సాక్షి, ముంబై: భారత్‌లో తయారు చేసిన ఎస్‌యూవీలు పది లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు సోమవారం కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది. ఈ మొత్తం విక్రయాల్లో క్రెటా ఎస్‌యూవీ సింహభాగాన్ని ఆక్రమించినట్లు కంపెనీ పేర్కొంది. 2005లో విడుదలైన క్రెటా ఇప్పటి వరకు 5.9 లక్షల అమ్మకాలు దేశీయ మార్కెట్లోనూ, 2.2 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్లో అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక 2019లో విడులైన వెన్యూ ఎస్‌యూవీ మొత్తం అమ్మకాలు 1.8 లక్షలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీ రంగంలో విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో ఈ ఘనతను సాధించామని కంపెనీ డెరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్‌లోనే ఎస్‌యూవీలను తయారీ చేస్తున్న సంగతి గార్గ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment