్టరీని డిలీట్ చేసేయొచ్చు. ►మ్యాప్స్ టైమ్‌లైన్‌లో లొకేషన్ హిస్టరీ ఫీచర్. ►గూగుల్ ఫొటోస్‌లో పాస్వర్డ్ రక్షణతో ‘‘లాక్డ్ ఫోల్డర్’’ ఫీచరు. యూజరు ఎంపిక చేసుకున్న ఫొటోలను విడిగా భద్రపర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇవి గ్రిడ్ లేదా షేర్డ్ ఆల్బమ్స్‌లో కనిపించవు. దీన్ని ముందుగా గూగుల్ పిక్సెల్ ఫోన్లలో ఆ తర్వాత మిగతా ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులోకి తెస్తారు. ►2014 తర్వాత డిజైన్పరంగా గణనీయమైన మార్పులు, చేర్పులతో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బీటా వెర్షన్. ఇందులో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. యూజర్ డేటాను ఏయే యాప్స్ తీసుకుంటున్నాయన్న వివరాలను అందించడంతో పాటు యూజర్లకు డివైజ్‌పై మరింతగా నియంత్రణ ఉండేలా ఆండ్రాయిడ్ 12 రూపకల్పన. -
ఆండ్రాయిడ్ 12లో టాప్-5 ఫీచర్స్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన టెక్నాలజీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధానమైనది. ప్రతి ఏడాది వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ వస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోని వచ్చింది. దీనిలో ప్రధానంగా ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్‌ని ఆండ్రాయిడ్ యూజర్స్ కు పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఓఎస్ ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆండ్రాయిడ్ 12కి సంబందించిన కొన్ని ఫీచర్స్ బయటకి వచ్చాయి. వాటిలో ప్రధానమైన 5 ఫీచర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. సరికొత్త థీమ్స్: గతంలో ఉపయోగించిన థీమ్ రంగులకు భిన్నంగా రాబోయే ఆండ్రాయిడ్ 12లో సరికొత్త పరిచయం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘థీమింగ్ సిస్టం’ ఫీచర్‌ను కొత్త వెర్షన్లో తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనితో యూజర్ తనకు నచ్చినట్టు ఓఎస్ థీమ్ రంగుని మార్చుకొనే అవకాశం ఉంది. కొత్త యూఐతో నోటిఫికేషన్స్: ఆండ్రాయిడ్ 12లోని నోటిఫికేషన్ సెంటర్లో కూడా మార్పులు చేస్తున్నారు. ‘మెటీరియల్ నెక్ట్స్’ డిజైన్ ఆకృతితో నోటిఫికేషన్ సెంటర్‌ను తీసుకోని రానున్నారు. ఇందులో యాప్ నోటిఫికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ యాప్స్ అప్డేట్లు సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)తో కనిపిస్తాయి. నోటిఫికేషన్ కోసం ఎక్కువ స్థలం కాకుండా తక్కువ స్థలం తీసుకొనేలా రూపొందించారు.మెసేజింగ్ యాప్‌ల కోసం ప్రత్యేకంగా ‘కన్వర్సేషన్స్’ పేరుతో విడ్జెట్స్ తీసుకొస్తున్నారు. వీటిలో మనం యాప్ ద్వారా చివరిగా ఎవరితో సంభాషించామనేది తెలుస్తుంది. అలా ప్రతి యాప్‌కి ప్రత్యేక విడ్జెట్ ఉంటుందని సమాచారం. సింగల్ హ్యాండ్ మోడ్: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు స్క్రీన్ పెద్దదిగా వస్తున్నాయి. దీంతో కొన్ని సార్లు ఫోన్ వాడటం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఆండ్రాయిడ్ 12లో ‘వన్ హ్యాండ్ మోడ్’ ఫీచర్ పరిచయం చేస్తున్నారు. ఇది ఫోన్ స్క్రీన్ నిలువు సైజ్‌ను తగ్గిస్తుంది. దీని సాయంతో యూజర్ ఫోన్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం: యాపిల్ ఐఓఎస్ తరహాలోనే గూగుల్ ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం ఫోన్ పైభాగం చివర్లో యూజర్‌కి తెలిసేలా ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో చిన్నపాటి గుర్తులు ఉంటాయి. ఆరెంజ్ రంగులో మైక్ సింబల్, గ్రీన్ రంగులో కెమెరా సింబల్ కనిపిస్తాయి. దీని వల్ల మీరు యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుమతి లేకుండా కెమెరా, ఫోన్ మైక్రోఫోన్ పనిచేస్తుంటే సులభంగా తెలిసిపోతుంది. అలాగే వైఫ్ షేర్ చేసుకోవడానికి కొత్తగా క్యూఆర్ కోడ్ ఆప్షన్ తీసుకోని వచ్చింది. దీనితో ఎదుటి వ్యక్తికి పాస్ వర్డ్ షేర్ చేయకుండా క్యూఆర్ కోడ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ స్క్రీన్‌షాట్: 2019లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్ 10, 11 వెర్షన్లో ఈ ఫీచర్‌ను తీసుకురాలేదు. తాజాగా స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్‌ని ఆండ్రాయిడ్ 12లో పరిచయం చేయనున్నారట. దీని సాయంతో యూజర్ స్క్రీన్‌షాట్ తీసిన వెంటనే దానంతటదే ఫోన్ స్క్రీన్ కిందకు జరిగి మరో స్క్రీన్‌షాట్ తీసుకుని రెండింటిని కలిపి చూపిస్తుంది. చదవండి: 16వేలకే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్... గూగుల్ తీసుకొచ్చిన అద్భుతమైన ఈ టెక్నాలజీతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్మార్టుగా తయారైంది అని చెప్పుకోవాలి. ఆండ్రాయిడ్ మొదటి వెర్షన్ 1.0 సెప్టెంబర్ 23, 2008న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మొబైల్ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 11లో ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేశారు. ప్రస్తుతం ఇంకా ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అందరి స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి రానప్పటికీ అప్పుడే తర్వాత రాబోయే ఆండ్రాయిడ్12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12కు చెందిన కొన్ని ఫీచర్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికి గూగుల్ పిక్సల్, ఆండ్రాయిడ్ వన్ తో పాటు ఇతర స్మార్ట్ఫోన్లలో దీనిని తీసుకొనిరానున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పతులలో వినియోగిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆండ్రాయిడ్ 12 లీకైన స్క్రీన్షాట్లను గమనిస్తే ప్రధానంగా యూఐ, సెక్యూరిటీ విషయంలో దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గూగుల్ తర్వాత తీసుకొనిరాబోయే ఆండ్రాయిడ్ 12లోని ఫీచర్లు ఐఓఎస్ ని పోలి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక, పెద్ద నోటిఫికేషన్ టోగుల్ బటన్‌తో ఉన్న స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 11లో ఆరు క్విక్ టోగుల్ బటన్స్ ఉండగా, ఆండ్రాయిడ్ 12లో మాత్రం నాలుగు టోగుల్ బటన్స్ మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఐఓఎస్ లో కనిపించే సెక్యూరిటీ టోగుల్స్ కూడా ఇందులో తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అంటే, ఆండ్రాయిడ్ 12లో పటిష్టమైన సెక్యూరిటిని అందించడానికి ఈ అప్డేట్లో ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు రీసెంట్ మెసేజెస్, కాల్స్, యాక్టివిటీ స్టేటస్ వంటి కొత్త విడ్జెట్లను తీసుకురానున్నారు. సమీప ఎలక్ట్రానిక్ పరికరాలతో వై-ఫై పాస్‌వర్డ్‌లను పంచుకోవడం, మెరుగైన థీమింగ్ అందిస్తారని అర్ధం అవుతుంది. చదవండి: ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి రికార్డు స్థాయిలో రెడ్మి నోట్ సిరీస్ ఫోన్ అమ్మకాలు