సాక్షి, న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ ఆపిల్ 2021 ఈవెంట్ ఈ రోజు, (ఏప్రిల్ 20) జరగనుంది. “స్ప్రింగ్ లోడెడ్” పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని కంపెనీ క్యాంపస్ నుండి రాత్రి 10:30 గంటలకు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐమాక్, ఆపిల్ టీవీ, ఎయిర్‌ట్యాగ్‌తోపాటు, ఐవోఎస్ 14.5 ను ఈ వేడుకలో ఆవిష్కరించనుందని అంచనా.
ఈ ఈవెంట్‌లో ఆవిష్కరించబోయే ఉత్పత్తులపై ఆపిల్ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ తాజా ఊహాగానాల ప్రకారం, ఆపిల్ కొత్త మినీ-ఎల్ఈడి ఐప్యాడ్ ప్రో, ఎయిర్‌ట్యాగ్స్, తోపా రీడిజైన్ ఐమాక్‌ను ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ 3 లాంటి కొత్త ఐప్యాడ్ మోడళ్లు.. కొత్త ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ప్రో మోడళ్లు ప్రదర్శించే అవకాశం ఉందని అంచనా. ఐఫోన్, ఐప్యాడ్, మాక్, పిసి, స్మార్ట్‌ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్‌ను కలిగి ఉన్న ఏదైనా ఇతర పరికరంలో ఆపిల్ ఈవెంట్స్ వెబ్‌సైట్ ద్వారా, లేదా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏయే కొత్త పరికరాలు, ఉత్పాదనలకు పరిచయం చేస్తుందోనని ఆపిల్ అభిమానులు, టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Spring loaded. Watch a special #AppleEvent today at 10:00 a.m. PDT on https://t.co/tkb3KTIxTd.
— Apple (@Apple) April 15, 2021
Comments
Please login to add a commentAdd a comment