Made in India models
-
తొలిసారి మేడిన్ ఇండియా ఐఫోన్..నో వెయిటింగ్! ఇక ఐఫోన్ లవర్స్‌కు పండగే!
Apple iPhone 15: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా యాపిల్ ఐఫోన్ 15 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఇండియాలోని ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఐఫోన్ 15 లాంచింగ్ తరువాత ఎలాంటి వెయిటింగ్ లేకుండానే, గ్లోబల్ సేల్స్ అరంగేట్రం రోజునే ఇండియా మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందట. అదీ మేడిన్ ఇండియా కొత్త ఐఫోన్ మోడల్స్ రాబోతున్నాయి. అదే నిజమైతే ఐఫోన్ లవర్స్‌కు నిజంగా పండగే. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం లాంచ్ రోజున భారతదేశంలో అసెంబుల్ చేసిన యాపిల్ ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్ 15ని దక్షిణాసియాతో పాటు మరికొన్ని ఇతర గ్లోబల్ ప్రాంతాల్లో తొలిరోజే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. భారత్‌లొ సరికొత్త ఐఫోన్లకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. మేడ్-ఇన్-ఇండియా పథకానికి ఇదొక కీలకమైన మైలురాయి కానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ఐఐటీ కాదని నటిగా..చివరికి బి-టౌన్‌ని కూడా వదిలేసి..ఇన్ని ట్విస్ట్‌లా!) ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో ఇటీవల ఆంక్షలు, యాపిల్‌కు తర్వాతి చైనాగా భారత్ నిలుస్తుందన్న అంచనాల మధ్య ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రారంభంలో, యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్లను దేశంలో ప్రారంభించింది. కాగా గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు) అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా వండర్ లస్ట్ పేరుతో నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15సిరీస్‌ను ప్రకటించనుంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పాటు, యాపిల్‌వాచ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 9 యాపిల్ వాచ్ అల్ట్రా (2వ తరం) ఐపాడ్స్ లాంచింగ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గాను, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉంటుందని అంచనా -
అమ్మకాల్లో దుమ్ము లేపిన హ్యుందాయ్
సాక్షి, ముంబై: భారత్‌లో తయారు చేసిన ఎస్‌యూవీలు పది లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు సోమవారం కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది. ఈ మొత్తం విక్రయాల్లో క్రెటా ఎస్యూవీ సింహభాగాన్ని ఆక్రమించినట్లు కంపెనీ పేర్కొంది. 2005లో విడుదలైన క్రెటా ఇప్పటి వరకు 5.9 లక్షల అమ్మకాలు దేశీయ మార్కెట్లోనూ, 2.2 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్లో అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక 2019లో విడులైన వెన్యూ ఎస్యూవీ మొత్తం అమ్మకాలు 1.8 లక్షలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్యూవీ రంగంలో విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో ఈ ఘనతను సాధించామని కంపెనీ డెరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్‌లోనే ఎస్‌యూవీలను తయారీ చేస్తున్న సంగతి గార్గ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
టీవీ మార్కెట్లో సంచలనానికి షావోమి రె‘ఢీ’
కోల్‌కతా : టెలివిజన్ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేయడానికి షావోమి సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న షావోమి, భారత్‌లో టెలివిజన్ సెట్లు తయారుచేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని కోసం తైవనీస్ కాంట్రాక్ట్ మానుఫ్రాక్ట్ర్చర్ ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. వచ్చే పండుగ సీజన్ కల్లా ఆన్లైన్ అమ్మకాల్లో తాను ఆధిపత్య స్థానంలో ఉండాలని షావోమి ప్లాన్ చేస్తోందని ముగ్గురు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. భారత్‌లోనే టీవీ సెట్లను రూపొందిస్తుండటంతో, కంపెనీ పన్ను ప్రయోజనాలను కూడా పొందనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. అయితే టీవీల ధరలను మాత్రం షావోమి తగ్గించకపోవచ్చని, ఇప్పటికే ఎలాంటి మార్జిన్లు లేకుండా వీటిని తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తుందని తెలిపారు. భారత్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారిగా ఇప్పటికే షావోమికి పేరుంది. ప్రస్తుతం భారత్‌లో టెలివిజన్లను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్‌తో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. జూన్-ఆగస్టు నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయని, పండుగ సీజన్-దివాళి విక్రయాల్లో ఎక్కువగా మేడిన్ ఇండియా మోడల్సే ఉండనున్నాయని పేర్కొన్నాయి. అయితే షావోమి తొలుత అతిపెద్ద ఆన్లైన్ టెలివిజన్ బ్రాండ్‌గా నిలువాలని టార్గెట్ పెట్టుకుంది. అనంతరం మల్టి బ్రాండ్ స్టోర్లలోకి విస్తరించాలని చూస్తోంది. స్థానికంగా టెలివిజన్ సెట్లు తయారు చేస్తుండటంతో, కంపెనీకి పన్ను ప్రయోజనాలు లభించడమే కాకుండా... మార్జిన్లు కూడా పెరగనున్నాయి. ఇది సప్లై చెయిన్‌ను నియంత్రించడానికి సహకరిస్తుంది. భారత్‌లో టెలివిజన్లను తయారుచేయడం షావోమి ప్రారంభిస్తుందని, ఈ ఏడాదిలో ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చని షావోమి ఇండియా అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఫాక్స్‌కాన్ మాత్రం దీనిపై స్పందించలేదు. దిగుమతి పన్నుల్లో మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో షావోమి గత నెలలో తన 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను పెంచిన సంగతి తెలిసిందే. పన్నులు పెరుగుతుండటంతో ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్, ఫోకస్డ్ టెలివిజన్ బ్రాండ్లు స్థానిక ఉత్పత్తిని పెంచడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. షావోమి స్మార్ట్ఫోన్లను భారత్‌లో తయారు చేయడంలో ఫాక్స్‌కాన్ అతిపెద్ద తయారీదారి. స్మార్ట్ఫోన్లను అసెంబుల్ చేయడానికి షావోమి ఇప్పటికీ ఆరు థర్డ్ పార్టీ ప్లాంట్లను కలిగి ఉంది. -
ఆ కార్లపై 7లక్షల వరకు ధర తగ్గింపు
న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మెడిన్ ఇండియా వాహనాలపై భారీగా రేట్లు తగ్గించింది. తమ మోడల్ కార్లపై 7 లక్షల రూపాయల వరకు రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుండటంతో కొత్త పన్ను రేటు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మెర్సిడెస్ బెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. ఒకవేళ జీఎస్టీ అమలును వాయిదా వేస్తే, కంపెనీ మళ్లీ పాత ధరలనే కొనసాగించనుంది. మెర్సిడెస్ బెంజ్ స్థానికంగా తొమ్మిది మోడల్స్ ను తయారుచేస్తోంది. అవి సీఎల్ఏ సెడాన్, ఎస్యూవీస్ జీఎల్ఏ, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్, లగ్జరీ సెడాన్లు సీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్, మేబ్యాచ్ ఎస్ 500. ఈ మోడల్స్ ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీలో 32 లక్షల రూపాయల నుంచి 1.87 కోట్ల మధ్యలో ఉన్నాయి. సీఎల్ఏ సెడాన్ పై 1.4 లక్షల రూపాయల నుంచి మేబ్యాచ్ ఎస్ 500 మోడల్ ధర 7 లక్షల రూపాయల వరకు ధరను కంపెనీ తగ్గించింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, ఈ తగ్గింపు చేపట్టడం సహేతుకమని మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోల్యాండ్ ఫోల్గర్ చెప్పారు. ఇండియాలో ఉత్పత్తి అయ్యే అన్ని మోడల్స్ పై కస్టమర్లకు ట్రాన్సక్షన్ ధరలను సగటున 4 శాతం వరకు తగ్గించనున్నట్టు ఫోల్గర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ధరల తగ్గింపు 2 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటుందని, ప్రస్తుత పన్నుల విధానం, రాష్ట్రాల్లో లోకల్ బాడీ పన్నులపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు.