యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.ఈ ఏడాది మార్చి నెలలో జరిగే ఈవెంట్‌లో యాపిల్ సంస్థ తక్కువ ధరలో 5జీ ఐఫోన్ ను విడుదల చేయనుంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో జరగనున్న ఈవెంట్‌లో యాపిల్ సంస్థ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ తో పాటు ఐపాడ్, మాక్ కంప్యూటర్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 13, అక్టోబర్‌లో మాక్ బుక్ ప్రో ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేసింది. ఆ తరహాలోనే మరికొద్ది రోజుల్లో జరిగే యాపిల్ ఈవెంట్‌లో లో బడ్జెట్‌లో ఐఫోన్, మాక్‌లను విడుదల చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది.
ఐఫోన్ ఎస్ఈ 2022
యాపిల్ సంస్థ తొలిసారి ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌ను 2020లో మార్కెట్‌లో పరిచయం చేసింది. అయితే తాజాగా యాపిల్ ఎస్ఈ సిరీస్ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ ను ఐఫోన్ఎస్ఈ 2022 పేరిట వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఫీచర్లు
ఐఫోన్ ఎస్ఈ 2022 కొత్త మోడల్ పాత డిజైన్‌తో 4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ,5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసేలా ప్రాసెసర్ తో విడుదలవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈఫోన్ ధర విషయానికొస్తే ఐఫోన్ ఎస్ఈ 2022 ధర రూ.30వేలు ఉండగా.. త్వరలో విడుదలయ్యే ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ ధర కూడా అదే తరహాలో ఉండనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment