samrtphone
-
మీ ఫోన్ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్..!
సాక్షి, హైదరాబాద్: మీ ఫోన్ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్‌ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. మనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ పోర్టల్‌లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేయవచ్చు. అంటే మన ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ దొరికాక అన్‌బ్లాక్ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌తోపాటు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్ పోర్టల్‌లో జత చేయాలి. వివరాలన్నీ అప్లోడ్ చేస్తే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్‌లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్ పనిచేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్ సైతం ఈ పోర్టల్‌లో ఉంది. మార్చి 15 నుంచి అమల్లోకి.. వాస్తవానికి సీఈఐఆర్ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ సీఈఐఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పోలీసు సిబ్బంది ఈ సేవలు వాడాలి: డీజీపీ మొబైల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
ఐఫోన్లలోనే కాదు.. స్మార్ట్ ఫోన్లలో సైతం అదిరిపోయే ఫీచర్..
టెలికం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1జీ మొదులుకొని 2జీ, 3జీ, 4జీ అంటూ కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. వినియోగదారుల జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. త్వరలో 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ అందుబాటులోకి తేనున్నాయి. ఈ తరుణంలో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతుల్ని..ఆకళింపు చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. తొలిసారి యాపిల్ ఈ శాటిలైట్ ఫీచర్‌పై వర్క్ చేస్తుండగా..ఇప్పుడు అదే దారిలో గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు సైతం ఈ సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందించనున్నాయి. గూగుల్ సైతం గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ డెవెలప్మెంట్ టీంలో కీలకంగా పనిచేస్తున్న Hiroshi Lockheimer యాపిల్ తన ఐఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఎనేబుల్ చేయడంపై స్పందించారు. ఈ ఫీచర్ ఐఫోన్లలోనే కాకుండా.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆండ్రాయిడ్ 14లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్, గూగుల్‌తో ఒప్పందమైన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ 13 కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి, పాత వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ మహిమ ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ ఫీచర్ సాయంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో సైతం టెక్ట్స్, కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ నెట్ వర్క్‌లను ఆపరేట్ చేసేందుకు, వినియోగదారులకు అందుబాటులో తెచ్చేందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుందా? లేదా అని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 సముద్రంలో పడిన ఐఫోన్, 'బ్రాండ్' బాబుకు దొరికిందోచ్! -
మీ ఫోన్లో యాప్స్ డిలీట్ చేసిన తర్వాత ఈ పని చేస్తున్నారా!
సాధారణంగా మన అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటుంటాం. వాటితో మన అవసరం తీరిపోయిన వెంటనే డిలీట్ చేస్తాం. కానీ యాప్స్ డిలీట్ చేసినా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కొన్నిసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంటాయి. అరె! యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసినా నోటిఫికేషన్లు ఎందుకొస్తున్నాయని కంగారు పడిపోతుంటాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే యూజర్లు యాప్స్ డిలీట్ చేసిన వెంటనే ఇంకో పనిచేయాల్సి ఉంటుంది. అదేంటంటే! స్మార్ట్ ఫోన్‌కి జీమెయిల్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. మరి యాప్స్ డిలీట్ చేస్తే..ఆ యాప్స్‌కు అటాచ్ అయిన జీమెయిల్ అకౌంట్ డిస్ కనెక్ట్ అవుతుందని అనుకుంటాం. కానీ అలా జరగదు. దీంతో ఈజీగా జీమెయిల్లో ఉన్న మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది. అందుకే యాప్స్‌ను అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యాన్యువల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్‌కు కనెక్ట్ అయిన జీమెయిల్ అకౌంట్‌ను డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో యాప్స్‌కు కనెక్టైన జీమెయిల్‌ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ►ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి ►అనంతరం సెట్టింగ్‌లో ఉన్న గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి ►గూగుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద భాగంలో సెట్టింగ్స్ పర్ గూగుల్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ కనెక్టెడ్ యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ యాక్టీవ్‌గా జీ మెయిల్‌కు ఏ యాప్స్ అటాచై ఉన్నాయో తెలుస్తోంది. వెంటనే ఆ యాప్స్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్‌ను డిస్ కనెక్ట్ చేసుకోవచ్చు. -
ఐపోన్ లవర్స్‌కు శుభవార్త, అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు!!
యాపిల్ ఐపోన్ లవర్స్‌కు శుభవార్త. అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలు దారులకు భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది. అయితే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌తో పాటు ఇతర ఆఫర్లను పొందవచ్చు. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలనుకుంటే క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.6000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ ధర రూ.68,900 ఉండనుంది. ఐఫోన్13 256జీబీ వేరియంట్‌ను రూ.78,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి కస్టమర్లు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించవచ్చు. 512జీబీ వేరియంట్‌ను రూ. 98,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రకారం వినియోగదారులు ఐఫోన్13 కొనుగోలు చేసిన 90రోజులలోపు వారి క్రెడిట్ కార్డ్‌లకు లేదా బ్యాంక్ అకౌంట్లలో రూ.6వేలు జమ అవుతాయి. అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు పొందడానికి కస్టమర్లు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో ఎక్ఛేంజ్ ఆఫర్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లతో సహా అన్ని మోడల్స్ కు వర్తిస్తుందని అమెజాన్ తెలిపింది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్ పై రూ.15,350 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఎక్ఛేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో, ఆపిల్ ఐఫోన్ 13 కూడా రూ.5000 తగ్గింపుతో రూ.74,900కి విక్రయిస్తోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఇ-కామర్స్ కంపెనీ ఐఫోన్ 13 కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి కస్టమర్లు యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త, బడ్జెట్ ధరలో మరో కొత్త 5జీ ఐఫోన్! ధర ఎంతంటే?
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.ఈ ఏడాది మార్చి నెలలో జరిగే ఈవెంట్లో యాపిల్ సంస్థ తక్కువ ధరలో 5జీ ఐఫోన్ ను విడుదల చేయనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ సంస్థ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ తో పాటు ఐపాడ్, మాక్ కంప్యూటర్ను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 13, అక్టోబర్‌లో మాక్ బుక్ ప్రో ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేసింది. ఆ తరహాలోనే మరికొద్ది రోజుల్లో జరిగే యాపిల్ ఈవెంట్లో లో బడ్జెట్లో ఐఫోన్, మాక్‌లను విడుదల చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఐఫోన్ ఎస్ఈ 2022 యాపిల్ సంస్థ తొలిసారి ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌ను 2020లో మార్కెట్లో పరిచయం చేసింది. అయితే తాజాగా యాపిల్ ఎస్ఈ సిరీస్ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ ను ఐఫోన్ఎస్ఈ 2022 పేరిట వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫీచర్లు ఐఫోన్ ఎస్ఈ 2022 కొత్త మోడల్ పాత డిజైన్‌తో 4.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ,5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసేలా ప్రాసెసర్ తో విడుదలవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈఫోన్ ధర విషయానికొస్తే ఐఫోన్ ఎస్ఈ 2022 ధర రూ.30వేలు ఉండగా.. త్వరలో విడుదలయ్యే ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ ధర కూడా అదే తరహాలో ఉండనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా..అదరగొట్టేస్తున్నాయ్!
ప్రస్తుతం అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఓఎస్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ నడుస్తోంది. అయితే త్వరలో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్డేట్ అవుతుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి.ఆ రిపోర్ట్‌ల ఆధారంగా ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మేలో గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక ఈ ఆండ్రాయిడ్ 13 వెర్షన్లో ఉన్న సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం. యాడ్స్‌కు చెక్ పెట్టొచ్చు స్మార్ట్ ఫోన్లో బ్రౌజింగ్ చేసే సమయంలో కొత్త కొత్త వెబ్సైట్లను ఓపెన్ చేస్తుంటాం. ఆ సమయంలో మన పర్మీషన్ లేకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు మన ఫోన్‌కు వస్తుంటాయి. చిరాకు పెట్టిస్తుంటాయి. కానీ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్ డేట్‌తో పర్మీషన్ లేకుండా నోటిఫికేషన్ లు మన ఫోన్‌కు రాలేవు. పైగా నోటిఫికేషన్ కావాలని ఎనేబుల్ చేసినా , బ్లాక్ చేయాలంటే ఈజీగా బ్లాక్ చేయొచ్చు. లాంగ్వేజ్ కూడా ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఆండ్రాయిడ్ 13లో అలా కాదు. యూజర్ ఒక్కసారి యాప్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో లాంగ్వేజ్ మార్చుకుంటే..ఆ లాంగ్వేజ్‌లో కంటెంట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్13లో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఆండ్రాయిడ్ 13వెర్షన్ ఈ సంవత్సరంలో మే, సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ అనూహ్యంగా ఓఎస్ ఫీచర్లు లీకవ్వడంతో ఆండ్రాయిడ్ 13వెర్షన్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు టెంప్ట్ అవుతున్నారు. చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు! -
మారుపేర్లతో అదరగొడుతున్న స్మార్ట్ ఫోన్, మరి ఇండియాలో..
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ భారత్‌లో తన దూకుడును కొనసాగిస్తుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షావోమీ.. తాజాగా రెడ్మీ నోట్11 5జీ ఫోన్‌ను 'రెడ్మీ నోట్ 11టీ' పేరుతో ఇండియాలో విడుదల చేయనుంది. షావోమీ సంస్థ గతవారం చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్‌ను లాంఛ్ చేసింది. వరల్డ్ వైడ్‌గా స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ రెడ్మీ నోట్ 11ను ఆయా దేశాల్లో మారు పేర్లతో విడుదల చేస్తోంది. చైనాలో రెడ్ మీ నోట్11గా విడుదల చేయగా..యురేపియన్ మార్కెట్లో పోకో ఎం4 ప్రో5జీగా విడుదల చేసేందుకు స్ధిమైంది. 'రెడ్మీ నోట్ 11టీ' ఫీచర్లు రెడ్మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 5జీ,రెడ్మీ నోట్11 ప్రో, రెడ్మీ నోట్11 ప్రో ప్లస్ మూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా రెడ్మీ నోట్ 11 ప్రో, ప్రో ప్లస్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ తప్ప మిగిలిన అన్నీ ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. రెడ్మీ నోట్ 11 ప్రోలో 67వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, 5,160ఎంఏహెచ్ తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ప్రో ప్లస్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మూడు స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, పంచ్ హోల్ డిజైన్‌తో విడుదల కానుంది. చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ రూ.14,000 ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ రెడ్మీ నోట్11 పేరుతో షావోమీ చైనాలో నిన్నటి నుంచి సేల్స్ ప్రారంభించింది.ఈ సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్లు అమ్ముడైన విషయం తెలిసిందే. భారత్‌లో సైతం షావోమీ విడుదల చేసిన రెడ్మీ సిరీస్ ఫోన్లు సేల్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల భారత్‌లో విడుదలైన క్యూ3 (త్రైమాసిక) ఫలితాల్లో షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో అమ్ముడవుతున్న అన్నీ ఫోన్లలో కంటే యాపిల్ ఐఫోన్లు చాలా ఖరీదు. ఇదే విషయం ఆ ఫోన్ల అమ్మకాల్లో తేలింది. కానీ ట్రెండ్ మారింది. తాజాగా విడుదలైన క్యూ3 ఫలితాల్లో ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల విడుదలైన 2021 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరిగాయని, ఈ విషయంలో యాపిల్ సంస్థ అరుదైన ఘనతను సాధించిందని కొనియాడారు. అయితే భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 13 తో దశ తిరిగింది. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ సంస్థ ఐఫోన్ 13 విడుదల ముందు వరకు భారత్‌లో గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఎందుకంటే మిగిలిన టెక్ కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు,గాడ్జెట్స్ ధరలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేవి. కానీ యాపిల్ విడుదల చేసే ఐఫోన్లలో ఫీచర్లు బాగున్నా ధరలు ఆకాశాన్నంటేవి. అందుకే ఐఫోన్ అమ్మకాలు ఆశాజనకంగా లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 సిరీస్ విడుదలతో భారత్‌లో యాపిల్ ఐఫోన్ అమ్మకాల దశ తిరిగింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఏం తేల్చింది మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ క్యూ3 ఫలితాల్లో యాపిల్ సంస్థ 212 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని పేర్కొంది. యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (రూ. 30,000 కంటే ఎక్కువ ఉన్న ఫోన్లు) 44 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతుందని తెలిపింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో 74 శాతం మార్కెట్ వాటాతో (రూ. 45,000 పైన ఉన్న ఫోన్లు) ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. అయితే ఇలా సేల్స్ పెరగడానికి యాపిల్ తెచ్చిన ఫీచర్లేనని తెలుస్తోంది. పెద్ద ఐఫోన్ స్క్రీన్లు 2017 నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ల స్క్రీన్ సైజ్‌ను పెంచుతూ వచ్చింది.ఇక తాజాగా స్క్రీన్ సైజ్ పెరిగిన ఫోన్లలో ఐఫోన్ 11,ఐఫోన్ 12, ఐఫోన్ 13 ఫోన్లు ఉన్నాయి. దీంతో పాటు మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్ లతో పోలిస్తే యాపిల్ ఇప్పుడు 6 అంగుళాల డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తద్వారా ఐఫోన్ వినియోగదారులు ఈజీగా సినిమాలు, గేమ్స్, నెట్ బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం యాపిల్ విడుదల చేస్తున్న ఐఫోన్లలో 4.7 అంగుళాల స్క్రీన్ నుండి 6.7 అంగుళాల వరకు ఐఫోన్లను అమ్ముతుంది. ఐఓఎస్ అప్డేట్లు ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లు చాలా అవసరం. అందుకే అప్డేట్ విషయంలో ఆలస్యం చేసే యాపిల్ సంస్థ గత కొంత కాలంటే సాఫ్ట్వేర్ల విషయంలో అప్డేట్గా ఆలోచిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్‌ను ఆవిష్కరించిన కొన్ని రోజుల తర్వాత ఐఓస్ 15 అప్డేట్ చేసింది. 2015లో విడుదలైన ఐఫోన్ 6ఎస్ లో ఓఎస్ అప్డేట్లు చేస్తూ వస్తోంది. ఐఫోన్‌కు మరో అడ్వాంటేజ్ చిప్ సెట్ లు డిస్ప్లే ,సాఫ్ట్వేర్ అప్డేట్లు కాకుండా ఐఫోన్ సేల్స్ పెరగడానికి మరో కారణం చిప్సెట్. యాపిల్ బయోనిక్ చిప్సెట్లను వినియోగిస్తుంది. 2019నుంచి ఈ బయోనిక్ చిప్సెట్ల వినియోగం ప్రారంభమైంది. ఈ బయోనిక్ చిప్ ఉన్న ఐఫోన్ల వినియోగం సులభంగా ఉన్నట్ల ఐఫోన్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజూవారి పనులే కాకుండా గేమింగ్, బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్‌లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్‌టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
రియల్మీ బడ్జెట్ ఫోన్లు.. రూ.6,799కే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ బ్రాండ్ రియల్మీ తాజాగా సి–సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను రూపొందించింది. వీటి ధరలు రూ.6,799 నుంచి రూ.10,999 వరకు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ర్యామ్ 2–4 జీబీ, ఇంటర్నల్ మెమరీ 32–128 జీబీ, బ్యాటరీ 5000–6000 ఎంఏహెచ్ ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సి–సిరీస్‌లో 3.2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెలిపారు. 10 కోట్లు దాటిన భారత్‌పే యూపీఐ లావాదేవీలు న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021–22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్‌టెక్ పరిశ్రమలో భారత్‌పే 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్‌పే యూపీఐ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్‌పే గ్రూప్ అధ్యక్షుడు సుహైల్ సమీర్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. క రోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్‌పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్‌పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్ డాలర్ల టీపీవీ (టోటల్ పేమెంట్స్ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
చూపు కోల్పోనున్న చిన్నారి.. పాపం ఫోన్‌దే
బీజింగ్: స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో మరోసారి రుజువైంది. ఫోన్‌ను అతిగా వాడడం వల్ల ఓ చిన్నారి చూపు కోల్పోనుంది. చైనాలోని జియాంగ్జూ ప్రాంతానికి చెందిన జియావో అనే రెండేళ్ల బాలికకు కొద్ది రోజులుగా కళ్లు సరిగా కనిపించడంలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చిన్నారికి హ్రస్వదృష్టి ఏర్పడినట్లు తేల్చారు. చిన్నారి ఎదిగేకొద్ది ఈ సమస్య తీవ్రమై, 9 ఏళ్లు వచ్చేసరికి చూపు పూర్తిగా మసకబారిపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ సమస్య తలెత్తడానికి కారణమేంటా? అని అన్వేషించగా.. జియావోకు ఏడాది వయసు నుంచే స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం అలవాటని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆమె చూపు కోల్పోవడానికి కారణం స్మార్ట్‌ఫోనేనని వైద్యులు తేల్చారు. -
శబ్దాలను బట్టి జబ్బులు గుర్తించే ఆప్!
పిల్లలు అదేపనిగా దగ్గుతున్నప్పుడు, సమస్య ఏమిటో తెలుసుకునేందుకు మనం వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళతాం. అయితే ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తే సమీప భవిష్యత్తులోనే సమస్య ఏమిటో ఇంట్లోనే గుర్తించవచ్చు. అదెలాగంటారా? చాలా సింపుల్.. దగ్గు తాలూకూ ధ్వనుల ద్వారా జబ్బు ఏమిటో తెలుసుకునేందుకు వీరు ఒక స్మార్ట్‌ఫోన్ యాప్‌ను తయారు చేస్తున్నారు మరి. ఆసుపత్రిలో చేరిన పిల్లలు (29 రోజుల వయసు నుండి 12 ఏళ్ల వయసు వరకూ) దగ్గినప్పుడు వచ్చే శబ్దాలను రికార్డు చేయడం.. సాధారణ పద్ధతుల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలను వీటికి జోడించడం ఈ ప్రాజెక్టులో కీలక అంశం. ఇప్పటికే 1437 మంది శబ్దాలను రికార్డు చేసిన శాస్త్రవేత్తలు మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని నిశితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యుమోనియా, ఉబ్బసం, బ్రాంకైటిస్‌లతో పాటు సాధారణ ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన ధ్వనులను అప్లికేషన్ ద్వారా గుర్తించేలా చేశారు. అప్లికేషన్ పూర్తయిన తరువాత దగ్గు ధ్వనులను రికార్డు చేసిన పిల్లలు 585 మంది మీద పరీక్షలు జరిపారు. ఎవరికి ఏ జబ్బు ఉందో 81 నుంచి 97 శాతం కచ్చితత్వంతో గుర్తించింది ఆ అప్లికేషన్ అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ పోర్టర్ తెలిపారు. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో పిల్లల సమస్యలను గుర్తించేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని, మరింత సమర్థంగా పనిచేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. -
సూపర్ ఫీచర్స్‌తో నుబియా స్మార్ట్‌ఫోన్
బీజింగ్ : స్మార్ట్ ప్రపంచంలోకి సరికొత్త ఫోన్ రాబోతుంది. జీటీఈ అనుబంధ సంస్థ నుబియా, నుబియా ఎన్3 పేరుతో అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఈ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో ఫోన్ రిలీజ్ కాబోతుందని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ.. కంపెనీ నుబియా ఎన్3ని ఈ నెల 24న చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. మొత్తం మూడు రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఫోన్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్తో ప్రపంచ మార్కెట్లను అలరించనుందనే అంచనా ఉన్నప్పటికీ.. ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. నుబియా ఎన్3 ఫీచర్స్ 18:9 ఐపీఎస్ ఎల్సీడీ 5.99 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆటో ఫోకస్‌తో వెనుక రెండు కెమెరాలు 5000 యంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ లాక్ సిస్టమ్ -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కార్బన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. తద్వారా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. గత వారం బడ్జెట్ ధరలో ఆరా పవర్ 3జీనులాంచ్ చేసిన కార్బన్ ఈ సిరీస్‌లో మరో కొత్త డివైస్‌ను తీసుకొచ్చింది. ఆరా పవర్ 4జీ ప్లస్ పేరుతో శుక్రవారం దీన్ని విడుదల చేసింది. దీని ధర రూ .5,790గా ప్రకటించింది. ఫ్రీ ప్రొటెక్టివ్ కవర్‌తోపాటు గ్రే అండ్ షాంపైన్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆరా పవర్ 4జీ ప్లస్ స్పెసిఫికేషన్స్ 720x1280 పిక్సెల్ రిసల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం 5 ఇంచెస్ హెచ్ డీ డిస్ప్లే క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మొమరీ, 32జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మొమరీ 5 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ