ipod
-
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.ఈ ఏడాది తొలిసారి యాపిల్ సంస్థ ఏప్రిల్ 7న ‘లెట్ లూస్’ ఈవెంట్లో కొత్త ఐపాడ్‌లపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఓల్ఈడీ ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్స్ను లాంచ్ చేయనుందని సమాచారం. టెక్ దిగ్గజం లాంచ్ చేయనున్న కొత్త ఐపాడ్ ప్రో తరహాలో మాక్ బుక్ ప్రో సైతం మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది.యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో ప్రత్యేకతలు లెట్ లూస్ ఈవెంట్లో యాపిల్ సంస్థ విడుదల చేయనున్న ఐపాడ్ ప్రోలో ఓఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది. అంతేకాదు బెటర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ ఆక్యురెన్స్ సైతం అప్‌గ్రేడ్ వెర్షన్ యూజర్లకు వినియోగం మరింత సులభం కానుందనే నివేదిక హైలెట్ చేసింది. స్క్రీన్ అప్‌గ్రేడ్‌తో పాటు కొత్త ఐపాడ్ ప్రో మోడల్‌లు ఓల్డ్ మోడళ్ల కంటే సన్నగా ఉండనుందని అంచనా. 12.9 అంగుళాల మోడల్‌కు 20 శాతం, 11 అంగుళాల మోడల్‌కు 15 శాతం వరకు సైజ్ తగ్గుతుంది. ఐపాడ్ ప్రోలో ఎం4 చిప్యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎం4 చిప్‌ని ఐపాడ్ ప్రోలో అప్డేట్ చేయనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత ఎం3 చిప్ కంటే గణనీయమైన పనితీరు, సామర్థ్యం సైతం పెరగనుందని టెక్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహానాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో స్పష్టత రానుంది. యాపిల్ లెట్ లూస్ ఐప్యాడ్ లాంచ్‌ను ఎలా చూడాలిఇక మే 7న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను యూట్యూబ్, యాపిల్.కామ్, యాపిల్ టీవీలో వీక్షించవచ్చు. -
యాపిల్: వెళ్లిపోతాం..చైనాలో ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
త్వరలో చైనాకు భారీషాక్ తగలనుంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐపాడ్ ప్రొడక్షన్‌ను చైనాలో నిలిపి వేయనుందని నిక్కీ ఆసియా నివేదించింది. షాంఘై వంటి నగరాల్లో కొనసాగుతున్న లాక్డౌన్లతో పాటు, అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల యాపిల్ చైనా నుండి ప్రొడక్షన్‌ను వియాత్నంకు తరలించాలని భావిస్తోంది. చైనాకు చెందిన బీవైడీ సంస్థ యాపిల్ ఐపాడ్లను తయారు చేస్తోంది. తయారు చేసిన వాటిని యాపిల్ అమ్మకాలు నిర్వహిస్తుంది. గతేడాది యాపిల్‌కు రెండో అతిపెద్ద ప్రొడక్ట్ ఐపాడ్లను 58మిలియన్ల షిప్ మెంట్ చేసింది. కానీ ఈఏడాది సాధ్య పడలేదు.పెరిగిపోతున్న కరోనా కేసులు, చిప్ కొరత, సప్లయ్‌తో పాటు ప్రభుత్వ నిర్ణయాలతో యాపిల్ సంస్థ ఐపాడ్ ప్రొడక్షన్‌ను చైనా నుంచి మరో చోటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే భవిష్యత్‌లో చిప్ కొరత లేకుండా ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చిప్ తయారీ సంస్థలకు చిప్‌లను వెంటనే పంపించాలని యాపిల్ విజ్ఞప్తి చేసినట్లు నీక్కీ ఆసియా తన నివేదికలో వెల్లడించింది చైనా టూ వియాత్నం! చైనా షాంఘైలో యాపిల్ సంస్థకు సగ భాగానికి పైగా 200 ప్రధాన సప్లయర్స్ ఉన్నారు. అందుకే యాపిల్ సంస్థ షాంఘై కేంద్రంగా 31 కంపెనీలతో తన ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం నుంచి వియాత్నంకు ఐపాడ్ ప్రొడక్షన్‌ను తరలించనుంది. ఇందుకోసం యాపిల్..బీవైడీ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ షాంఘై నుంచి వియాత్నం కు తరలింపు, వియాత్నంలో తక్కువ సంఖ్యలో ఐపాడ్లను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. -
గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు..
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ గ్యాడ్జెట్స్‌కి ఉన్న క్రేజ్ వేరు. యాపిల్ నుంచి ఓ కొత్త ప్రొడక్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడు సొంతం చేసుకుందామా.. అని టెక్ ప్రియులు ఎదురు చూస్తుంటారు. అయితే యాపిల్‌కి ఇంతటి క్రేజ్ రావడంలో తొలి బ్రేక్ త్రూ అందించింది ఐపాడ్ అనడం అతిశయోక్తి కాదు. అప్పట్లో సంచలనం మోత బరువు ఉండే వాక్మెన్లు రాజ్యం ఏలుతున్నా కాలంలో సింపుల్‌గా అరచేతిలో ఇమిడిపోతూ వెయ్యికి పైగా పాటలను నాన్‌స్టాప్‌గా గంటల తరబడి అందించే గ్యాడ్జెట్‌గా ఇరవై ఏళ్ల క్రితం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది ఐపాడ్. ఆ రోజుల్లో ఐపాడ్ ఓ టెక్నికల్ వండర్. దీన్ని సొంతం చేసుకోవడం ఓ స్టేటస్ సింబల్. ఐపాడ్ ఇచ్చిన క్రేజ్‌తో ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం మార్కెట్లో వరల్డ్‌లో ఐఫోన్ నంబర్ వన్‌గా ఉందంటే అదంతా ఐపాడ్ చలవే. Say goodbye to iPod. pic.twitter.com/0WXYeOwiPJ — Joe Rossignol (@rsgnl) May 10, 2022 అదంతా గతం గడిచిన పదేళ్లలో సాంకేతిక అభివృద్ధి ఊహించని వేగంతో జరిగింది. వందల జీబీని మించిన స్టోరేజీలో స్మార్ట్ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇంటర్నెట్ లభ్యత విరివిగా మారిన తర్వాత స్టోరేజీతో సంబంధం లేకుండా ఆన్లైన్ మ్యూజిక్స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోయాయి. ఫలితంగా ఐపాడ్ అవసరం జనానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐపాడ్ కేవలం ఇరవై ఏళ్లకే ‘వింటేజ్’ జాబితాలో చేరిపోయింది. Today, Apple discontinued the last iPod. pic.twitter.com/T2vwJ4LvCc — Pigeons & Planes (@PigsAndPlans) May 10, 2022 ఇకపై.. ఐపాడ్‌కి డిమాండ్ తగ్గిపోయినా దీనికి ఉన్న సపరేట్ ఫ్యాన్ బేస్ కోసం ఇన్నాళ్లు యాపిల్ సంస్థ ఐపాడ్‌ను మార్కెట్లో కంటిన్యూ చేసింది. కానీ ఇలా ఎంత కాలం కొనసాగించలేమని నిర్ణయానికి వచ్చి.. తాజాగా ఐపాడ్ ప్రొడక్షన్ ఆపేస్తున్నట్టు.. మార్కెట్ నుంచి డిస్కంటిన్యూ చేస్తున్నట్టు యాపిల్ ప్రకటించింది. Well, it’s official. After over 20 years (7,504 days to be exact), Apple just discontinued the last iPod. What a run pic.twitter.com/lzkBx6Uwnf — Luke Miani (@LukeMiani) May 10, 2022 చెరిగిపోని జ్ఞాపకం యాపిల్ ఈ నిర్ణయం ప్రకటించడం ఆలస్యం సోషల్ మీడియా ఐపాడ్ జ్ఞాపకాలు, తీపి గుర్తులతో నిండిపోయింది. తమకు ఎంతో చక్కని అనుభూతిని అందించిన ఐపాడ్ జ్ఞాపకాలను ట్వీట్ల రూపంలో మెసేజ్‌ల రూపంలో, ఫోటోల రూపంలో పంచుకుంటున్నారు. Apple has discontinued the iPod touch, ending the 20 year run of the iconic iPod brand. What’s your favorite memory associated with the iPod? pic.twitter.com/N1D9d3VSIG — Pop Crave (@PopCrave) May 10, 2022 RIP iPod 2001-2022 The iPod has been officially discontinued as of today The music... the games... the memories all gone 😧 pic.twitter.com/0eLClT2clz — TmarTn (@TmarTn) May 10, 2022 చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
అదిరిపోయే ఫీచర్లతో!! యాపిల్ ఫోల్డబుల్ మాక్ బుక్, ఐపాడ్..విడుదల ఎప్పుడంటే?!
వరల్డ్ వైడ్ గా ఉన్న టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ టెక్ జెయింట్ 20 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే తో మ్యాక్ బుక్, ఐప్యాడ్లను టెక్ లవర్స్‌కు పరిచయం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..2026 నాటికి ఫోల్డబుల్ డిస్ప్లేతో ప్రొడక్ట్‌లను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా యాపిల్ డ్యూయల్ స్క్రీన్, ఫోల్డబుల్ మ్యాక్‌బుక్/ఐప్యాడ్ హైబ్రిడ్‌ను తయారు చేయాలని భావిస్తుందని బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి గుర్మాన్ రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్సీసీ) విశ్లేషకుడు రాస్ యంగ్ నిర్ధారించారు. యాపిల్ కంటే ముందే లెనోవో యాపిల్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఫోల్డబుల్ ప్రొడక్ట్‌లను లెనోవో గతంలో విడుదల చేసింది. Lenovo ThinkPad X1 ఫోల్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్సనల్ కంప్యూటర్ కేవలం టాబ్లెట్/ మానిటర్‌గా పనిచేయడమే కాకుండా ఫోల్డ్ చేసి ఉన్న సగం స్క్రీన్ కీబోర్డ్‌లా పనిచేస్తుంది. అయితే ఈ తరహా ప్రొడక్ట్‌లు చాలా కాస్ట్లీగా ఉన్నాయని లెనోవో విడుదల చేసిన ఈ ఫోల్డబుల్ ప్రొడక్ట్ Lenovo ThinkPad X1 ధర మనదేశంలో రూ.2,43,198గా ఉంది. యాపిల్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ కూడా ఇదే కాస్ట్లో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త, బడ్జెట్ ధరలో మరో కొత్త 5జీ ఐఫోన్! ధర ఎంతంటే?
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.ఈ ఏడాది మార్చి నెలలో జరిగే ఈవెంట్లో యాపిల్ సంస్థ తక్కువ ధరలో 5జీ ఐఫోన్ ను విడుదల చేయనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ సంస్థ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ తో పాటు ఐపాడ్, మాక్ కంప్యూటర్ను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 13, అక్టోబర్‌లో మాక్ బుక్ ప్రో ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేసింది. ఆ తరహాలోనే మరికొద్ది రోజుల్లో జరిగే యాపిల్ ఈవెంట్లో లో బడ్జెట్లో ఐఫోన్, మాక్‌లను విడుదల చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఐఫోన్ ఎస్ఈ 2022 యాపిల్ సంస్థ తొలిసారి ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌ను 2020లో మార్కెట్లో పరిచయం చేసింది. అయితే తాజాగా యాపిల్ ఎస్ఈ సిరీస్ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ ను ఐఫోన్ఎస్ఈ 2022 పేరిట వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫీచర్లు ఐఫోన్ ఎస్ఈ 2022 కొత్త మోడల్ పాత డిజైన్‌తో 4.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ,5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసేలా ప్రాసెసర్ తో విడుదలవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈఫోన్ ధర విషయానికొస్తే ఐఫోన్ ఎస్ఈ 2022 ధర రూ.30వేలు ఉండగా.. త్వరలో విడుదలయ్యే ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ ధర కూడా అదే తరహాలో ఉండనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్‌లో యాపిల్ యూజర్లకు అలర్ట్
భారత్‌లో యాపిల్ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్ జారీ అయ్యింది. వెంటనే ఐఫోన్లను, ఐప్యాడ్లను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని సూచనలు అందాయి. ఈ మేరకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ విభాగం సీఈఆర్టీ-ఇన్(Indian Computer Emergency Response Team) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఐవోఎస్ 14.7.1, ఐప్యాడ్ 14.7.1 వారం కిందట రిలీజ్ అయ్యాయి. వీటికి సంక్లిష్టమైన మెమరీ కరప్షన్ బగ్‌ను ఫిక్స్ చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి, వెంటనే ఆ వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలని యాపిల్ యూజర్లకు సూచించింది. మెమరీ కరప్షన్ ఇష్యూస్ ఉన్నందున అప్డేట్ చేసుకోమని తెలిపింది. ‘హ్యాకర్లు పాత అప్డేట్ ఉన్న ఐఫోన్లలో కోడింగ్‌ను హ్యాక్ చేసి.. రిమోట్ యాక్సెస్ చేసే ప్రమాదం ఉంద’ని పేర్కొంది. వీటితో పాటు మాక్ యూజర్లు(డెస్క్‌టాప్ వెర్షన్) యూజర్లు కూడా సాప్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మంచిదని సూచించింది. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.. జనరల్‌ను క్లిక్ చేయాలి.. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ వేటికంటే.. ఐఫోన్ 6ఎస్, ఆ తర్వాత వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ ప్రో మోడల్స్ అన్నీ, ఐప్యాడ్ ఎయిర్ 2 ఆ తర్వాత వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ ఫిఫ్త్ జనరేషన్-ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు, ఐప్యాడ్ మినీ 4-తర్వాతి మోడల్స్, ఐప్యాడ్ టచ్(సెవెన్త్‌జనరేషన్), మోస్ట్ అడ్వాన్స్డ్ మాక్‌ఓస్ బిగ్ సర్ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త..!
భారత ఐఫోన్ యూజర్లకు ఆపిల్ శుభవార్తను అందించింది. ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్ కొనుగోలులో భాగంగా మూడు కొత్త చెల్లింపు మోడ్‌లను ఆపిల్ ప్రవేశపెట్టింది. యూపీఐ, రూపే, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఆప్షన్లను ఆపిల్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేవలం క్రెడిట్, డెబిట్ కార్డులతో యాప్ స్టోర్, ఐట్యూన్స్‌లో చెల్లింపులు జరపడానికి వీలు ఉండేది. తాజాగా ఆపిల్ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ, రూపే, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చును. దీంతో అధిక సంఖ్యలో ఆపిల్ యూజర్లకు లాభం జరగనుంది. ఐట్యూన్స్‌లో పాటలను కొనుగోలు చేయడానికి యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. టెక్ దిగ్గజం కుపెర్టినో యాప్ స్టోర్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలిపింది. అయితే ఈ సేవలు అప్డేట్ చేసిన ఐవోస్, ఐప్యాడ్, మాక్ఓఏస్ లో వస్తుందని ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మీ ఐఫోన్, ఐపాడ్లో కొత్త పేమెంట్ అప్షన్లను ఇలా యాడ్ చేయండి..! మీ ఐఫోన్, ఐపాడ్‌లోని సెట్టింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తరువాత ఆపిల్ ఐడీపై ట్యాప్ చేయండి. తరువాత పేమెంట్ అండ్ షిప్పింగ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మరోసారి మిమ్మిల్సి సైన్ ఇన్ అవ్వమని అడుగుతోంది. కొత్త పేమెంట్ విధానాన్ని యాడ్ చేసేందుకు యాడ్ పేమెంట్ మేథడ్ను సెలక్ట్ చేసుకోండి. యూపీఐ, రూపే, నెట్‌బ్యాంకింగ్ వివరాలను యాడ్ చేసేందుకు చూపించే స్టెప్స్‌ను ఫాలో అవ్వండి. అవసరమైతే పేమెంట్ మేథడ్ను పునర్వ్యవస్థీకరించడానికి, తీసివేయడానికి ఎగువ కుడి మూలలో ఉన్న ఎడిట్పై క్లిక్ చేయండి. యూజర్లు ఆపిల్ ఐడీ నుపయోగించి మల్టీపుల్ పేమెంట్ విధానాలతో చెల్లింపులు జరపవచ్చును. -
Apple Event 2021: భారీ హైప్.. ఆపిల్ లవర్స్ ఎదురుచూపులు
సాక్షి, న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ ఆపిల్ 2021 ఈవెంట్ ఈ రోజు, (ఏప్రిల్ 20) జరగనుంది. “స్ప్రింగ్ లోడెడ్” పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని కంపెనీ క్యాంపస్ నుండి రాత్రి 10:30 గంటలకు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐమాక్, ఆపిల్ టీవీ, ఎయిర్ట్యాగ్తోపాటు, ఐవోఎస్ 14.5 ను ఈ వేడుకలో ఆవిష్కరించనుందని అంచనా. ఈ ఈవెంట్లో ఆవిష్కరించబోయే ఉత్పత్తులపై ఆపిల్ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ తాజా ఊహాగానాల ప్రకారం, ఆపిల్ కొత్త మినీ-ఎల్ఈడి ఐప్యాడ్ ప్రో, ఎయిర్‌ట్యాగ్స్, తోపా రీడిజైన్ ఐమాక్ను ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ 3 లాంటి కొత్త ఐప్యాడ్ మోడళ్లు.. కొత్త ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ప్రో మోడళ్లు ప్రదర్శించే అవకాశం ఉందని అంచనా. ఐఫోన్, ఐప్యాడ్, మాక్, పిసి, స్మార్ట్‌ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్‌ను కలిగి ఉన్న ఏదైనా ఇతర పరికరంలో ఆపిల్ ఈవెంట్స్ వెబ్సైట్ ద్వారా, లేదా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏయే కొత్త పరికరాలు, ఉత్పాదనలకు పరిచయం చేస్తుందోనని ఆపిల్ అభిమానులు, టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Spring loaded. Watch a special #AppleEvent today at 10:00 a.m. PDT on https://t.co/tkb3KTIxTd. — Apple (@Apple) April 15, 2021 -
యూపీ: యోగి ఐ సర్కార్..
లక్నో : అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి, సంక్షేమాన్ని కొత్తపుంతలు తొక్కించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణయించారు. పాలనాపగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో పోలీసుల దమనకాండ, ఎడాపెడా పేర్ల మార్పు వంటి నిర్ణయాలతో వివాదాస్పద సీఎంగా పేరొందిన యోగి క్రమంగా పాలనా సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కసరత్తు వేగవంతం చేశారు. మంత్రులందరికీ ఐపాడ్లు సమకూర్చి పేపర్‌లెస్ కేబినెట్‌గా మార్చేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో ఇటీవల జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పోలో సీఎం యోగి ఐపాడ్‌తో నోట్స్ రాసుకోవడం, ఆదేశాలు ఇవ్వడం అధికారిక కార్యక్రమాలకు విస్తృతంగా ఐపాడ్‌ను వినియోగించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చదవండి : టీచర్లకు విదేశీ భాషలు నేర్పించండి : యోగి -
యాపిల్ ‘ఐప్యాడ్ ప్రో’ వచ్చింది..
న్యూయార్క్: గ్యాడ్జెట్ ప్రియుల కోసం యాపిల్ ‘ఐప్యాడ్ ప్రో’ను మంగళవారం ఆవిష్కరిం చింది. తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐఫోన్ 10ఎస్ ఫీచర్లతో ఈ ఐప్యాడ్ రూపొందింది. 2 వేరియంట్లలో ఇది లభిస్తుంది. 11 అంగుళాల స్క్రీన్ కలిగిన ఐప్యాడ్ ధర 799 అమెరికా డాలర్లు. కాగా, 12.9 అంగుళాల ఐప్యాడ్ ధర 999 అమెరికా డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ప్లే, వేగవంతమైన ప్రాసెసర్లు, మరింత మెరుగైన బ్యాక్ కెమెరా, పేమెంట్లు నిర్వహించడం, డివైజ్ అన్‌లాక్ చేయడం కోసం ఫేస్ ఐడీ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. -
యాపిల్ కొత్త ఐపాడ్
చికాగో: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ తాజాగా కొత్త ఐపాడ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో 9.7 అంగుళాల స్క్రీన్, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏ10 ఫ్యూజన్ చిప్, 10 గంటల బ్యాటరీ లైఫ్, 8 ఎంపీ కెమెరా, యాపిల్ పెన్సిల్ సపోర్ట్, హెచ్డీ వీడియో రికార్డింగ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఐపాడ్ భారత్‌లో ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. 32 జీబీ వై–ఫై మోడల్ ధర రూ.28,000గా, 32 జీబీ వై–ఫై + సెల్యులర్ మోడల్ ధర రూ.38,600గా ఉంది. ఇక యాపిల్ పెన్సిల్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంది. దీని ధర రూ.7,600. యాపిల్ ఐపాడ్‌తోపాటు కొత్త క్లాస్రూమ్ సాఫ్ట్‌వేర్‌ను, ఐవర్క్ ప్రొడక్టివిటీ యాప్స్‌ను ఆవిష్కరించింది. స్కూల్వర్క్ అనే మరొక ఉచిత యాప్‌ను విడుదల చేసింది. టీచర్లు ఈ యాప్‌లోనే విద్యార్థులకు అసైన్మెంట్స్, హోమ్‌వర్క్ ఇవ్వొచ్చు. కొత్త ఐపాడ్ ధర అమెరికాలోని స్కూళ్లకు 299 డాలర్లుగా, కన్సూమర్లకు 329 డాలర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. -
తక్కువ ధరకే ఐప్యాడ్.. రెడ్ కలర్లో ఐ ఫోన్
తక్కువ ధరలో కొత్త ఐప్యాడ్ మోడల్‌ను ఆపిల్ మంగళవారం విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా మందకోడిగా ఉన్న ఐప్యాడ్ అమ్మకాలకు బూస్ట్ ఇచ్చేందుకే తక్కువ ధర ఐప్యాడ్‌ను ఆపిల్.. మార్కెట్లోకి తీసుకువస్తోందని తెలిసింది. అయితే, ఐప్యాడ్ ప్రొ ఫీచర్లతో పోల్చితే ఇందులో కొన్ని ఫీచర్లను తగ్గించింది. ఈ నెల 24 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది కొత్త ఐప్యాడ్. కాగా, ఐప్యాడ్ రిలీజ్ ఈవెంట్లోనే ఐ ఫోన్ 7ను ఎరుపు రంగులో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది ఆపిల్. హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల నివారణకు విరాళంగా ఇవ్వడానికి ఆపిల్ అప్పుడప్పుడూ రెడ్ కలర్లో ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. రెడ్ కలర్ ఫోన్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో కొంత హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల నివారణ ఫండ్‌కు కేటాయిస్తుంది. ఐప్యాడ్ ఫీచర్లు స్క్రీన్: 9.7 అంగుళాలు ప్రాసెసర్: ఏ9 ప్రాసెసింగ్ చిప్ బ్యాటరీ లైఫ్: 10 గంటలు కెమెరా: 8 మెగాపిక్సల్ ధర: రూ.21467/- -
ఐపాడ్ల జోరు.. యువతలో హుషారు
కాలం మారింది. సాంకేతికత అందుబాటులోకి రావడంతో కిలోల కొద్దీ పుస్తకాల బరువును మోయూల్సిన రోజులకు కాలం చెల్లింది. కావాల్సిన సమాచారం కోసం గంటల తరబడి పేజీలు తిరగే సే పని తప్పిం ది. ఐపాడ్‌తో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతోంది. ఏ సమాచారం కావాలన్నా చిన్న క్లిక్ చేస్తే చాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. సమాచారాన్ని కూడా క్షణాల్లో చేరవేయవ చ్చు. దీంతో విద్యార్థులు, వ్యాపారులు, సంస్థలు, వివిధ కంపెనీల మేనేజర్లు, సిబ్బంది ఐపాడ్లపైనే ఆధారపడుతున్నారు. పనిని సులభంగా చక్కబెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లాలో సైతం ఐపాడ్లను విద్యార్థులు విరివిగా వినియోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. శ్రీకాకుళం కల్చరల్: సాంకేతిక రంగం అభివృద్ధి చెందడం తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోరుుంది. ఇంట ర్నెట్ వినియోగం పెరగడంతో మనుషుల మధ్య దూరం తగ్గింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారిని చూస్తూ మాట్లాడుకోవచ్చు. సమాచారాన్ని చేరవేయవచ్చు. విద్య, ఉపాధి అవకాశాలను నెట్లో చూసుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. విద్యకు కావాల్సిన సమస్త సమచారాన్ని చేకరించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయే ఐపాడ్లు రావడం యువత కుషీగా అవుతోంది. కంప్యూటర్లతో పనిలేకుండా తమకు కావాల్సిన సమాచారాన్ని, పనులను ఐపాడ్లతోనే చక్కబెడుతున్నారు. గతంలో ఈ ఐపాడ్లు కేవలం పాటలు వినేందుకు మాత్రమే ఉపయోగించే వారు. చెవిలో ఇయర్ పోన్లు పెట్టుకొని పాటలు వినడం పరిపాటుగా ఉండేది. ఐపాడ్లు టాబ్లెట్ మాదిరిగా మార్కెట్లోకి రావడం, ఇంటర్నెట్ అప్లికేషన్‌ను విరివిగా వినియోగించుకునే అవకాశం ఉండడంతో ప్రపంచమంతా చేతిలోకి వచ్చేసింది. దీంతో యువకులు ఆర్షికతులై ఎక్కువగా వాడుతున్నారు. చదువుకు సంబంధించిన ఎన్నో యూప్‌లు ఉండడంతో వారికి ఎక్కువగా ఉపయోగపడుతోంది. వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉండడం విద్యార్థులకు కాలం కలిసొస్తోంది. సామాజిక సంబంధాలు ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ప్రపంచంలో వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలు కొనసాగించే వెబ్సైట్లకు కొదవలేదు. కేవలం కంప్యూటర్ ముందే కూర్చుని చిట్‌చాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక మూల కూర్చొని ప్రపంచంలో ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషులతో చాటింగ్ చేయవచ్చు. తాము చూసి వింతలను కాని, ప్రత్యేక విషయాలను గాని, తమ మనసుకు ఆ సమయంలో అనిపించిన భావాలను వెంటనే తమ వారితో షేర్చేసుకోవచ్చు. సోషల్ మీడియా వాడకం పెరడగంతో దీని అవసరం కూడా పెరిగింది. శక్తివంతమెన కెమెరా ఐపాడ్లలో శ క్తివంతమైన కెమెరా కూడా ఉంటుంది. దీనితో మనకు కనపడిన దృశ్యాన్ని వెంటనే ఫొటో తీసి వాట్స్యూప్ ద్వారా మనకు నచ్చిన వాళ్లకి వెంటనే పంపవచ్చు. అత్యంత నాణ్యమైన వీడియోలు కూడా చిత్రీకరించవచ్చు. అన్ని సేవలకు కావలసిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకునేందుకు వీలుగా ఇంటర్నెట్ ఉండనే ఉంది. వినోద సాధనంగా... ఐపాడ్లు వినోద సాధనంగా కూడా ఉపయోగపడుతున్నారుు. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే సదుపాయం ఉండడం, నెట్ అందుబాటులో ఉండడంతో రకరకాల వీడియోలు, సినిమాలు, సంగీతం ఇలా అవధులులేని ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే అత్యంత నాణ్యమైన చిత్రాలను, శ్రావ్యమైన సంగీతం ఇందులో లభిస్తున్నారుు. యువతకు, చిన్నారులకు మంచి గేమ్స్ ఆడుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది. ప్రయాణాల సమయంలో ఐపాడ్ చేతిలో ఉంటే సమయమే సరిపడదు. చదువుకు సహకారం... ఇంజినీరింగ్ విద్యార్థులకు అభ్యసనలో ఐపాడ్ చాలా ఉపయోగపడుతోంది. నూతన విధానాలు ఏమైనా ఉంటే వెంటనే తెలుస్తున్నాయి. క్లాస్‌లో చెబుతున్న పాఠాలకు అనగుణంగా నోట్సు తయారు చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఖాళీ సమయంలో కావాల్సిన విద్య, ఉపాధి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. - అనుదీప్, ఇంజినీరింగ్ విద్యార్థి -
డ్వాక్రా మహిళలకు ఐపాడ్లు: మంత్రి పల్లె
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి డ్వాక్రా మహిళకూ త్వరలో ఓ ఐపాడ్‌ను అందించి ప్రతి ఇంటినీ ఒక పారిశ్రామిక గృహంగా మార్చనున్నామని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగంలో 5, ఎలక్ట్రానిక్స్ రంగంలో 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విజయవాడలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పాత్రికేయులకు నగదు రహిత ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి విలేకరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.