త్వరలో చైనాకు భారీషాక్ తగలనుంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐపాడ్ ప్రొడక్షన్‌ను చైనాలో నిలిపి వేయనుందని నిక్కీ ఆసియా నివేదించింది. షాంఘై వంటి నగరాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌లతో పాటు, అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల యాపిల్ చైనా నుండి ప్రొడక్షన్‌ను వియాత్నంకు తరలించాలని భావిస్తోంది.
చైనాకు చెందిన బీవైడీ సంస్థ యాపిల్ ఐపాడ్‌లను తయారు చేస్తోంది. తయారు చేసిన వాటిని యాపిల్ అమ్మకాలు నిర్వహిస్తుంది. గతేడాది యాపిల్‌కు రెండో అతిపెద్ద ప్రొడక్ట్ ఐపాడ్‌లను 58మిలియన్ల షిప్ మెంట్ చేసింది. కానీ ఈఏడాది సాధ్య పడలేదు.పెరిగిపోతున్న కరోనా కేసులు, చిప్ కొరత, సప్లయ్‌తో పాటు ప్రభుత్వ నిర్ణయాలతో యాపిల్ సంస్థ ఐపాడ్ ప్రొడక్షన్‌ను చైనా నుంచి మరో చోటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే భవిష్యత్‌లో చిప్ కొరత లేకుండా ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చిప్ తయారీ సంస్థలకు చిప్‌లను వెంటనే పంపించాలని యాపిల్ విజ్ఞప్తి చేసినట్లు నీక్కీ ఆసియా తన నివేదికలో వెల్లడించింది
చైనా టూ వియాత్నం!
చైనా షాంఘైలో యాపిల్ సంస్థకు సగ భాగానికి పైగా 200 ప్రధాన సప్లయర్స్ ఉన్నారు. అందుకే యాపిల్ సంస్థ షాంఘై కేంద్రంగా 31 కంపెనీలతో తన ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం నుంచి వియాత్నంకు ఐపాడ్ ప్రొడక్షన్‌ను తరలించనుంది. ఇందుకోసం యాపిల్..బీవైడీ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ షాంఘై నుంచి వియాత్నం కు తరలింపు, వియాత్నంలో తక్కువ సంఖ్యలో ఐపాడ్‌లను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment