Apple iPhone 15: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా యాపిల్ ఐఫోన్ 15 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఇండియాలోని ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఐఫోన్ 15 లాంచింగ్ తరువాత ఎలాంటి వెయిటింగ్ లేకుండానే, గ్లోబల్ సేల్స్ అరంగేట్రం రోజునే ఇండియా మార్కెట్‌లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందట. అదీ మేడిన్ ఇండియా కొత్త ఐఫోన్ మోడల్స్ రాబోతున్నాయి. అదే నిజమైతే ఐఫోన్ లవర్స్‌కు నిజంగా పండగే.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం లాంచ్ రోజున భారతదేశంలో అసెంబుల్ చేసిన యాపిల్ ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్ 15ని దక్షిణాసియాతో పాటు మరికొన్ని ఇతర గ్లోబల్ ప్రాంతాల్లో తొలిరోజే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. భారత్‌లొ సరికొత్త ఐఫోన్లకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. మేడ్-ఇన్-ఇండియా పథకానికి ఇదొక కీలకమైన మైలురాయి కానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ఐఐటీ కాదని నటిగా..చివరికి బి-టౌన్‌ని కూడా వదిలేసి..ఇన్ని ట్విస్ట్‌లా!)
ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో ఇటీవల ఆంక్షలు, యాపిల్‌కు తర్వాతి చైనాగా భారత్ నిలుస్తుందన్న అంచనాల మధ్య ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రారంభంలో, యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్లను దేశంలో ప్రారంభించింది. కాగా గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు)
అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా వండర్ లస్ట్ పేరుతో నిర్వహించనున్న మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 15సిరీస్‌ను ప్రకటించనుంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పాటు, యాపిల్‌వాచ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 9 యాపిల్ వాచ్ అల్ట్రా (2వ తరం) ఐపాడ్స్ లాంచింగ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గాను, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉంటుందని అంచనా
Comments
Please login to add a commentAdd a comment