ప్రస్తుతం అన్నీ స్మార్ట్ ఫోన్‌లలో ఓఎస్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ నడుస్తోంది. అయితే త్వరలో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్‌డేట్ అవుతుందని పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.ఆ రిపోర్ట్‌ల ఆధారంగా ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మేలో గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక ఈ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌లో ఉన్న సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
యాడ్స్‌కు చెక్ పెట్టొచ్చు
స్మార్ట్ ఫోన్‌లో బ్రౌజింగ్ చేసే సమయంలో కొత్త కొత్త వెబ్‌సైట్‌లను ఓపెన్ చేస్తుంటాం. ఆ సమయంలో మన పర్మీషన్ లేకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌లు మన ఫోన్‌కు వస్తుంటాయి. చిరాకు పెట్టిస్తుంటాయి. కానీ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్ డేట్‌తో పర్మీషన్ లేకుండా నోటిఫికేషన్ లు మన ఫోన్‌కు రాలేవు. పైగా నోటిఫికేషన్ కావాలని ఎనేబుల్ చేసినా , బ్లాక్ చేయాలంటే ఈజీగా బ్లాక్ చేయొచ్చు.
లాంగ్వేజ్ కూడా
ఫోన్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఆండ్రాయిడ్ 13లో అలా కాదు. యూజర్ ఒక్కసారి యాప్ ఇన‍్ఫర్మేషన్ స్క్రీన్‌లో లాంగ‍్వేజ్ మార్చుకుంటే..ఆ లాంగ్వేజ్‌లో కంటెంట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్13లో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఆండ్రాయిడ్ 13వెర్షన్ ఈ సంవత్సరంలో మే, సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ అనూహ్యంగా ఓఎస్ ఫీచర్లు లీకవ‍్వడంతో ఆండ్రాయిడ్ 13వెర్షన్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు టెంప్ట్ అవుతున్నారు.
చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!
Comments
Please login to add a commentAdd a comment