ఐపాడ్‌ల జోరు.. యువతలో హుషారు
కాలం మారింది. సాంకేతికత అందుబాటులోకి రావడంతో కిలోల కొద్దీ పుస్తకాల బరువును మోయూల్సిన రోజులకు కాలం చెల్లింది. కావాల్సిన సమాచారం కోసం గంటల తరబడి పేజీలు తిరగే సే పని తప్పిం ది. ఐపాడ్‌తో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతోంది. ఏ సమాచారం కావాలన్నా చిన్న క్లిక్ చేస్తే చాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. సమాచారాన్ని కూడా క్షణాల్లో చేరవేయవ చ్చు. దీంతో విద్యార్థులు, వ్యాపారులు, సంస్థలు, వివిధ కంపెనీల మేనేజర్లు, సిబ్బంది ఐపాడ్‌లపైనే ఆధారపడుతున్నారు. పనిని సులభంగా చక్కబెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లాలో సైతం ఐపాడ్‌లను విద్యార్థులు విరివిగా వినియోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు.
శ్రీకాకుళం కల్చరల్: సాంకేతిక రంగం అభివృద్ధి చెందడం తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోరుుంది. ఇంట ర్నెట్ వినియోగం పెరగడంతో మనుషుల మధ్య దూరం తగ్గింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారిని చూస్తూ మాట్లాడుకోవచ్చు. సమాచారాన్ని చేరవేయవచ్చు. విద్య, ఉపాధి అవకాశాలను నెట్‌లో చూసుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. విద్యకు కావాల్సిన సమస్త సమచారాన్ని చేకరించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయే ఐపాడ్‌లు రావడం యువత కుషీగా అవుతోంది.
కంప్యూటర్లతో పనిలేకుండా తమకు కావాల్సిన సమాచారాన్ని, పనులను ఐపాడ్‌లతోనే చక్కబెడుతున్నారు. గతంలో ఈ ఐపాడ్‌లు కేవలం పాటలు వినేందుకు మాత్రమే ఉపయోగించే వారు. చెవిలో ఇయర్ పోన్‌లు పెట్టుకొని పాటలు వినడం పరిపాటుగా ఉండేది. ఐపాడ్‌లు టాబ్‌లెట్ మాదిరిగా మార్కెట్‌లోకి రావడం, ఇంటర్నెట్ అప్లికేషన్‌ను విరివిగా వినియోగించుకునే అవకాశం ఉండడంతో ప్రపంచమంతా చేతిలోకి వచ్చేసింది. దీంతో యువకులు ఆర్షికతులై ఎక్కువగా వాడుతున్నారు. చదువుకు సంబంధించిన ఎన్నో యూప్‌లు ఉండడంతో వారికి ఎక్కువగా ఉపయోగపడుతోంది. వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉండడం విద్యార్థులకు కాలం కలిసొస్తోంది.
సామాజిక సంబంధాలు
ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా ప్రపంచంలో వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలు కొనసాగించే వెబ్‌సైట్లకు కొదవలేదు. కేవలం కంప్యూటర్ ముందే కూర్చుని చిట్‌చాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక మూల కూర్చొని ప్రపంచంలో ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషులతో చాటింగ్ చేయవచ్చు. తాము చూసి వింతలను కాని, ప్రత్యేక విషయాలను గాని, తమ మనసుకు ఆ సమయంలో అనిపించిన భావాలను వెంటనే తమ వారితో షేర్‌చేసుకోవచ్చు. సోషల్ మీడియా వాడకం పెరడగంతో దీని అవసరం కూడా పెరిగింది.
శక్తివంతమెన కెమెరా
ఐపాడ్‌లలో శ క్తివంతమైన కెమెరా కూడా ఉంటుంది. దీనితో మనకు కనపడిన దృశ్యాన్ని వెంటనే ఫొటో తీసి వాట్స్‌యూప్ ద్వారా మనకు నచ్చిన వాళ్లకి వెంటనే పంపవచ్చు. అత్యంత నాణ్యమైన వీడియోలు కూడా చిత్రీకరించవచ్చు. అన్ని సేవలకు కావలసిన అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వీలుగా ఇంటర్నెట్ ఉండనే ఉంది.
వినోద సాధనంగా...
ఐపాడ్‌లు వినోద సాధనంగా కూడా ఉపయోగపడుతున్నారుు. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే సదుపాయం ఉండడం, నెట్ అందుబాటులో ఉండడంతో రకరకాల వీడియోలు, సినిమాలు, సంగీతం ఇలా అవధులులేని ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే అత్యంత నాణ్యమైన చిత్రాలను, శ్రావ్యమైన సంగీతం ఇందులో లభిస్తున్నారుు. యువతకు, చిన్నారులకు మంచి గేమ్స్ ఆడుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది. ప్రయాణాల సమయంలో ఐపాడ్ చేతిలో ఉంటే సమయమే సరిపడదు.
చదువుకు సహకారం...
ఇంజినీరింగ్ విద్యార్థులకు అభ్యసనలో ఐపాడ్ చాలా ఉపయోగపడుతోంది. నూతన విధానాలు ఏమైనా ఉంటే వెంటనే తెలుస్తున్నాయి. క్లాస్‌లో చెబుతున్న పాఠాలకు అనగుణంగా నోట్సు తయారు చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఖాళీ సమయంలో కావాల్సిన విద్య, ఉపాధి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- అనుదీప్, ఇంజినీరింగ్ విద్యార్థి