టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.
ఈ ఏడాది తొలిసారి యాపిల్ సంస్థ ఏప్రిల్ 7న ‘లెట్ లూస్’ ఈవెంట్‌లో కొత్త ఐపాడ్‌లపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఓల్‌ఈడీ ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్స్‌ను లాంచ్ చేయనుందని సమాచారం. టెక్ దిగ్గజం లాంచ్ చేయనున్న కొత్త ఐపాడ్ ప్రో తరహాలో మాక్ బుక్ ప్రో సైతం మరింత పవర్ఫుల్‌గా ఉండనుంది.
యాపిల్ లెట్ లూస్ ఈవెంట్‌లో ప్రత్యేకతలు
లెట్ లూస్ ఈవెంట్‌లో యాపిల్ సంస్థ విడుదల చేయనున్న ఐపాడ్ ప్రోలో ఓఎల్‌ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది. అంతేకాదు బెటర్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, కలర్ ఆక్యురెన్స్ సైతం అప్‌గ్రేడ్ వెర్షన్ యూజర్లకు వినియోగం మరింత సులభం కానుందనే నివేదిక హైలెట్ చేసింది.
స్క్రీన్ అప్‌గ్రేడ్‌తో పాటు కొత్త ఐపాడ్ ప్రో మోడల్‌లు ఓల్డ్ మోడళ్ల కంటే సన్నగా ఉండనుందని అంచనా. 12.9 అంగుళాల మోడల్‌కు 20 శాతం, 11 అంగుళాల మోడల్‌కు 15 శాతం వరకు సైజ్ తగ్గుతుంది.
ఐపాడ్ ప్రోలో ఎం4 చిప్
యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎం4 చిప్‌ని ఐపాడ్ ప్రోలో అప్‌డేట్ చేయనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత ఎం3 చిప్ కంటే గణనీయమైన పనితీరు, సామర్థ్యం సైతం పెరగనుందని టెక్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహానాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్‌లో స్పష్టత రానుంది.
యాపిల్ లెట్ లూస్ ఐప్యాడ్ లాంచ్‌ను ఎలా చూడాలి
ఇక మే 7న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను యూట్యూబ్, యాపిల్.కామ్, యాపిల్ టీవీలో వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment